Showing posts with label వెబ్ సైట్లు. Show all posts
Showing posts with label వెబ్ సైట్లు. Show all posts

Thursday, March 28, 2013

కంప్యూటర్స్ నేర్చుకోవటానికి ఒక మంచి సైట్ [వీడియో ట్యుటోరియల్స్]

నెట్ లో సెర్చ్ చేస్తుంటే నాకు ఒక మంచి సైట్ కనబడింది అదే http://computerseekho.com/ ఈ సైట్ లో 200 పైగా కంప్యూటర్స్ కి సంబంధించిన పాఠాలు/ వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి. వీడియోస్  వివరణ మాత్రం హిందీలో ఉంటుంది, స్లైడ్స్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. మనలో కూడా చాలా మందికి హిందీ వచ్చు కాబట్టి కొందరికైనా ఉపయోగపడుతుందని ఈ సైట్ ని ఇక్కడ్ షేర్ చేస్తున్నాను. ఈ సైట్ ని మూడు విభాగాలుగా విభజించారు ౧) Basic Learning 2) Intermediate Learning 3) Advanced Learning. ఇక్కడ పాఠాలన్నీ పూర్తిగా ఉచితం మరియు ఎటువంటి రిజిస్ట్రేషన్ చెయ్యనవసరం లేదు.


మాధ్యమం హిందీ అనే కానీ పాఠాలు చాలా బాగున్నాయి. ఈ సైట్ రూపొందించిన వారికి హాట్సాఫ్!!!

వెబ్ సైట్: http://computerseekho.com

ధన్యవాదాలు

Friday, March 22, 2013

Google Keep - నోట్స్ మరియు టు-డు లిస్ట్స్ కొరకు [వెబ్ & ఆండ్రాయిడ్]

Google Keep అనే వెబ్ సర్వీస్ మరియు ఆండ్రాయిడ్ ఆప్ నోట్స్ తీసుకోవటానికి మరియు To-do లిస్ట్ లు తయారు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. Google Keep లో టెక్స్ట్ మెసేజెస్ తో పాటు ఇమేజ్ లను కూడా జత చెయ్యవచ్చు. ఇది గూగుల్ డ్రైవ్  డొమైన్ ని ఉపయోగించుకుంటుంది. సింపుల్ ఇంటర్ ఫేస్ కలిగిన దీనిలో నోట్ లను సెర్చ్ చెయ్యటం సులువు.


ఫీచర్లు:

• Keep track of your thoughts via notes, lists and photos
• Have voice notes transcribed automatically
• Use homescreen widgets to capture thoughts quickly
• Color-code your notes to help find them later
• Swipe to archive things you no longer need
• Turn a note into a checklist by adding checkboxes
• Use your notes from anywhere - they are safely stored in the cloud and available on the web 

వెబ్ సైట్: Google Keep

ఆండ్రాయిడ్ అప్లికేషన్: Google Keep

ధన్యవాదాలు

Wednesday, March 20, 2013

Social Media Image Maker - సోషల్ నెట్ వర్క్స్ కోసం సరిపోయే ఇమేజ్ లను క్రియేట్ చేసుకోండి!

Social Media Image Maker అనే ఉచిత ఆన్ లైన్ టూల్ ని ఉపయోగించి ప్రముఖ సోషల్ వెట్ వర్క్ సైట్లైన ఫేస్ బుక్ , గూగుల్ ప్లస్, టంబ్లర్, పింటెరెస్ట్, లింక్డ్ ఇన్ ఇలా మెదలగు సైట్ల కోసం సరిపడే తగిన బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్, ప్రొఫైల్ ఇమేజ్ , కవర్ ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ లో ఆయా సైట్లకు తగిన ఇమేజ్ లెంగ్త్ ముందుగా సెట్ చేసి ఉండటం వలన దీనిలో తయారు చేసిన ఇమేజ్ లు ఆయా సైట్లకు సైట్లకు సరిగ్గా సరిపోతాయి.


Social Media Image Maker సైట్ కి వెళ్ళి కావలసిన సోషల్ నెట్ వర్క్ ఆప్షన్ ను ఎంచుకోవటం వలన అక్కడ ఆయా సైట్లకు తగిన ఇమేజ్ లను తయారు చేసుకోవటానికి ఆప్షన్ వస్తుంది . ఉదా ఫేస్ బుక్ కవర్ ఇమేజ్ తయారు చేసుకోవాలన్నప్పుడు ’Facebook' పై క్లిక్ చేసి ’Cover Image' దగ్గర ఉన్న 'Create' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత పేజీలో ’Add your File ' పై క్లిక్ చేసి ఇమేజ్ పైల్ అప్ లోడ్ చెయ్యవచ్చు, లేదంటే సింపుల్ గా ఇమెజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యటం ద్వారా అక్కడ ఉన్న ఆప్షన్లను ఉపయోగించి కవలసిన మార్పులు చేసుకుని ’Apply' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత కలర్ బ్రైట్ నెస్ లో కావాలంటే మార్పులు చేసుకుని అక్కడే పైన ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసి ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్: Social Media Image Maker

ధన్యవాదాలు

Tuesday, January 1, 2013

hellofax నుండి ఎక్కడికైనా ఉచితంగా ఫాక్స్ పంపండి!!!

****

మితృలకు ... ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..

****
hellofax అనే వెబ్ సైట్ నుండి ప్రపంచం లో ఎక్కడికైనా నెలకు పరిమిత సంఖ్యలో (50 పేజీలు) ఉచితంగా ఫాక్స్ పంపవచ్చు. హెలోఫాక్స్ సైట్ కి వెళ్ళి గూగుల్ అకౌంట్ లేదా మైక్రోసాప్ట్ అకౌంట్ తో లాగిన్ అయ్యి లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ముందుగా ఫాక్స్ పంపవలసిన ఫైల్ ని అప్ లోడ్ చేసుకోవాలి, తర్వాత ఫాక్స్ నంబర్ ఆయా దేశాలా కోడ్ తో సహా ఎంటర్ చెయ్యాలి, తర్వాత 'Send it Now' బటన్ పై క్లిక్ చెయ్యాలి. వర్డ్ డాక్యుమెంట్స్ , పీడీఎఫ్ పైల్స్, ఇమేజెస్, టెక్స్ట్ పైల్ ఇలా వివిధ ఫార్మేట్లలో ఉన్న ఫైళ్లను హెలోఫాక్స్  ద్వారా పంపవచ్చు. అంతేకాకుండా క్లౌడ్ స్టోరేజ్ లనుండి కూడా ఫైళ్ళను తీసుకోవచ్చు. 



వెబ్ సైట్: hellofax

ధన్యవాదాలు

Wednesday, October 17, 2012

Road To Grammar - ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ మెరుగుపర్చుకోవటానికి ఒక మంచి సైట్!!

ఇంగ్లీష్ గ్రామర్ స్క్రిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి Road To Grammar అనే వెబ్ సైట్ ఉపయోగపడుతుంది. దీనిలో 365 క్విజ్ లు, గ్రామర్ కి సంబంధించిన గేమ్స్, వీలున్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవటానికి డౌన్లోడ్స్ ఉన్నాయి.ఈ సైట్ ఉపయోగించటానికి ఎటువంటి రిజిస్టేషన్ అవసరం లేదు  పూర్తిగా ఉచితం. 


’Quizzes' లో నచ్చిన టాపిక్ ని ఎంచుకొని ప్రక్కనే ఉన్న ’Start' పై క్లిక్ చెయ్యాలి. క్విజ్ లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానం పై క్లిక్ చెయ్యాలి, తప్పైన జవాబుకు సరైన సమాధానం అప్పుడే తెలుస్తుంది. ఇక్కడ క్విజ్ లో 365 టాపిక్స్ ఉన్నాయి. ’Extra Practice' లో ఉదాహరణ సహితంగా వివరణ ఉంటుంది. 

వెబ్ సైట్: Road To Grammar

ధన్యవాదాలు

Thursday, October 11, 2012

RailRadar - కావలసిన రైలు ప్రస్తుతం ఎక్కడ ఉందో గూగుల్ మాప్స్ లో తెలుసుకోవటానికి!!


భారత రైల్వే RailRadar  అనే సర్వీస్ ని ప్రారంభించింది, దీనిని ఉపయోగించి మనకు కావలసిన రైలు యొక్క ప్రస్తుత జియోగ్రాఫికల్ లోకేషన్ ని గూగుల్ మాప్స్ లో చూడవచ్చు.  రైలు యొక్క రాక/ పోకలు తెలుసుకోవటానికి  కావలసిన స్టేషన్ కోసం మ్యాప్ పై జూమ్ ఇన్ చెయ్యాలి అది మౌస్ సహాయంతో గాని లేదా ఎడమచేతి ప్రక్కన ఉన్న + గుర్తు పై క్లిక్ చెయ్యవచ్చు. ఇలా కావలసిన స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న కావలసిన ట్రైన్ గుర్తు పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. రైలు యొక్క ప్రస్తుత లొకేషన్ తో పాటు రూట్ మరియు ఆగే స్టేషన్లను కూడా తెలుసుకోవచ్చు.  బ్లూ కలర్ లో ఉన్నవి సరైన సమయం లో మరియు రెడ్ కలర్ లో ఉన్నవి ఆలస్యంగా నడుస్తున్నవని అర్ధం. ప్రతి ఐదు నిమిషాలకు ఇక్కడ సమాచారం రిఫ్రెష్ అవుతుంది.



వెబ్ సైట్: RailRadar

ధన్యవాదాలు

Thursday, October 4, 2012

Jumpshare - ఆన్ లైన్ లో పెద్ద ఫైళ్ళను షేర్ చెయ్యటానికి మరియు వాటిని చూడటానికి!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా పెద్ద పెద్ద ఫైళ్ళను వేగంగా మరియు సులభంగా అందరితో షేర్ చేసుకోవటానికి Jumpshare అనే ఉచిత ఆన్ లైన్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఫైళ్ళను డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి లేదా  ’Select the files to Share' పై క్లిక్ చేసి కూడా షేర్ చెయ్యవలసిన ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. 2GB వరకు ఎన్ని ఫైళ్ళనైనా అప్ లోడ్ చెయ్యవచ్చు.  ఫైల్ అప్ లోడ్ చేసిన తర్వాత వచ్చే లింక్ ని అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ కూడా చెయ్యవచ్చు. షేర్ చేసిన ఫైల్ ని అవతలివారు అవసరమనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ లైన్ లోనే ఫైల్ ని  ఓపెన్ చేసి చూడటానికి వ్యూయర్ కూడా   దీనిలోనే ఉంది. ఫైల్ వ్యూయర్ 200 పైగా ఫైల్ ఫార్మేట్లని సపోర్ట్ చేస్తుంది.  అప్ లోడ్ చేసిన ఫైల్ 2 వారాల వరకు ఉంటుంది.  


వెబ్ సైట్: Jumpshare 

ధన్యవాదాలు

Wednesday, September 19, 2012

వికీపీడియా వ్యాసాలతో ఈ-బుక్ లను తయారుచేసుకోవటం ఎలా?

అతి పెద్ద సమాచార భాంఢాగారమైన వికీపీడియా వ్యాసాలతో ఈ-బుక్ లను తయారుచేసుకొని అవసరమైనప్పుడు ఆఫ్ లైన్ లో చదువుకోవచ్చు. దీనికోసం వికీపీడీయా ఆంగ్ల సైట్ కి వెళ్ళి ఎడమ చేతి పైపున ఉన్న 'Pint/Export'దగ్గర ఉన్న 'Create a Book' పై క్లిక్ చెయ్యాలి.   


ఇక్కడ Start Book Creator పై క్లిక్ చేసి ఇక కావలసిన పేజీలతో ఈ-బుక్ లను తయారుచేసుకోవచ్చు. 


కావలసిన ఆర్టికల్ ని మన ఈ-బుక్ కి యాడ్ చెయ్యటానికి Book Creator దగ్గర ఉన్న Add this page to your Book పై క్లిక్ చెయ్యాలి అలానే యాడ్ చేసిన పేజీన తొలగించటానికి Remove this page from your Book పై క్లిక్ చెయ్యాలి. అలానే బుక్ ని ఎడిట్ చెయ్యటానికి లేదా డౌన్లోడ్ చెయ్యటానికి Show Book పై క్లిక్ చెయ్యాలి.


చివరగా ఈ-బుక్ లను పీడీఎఫ్, EPUB మొదలగు ఫార్మేట్లలో కావలసిన దానిని ఎంచుకుని డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చెయ్యాలి.


మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు

Thursday, September 6, 2012

Meeting.io - వెబ్ ఆధారిత వీడియో మీటింగ్స్!!!

ఎటువంటి సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ చేసుకోకుండా మరియు రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా మీ బ్రౌజర్ లోనే ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవటానికి MeetingsIO అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది.  రిజిస్ట్రేషన్ చేసుకోవటం ద్వారా మీటింగ్ షెడ్యూల్స్ ని ముందుగానే సెట్ చేసుకోవచ్చు. MeetingsIO సైట్ కి వెళ్ళి ’Get a Meeting Room' పై క్లిక్ చేస్తే Room Name దగ్గర వచ్చే లింక్ ని అవసరమైన వారితో షేర్ చేసుకొని  ’Enter' పై క్లిక్ చెయ్యాలి. ఇనస్టంట్ మీటింగ్ లో జాయిన్ అవటానికి నిక్ నేమ్ ఇవ్వాలి.  ఇది notepad, screen sharing, live chat, and file sharing ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. 


వెబ్ సైట్:MeetingsIO

ధన్యవాదాలు

Wednesday, September 5, 2012

Make Me Genius - పిల్లలకోసం ఒక మంచి ఎడ్యుకేషనల్ వీడియో సైట్!!

ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఉపయోగపడే ఉచిత ఎడ్యుకేషనల్ వీడియో లను అందిస్తున్న సైట్ Make Me Genius. పిల్లలకు సులభంగా అర్ధమయ్యే విధంగా వీడియోలను రూపొందించారు.  వీడీయోలే కాకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ కూడా ఉన్నాయి.

అవగాహన కోసం సోలార్ సిస్టం గురించిన వీడియో చూడండి:



వెబ్ సైట్: Make Me Genius

మరిన్ని బెస్ట్ ఎడ్యుకేషనల్ వెబ్ సైట్స్ - వీటిలో ఉచిత / పెయిడ్ సైట్లు కూడా ఉన్నాయి:

ధన్యవాదాలు

Tuesday, July 3, 2012

MAKE PASSPORT PHOTO - పాస్‌పోర్ట్ ఫోటోల షీట్ తయారుచేసుకోవటానికి!

మన దగ్గర ఉన్న ఫోటోని ఆన్‌లైన్ లో అప్‌లోడ్ చేసి పాస్‌పోర్ట్ ఫోటోల షీట్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం makepassportphoto.com అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది మరియు ఈ సర్వీస్ ని ఉపయోగించటానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు, ఇది పూర్తిగా ఉచితం.   

పాస్‌పోర్ట్ షీట్ తయారు చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. ఇక్కడ Select Your Photo type దగ్గర ఆయా దేశాల పాస్‌పోర్ట్ ఫోటో సైజ్ లు ఇవ్వబడ్డాయి, వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి లేదా క్రింద కావలసిన సైజ్ ని డైరెక్ట్ గా ఎంచుకోవచ్చు. తర్వాత Upload Image దగ్గర Choose file పై క్లిక్ చేసి ఇమేజ్ ఫైల్ ని అప్‌లోడ్ చెయ్యాలి. Next పై క్లిక్ చెసి మౌస్ సహాయంతో ఫోటోలో కావలసిన భాగాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు FINISH పై క్లిక్ చేసి Download పై క్లిక్ చెయ్యాలి అంతే. షీట్ డౌన్లోడ్ అవుతుంది ఇక ప్రింట్ చేసుకోవటమే.    



ధన్యవాదాలు

Monday, June 25, 2012

like.fm తో స్వంత మ్యూజిక్ బ్లాగ్ క్రియేట్ చేసుకోండి!!

like.fm అనే వెబ్ సర్వీస్ ని ఉపయోగించి స్వంత మ్యూజిక్ బ్లాగ్ క్రియేట్ చేసుకొని దానిలో పాటల్ పోస్ట్ చేసి కావలసిన వారితో షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా  Cross-posted ద్వారా ఇక్కడ పోస్ట్ చేసే పాటలు ట్విట్టర్ మరియు ఫేస్ బుక్ లలో కూడా పోస్ట్ చెయ్యవచ్చు. like.fm లో ఇంతకుముందు ఎవరైనా చేసిన పోస్ట్ లను రీ-పోస్ట్ చేసే సదుపాయం కలదు. 


like.fm ఫేస్ బుక్ అకౌంట్ సహాయం తో సైన్-అప్ చెయ్యవచ్చు. like.fm/username మీ హోమ్ పేజీ అవుతుంది.   దీనినే కావలసిన వారితో షేర్ చేసుకోవాలి. పోస్ట్  చెయ్యబడిన పాటలు థంబ్‍నైల్స్ గా కనిపిస్తాయి.  

వెబ్ సైట్: like.fm

ధన్యవాదాలు

Tuesday, June 19, 2012

Hundred Zeros.com - ఉచిత ఈ-పుస్తకాల సమాహారం !!!



hudndredzeros.com  సైట్ ఉచిత ఈ-పుస్తకాల సమాహారం ఇక్కడ వివిధ సబ్జెక్ట్ ల వారీగా పుస్తకాలను బ్రౌజ్ చేసే సదుపాయం కలదు. Amazon అకౌంట్ సహాయంతో Kindle device లేకున్నా ఈ-పుస్తకాలను కంప్యూటర్, మొబైల్, టాబ్లెట్ లేదా వెబ్ బ్రౌజర్ లోనే  ఉచితంగా చదవవచ్చు. ఈ సైట్ లో ప్రతి గంటకూ ఉచిత ఈ-పుస్తకాల లిస్ట్ అప్ డేట్ చెయ్యబడుతుంది. ఇక్కడ కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ, కిడ్స్, కామిక్స్, కుకరీ, ఫిట్ నెస్, పేరెంటింగ్, లా , సైన్స్ ఇలా మొదలగువాటికి సంబంధించిన ఉచిత పుస్తకాల లిస్ట్ ఉంది. 


వెబ్ సైట్: hudndredzeros.com

ధన్యవాదాలు

Saturday, June 9, 2012

మీ మితృలకు సంబంధించిన వార్తలు తెలుసుకోవాలా?


Newsle అనే ఆన్‌లైన్ టూల్ ని ఉపయోగించి మన ఫ్రెండ్స్ లేదా ఆయా రంగాల్లోని ప్రముఖులకు సంబంధిన వార్తలను తెలుసుకోవచ్చు. ఫేస్‌బుక్ లేదా లింక్‌డ్ఇన్ అకౌంట్లను ఉపయోగించి Newsle సీన్-ఇన్ చెయ్యవచ్చు. వాటిలోని ఫ్రెండ్స్ లిస్ట్ తీసుకొని వాళ్ళకు సంబంధించిన వార్తలను చూపిస్తుంది. లిస్ట్ లో అవసరం లేని వాళ్ళను తొలగించవచ్చు.


ఇలాంటిదే మరొక టూల్ గూగుల్ అలెర్ట్ మన సెర్చ్ క్వరీ అధారంగా ఈ-మెయిల్ నోటిపికేషన్స్ పంపబడతాయి.

 మరొక టూల్ :   uFollow.com

ధన్యవాదాలు

Google Hangout తో ఆన్‌లైన్ మీటింగ్స్ నిర్వహించుకోండి!!

Google Hangout తో ఆన్‌లైన్ మీటింగ్స్ లో పాల్గొనవచ్చు. దీనికోసం  plus.google.com/hangouts కి వెళ్ళి Start a Hangout పై క్లిక్ చెయ్యాలి. మీటింగ్ లో పాల్గ్నవలసిన వారి పేర్ల ను ఎంచుకున్న తర్వాత హ్యాంగ్ అవుట్ కి ఒక పేరు పెట్టి  Hangout బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఎమ్చుకున్న వారికి నోటిఫికేషన్ పంపబడుతుంది, అక్కడ Hangout బటన్ పై క్లిక్ చేసి హ్యాంగ్ అవుట్ లో పాల్గొనవచ్చు.  మీటింగ్ లో పాల్గొనేవారికి వెబ్ క్యామ్ మరియు మైక్ తప్పని సరిగా ఉండాలి మరియు గూగుల్ ప్లస్ యూజర్లు మాత్రమే హ్యాంగ్ అవుట్ లో పాల్గొన గలరు. మనం ఎంతమందినైనా ఆహ్వానించవచ్చు అయితే ఒకేసారి పదిమంది మాత్రమే హ్యాంగ్ అవుట్ లో పాల్గొనగలరు. గూగుల్ హ్యాంగ్ అవుట్ లో చాట్, గూగుల్ డాక్స్, స్క్రీన్ షేరింగ్ మొ. ఇంటిగ్రేట్ చెయ్యబడి ఉన్నాయి.


మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

వెబ్ సైట్: plus.google.com/hangouts

ధన్యవాదాలు

Thursday, June 7, 2012

మీ సెర్చ్ హిస్టరీని ట్రాక్ చెయ్యని సెర్చ్ ఇంజిన్ల్లు...


అంతర్జాలంలో ఏదైనా సెర్చ్ చెయ్యాలంటే కనుక మనకు ముందుగా గుర్తు వచ్చే సెర్చ్ ఇంజిన్ Google... అయితే దీనితోపాటు ప్రముఖ సెర్చ్ ఇంజిన్లైన యాహూ, బింగ్ మన సెర్చ్ హిస్టరీని ట్రాక్ చేసి, మనకొక ఫ్రొఫైల్ నిర్మించి దానిని బట్టి సెర్చ్ రిజల్ట్స్ ని అందిస్తాయి... అయితే మన సెర్చ్ హిస్టరీని ట్రాక్ చెయ్యని సెర్చ్ ఇంజన్స్ గురించి ఇక్కడ తెల్సుకుందాం: 

DuckDuckGo: ఇది మన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదు మరియు ఎవరితో షేర్ చెయ్యదు. DuckDuckGo ప్రైవసీ పాలసీ ఇక్కడ చూడండి.   ఒక్కొక్కరికి వేరేలా కాకుండా అందరికీ ఒకే సెర్చ్ రిజల్ట్స్ ని ఇది అందిస్తుంది. దీని హోమ్ పేజి చాలా సింపుల్ గా ఉంటుంది.




DuckDuckGo లాగానే మన వ్యక్తిగత సమాచారం సేకరించని ఇతర సెర్చ్ ఇంజిన్లు StartPage, ixquick, Blekko, Ask


ధన్యవాదాలు

Monday, May 28, 2012

So.cl - మైక్రోసాప్ట్ నుండి సోషల్ నెట్ వర్క్!!!



ఫేస్ బుక్, గూగుల్ + లా మరొక సొషల్ నెట్ వర్క్ అదే So.cl .... అదీ మైక్రోసాఫ్ట్ నుండి.. ఇది సోషల్ నెట్ వర్క్ మాత్రమే కాదు ఒక సెర్చ్ సైట్ కూడా. ఏదో నేర్చుకోవాలన్న తపన ఉన్న  వారికి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ కావలసిన టాపిక్ పై సెర్చ్ చేసి కావలసిన సమాచారాన్ని సేకరించవచ్చు మరియు షేర్ చేసుకోవచ్చు. ఇది ఒకరకంగా సెర్చ్ సొషల్ నెట్ వర్క్ గా చెప్పవచ్చు.

మీకు ఆల్రెడీ ఉన్న ఫేస్ బుక్ లేదా విండోస్ లైవ్ అకౌంట్ తో సైన్-ఇన్ చెయ్యవచ్చు, అయితే పర్మిషన్ ఇవ్వవలసి ఉంటుంది. టెర్మ్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత హోమ్ పేజ్ వస్తుంది


మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి:



Website: So.cl

ధన్యవాదాలు

Tuesday, May 8, 2012

IRCTC సైట్ లో తత్కాల్ టిక్కెట్స్ బుక్ చేసే వారికి ఉపయోగపడే Magic Autofill టూల్!!

IRCTC సైట్ లో కన్ఫార్మ్ డు తత్కాల్ టిక్కెట్స్  బుక్ చేసుకోవటం చాలా కష్టం... మనం సైట్ లో టికెట్ బుక్ చేసుకునే లోపే కౌంటర్ లో తత్కాల్ కోటా అయిపోతుంది.  అందుకే తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవటం కోసం తెల్లవారుజాముకే కౌంటర్ల్ల దగ్గర పడిగాపులు కాయాల్సివస్తుంది లేదంటే ఏజెంట్ పై ఆధారపడవలసి వస్తుంది. ఇక్కడ చెప్పబోయే చిన్న ఆటోఫిల్ టూల్ ఉపయోగించి ప్రయాణీకుల పేర్లు తదితర వివరాలను ముందుగా సిద్ధం చేసుకొని తర్వాత IRCTC సైట్ లో ఆటో ఫిల్ చేసుకోవచ్చు దీంతో ఆ సైట్ లో ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చెయ్యటానికి పట్టే సమయాన్ని ఆదాచెయ్యవచ్చు.

అదెలాగో ఈ క్రింది డిజిటల్ ఇన్స్ఫిరేషన్ వీడియో చూడండి:


పై వీడియోలో తెలిపిన Magic Autofill ఫార్మ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి, అక్కడ ప్రయాణీకుల వివరాలను ఎంటర్ చేసి ’I'm feeling lucky' పై క్లిక్ చెయ్యాలి, తర్వాత అక్కడ వచ్చే ’Magic Autofill' ని బుక్ మార్క్ టూల్ బార్ లోకి డ్రాగ్ చెయ్యాలి. ఇప్పుడు IRCTC సైట్ కి వెళ్ళినప్పుడు ’Passeger Details' దగ్గర ప్రయాణీకుల విరాలు ఆటోమాటిక్ గా ఫిల్ చెయ్యటం కోసం బుక్ మార్క్ చేసుకున్న ’Magic Autofill' పై క్లిక్ చెయ్యాలి అంతే.


సేకరణ: Digital Inspiration నుండి.

ధన్యవాదాలు

Monday, May 7, 2012

స్టూడెంట్స్ కోసం సెర్చ్ ఎడ్యుకేషన్[Search Education] ని ప్రారంభించిన గూగుల్...

గూగుల్ సెర్చ్ ని ఎలా ఉపయోగించాలనే దానిపై విద్యార్ధులను ఎడ్యుకేట్/ ట్రైనింగ్ ఇవ్వటం కోసం గూగుల్ సెర్చ్ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ని ప్రారంభించింది. ఈ సైట్ విద్యార్ధులకే కాక ఉపాధ్యాయులకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ  Lesson Plans తో పాటు Live Training ని కూడా అందిస్తున్నారు. ఈ సైట్ లోని ట్యుటోరియల్స్ విద్యార్ధులు తమ కావలసిన సబ్జెట్ కి సంబంధించిన సరైన సమాచారాన్ని సెర్చ్ చెయ్యటం లో ఎంతగానో ఉపకరిస్తాయి.





వెబ్ సైట్: Google Search Education

ధన్యవాదాలు

Thursday, May 3, 2012

అవయవదానాన్ని ప్రోత్సహించటానికి ఫేస్ బుక్ క్రొత్త ఫీచర్...

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ అవయవదానాన్ని ప్రోత్సహించటానికి క్రొత్త ఫీచర్ 'Organ Donor' ని ’Time Line ' లోని ’Life Event' లో తెచ్చింది. మెడికల్ ఫీల్డ్ లో పని చేస్తున్న తన గర్ల్ ప్రెండ్ తో డిన్నర్ చేస్తున్నప్పుడు మాటల మధ్యలో వచ్చిన ఐడియాతో అవయవ దానం యొక్క ఆవశ్యకతను తెలియచెయ్యాలని  క్రొత్త ఫీచర్ యాడ్ చెయ్యనున్నట్లు ఫేస్ బుక్ CEO Mark Zuckerberg US television లో గుడ్ మార్నింగ్ అమెరికా షో లో తెలియచేశారు.   అంతేకాకుండా యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నుండి కూడా స్పూర్తి పొందినట్లు చెప్పారు.  స్టీవ్ జాబ్స్ కి ఆయన చనిపోవటానికి సంవత్సరం ముందు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేశారు.


ప్రస్తుతానికి ఈ ఫీచర్ US మరియు బ్రిటన్ దేశాలలో పరిచయం చేశారు. ఇక్కడ విజయవంతమైతే ఈ పీచర్ ని మిగతా దేశాల్లో విస్తరించనున్నారు.

ధన్యవాదాలు