Monday, January 31, 2011

వికీలీక్స్ కి ప్రత్యామ్నాయం ఓపెన్‌లీక్స్!!!

వ్యక్తిగత మరియు రహస్య సమాచారం అందించటం లో సంచలనం సృష్టించిన వికీలీక్స్ కి ప్రత్యామ్నాయంగా మరొక లీక్స్ సైట్ మొదలైంది అదే ఓపెన్‌లీక్స్!. ఓపెన్‌లీక్స్ గురించి వారి మాటల్లోనే “dedicated and generally free services to whistleblowers and organizations interested in transparency.”

ఓపెన్‌లీక్స్ విడుదల్ చేసిన మొదటి డ్రాఫ్ట్ వీడియో ఇక్కడ చూడండి.

మరింత సమాచారం కోసం ఓపెన్‌లీక్స్ సైట్ చూడండి.


ధన్యవాదాలు

teachparentstech.org - తల్లిదండ్రుల కోసం టెక్-సపోర్ట్ సైట్ గూగుల్ నుండి !!!

కంప్యూటర్ సంబంధించిన పిల్లలు అడిగే బేసిక్ ప్రశ్నలకు తల్లిదండ్రులు సమాధానాలు చెప్పటానికి వీలుగా పేరెంట్స్ కోసం ఒక టెక్ సపోర్ట్ సైట్ ని గూగుల్ మన ముందుకు తీసుకొని వచ్చింది. ఈ సైట్ లో కంప్యూటర్ కి అంటే బేసిక్స్, ఇంటర్నెట్, మీడియా మొదలగు వాటికి సంబంధించిన దాదాపు 50 వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి.



వెబ్ సైట్: teachparentstech

ధన్యవాదాలు

Friday, January 28, 2011

సిస్టం అడ్మిన్స్ కోసం CCleaner ఇప్పుడు నెట్‌వర్క్ ఎడిషన్ లో కూడా!!!

పీసీ లో అనవసరమైన టెంపరరీ ఫైళ్ళను తొలగించటానికి ఉపయోగించే ప్రముఖ CCleaner ఇప్పుడు నెట్‌వర్క్ ఎడిషన్ కూడా లభిస్తుంది. నిజంగా ఇది నెట్‌వర్క్ అడ్మిన్స్ కి శుభవార్తే, వారి కోసమే ఈ ఎడిషన్ రూపొందించబడినది. ఈ క్రొత్త అప్లికేషన్ ఒకే పీసీ నుండి నెట్‌వర్క్ లోని అన్ని పీసీ లను స్కాన్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మొత్తం వర్క్ గ్రూప్ లేదా అన్ని మెషీన్లను ఒకేసారి స్కాన్ చెయ్యవచ్చు.



ఉచిత ట్రయల్ వెర్షన్ మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: ట్రయల్ వెర్షన్

ధన్యవాదాలు

Thursday, January 27, 2011

జీమెయిల్ క్రొత్త ఫీచర్: ఈ-మెయిల్ లేదా ఛాట్ కి సంబంధించిన క్రొత్త మెసేజ్ లు వచ్చినప్పుడు పాపప్ నోటిఫికేషన్ డెస్క్‌టాప్ పై వస్తుంది !!!


జీమెయిల్ లో మరొక క్రొత్త ఫీచర్ అదే ఈ-మెయిల్ లేదా ఛాట్ కి సంబంధించిన క్రొత్త మెసేజ్ లు వచ్చినప్పుడు పాపప్ నోటిఫికేషన్ డెస్క్‌టాప్ పై వస్తుంది. దానికోసం చెయ్యవలసిందల్లా మీ జీమెయిల్ లాగిన్ అవ్వగానే Click here to enable desktop notifications for Gmail అని వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే Allow mail.google.com to show desktop notifications? Allow Deny వస్తుంది, Allow పై క్లిక్ చెయ్యాలి.




లేదంటే కనుక ’Settings' పై క్లిక్ చేసి క్రిందకు వెళితే Desktop Notifications అని వస్తుంది, దాని దగ్గర ఉన్న ఆప్షన్లలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి.


మరింత సమాచారం కోసం జీమెయిల్ బ్లాగ్ చూడండి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో మాత్రమే పనిచేస్తుంది.

ధన్యవాదాలు

Tuesday, January 25, 2011

Awesome Duplicate Photo Finder - డూప్లికేట్ ఇమేజ్ లను కనుగొనటానికి!!!


Awesome Duplicate Photo Finder అనే శక్తివంతమైన ఉచిత టూల్ ని ఉపయోగించి మీ పీసీ లో డూప్లికేట్/ఒకేలా ఉన్న ఫోటోలను కనుగొని అవసరమైతే వాటిని తొలగించవచ్చు. ఈ అప్లికేషన్ ని స్టార్ట్ చేసి ’+’ పై క్లిక్ చేసి డూప్లికేట్ ఇమేజ్ లను సెర్చ్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Start Search' పై క్లిక్ చెయ్యాలి. చక్కని యూజర్ ఇంటర్ఫేజ్ ని కలిగి ఒకేలా ఉన్న ఫోటోలను ప్రక్క ప్రక్క నే చూపిస్తూ వాటి సిమిలారిటీ శాతాన్ని చూపిస్తుంది. అనవసరమైన ఫోటోలను రీసైకిల్ బిన్ ఐకాన్ పై క్లిక్ చేసి డీలీట్ చెయ్యవచ్చు.



డౌన్లోడ్: Awesome Duplicate Photo Finder

ధన్యవాదాలు

Microsoft Attack Surface Analyzer - ఏదైనా సాప్ట్‌వేర్ ఇనస్టలేషన్ చేసినప్పుడు సిస్టం జరిగిన మార్పులను తెలుసుకోవటానికి!!!

ఏదైనా సాప్ట్‌వేర్ ఇనస్టలేషన్ చేసినప్పుడు అటాక్ సర్ఫేస్ లో జరిగిన మార్పులు తెలుసుకోవటానికి మైక్రోసాప్ట్ వారి Attack Surface Analyzer అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. ఒకసారి ఏదైనా సాప్ట్‌వేర్ డెవలప్ చేసి దానిని రిలీజ్ చేసేముందు అటాక్ సర్ఫేస్ లో జరిగే మార్పులు తెలుసుకోవటానికి ఐటీ డెవలపర్స్ మరియు టెస్టెర్స్ ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. Attack Surface Analyzer ఏదైనా సాప్ట్‌వేర్ ఇనస్టలేషన్ కి ముందు మరియు తరువాత రన్ చేసుకోవాలి అదెలాగో క్రింద చూద్దాం:



ముందుగా మైక్రోసాప్ట్ సైట్ కి వెళ్ళి Microsoft Attack Surface Analyze ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. Attack Surface Analyzer ని ఉపయోగించి సిస్టం ని స్కాన్ చెయ్యాలి. .CAB ఫార్మేట్ లో ఒక రిపోర్ట్ జెనెరేట్ అవుతుంది, ఈ ఫైల్ ని ఏదైనా 7ZIP లాంటి అన్ జిప్ సాప్ట్ వేర్లని ఉపయోగించి అన్ జిప్ చేస్తే XML ఫైల్ వస్తుంది. దీనిని ఏదైనా నోట్ పాడ్ ఎడిటర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ చెయ్యవలసిన సాప్ట్ వేర్ ని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇప్పుడు Attack Surface Analyzer మరల రన్ చెయ్యాలి, ఇప్పుడు దీనిచే జెనెరేట్ చెయ్యబడే రిపోట్ సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ కారణంగా అటక్ సర్ఫేస్ లో జరిగిన మార్పులను తెలియచేస్తుంది.


ఇప్పటి వరకు మైక్రోసాప్ట్ దీనిని తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగించింది, ఇప్పుడు అందరికోసం బీటా వెర్షన్ ని విడుదల చేసింది.

డౌన్లోడ్: Microsoft Attack Surface Analyzer

ధన్యవాదాలు

Monday, January 24, 2011

FacebookDesktop - ఫేస్‌బుక్ డెస్క్‌టాప్ అప్లికేషన్!!!

ఫేస్‌బుక్ ని మీ డెస్క్‌టాప్ కి తీసుకొని రావటానికి అడోబ్ ఎయిర్ ఆధారిత FacebookDesktop అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీనిని ఇనస్టలేషన్ చేసిన తర్వాత సిస్టం ట్రేలో కూర్చుంటుంది. ఫేస్‌బుక్ ఐడీ తో లాగిన్ చేస్తే ఏదైనా కొత్త యాక్టివిటీ జరిగినప్పుడు అంటే వాల్ పై క్రొత్త పోస్టులు, స్టేటస్ అప్ డేట్స్, ఫ్రెండ్స్ రిక్వెస్టులు మరియు మెసేజ్ లు వచ్చినప్పుడు డెస్క్‌టాప్ పై అలర్ట్/ నోటిఫికేషన్ వస్తుంది.


డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం FacebookDesktop సైట్ చూడండి.


డౌన్లోడ్: FacebookDesktop

ధన్యవాదాలు

Friday, January 21, 2011

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కారణంగా మొరాయించిన BSNL సర్వర్లు!!!

నిన్న సాయత్రం సడెన్ గా నా BSNL మొబైల్ పెనిచెయ్యలేదు కాల్స్ చేస్తుంటే పోవటం లేదు ఇన్ కమింగ్ కాల్స్ రావటంలేదు, నాకేనా ప్రాబ్లం అంటే BSNL వినియోగదారులందరిదీ అదే సమస్య. సరే రాత్రి ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి వార్తా ఛానల్ పెడితే క్రింద బ్రేకింగ్ న్యూస్ "నంబర్ పోర్టబిలిటీ కారణంగా ఎక్కువమంది మొబైల్ వినియోగదారులు BSNL కి మారటం తో సర్వర్లు హ్యాంగ్ అయ్యాయి" అని. ఒక్కసారి ఇదే జోక్ ఆఫ్ ద ఇయర్ అనుకున్నా, ఎందుకంటే నిన్న ఉదయం వరకు మొబైల్ రంగం లో రాష్ట్రం లో నాల్గో స్థానం లో ఉన్న BSNL కి ఒక్కసారిగా ఆదరణ పెరగడం ఆశ్చర్యం కలిగించింది. సరే సంగతేంటని BSNL లో పనిచేసే మిత్రుడికి ఫోన్ చేసి అడిగా నంబర్ పోర్టబిలిటీ తో BSNL కి మారే వినియోగదారులకు ఉచిత టాక్ టైమ్ ఇస్తున్నారంట. రాబోయే రోజుల్లో BSNL నంబర్ 1 కి వస్తుందంట.

మొబైల్ రంగం లో దాదాపు 5 సంవత్సరాలు లేటుగా వచ్చిన BSNL లేటెస్ట్ గా వస్తుందనుకుంటే నిరాశేపరచింది. ప్రభుత్వరంగ సంస్థ కావటంతో నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం కారణంగా ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేకపోతుంది. ఉదాహరణకి మా ఆఫీస్ లో సిగ్నల్ సరిగా రాదు, దాని గురించి వ్రాతపూర్వకంగా 6 నెలల క్రితం ఫిర్యాదు చేస్తే గతవారం మా ఆఫీస్ సందర్శించి సిగ్నల్ స్టెంగ్త్ చెక్ చేశారు, అంతే పరిష్కారం చెప్పలేదు.

సరే ఇదంతా వదిలేస్తే రాత్రి 10.30 కి తిరిగి ఫోన్లు పనిచెయ్యటం ప్రారంభించాయి. BSNL సిబ్బందికి ధన్యవాదాలు.

నిన్న ప్రధానమంత్రిగారు లాంఛనంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ని ప్రారంభించారు. టెలీకమ్యూనికేషన్ రంగంలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ ఒక ముఖ్యమైన మైలు రాయి గా ప్రధానమంత్రి పేర్కొన్నారు.


ధన్యవాదాలు

Tuesday, January 18, 2011

20/01/2011 నుండి అమలులోకి రానున్న మొబైల్ నంబర్ పోర్టబిలిటీ!!!

మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మొబైల్ నంబర్ పోర్టబిలిటీ గురువారం అంటే 20/01/2011 నుండి అమలులోకి రానున్నది. అసలు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ అంటే మన మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ (నెట్ వర్క్)/ ఆపరేటర్ అందించే సేవలు సరిగా లేనప్పుడు (సిగ్నల్ స్రిగా లేకపోవటం, బిల్లింగ్ సమస్యలు, ఎక్కువ ఆఫర్లు లేకపోవటం మొదలగునవి)మొబైల్ నంబర్ మార్చకుండా ఆపరేటర్ (నెట్ వర్క్) ని మార్చటం అన్నమాట. నంబర్ పాతదే కానీ నచ్చిన ఆపరేటర్ కి మారవచ్చు. అయితే ప్రీ-పెయిడ్ కస్టమర్లు ఆపరేటర్ మార్చినప్పుడు బ్యాలన్స్ క్యారీఫార్వార్డ్ కాదు. అదే పోస్ట్-పెయిడ్ వినియోగదారులు అయితే బిల్లులు మొత్తం చెల్లించాలి. ఆపరేటర్ మార్చటానికి 1900 కి SMS పంపితే యూనీక్ పోర్టింగ్ కోడ్ (UPC) వస్తుంది. SMS పంపటానికి PORT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి 1900 కి పంపాలి ఉదా: (PORT 9912345678). UPC తో నచ్చిన ఆపరేటర్ దగ్గరకు వెళ్ళి అప్లికేషన్ ఫార్మ్ నింపి, అవసరమైన పత్రాలు జత చేసి, రు.19/- కడితే సరిపోతుంది. ఫొస్ట్-పెయిడ్ వియోగదారులు అయితే డిపాజిట్ కట్టవలసి ఉంటుంది.



Procedure for Porting Mobile Number:

  • Send an SMS:

PORTMobile Number (that is to be ported) to 1900


For ex. PORT 9912345678

  • Your existing operator will immediately provide you with an 8 digit alpha-numeric porting code that you need to submit to the operator you wish to opt to along with relevant documents. (The unique porting code will be valid only for 24 hours)
  • After consulting with your existing operator, new operator will move your number in a maximum of 4 days.

Charges for Porting Mobile Number:

As per TRAI, any telecom operator can charge a maximum of Rs. 19 towards porting charges.

Some Queries related to Mobile Number Portability:

  • When will Mobile Number Portability Services be introduced pan-India?

As per union minister of Telecommunications & IT, Mr. Kapil Sibal, MNP will be introduced pan-India by January 20, 2011.

  • What are the minimum and maximum time specified for porting number from one operator to another?

Porting time could be anything between 24 hours to 4 days.

  • What are the charges for Porting to another operator?

As mentioned above, service providers can charge a maximum of Rs. 19 for porting a number.

  • Who is eligible for availing mobile number portability?


Any customer having a mobile number older than 90 days can migrate to another operator with the same number. He or She will have to wait for another 90 days before being able to port their number again.

  • Will my number be dead during the porting process?


As per the details available, a number will remain dead for 2 hours approximately during the porting process. Fortunately, the 2 hours downtime will be between 10 PM and 5 AM IST.

  • Can I migrate my post-paid number to another operator with prepaid services or vice-versa?

Yes, that can be done once you clear off all pending dues with the current operator.

  • Will my prepaid balance carry-forward to new operator?

Unfortunately not. All remaining balance on your mobile will get lapsed and will not be carried-forward to the new operator. Thus, it’s advisable to completely use the available talk-time before moving to another operator.

  • Can I port my number from one circle (state) to another?

Retaining same number while moving from one state to another is not possible unless MNP services are launched pan-India.

  • Can I port my CDMA number to GSM operator or vice versa?

Yes, with the introduction of MNP, moving from CDMA to GSM or vice-versa is possible too, but your existing mobile will be rendered useless if you opt to move from CDMA to GSM technology.

  • Can I port my landline number to a mobile service provider?

Porting a landline number to a mobile operator is possible in countries like US though, for now, Indian govt. has planned to launch MNP only for mobile phone users. India might witness landline number portability in the future.

  • Will I get any freebies from the operator I am porting my number to?

Keeping in mind the bottle-neck competition in Indian telecom arena, you can definitely expect some freebies and goodies from your new operator. In fact, BSNL and TATA Docomo have already announced various freebies for subscribers porting to them.

ధన్యవాదాలు

Wednesday, January 12, 2011

lichess.org - ఆన్‌లైన్ లో చెస్ ఆడటానికి!!!

ఎటువంటి రిజిస్ట్రేషన్,ప్లగిన్స్ డౌన్లోడ్ అవసరం లేకుండా ఆన్‌లైన్ లో చెస్ ఆడటానికి lichess.org సైట్ కి వెళ్ళాల్సిందే. ఈ సైట్ కి వెళితే మనకు మూడు ఆప్షన్లు కనబడతాయి అవి Play With a Friend, Play With anybody, Play With the machine, వీటిలో ఏదైనా ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఆన్‌లైన్ లోనే చెస్ ఆడవచ్చు.



ఇటువంటివే మరికొన్ని సైట్లు:ChessKid, Chess.com, SparkChess.

వెబ్‌సైట్:lichess.org



ధన్యవాదాలు

Thursday, January 6, 2011

iCloud - మీ ఆన్‌లైన్ కంప్యూటర్ (వర్చువల్ డెస్క్‌టాప్)


iCloud అనే వెబ్ సర్వీస్ ఉచిత ఆన్‌లైన్ వర్చువల్ డెస్క్‌టాప్ ని అందిస్తుంది. iCloud సైట్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయితే చాలు బ్రౌజర్ లోనే డెస్క్ టాప్ ని పొందవచ్చు. అంతే కాకుండా దీనిలో clock, calendar, weather, Contacts, ToDO, IM, Mail లాంటి చిన్న చిన్న అప్లికేషన్లు కూడా ఉన్నాయి. మన పీసీ లోని ఫైళ్ళను అప్లోడ్ చేసుకోవచ్చు, ఎడిట్ మరియు డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కూడా కలదు. ఫోటోలు/ వీడియోలు చూదవచ్చు ఇంకా చాలా ...

iCloud సంబంధించిన విడియోని ఇక్కడ చూడండి:



వెబ్ సైట్: iCloud

ధన్యవాదాలు

టాబ్లెట్ మొబైల్స్ ల కోసం గూగుల్ అండ్రాయిడ్ ౩.౦, హనీకోంబ్ [వీడీయో]



అండ్రాయిడ్ ౩.౦, హనీకోంబ్ పై మరింత సమాచారం కోసం గూగుల్ మొబైల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు

Tuesday, January 4, 2011

2011 క్యాలండర్లు తయారు చేసుకోండి మరియు ప్రింట్ చేసుకోండి!!!

ముందుగా అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రొత్త సంవత్సరం అంటేనే గ్రీటింగ్స్, క్యాలండర్స్, ప్లానర్లు. అయితే కొన్ని వెబ్ సైట్లలో మనకు నచ్చిన ఇమేజ్ లతో క్యాలండర్లు లేదా ప్లానర్లు తయారుచేసుకొని, డౌన్లోడ్ చేసుకొని అవసరం అనుకుంటే ప్రింట్ కూడా చేసుకోవచ్చు, ఆ సైట్లకు సంబంధించిన వివరాలు ఇక్కడ చూద్దాం:

1. My Owl Barn:


తెలివైన పక్షి గుడ్లగూబ, దానికి సంబంధించిన వివిధ చిత్రాలు ఈ సైట్ లో ఉన్నాయి, నచ్చిన చిత్రం క్రింది ’Select Moth' దగ్గర కావలసిన నెల సెలెక్ట్ చేసుకోవాలి జనవరి నుండి డిసెంబర్ వరకు, చిత్రాల్ సెలెక్షన్ పూర్తి అయిన తర్వాత ’Download Calender' పై క్లిక్ చేసి క్యాలండర్ ని పీడీఎఫ్ రూపంలో మన పీసీ లోకి డౌన్లోడ్
చేసుకోవచ్చు తర్వాత అవసరమైతే ప్రింట్ కూడా చేసుకోవచ్చు.


2.BigHugeLabs



మనకు నచ్చిన ఇమేజ్ అప్లోడ్ చేసి నెలను సెలెక్ట్ చేసుకొని ’Create' పై క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ తో సెలెక్ట్ చేసుకొన్న నెలకు తగిన క్యాలండర్ వస్తుంది, దానిని పీసీ లో సేవ్ చేసుకోవచ్చు.

ఇటువంటివే మరికొన్ని సైట్లు :Alice Cantrell , Blog Guide Book, Blue Ant Studio , Monitor Strip, Bunny Calender, Bookmark Calendar , clovered, Mini Laundry Calendar, Wisdom Journal , 2011 Diary మొదలగునవి.

ధన్యవాదాలు