ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ని బ్యాక్ అప్ తీసుకోవటం ఎలాగో ఇక్కడ చూద్దాం.
౧. ముందుగా ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అవ్వాలి, తర్వాత కుడి చేతి ప్రక్క పై మూలన ఉన్న’ గేర్ ’ గుర్తు పై క్లిక్ చేసి ’Account Settings' ని సెలెక్ట్ చేసుకోవాలి.
౨. ఇప్పుడు
‘Download a copy of your Facebook data’ లింక్ పై క్లిక్ చెయ్యాలి.
౩. ఇక్కడ మనకు రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి, ఒకటి రెగ్యులర్ Archive మరొకటి Expended Archive. రెగ్యులర్ దానిలో ఫోటోస్, ఛాట్, మెసేజెస్ , అకౌంట్ వివరాలు మొ. ఉంటాయి. అదే Expended లో ఇంకా ఎక్కువ వివరాలు ఉంటాయి ఇనస్టలేషన్ చేసుకున్న అప్లికేషన్లు, అన్-ఫ్రెండ్,ఐపీ అడ్రస్ మరిన్ని వివరాలు ఉంటాయి. రెండింటీ మధ్య తేడాను అక్కడే ఉన్న హెల్ప్ లిం పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు,రెగ్యులర్ Archive కోసం Start My Archive పై క్లిక్ చెయ్యాలి.
౪. Request My Download వస్తుంది అక్కడ Start My Archive పై క్లిక్ చెయ్యాలి.
౫. ఇక్కడ Confirm పై క్లిక్ చేసిన తర్వాత డాటా మొత్తం సేకరించి డౌన్లోడ్ సమాచారం మన మెయిల్ కి
పంపబడుతుంది.
౬. Your Download is ready అంటూ మనకు మెయిల్ వస్తుంది, అది రావటానికి కొంత సమయం పడుతుంది, వెయిట్ చెయ్యాలి. మెయిల్ లోని లింక్ పై క్లిక్ చెయ్యగా వచ్చే పేజీలో ఫేస్ బుక్ పాస్ వార్డ్ ఎంటర్ చేసి ’Continue' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Download Archive పై క్లిక్ చెయ్యాలి. జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది , దానిని అన్ జిప్ చేసుకోవాలి.
ధన్యవాదాలు