Monday, September 27, 2010

www.keyhero.com - ఉచిత ఆన్‌లైన్ టైపింగ్ టెస్ట్

www.keyhero.com సైట్ కి వెళ్ళి మీ టైపింగ్ స్పీడ్ (WPM - word per minute) ని టెస్ట్ చేసుకోవచ్చు, అదీ ఉచితంగా...www.keyhero.com సైట్ కి వెళ్ళి Typing Test - Play Now! లింక్ పై క్లిక్ చెయ్యాలి. టైపింగ్ బాక్స్ వస్తుంది, అక్కడ వున్న ’Start' బటన్ పై క్లిక్ చెయ్యాలి.



ఇప్పుడు బాక్స్ లో కొంత టెక్స్ట్ వస్తుంది, దాని క్రింద టైప్ చెయ్యటమే. బాక్స్ క్రింద మన టైపింగ్ స్పీడ్ మరియు యాక్యురసీ తెలియచెయ్యబడతాయి.



వివిధ ఆర్గనైజేషన్లలో టైపిస్ట్ పోస్ట్ కి అప్లై చేసిన వారు తమ టైపింగ్ స్పీడు తెలుసుకోవటానికి ఈ సైట్ ఉపయోగపడుతుంది.

వెబ్‌సైట్: http://www.keyhero.com/

ధన్యవాదాలు

Friday, September 24, 2010

Google New - గూగుల్ విడుదల చేసే క్రొత్త ఉత్పత్తులు/ ఫీచర్ల వివరాలు తెలుసుకోవటానికి!!!


గూగుల్ తరచూ క్రొత్త ఉత్పత్తులు/ ఫీచర్లను విడుదల చేస్తూ ఉంది, వాటికి సంబంధించిన వివరాలను ఆయా ప్రొడక్ట్ లకు సంబంధించిన వివరాలను ఆయా బ్లాగుల ద్వారా తెలియచేస్తూ వచ్చింది. ఇప్పుడు క్రొత్తగా Google New ని ప్ర్రారంభించింది, దీనిలో గూగుల్ విడుదల చేసే క్రొత్త ప్రొడక్ట్స్ లేదా పాత ప్రొడక్ట్స్ కి సంబంధించిన క్రొత్త ఫీచర్ల వివరాలు అన్నీ ఒకే చోట తెలియచేస్తుంది.



వెబ్ సైట్: Google New

Thursday, September 23, 2010

epic browser - భారతదేశపు మొదటి వెబ్ బ్రౌజర్!!!

Epic browser ఇది మన బ్రౌజర్ ... భారతదేశపు మొదటి వెబ్ బ్రౌజర్ !!! భారతీయులకోసం ప్రత్యేకంగా రూపొందించిన Mozilla ఆధారిత వెబ్ బ్రౌజర్. బెంగళూర్ కి చెందిన Hidden Reflex వారు ఈ Epic ని రూపొందించారు.




Epic ప్రత్యేకతలు:

౧. బిల్ట్-ఇన్ యాంటీ వైరస్ కలిగిన మొదటి బ్రౌజర్, దీనిని ఉపయోగించి మన పీసీ పూర్తిగా స్కాన్ చెయ్యవచ్చు. డౌన్లోడ్ చేసే ఫైళ్లను ఆటోమాటిక్ గా స్కాన్ చేస్తుంది. యాంటీ ఫిషింగ్ నుండి రక్షణ కలిగిస్తుంది.
౨. దాదాపు అన్ని భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది.
౩. ఇండియా కంటెంట్ ద్వారా న్యూస్ హెడ్ లైన్స్ తెలుసుకోవచ్చు.
౪. epic సైడ్ బార్ 1500 పైగా అప్లికేషన్లు ఉన్నాయి, My Computer బ్రౌజ్ చెయ్యవచ్చు, Indic, wordprocessor, twitter, Gmail, videos, chat, jobs, games, backup, travel, jobs...యిలా ఎన్నో...
౫.అన్ని ఫైర్ ఫాక్స్ యాడ్ ఆన్స్ ఈ బ్రౌజర్ లో కూడా పని చేస్తాయి.
౬. 1500 పైగా ఇండియన్ థీమ్స్ మరియు వాల్ పేపర్స్
ఇంకా ఎన్నో...


డౌన్లోడ్: Epic Browser

ధన్యవాదాలు

Wednesday, September 22, 2010

Koyote Free Screen To Video - పీసీ స్క్రీన్ రికార్డింగ్ సాప్ట్‌వేర్!!!

ఉపాధ్యాయులు, వెబ్ ట్యూటర్లు పీసీ స్క్రీన్ రికార్డ్ చేసి వీడీయో ట్యుటోరియల్స్ తయారుచెయ్యటానికి Koyote Free Screen To Video అనే ఉచిత సాప్ట్‌వేర్ ఉపయోగపడుతుంది. ముందుగా Koyote సైట్ కి వెళ్ళి Free Screen To Video అనే సాప్ట్‌వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి.

మెయిన్ అప్లికేషన్ ఇంటర్‌ఫేజ్ ఈ క్రింది విధంగా వుంటుంది:


ఇక్కడ క్రింద చూపిన విధంగా వీడీయో అవుట్‌పుట్ సెలెక్ట్ చేసుకోవాలి.



స్క్రీన్ రికార్డింగ్ మెదలు పెట్టేముందు Screen Capure బటన్ పై క్లిక్ చేసి కాప్చర్ చెయ్యవలసినది మొత్తం పీసీ స్క్రీన్ లేదా కావలసిన విండో లేదా కావలసిన ఏరియానా అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి.



ఇప్పుడు Start బటన్ పై క్లిక్ చేస్తే రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది మరియు అవుట్‌పుట్ సేవ్ చెయ్యటానికి సేవ్ విండో ఓపెన్ అవుతుంది, కావలసిన ఫైల్ పేరు ఎంటర్ చేసి సేవ్ చేసుకోవాలి.



ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఆటోమాటిక్ గా రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది మరియు ఐకాన్ సిస్టం ట్రేలో కూర్చుంటుంది. Stop చెయ్యటానికి [F10] బటన్ Pause చెయ్యటానికి [F9] బటన్ ప్రెస్ చెయ్యాలి.

తిరిగి మెయిన్ అప్లికేషన్ కి వెళితే రికార్డ్ చెయ్యబడిన ఫైళ్ళ లిస్ట్ కనబడుతుంది, కావలసిన దానిపై డబల్ క్లిక్ చేస్తే ఆ వీడియో ప్లే అవుతుంది. లేదంటే వీడీయో ఫైల్ సేవ్ చెయ్యబడిన లొకేషన్ కి వెళ్ళి మాన్యువల్ గా కూడా ప్లే చేసుకోవచ్చు.

స్క్రీన్ కాప్చర్ చేసేటప్పుడు మౌస్ పాయింటర్ కనబడకుండా వుండటానికి మెయిన్ మెనూ లో Mouse బటన్ పై క్లిక్ చేసి Don't Capture Mouse ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

అంతేకాకుండా ఆడియో కూడా కాప్చర్ చేసే సదుపాయం కూడా కలదు, దానికోసం మెయిన్ మెనూ లో Configuration బటన్ పై క్లిక్ చెయ్యాలి.


Free Screen To Video తో పాటు యితర సాప్ట్ వేర్లను Koyote సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డౌన్లోడ్: Koyote Free Screen To Video

ధన్యవాదాలు

Monday, September 20, 2010

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ త్వరలో!!!

మన మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్/ ఆపరేటర్ అందించే సేవలు సరిగా లేనప్పుడు (సిగ్నల్ స్రిగా లేకపోవటం, బిల్లింగ్ సమస్యలు, ఎక్కువ ఆఫర్లు లేకపోవటం మొదలగునవి)వేరే ఆపరేటర్ కి మరుతూవుంటాం. ఒక్కొక్కసారి మొబైల్ ఫోన్ నంబరు (ఫ్యాన్సీ) బాగుండి, కొంతకాలంగా వాడుతూ బంధుమిత్రులకు ఆ నంబర్ యిచ్చి సడన్ గా వేరే నంబరా అని ఆలోచించి ఇబ్బందులు వున్నా పాత దానితోనే అడ్జస్ట్ అయిపోతూ వుంటాం. ఇప్పుడు ఆ సమస్య లేదు మన ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నంబర్ పోర్టబిలిటీ నవంబర్ 1 వ తారీకు నుండి అమలులోకి రానుంది. నంబర్ పోర్టబిలిటీ అంటే మన మొబైల్ నంబరు మార్చకుండా మనకు నచ్చిన ఆపరేటర్ దగ్గరకు వెళ్లవచ్చు (మార్చుకోవచ్చు).

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ గురించి Telecom Regulatory Authority of India (TRAI) చైర్మన్ Dr J. S. Sarma హిందూ దిన పత్రికకి ఇచ్చిన ఇంటర్యూ
ఇక్కడ చూడండి.



ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా నంబర్ పోర్టబిలిటీ నవంబర్ 1 నుండి అమలులోకి వస్తుందని ఆశిద్దాం!!!! దీనికోసం ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.

ధన్యవాదాలు

ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ 9.0 బీటా!!!

మైక్రోసాప్ట్ ఇటీవలే తమ క్రొత్త బ్రౌజర్ ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ 9.0 బీటా వెర్షన్ ని విడుదల చేసింది. ఇది విండోస్ విస్టా మరియు 7 ఆపరేటింగ్ సిస్టం 32/64 బిట్ వెర్షన్లలో మాత్రమే పనిచేస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్‌ఫ్లోరర్ 9.0 ఇప్పుడు హిందీలో కూడా డౌన్లోడ్ కి సిద్ధంగా వుంది.


ఇనస్టలేషన్ చెయ్యటం ఎలా:

  1. Go to the Internet Explorer 9 page.

  2. Click Download Now, click Run in the File Download dialog box, and then click Continue in the User Account Control dialog box.

  3. Click one of the following:

    • Restart now (recommended) (to finish the installation process, so you can use Internet Explorer 9 immediately).

    • Restart later (to wait until you shut down or restart your computer).

అన్-ఇనస్టలేషన్ చెయ్యటం ఎలా:


  • Click the Start button Picture of the Start button, type Programs and Features in the search box, and then click View installed updates.

  • Right-click Windows Internet Explorer 9, click Uninstall, and then, when prompted, click Yes.

  • Click one of the following:

    • Restart now (to finish the process of uninstalling Internet Explorer 9, and restore the previous version of Internet Explorer).

    • Restart later (to wait until you shut down or restart your computer).



  • డౌన్లోడ్: ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్


    ధన్యవాదాలు

    Friday, September 17, 2010

    Student DOG organizer - విద్యార్ధుల కోసం ఒక చక్కటి ఆర్గనైజర్!!!

    Student DOG organizer - విద్యార్ధుల కోసం ఒక విద్యార్ధి (Mr.David Capka) రూపొందించిన చక్కటి ఉచిత యూజర్ ఫ్రెండ్లీ ఆర్గనైజర్. దీనిని ఉపయోగించి స్కూల్/ నాన్ స్కూల్ యాక్టివిటీ లను చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. దీనిలో ముఖ్యమైన ఫోన్ నంబర్లను స్టోర్ చేసుకోవచ్చు మరియు అవుట్ లుక్ నుండి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, క్యాలండర్, టాస్క్, మార్క్స్, నోట్స్, టైమ్ టేబుల్ వున్నాయి.




    Student DOG organizer లో ఉన్న అంశాలు:

    • Denní přehledDay overview - Date, database state, clock (analog/digital). If you go to school with laptop, you will appreciate "In-school" mode, which will determinate upcoming lesson, when it ends and what lesson is next. It uses system time and timetable.

    • KontaktyContacts - Controlls all your important contacts. It can import contacts from MS Outlook and functions like age counting, automatic determination of name day or reminding of birthdays and name days are not missing.

    • KalendářCalendar - Here you can record all you school and non-school activities. Every record can be marked with different icon (phone, book, person...), you can also choose if you want to enter time and if record should occurs more than once (weekly, monthly etc.)

    • ÚlohyTasks - Classic checking tasks which can be stored in user defined categories (Homeworks, Shopping list, Downloads, Borrows etc.)

    • ZnámkyMarks - Virtual student sheet which automatically counts averages/sums of your marks. It's a table of subjects and every subject can contain marks. Subject list can be modified so it fits to all kinds of schools. It supports Marks (ABCDF, 1-5, 1-6), Percents and Points.

    • PoznámkyNotes - This category keeps all your important texts, notes from speeches and ideas in one place. It supports inserting WWW links and images and you can choose different editors.

    • Time table - Your time table. If "In-school" mode is on, here's the place from where program determinates information in Overview. It supports 2 time tables for even/odd weeks (on/off) and lesson times are changeable.


    డౌన్లోడ్: Student Dog Organiser

    twistynoodle.com - పిల్లల కోసం కలరింగ్ పేజీలను ప్రింట్ తీసుకోండి!!!

    twistynoodle.com కి వెళ్ళి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా పిల్లల కోసం కలరింగ్ పేజీలను ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ తీసుకోనేముందు అవసరం అనుకొంటే దానిలోని టెక్స్ట్ ని, ఫాంట్ మరియు స్టైల్ ని మార్చుకోవచ్చు. కలరింగ్ పేజెస్ ని వివిధ క్యాటగిరీల్లో వుంచారు...Animals, food, buildings, History, food, months ఇలా... మరియు రంగులు దిద్దటం తో పాటు ఇంగ్లీష్ వ్రాత వర్క్‌షీట్ కూడా వుంటుంది, పనిలో పనిగా కలరింగ్ మరియు వ్రాత ప్రాక్టీస్ కూడా అయిపోతుంది.



    పిల్లల కోసం ఇదొక మంచి సైట్...

    వెబ్‌సైట్:
    twistynoodle

    ధన్యవాదాలు

    Thursday, September 16, 2010

    FixPicture.org - ఆన్‌లైన్ లో ఇమేజెస్ ని రీసైజ్ చెయ్యటానికి !!!

    FixPicture.org సైట్ కి వెళ్ళి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఇమేజ్ లను అప్‌లోడ్ చేసి ఇమేజ్ సైజ్ ని పెంచటం లేదా తగ్గించటం చెయ్యవచ్చు. అంతేకాకుండా క్రాప్, రొటేట్, బ్లర్, గ్రేస్కేల్, కలర్ అడ్జస్ట్‌మెంట్ టూల్స్ ఉన్నాయి. మార్పులు చేర్పులు చేసిన తర్వాత తిరిగి మన హార్డ్‌డిస్క్ లో సేవ్ చేసుకోవచ్చు.



    FixPicture.org సైట్ కి వెళ్ళగానే రెండు ఆప్షన్లు వస్తాయి ఒకటి FLASH VERSION మరొకటి HTML VERSION. FLASH VERSION చక్కని ఇంటర్‌ఫేజ్ ని కలిగివుంటుంది, కాబట్టి FLASH VERSION ఆప్షన్ ని ఎంచుకోండి. IMPORT IMAGE లో వున్న [Browse your hard drive] పై క్లిక్ చేసి ఇమేజ్ ని అప్‌లోడ్ చెయ్యాలి. కేవలం రీసైజ్ మాత్రమే చెయ్యాలనుకొంటే కనుక పైన వున్న + లేదా - గుర్తులపై క్లిక్ చెయ్యాలి. ఇమేజ్ టచ్అప్ టూల్స్ కావాలంటే కనుక క్రిందవున్న BASIC TOOLS, EFFECTS లో వున్న టూల్స్ ని ఉపయోగించుకోవచ్చు. Undo, Redo ఆప్షన్లు వున్నాయి. అలానే చివరగా [Save Image to Disk] బటన్ పై క్లిక్ చేసి ఇమేజ్ ని మన హార్డ్‌డిస్క్ లో సేవ్ చేసుకోవచ్చు.

    వెబ్‌సైట్:FixPicture.org

    ధన్యవాదాలు

    Wednesday, September 15, 2010

    BrainShark - పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లను ఆకర్షణీయమైన మల్టీమీడియా ప్రెజెంటేషన్లగా మార్చటానికి!!!

    BrainShark సైట్ కి వెళ్ళి మీ పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్లను అప్‌లోడ్ చేసి అవసరమైన చోట వాయిస్/ ఆడియో/మ్యూజిక్, డాక్యుమెంట్లు, వీడియో ని జతచేసి ఆకర్షణీయమైన మల్టీమీడీయా ప్రెజెంటేషన్లను తయారుచేసుకోవచ్చు. అలా తయారుచేసుకొన్న ప్రెజెంటేషన్లను వీడియో ఫైళ్ళగా (.MP4, .3GP, .WMV) డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే యూట్యూబ్ లో అప్‍లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చెయ్యటం కోసం ముందుగా BrainShark సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. చిన్న వ్యాపారులు తమ ప్యాపార అవసరాలకు, విద్యార్ధులు/టీచర్లు ఎడ్యుకేషన్ కి సంబంధించిన మల్టీమీడీయా ప్రెజెంటేషన్లను ప్రిపేర్ చేసుకోవటం లో BrainShark సహాయపడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి BrainShark లో డైరెక్ట్ గా ప్రెజెంటేషన్లు తయారుచేసుకోలేం, ముందుగా పవర్‌పాయింట్ లో లేదా వేరే విధంగా చేసుకొన్న ప్రెజెంటేషన్లను అప్‍లోడ్ చేసి మాత్రమే పైన చెప్పిన విధంగా చెయ్యవచ్చు.

    BrainShark కి సంబంధించిన Quick Tour ఇక్కడ చూడండి:



    వెబ్‌సైట్: BrainShark

    ధన్యవాదాలు

    Tuesday, September 14, 2010

    PDClipart.org - ఆన్‌లైన్ Clip Art కలెక్షన్ !!!

    PDClipart.org - ఒక పబ్లిక్ డొమైన్ Clip Art కలెక్షన్ సైట్... ఇక్కడ వివిధ అవసరాల కోసం (బ్లాగులు, ప్రెజెంటేషన్లు) అవసరమయ్యే Clip Art ఫైళ్ళను క్యాటగిరీల వారీగా వుంచారు మరియు అవసరమైన వాటిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇది పబ్లిక్ డొమైన్ కాబట్టి కాపీ చేసుకోవటానికి కాపీరైట్ మరియు లైసెన్స్ అవసరం లేదు.



    ఈ సైట్ లో 25 వేల కు పైగా Clip Art ఫైళ్ళు డౌన్లోడ్ సిద్ధంగా వున్నాయి. ఇంకా ఎందుకు ఆలశ్యం కావలసిన Clip Art ని మీ పీసీ లోకి కాపీ చేసుకోండి.

    వెబ్‌సైట్: http://www.pdclipart.org/

    ధన్యవాదాలు

    Monday, September 13, 2010

    Google Scribe - టెక్స్ట్ ఆటోకంప్లీట్ ఫీచర్ !!!

    Google Scribe సైట్ కి వెళ్ళి కావలసిన టెక్స్ట్ టైప్ చేస్తూపోతూవుంటే క్రింద ఆటో కంప్లీట్ సూచనలు వస్తాయి, సరైన పదాన్ని ఎంపిక చేసుకోవటం కోసం ఆ పదం ప్రక్కన యివ్వబడిన నంబరు కీ ప్రెస్ చెయ్యటమే!!!



    ఇదే ఫీచర్ గూగుల్ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ గా కూడా పొందవచ్చు, దాని కోసం Google Scribe (Labs) Chrome extension పై క్లిక్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్ లో ఎక్కడైనా టైప్ చేసేటప్పుడు ఈ ఆటో కంప్లీట్ ఫీచర్ ని పొందవచ్చు.

    వెబ్‌సైట్: Google Scribe

    ధన్యవాదాలు

    Friday, September 10, 2010

    Google Family Safety Center - సురక్షిత బ్రౌజింగ్ కొరకు!!!

    గూగుల్ తమ Family Safety Center ద్వారా టీనేజర్స్ ని సురక్షిత నెట్ బ్రౌజింగ్ గురించి ఎడ్యుకేట్ చెయ్యనుంది. గూగుల్ తమ యితర పార్ట్‌నర్స్ తో కలసి Family Safety Center ని రూపొందించింది.




    Family Safety Center లక్ష్యాలు:
    - Provide parents and teachers with tools to help them choose what content their children see online
    - Offer tips and advice to families about how to stay safe online
    - Work closely with organizations such as charities, others in our industry and government bodies dedicated to protecting young people


    సేఫ్టీ టూల్స్ లో ప్రధానంగా Google SafeSearch, SafeSearch Lock, SafeSearch on your phone మరియు YouTube Safety Mode ఉన్నాయి. గూగుల్, యూట్యూబ్ సెర్చ్ సెట్టింగ్స్ లో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా సెర్చ్ ఫలితాలలో ఎటువంటి అసభ్యకరమైన ఫలితాలు చూపబడవు. సెట్టింగ్స్ గురించి పూర్తి సమాచారం మరియు వీడీయోస్ కోసం ఇక్కడ చూడండి.


    US లోని చైల్డ్ సేఫ్టీ ఆర్గనైజేషన్స్ (గూగుల్ పార్ట్‌నర్స్) ఆన్ లైన్ లో పిల్లలు పాటించవలసిన సేఫ్టీ విషయాలపై వారి సలహాలకై ఇక్కడ చూడండి.

    YouTube, Buzz, Picasa Web Albums, Blogger లో కనుక అసభ్యకరమైన మరియు జుగుప్సాకరమైన కంటెంట్ వుంటే కనుక వెంటనే రిపోర్ట్ చెయ్యండి. దానిపై పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

    సురక్షిత బ్రౌజింగ్ పై తల్లిదండ్రుల ఆలోచనల వీడీయోలను ఇక్కడ చూడండి.


    వెబ్ సైట్ : http://www.google.com/familysafety/


    సురక్షిత భ్రౌజింగ్ కోసం మైక్రోసాప్ట్ రూపొందించిన Windows Live Family Safety ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.


    ధన్యవాదాలు

    GMail Priority Inbox కోసం 5 చిట్కాలు!!!

    GMail క్రొత్త ఫీచర్ Priority Inbox గురించి ఇంతకుముందు పోస్ట్ లో తెలుసుకున్నాం, Priority Inbox ని సమర్ధవంతంగా ఉపయోగించటం కోసం గూగుల్ 5 చిట్కాలు చెప్పింది, వారి మాటల్లోనే...

    1. Customize your sections
    By default, Priority Inbox has three sections: "Important and Unread," "Starred" and "Everything Else.” But that doesn't mean you have to leave them that way. You can make a section show messages from a particular label (like your “Action” or “To-do” label), add a fourth section, or change the maximum size of any section. Visit the Priority Inbox tab under Settings to customize your sections, or do it right from the inline menus.


    2. Train the system
    If Gmail makes a mistake, you can help it learn to better categorize your messages. Select the misclassified message, then use the importance buttons at the top of your inbox to correctly mark it as important or not important.


    For those of you who can't live without keyboard shortcuts, don’t worry, you can use the "+" and "-" keys to adjust importance as well.

    3. See the best of your filtered messages
    You can set up Priority Inbox to show you not just the best of your inbox, but also the best of messages you filter out of your inbox and might otherwise miss. Just change your Priority Inbox settings to “Override filters” and Gmail will surface any important messages that would otherwise skip your inbox.


    With this option turned on, you can use filters to archive more aggressively and worry less about missing an important message.

    4. Use filters to guarantee certain messages get marked important (or not)
    If you read and reply to a lot of messages from your mom, Gmail should automatically put incoming messages from her in the “Important and unread” section. But if you want to be 100% sure that all messages from your mom (or your boss, boyfriend, client, landlord, etc.) are marked important, you can create a filter for messages from that sender and select “Always mark as important.” Similarly, if you regularly read messages from your favorite magazine, they should automatically get marked as important. If you’d rather they end up in the “Everything else” section, you can create a filter to never mark them as important.

    5. Archive unimportant messages quickly
    One of the features that can help make you more efficient is the ability to archive all of the visible messages in the "Everything Else" section at once. Just click on the down arrow next to "Everything Else" and select the "Archive all visible items" option. If you want to be able to archive even more messages at once, you can increase the maximum number of messages that show in that section from the same drop-down.


    టిప్స్ జీమెయిల్ బ్లాగ్ నుండి సేకరించబడినవి.

    ధన్యవాదాలు

    Thursday, September 9, 2010

    ఆగస్ట్ లో చేసిన పోస్ట్ ల పీడీఎఫ్ ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోండి !!!

    August 2010

    Google Instant - టైప్ చేస్తూనే సెర్చ్ రిజల్ట్స్ పొందటానికి ...

    అంతర్జాలంలో దేని కోసమైనా వెతకాలంటే కనుక మనకు ముందుగా గుర్తుకు వచ్చే సెర్చ్ ఇంజిన్ గూగుల్... గూగుల్ క్రొత్త సెర్చ్ ఎన్‌హాన్స్‌మెంట్ Google Instant సెర్చ్ సమయాన్ని తగ్గించి మనం టైప్ చేస్తూనే సెర్చ్ రిజల్ట్స్ ని చూపిస్తుంది. http://www.google.com/instant/ సైట్ కి వెళ్ళి ఈ ఫీచర్ ని ట్రై చెయ్యవచ్చు.



    Google Instant బెనిఫిట్స్:
    Faster Searches: By predicting your search and showing results before you finish typing, Google Instant can save 2-5 seconds per search.

    Smarter Predictions: Even when you don’t know exactly what you’re looking for, predictions help guide your search. The top prediction is shown in grey text directly in the search box, so you can stop typing as soon as you see what you need.

    Instant Results: Start typing and results appear right before your eyes. Until now, you had to type a full search term, hit return, and hope for the right results. Now results appear instantly as you type, helping you see where you’re headed, every step of the way.

    Google Instant ప్రస్తుతానికి Chrome v5/6, Firefox v3, Safari v5 for Mac and Internet Explorer v8 బ్రౌజర్లు వాడుతున్న US, UK, France, Germany, Italy, Spain మరియు Russia గూగుల్ డొమైన్ యూజర్లకు మాత్రమే పనిచేస్తుంది. మనం గూగుల్ US డొమైన్ వెళ్ళి గూగుల్ ఇనస్టంట్ ఫీచర్ ని చూడవచ్చు.



    Google Instant కి సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ చూడండి.

    గూగుల్ మరియు గూగుల్ ఇనస్టంట్ మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ చూదండి:


    ధన్యవాదాలు

    Trasir - మీ ఐపి అడ్రస్ మరియు దాని సంబంధిత సమాచారం తెలుసుకోవటానికి...

    Trasir సైట్ కి వెళ్ళటం తోటే ఎటువంటి సమాచారం ఎంటర్ చెయ్యకుండా మీ ఐపి అడ్రస్, హోస్ట్ నేమ్, కంట్రీ, రీజియన్, డేట్ , టైమ్ తదితర సమాచారం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మనకు తెలిసిన ఏదైనా ఐపి అడ్రస్ ఎంటర్ చేసి దానికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు.



    వెబ్‌సైట్ : Trasir

    Wednesday, September 8, 2010

    Nitro PDF Reader - పీడీఎఫ్ రీడర్, క్రియేటర్, టెక్స్ట్ కన్వర్టర్, ఇంకా ఎన్నో ....

    ఏదైనా అప్లికేషన్ (Word, Excel, Powerpoint మొ.) ఫైళ్ళను పీడీఎఫ్ ఫైళ్ళగా మార్చటానికి నెట్ లో చాలా పీడీఎఫ్ క్రియేటర్ అప్లికేషన్స్ దొరుకుతున్నాయి, అలానే పీడీఎఫ్ ఫైళ్ళను చదవటానికి రీడర్లు మరియు పీడీఎఫ్ ఫైళ్ళను టెక్స్ట్ లోకి మార్చటానికి ... యిలా వివిధ అప్లికేషన్ల ను మన అవసరాన్ని బట్టి డౌన్లోడ్ చేసుకొని ఉపయోగిస్తూ ఉంటాం. అలా కాకుండా పైన చెప్పిన వాటితో పాటు యింకా ఎన్నో ఫీచర్లు కలిగిన అప్లికేషన్ గురించి తెలుసుకోవాలా ... అదే... Nitro PDF Reader ... ఇది కేవలం రీడర్ మాత్రమే కాదు...ఎన్నో ఫీచర్లు వున్నాయి. Nitro PDF Reader ని ఉపయోగించి 300 పైగా ఫైల్ ఫార్మేట్లను పీడీఎఫ్ ఫైళ్ళగా మార్చవచ్చు. ఫీడీఎఫ్ ఫైల్ గా మార్చవలసిన ఏదైనా ఫైల్ ని డ్రాగ్ చేసి డెస్క్‌టాప్ పైన్ వున్న Nitro PDF Reader షార్ట్‌కట్ పై డ్రాప్ చేస్తే ఆ ఫైల్ పీడీఎఫ్ ఫైల్ గా మార్చబడుతుంది. అలా కాకుండా ప్రింట్ డైలాగ్ ఆప్షన్ ద్వారా కూడా పీడీఎఫ్ ఫైల్ గా మార్చవచ్చు. ఫీడీఎఫ్ ఫైల్ లోని కంటెంట్ ని టెక్స్ట్ లోకి మార్చుకోవచ్చు మరియు ఇమేజ్ లను వేరుగా సేవ్ చేసుకోవచ్చు. Nitro PDF Reader లోని కొన్ని టూల్స్ ని ఉపయోగించి పీడీఏఫ్ డాక్యుమెంట్ లో ఎక్కడైనా టెక్స్ట్ ని యాడ్ చెయ్యవచ్చు, టెక్స్ట్ ని హైలైట్ చెయ్యవచ్చు, నోట్స్/కామెంట్స్ జతచెయ్యవచ్చు. పీడీఎఫ్ ఫార్మ్స్ ని నింపి సేవ్ చేసుకోవచ్చు మరియు వాటికి సిగ్నేచర్ జతచెయ్యవచ్చు.


    Nitro PDF Reader ని చూడండి:



    డౌన్లోడ్ మరియు యితర సమాచారం కోసం Nitro PDF Reader సైట్ చూడండి.

    ధన్యవాదాలు

    Tuesday, September 7, 2010

    EASEUS Todo Backup - ఉచిత బ్యాక్అప్ / రీస్టోర్ సాప్ట్‌వేర్ ...

    EASEUS Todo Backup - ఉచిత బ్యాక్అప్ / రీస్టోర్ సాప్ట్‌వేర్ ని ఉపయోగించి విండోస్ లో హార్డ్‌డిస్క్ మొత్తాన్ని యదాతధంగా సిస్టం పార్టీషన్ తో సహా బ్యాక్అప్ ని వేగంగా తీసుకోవచ్చు మరియు బూటబుల్ సీడీ తయారుచేసుకోవచ్చు. అంతే కాకుండా ఎప్పుడైనా హార్డ్ డ్రైవ్ ఫెయిల్ అయినప్పుడు, వైరస్ దాడి చేసినప్పుడు, మరి ఏ యితర కారణాల వలన సిస్టం పూర్తిగా క్రాష్ అయినప్పుడు... బ్యాక్అప్ తీసిన డాటా ని తిరిగి రీస్టోర్ చెయ్యవచ్చు.



    EASEUS Todo Backup ఉపయోగించే విధానాన్ని ఇక్కడ చూడండి.

    Todo backup పై మరింత సమాచారం మరియు EASEUS అందిస్తున్న యితర ఉచిత సాప్ట్ వేర్ల కోసం Todo Backup సైట్ ని చూడండి.

    డౌన్లోడ్: EASEUS Todo Backup

    ధన్యవాదాలు

    వ్యవసాయదారుల కోసం కిసాన్ కాల్‌ సెంటర్

    Department of Agriculture & Cooperation, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చే January 21, 2004 న కిసాన్ కాల్‌సెంటర్ ని ప్రారంభించింది. ఈ మధ్య టీవీ లో దీని గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నారు... వ్యవసాయదారులు తమ వ్యవసాయానికి సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవటానికి లేదా నిపుణుల సలహాలను పొందటానికి కిసాన్ కాల్‌సెంటర్ టోల్ ఫ్రీ నం.1800-180-1551 లేదా 1551 లో సంప్రదించవచ్చు. వ్యవసాయదారులు తమ మాతృభాష లో మాట్లాడే సౌలభ్యం వుంది.


    మరింత సమాచారం కోసం కిసాన్ కాల్ సెంటర్ సైట్ ని చూడండి మరియు ఆంధ్రప్రదేశ్ కాల్ సెంటర్ వివరాల కై ఇక్కడ చూడండి.

    రైతన్నలకు ఒక వరం... ఈ కిసాన్ కాల్ సెంటర్!!!

    ధన్యవాదాలు

    Monday, September 6, 2010

    SlimCleaner - విండోస్ పీసీ మెయింటెనెన్స్ సాప్ట్‌వేర్!!!

    SlimCleaner ఒక విండోస్ పీసీ మెయింటెనెన్స్ సాప్ట్‌వేర్, ఇది ప్రముఖ CCleaner ని పోలి ఉంటుంది. మిగతా మెయింటెనెన్స్ టూల్స్ మాదిరిగానే SlimCleaner లో కూడా క్లీనర్, ఆప్టిమైజేషన్, అన్ఇనస్టలర్, విండోస్ టూల్స్ ఉన్నాయి. SlimCleaner ని ఉపయోగించి పీసీ లో చేసిన మార్పులను un do చెయ్యటానికి Restore టాబ్ ఉంది. ప్రస్తుతానికి SlimCleaner బీటా వెర్షన్ లో లభ్యమవుతుంది.


    డౌన్లోడ్: SlimCleaner

    ధన్యవాదాలు

    Google Chrome extensions కోసం...

    Google Chrome బ్రౌజర్ extensions (యాడ్-ఇన్) కోసం గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్‍షన్ సైట్ చూడండి... ఇక్కడ extensions వివిధ క్యాటగిరీల్లో ఉంచారు పాపులర్, రీసెంట్ , ఫీచర్డ్ యిలా... కావలసిన extension పై క్లిక్ చేసి తర్వాత ’Install' బటన్ పై క్లిక్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.




    సైట్: గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్‍షన్ సైట్

    ధన్యవాదాలు

    Friday, September 3, 2010

    ఈ-బుక్ : విండోస్ 7 గైడ్

    విండోస్ 7 కి సంబంధించిన ఉపయోగకరమైన టిప్స్ ఈ విండోస్ 7 గైడ్ లో వున్నాయి, ఒక్కసారి చదవండి లేదా డౌన్లోడ్ చేసుకోండి.

    The Windows 7 Guide: From Newbies To Pros

    డౌన్లోడ్: విండోస్ 7 గైడ్

    మరికొన్ని ఈ-బుక్స్ డౌన్లోడ్ కొరకు మేక్‍యూజ్‍ఆఫ్‍సైట్ చూడండి.

    ధన్యవాదాలు

    Thursday, September 2, 2010

    జీమెయిల్ క్రొత్త ఫీచర్ - Priority Inbox (ముఖ్యమైన మెసేజెస్ ని ఆటోమాటిక్ గా సార్ట్ చెయ్యటానికి)



    జీ మెయిల్ ప్రస్తుతానికి ఉన్న Inbox కి అదనంగా Priority Inbox అనే క్రొత్త ఫీచర్ ని అందిస్తుంది, Priority Inbox మన చదవలసిన లేదా రిప్లై యివ్వవలసిన ముఖ్యమైన మెసేజెస్ ని Sort చెయ్యటానికి ఉపయోగపడుతుంది.

    ఈ ఫీచర్ పొందటం కోసం జీ-మెయిల్ లాగిన్ అయ్యి 'Settings' పై క్లిక్ చేసి తర్వాత అక్కడ కనిపించే ’Priority Inbox’ పై క్లిక్ చేసి ’Show Priority Inbox' ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ’Save Changes' బటన్ పై క్లిక్ చెయ్యాలి.



    మరింత సమాచారం కోసం జీమెయిల్ బ్లాగ్ చూడండి.

    గూగుల్ ప్రేయారిటీ కి సంబంధించిన చిట్కాలు ఇక్కడ చూడండి.

    ధన్యవాదాలు

    Wednesday, September 1, 2010

    Winalite EMF Card - ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ నుండి రక్షణ పొందటానికి!!!

    సైన్స్ మరియు టెక్నాలజీ అభివ్రుద్దితో ఎన్నో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అవి అందించే సౌకర్యం తో పాటు ఎంతో ప్రమాదకరమైన ఎలక్ట్రో మాగ్నటిక్ ఫీల్డ్స్ (EMF) ని విడుదల చేస్తాయి. అవి పర్యావరణాన్నే కాక మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. EMF ని విడుదల చేసే పరికరాలు computers, portable video games, mobile phones, portable music devices మొదలగునవి.

    EMF ల వలన కలిగే అనర్ధాలు:
    - Effect DNA
    - Cause headache, insomnia and depression
    - Effect visual acuity
    - Influence people’s well-being and biological responses
    - Create health concerns

    ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులు తయారుచేసే WINALITE సంస్థ EMF Card ని రూపొందించింది. ఈ EMF Card ని ఉపయోగించి పైన చెప్పబడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు విడుదల చేసే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ని ఛేధించవచ్చు. EMF Card 50 సెం.మీ పరిధిలో వున్న మాగ్నెటిక్ వేవ్స్ ని తన లోకి తీసుకుని దాన్ని హీట్ ఎనర్ఝీ గా కన్వర్ట్ చేసి బయటకు విడుదల చేస్తుంది. EMF Card మన గుండెకు దగ్గరగా వుంచుకోవాలి అంటే మన షర్ట్ జేబు లో కాని, పర్స్ లో కాని పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్ వినియోగదారులు ఈ EMF Card ని ఫోన్ వెనక భాగం లో అతికించుకోవచ్చు.


    EMF Card వలన కలిగే ప్రయోజనాలు:

    - Is designed to absorb and reduce electromagnetic fields (EMFs).
    - Has a lifespan of approximately 6 years; providing long term protection.
    - Is magnet-proof, waterproof, heat resistant and durable.
    - Has obtained National Patent Authority approval in China.

    సో ఎలక్ట్రానిక్ మాగ్నటిక్ ఫీల్డ్స్ నుండి మనల్ని మరియు మన కుటుంబాన్ని కాపాడటం లో మరియు సెల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడే వారికి ఈ EMF Card బాగా ఉపయోగపడుతుంది.

    ఒక్కో EMF Card ధర కేవలం 500 రూపాయలు మాత్రమే, EMF Card మరియు దీని పై మరింత సమాచారం కోసం Shri Ch. Naga Manikanta Raj ని 9000905553 లో సంప్రదించండి.

    ధన్యవాదాలు