Friday, November 14, 2008

iSpring - పవర్ పాయింట్ టు ఫ్లాష్ కన్వర్షన్ సాప్ట్ వేర్

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను ఫ్లాష్ మూవీ లు గా మార్చ్టానికి iSpring సాప్ట్ వేర్ వుపయోగపడుతుంది. దీనిని http://www.ispringsolutions.com/products/ispring_free.html నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. iSpring వుచిత సాప్ట్ వేర్ మరియు డౌన్లోడ్ ఫైల్ సైజ్ 7 MB. iSpring functions ని పవర్ పాయింట్ స్టాండర్డ్ టూల్ బార్ లో పొందవచ్చు. ’Quick Publish' పై క్లిక్ చేసి ఒకే ఒక క్లిక్ తో ఫ్లాష్ లోకి మార్చవచ్చు. లేకుంటే ’Publish' పై క్లిక్ చేసి విజార్డ్ వుపయోగించి కావలసిన విధంగా మార్చుకోవచ్చు.







ధన్యవాదాలు

Wednesday, November 12, 2008

Evonsoft Computer Repair - సిస్టం పనితనం మెరుగుపర్చే వుచిత సాప్ట్ వేర్!!!

Evonsoft Computer Repair - స్పైవేర్ తొలగించటానికి, రిజిస్ట్రీ క్లీన్ చెయ్యటానికి, వ్యక్తిగత బ్రౌసింగ్ హిస్టరీ మరియు జంక్ ఫైళ్ళను తొలగించటానికి ఈ యుటిలిటీ వుపయోగపడుతుంది. దీనిని http://www.evonsoft.com/computer-repair.html నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫైల్ సైజ్ 1.51 MB మాత్రమే.







ధన్యవాదాలు

Wednesday, November 5, 2008

Adeona - లాప్ టాప్ ట్రాకింగ్ సిస్టం - ఉచిత సాప్ట్ వేర్


University of Washington కంఫ్యూటర్ సైంటిస్ట్ లచే మొదటి వుచిత లాప్ టాప్ ట్రాకింగ్ సిస్టం రూపోదించబడినది... అదే Adeona ...ఒక గ్రీకు దేవత పేరునే ఈ సాప్ట్ వేర్ కు పెట్టారు. దొంగిలించబడిన లేదా పోయిన లాప్ టాప్ లను కనుక్కోవటానికి ఈ సిస్టమ్ వుపయోగపడుతుంది.లాప్ టాప్ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన తర్వాత Adeona ఒక కీ జెనెరేట్ చేస్తుంది, దొంగిలించబడిన లాప్ టాప్ ట్రాక్ చెయ్యటానికి ఆ కీ అవసరమవుతుంది. లాప్ టాప్ ట్రాక్ చెయ్యటానికి Adeona వివిధ పధ్ధతులను అనుసరిస్తుంది. లాప్ టాప్ వుపయోగించే లొకేషన్ లోని ఐపి అడ్రస్ బ్రాడ్ కాస్ట్ చేస్తుంది మరియు సిస్టం లోని ఇన్ బిల్ట్ కెమేరా ను వుపయోగించి యూజర్ యొక్క ఫోటోలను ప్రతి 30 సెకన్లకొకసారి తీస్తుంది.

మరింత సమాచారం మరియు వుచిత Adeona సాప్ట్ వేర్ కోసం http://adeona.cs.washington.edu/ కి వెళ్ళండి.

ధన్యవాదాలు

Tuesday, November 4, 2008

యాహూ మెయిల్ కాంటాక్ట్ లను జీ-మెయిల్ కి ఇంపోర్ట్ చెయ్యండిలా!!!

ఈ మధ్యకాలంలో జీ-మెయిల్ వాడకం బాగా పెరిగింది...అది అందిస్తున్న సర్వీసెస్ వల్ల కానీ మరి ఏ యితర కారణాల వల్ల కానీ చాలా మంది యహూ మరియు యితర మెయిల్ యూజర్లు జీ-మెయిల్ కి మారారు. ఈ పరిస్ధితిలో యాహూ లో వున్న Contacts ని జీ-మెయిల్ కి ఎలా ఇంపోర్ట్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం...

1.ముందుగా యాహూ మెయిల్ కి లాగిన్ అవ్వాలి. ’Contacts' టాబ్ పై క్లిక్ చేసి ’Import/Export' పై క్లిక్ చెయ్యాలి.

2.క్రింద వున్న ’Export' దగ్గర 'Yahoo!CSC:' దగ్గరవున్న ’Export Now' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

3.CSV ఫైల్ ని ’Save' బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి.

4.ఇప్పుడు Gmail లాగిన్ చేసి ’Contacts' పై క్లిక్ చెయ్యాలి.

5.ఇక్కడ ’Import' పై క్లిక్ చెయ్యాలి.

6.’Browse' బటన్ పై క్లిక్ చేసి ఇంతకుముందు యాహూ నుండి సేవ్ చేసుకొన్న CSV ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్రిందవున్న ’Import' పై క్లిక్ చెయ్యాలి.

7.కాంటాక్ట్స్ ఇంపోర్ట్ చెయ్యబడిన తర్వాత ’Ok' పై క్లిక్ చెయ్యాలి. అంతే యాహూ మెయిల్ లోని Contacts అన్నీ Gmail లోకి వచ్చేస్తాయి.


ధన్యవాదాలు

Thursday, October 30, 2008

విండోస్ మొబైల్ అప్లికేషన్లు...

విండోస్ మొబైల్ కు సంబంధించిన కొన్ని ఉచిత అప్లికేషన్లు అవి దొరికే లింకులు ఈ క్రింద యివ్వబడినవి...
1. vBar Task manager:
http://vieka.com/vbar.htm
2.Data Backup:
http://www.dotfred.net/
3.PDF Viewer:
http://www.adobe.com/products/acrobat/readerforppc.html
4.Feed Reader:
http://www.freewarepocketpc.net/
5.Temp. file Cleaner:
http://www.tucows.com/
6.Web Browser:
http://www.opera.com/products/mobile/
7.Video Player:
http://picard.exceed.hu/tcpmp/test/
8.Screen Capture:
http://freewareppc.com/
9.Unzip Utility:
http://www.cnetx.com/ezyunzip/
10.Notepad:
http://handheld.softpedia.com/
11.Activity Simulator:
http://www.scottandmichelle.net/scott/cestuff.html
12.Image Viewer:
http://www.pocketcm.com/

చివరగా మైక్రోసాప్ట్ నుండి లభించే విండోస్ మొబైల్ అప్లికేషన్ల కోసం http://www.microsoft.com/windowsmobile/en-us/downloads/microsoft/default.mspx కి వెళ్ళండి.

ధన్యవాదాలు

Monday, October 27, 2008

యాహూ మెయిల్ ని అవుట్ లుక్ ఎక్స్ ప్రెస్ లో కాన్ఫిగర్ చెయ్యటానికి...

యాహూ మెయిల్ లో POP3 సర్వీస్ డిసేబుల్ చెయ్యబడి వుంటుంది, ధర్డ్ పార్టీ అప్లికేషన్ వుపయోగించి యాహూ మెయిల్ ని అవుట్ లుక్ ఎక్స్ ప్రెస్ లో యాక్సెస్ చెయ్యవచ్చు। ముందుగా YPOPS! అనే అప్లికేషన్ ని http://www.softpedia.com/progDownload/YahooPOPs-Download-3702.html నుండి డౌన్ లోడ్ చేసుకోని, ఇనస్టలేషన్ చేసుకోవాలి ... ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత YPOPS! ఐకాన్ సిస్టం ట్రే లో కనబడుతుంది. లేకుంటే Start ---> All Programs --->YPOPS!---> YPOPS! పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు అవుట్ లుక్ ఎక్స్ ప్రెస్ లో ఎలా కాన్ఫిగర్ చెయ్యాలో చూద్దాం.

1.ముందుగా Outlook Express ని ఓపెన్ చేసి, మెయిన్ మెనూ లోని Tools ---> Accounts పై క్లిక్ చెయ్యాలి

2.'Internet Accounts' విండో లో 'All' టాబ్ లో 'Add' బటన్ పై క్లిక్ చేసి ’Mail' సెలెక్ట్ చేసుకోవాలి.

3.'Internet Connection Wizard' లో ’Display Name'లో పేరు ఎంటర్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

4.'Internet E-mail Address' విండో లో 'E-mail address' దగ్గర yahoo e-mail Id ఎంటర్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

5.'E-mail Server Names' విండో లో ’My Incoming mail server is a' దగ్గర "POP3" సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Incoming mail (POP3. IMAP or HTTP)Server' దగ్గర మరియు 'Outgoing mail (SMTP)Server' దగ్గర localhost అని టైప్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

6.'Internet Mail Logon' విండో లో ’Account Name' దగ్గర ఫుల్ ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేసి, ’Password' దగ్గర పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

7.Outlook Express లో Yahoo Mail కాన్ఫిగర్ చెయ్యబడినది, ’Finish' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

8.ఇప్పుడు మెయిన్ మెనూ లో 'Tools' ---> 'Send and Recive' ---> 'Localhost' పై క్లిక్ చేస్తే యాహూ మెయిల్స్ ’Inbox' లోకి చేరతాయి.


ధన్యవాదాలు .... బ్లాగ్ మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు....

Wednesday, October 22, 2008

Macromedia Flash ఫ్రీ ఈ-బుక్స్

Macromedia Flash ఫ్రీ ఈ-బుక్స్ కోసం క్రింద యివ్వబడిన లింకులు చూడండి:

E-BOOK 1

E-BOOK 2

E-BOOK 3

E-BOOK 4

E-BOOK 5

E-BOOK 6

E-BOOK 7

E-BOOK 8

E-BOOK 9

E-BOOK 10

E-BOOK 11

E-BOOK 12

ధన్యవాదాలు