Friday, December 31, 2010

Wylio - the fastest photo finder for bloggers - ఇమేజ్ లను వెతికి వాటిని బ్లాగుల్లో ఎంబెడ్ చెయ్యటానికి !!! [500 వ పోస్ట్]

ఇమేజ్ లను సెర్చ్ చెయ్యటానికి అంతర్జాలంలో చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, కాని వాటన్నిటికి భిన్నమైనది Wylio. అదెలాగో చూద్దాం Wylio సైట్ కి వెళ్ళి కావలసిన ఇమేజ్ కి సంబంధించిన కీవార్డ్ ఎంటర్ చేసి 'Search' పై క్లిక్ చేస్తే ఇమేజ్ లు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి.



ఇప్పుడు కావలసిన ఇమేజ్ పై క్లిక్ చేస్తే Adjustments పేజీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఇమేజ్ ని రీసైజ్ చేసుకోవచ్చు మరియు ఎలైన్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ’get the code' పై క్లిక్ చేస్తే బ్లాగులో ఎంబెడ్ చేసుకోవటానికి కోడ్ వస్తుంది.



వెబ్ సైట్: Wylio

ఇది నా 500 వ పోస్ట్ మరియు ఈ సంవత్సరానికి కూడా ఇదే లాస్ట్. మూడు సంవత్సరాల క్రితం కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ లో బ్లాగులు మరియు తెలుగులో టైప్ చెయ్యటం గురించి తెలుసుకొని మనం కూడా ఒక బ్లాగు మొదలెడితే ఎలా ఉంటుంది అని ఈ బ్లాగ్ ని మొదలు పెట్టటం జరిగింది, ఇందుకు ముందుగా శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. కధలూ, కవితలూ రావు కాబట్టి మనకి టచ్ ఉన్న కంప్యూటర్ రంగమే బెటర్ అని అదే కంటిన్యూ అవుతున్నా. అంతర్జాలంలో వివిధ సైట్లనుండి సేకరించిన తాజా సమాచారాన్ని తెలుగులో అందించటం జరిగింది. ఇందులో కొన్ని మిత్రుల సహకారాలు కూడా ఉన్నాయి. కొన్ని హిట్లు మరియు కొన్ని ఫట్లతో బ్లాగు ప్రయాణం లో 500 వ మైలు రాయిని చేరుకున్నా. కొంత కాలం క్రితం కొందరు కామెంట్లలో అసభ్యకర లింకులు పెట్టటంతో కామెంట్లను డిసేబుల్ చెయ్యటం జరిగింది.

ఇంతకాలం ఆదరించిన రీడర్స్ కి నా ధన్యవాదాలు, ఇక ముండు కూడా మరిన్ని పోస్టులతో రచన - The Creation మీ ముందుకు వస్తుంది.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

మీ

శ్రీనివాస బాబు తోడేటి

పీసీ బూటింగ్ వేగాన్ని పెంచటానికి స్టార్ట్ అప్ లో ఉంచవలసిన లేదా తొలగించవలసిన అప్లికేషన్ల వివరాలు తెలుసుకోవటానికి!!!

పీసీ బూటింగ్ వేగం మందగించటం లో స్టార్ట్ అప్ అప్లికేషన్లు కూడా ఒక కారణం, అనవసరమైన స్టార్ట్ అప్ అప్లికేషన్లు తొలగించటం వలన బూటింగ్ సమయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే దీనికోసం మనం Srart ---> Run కి వెళ్ళి msconfig.exe అని టైప్ చేసి ఓకే చేస్తే ఓపెన్ అయ్యే సిస్టం కాన్ఫిగరేషన్ యుటిలిటీ Startup టాబ్ లో అనవసరమైన స్టార్ట్ అప్ ఐటమ్ దగ్గర టిక్ తీసివేయాలి.



అయితే ఇక్కడొక ప్రమాదం ఉంది, అనుభవం లేని వారు ఏ ప్రోగ్రామ్ కావాలో/ వద్దో తెలియక ఏదో ఒక టిక్ తీసివేస్తే కనుక మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి వారికోసం Sysinfo సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ స్టార్ట్ అప్ ఐటమ్, దానికి సంబంధించిన సమాచారం, దానిని ఉంచాలా వద్దా అనే వివరాలు పొందుపర్చారు.



వెబ్ సైట్: Sysinfo

ధన్యవాదాలు

Wednesday, December 29, 2010

BackStreet Browser - వెబ్‌సైట్లను పీసీ లోకి డౌన్లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్ లో బ్రౌజ్ చెయ్యటానికి!!!

మనకు నచ్చిన సైట్ ని ఆన్‌లైన్ లో చూడటానికి సమయం లేనప్పుడు ఆ సైట్ మొత్తాన్ని యధాతధంగా మన హార్డ్‌డిస్క్ లోకి డౌన్లోడ్ చేసుకొని అవసరమైనప్పుడు చూడటానికి BackStreet Browser అనే చిన్న అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ముందుగా BackStreet Browser ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. 'New' పై క్లిక్ చేసి URL దగ్గర డౌన్లోడ్ చెయ్యవలసిన వెబ్ సైట్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది, సైట్ మొత్తం మన హార్డ్ డిస్క్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది.


Major Features of BackStreet Offline Browser:

  • High-speed, multi-threading website download.

  • Resume feature to pick up a session where left off.

  • Update feature to download new or modified files.

  • Built-in file viewer in onboard browser window to view files offline.

  • Print/Preview downloaded files within same offline browser window.

  • Built-in Zip/Unzip facility for downloaded websites.

  • Option of duplicating the original directory structure of a site.

  • Filters files by URL, size, type, date modified, text.

  • User-selectable recursion levels, retrieval threads, timeout and proxy support.

  • Accesses password-protected sites.



డౌన్లోడ్: BackStreet Browser (1.48 MB)

ఇలాంటిదే మరొక సాప్ట్ వేర్ Fresh WebSuction.

ధన్యవాదాలు

Tuesday, December 28, 2010

ConvertToCartoon - ఫోటోలను కార్టూన్లగా మార్చటానికి!!!

మన ఫోటోలను కార్టూన్ క్యారక్టర్ గా మార్చితే ఎలా ఉంటుందో చూసుకోవాలని ఉందా? అదీ ఒకేఒక క్లిక్ తో! అయితే ConvertToCartoon సైట్ కి వెళ్ళాల్సిందే, ముందుగా URL ద్వారా లేదా Disk నుండైనా మన ఫోటోని అప్లోడ్ చెయ్యాలి. డిస్క్ నుండి అయితే కనుక ’Choose file' పై క్లిక్ చేసి కార్టూన్ గా మార్చవలసిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడే ఉన్న ’Cartoonize now' పై క్లిక్ చెయ్యాలి అంతే ఫోటో కార్టూన్ గా మారిపోతుంది. అవసరం అనుకొంటే ఆ కార్టూన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనంతటికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ConvertToCartoon gif, jpeg, jpg, png, bmp,లేదా xbm మొదలగు ఇమేజ్ ఫార్మేట్లని సపోర్ట్ చేస్తుంది.





వెబ్ సైట్: ConvertToCartoon

ధన్యవాదాలు

Monday, December 27, 2010

allmymacapps - Mac ఉచిత అప్లికేషన్ల సమాహారం!!!

Mac యూజర్ల కోసం ఉచిత మరియు పెయిడ్ అప్లికేషన్లు అన్నీ ఒకే చోట allmymacapps సైట్ లో లభిస్తాయి మరియు ఇక్కడ కావలసిన అప్లికేషన్ కై సెర్చ్ చేసుకొనే సదుపాయం కూడా కలదు. క్యాటగిరీ వారీగా సాప్ట్ వేర్లను చూడవచ్చు మరియు అవసరమైన అప్లికేషన్లను ఈ సైట్ నుండే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.



Mac యూజర్లు తప్పక చూడవలసిన సైట్ ఇది.

వెబ్ సైట్: AllMyMacApps

ధన్యవాదాలు

Saturday, December 25, 2010

FreeFileConvert - ఆన్‌లైన్ లో ఫైళ్ళను ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చటానికి!!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ మరియు ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యకుండా ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి సులభంగా మార్చవచ్చు, అదీ కేవలం మూడేమూడు స్టెప్పుల్లో, దీనికోసం freefileconvert సైట్ కి వెళ్ళాలి, అక్కడ Convert File టాబ్ పై క్లిక్ చెయ్యాలి. అక్కడ ఉన్న స్టెప్ 1) Input File దగ్గర ఉన్న Choose File పై క్లిక్ చేసి కన్వర్ట్ చెయ్యవలసిన ఫైల్ ని ఎంచుకోవాలి, ఫైల్ సైజ్ 300 MB వరకు ఉండవచ్చు. 2) Output Format దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ కి అనుగుణంగా మార్చదగిన ఫైల్ ఫార్మేట్లను చూపిస్తుంది, వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి. 3) Convert దగ్గర ఉన్న Convert బటన్ పై క్లిక్ చెయ్యాలి అంతే.



ఫైల్ కన్వర్ట్ చెయ్యబడిన తర్వాత డౌన్లోడ్ లింక్ జెనెరేట్ అవుతుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ సైట్ సర్వర్ లో ౧౨ గంటల వరకు ఉంటుంది.



వెబ్‌సైట్: FreeFileConvert

Friday, December 24, 2010

Autorun Disabler - విండోస్ లో ఆటోరన్ ని డిసేబుల్ చెయ్యటానికి పోర్టబుల్ అప్లికేషన్!!!

పీసీ లో సీడీ/డీవీడీ లేదా USB డ్రైవ్ లను ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటోరన్ ఫంక్షన్ ద్వారా చిన్న విండో పాప్ అప్ అవటం మనం గమనించే ఉంటాం. దీనివలన కావలసిన ఫైల్/ ఫోల్డర్ ని త్వరగా ఓపెన్ చెయ్యవచ్చు. ఒక్కొక్కసారి ఇది ప్రమాదకారి కూడా, దీనివలన వైరస్ లు సులభంగా పీసీ లోకి చేరే అవకాశం ఉంది, ఈ ప్రమాదం మరీ ముఖ్యంగా USB డ్రైవ్ ల వలన కలుగుతుంది. విండోస్ లో ఈ ఆటోరన్ ఫంక్షన్ ని డిసేబుల్ చెయ్యాలంటే కనుక రిజిస్ట్రీ లో కొన్ని మార్పులు చెయ్యాలి, అవగాహన లేకుండా రిజిస్ట్రీ ని కదిపించటం కూడా ప్రమాదమే. అటువంటి వారు ఆటోరన్ ఫంక్షన్ ని డిసేబుల్ చెయ్యటానికి Autorun Disabler అనే పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించవచ్చు. దీనిని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేసి Autorun Disabler ఫైల్ రన్ చేస్తే ఈ క్రిందివిధంగా వస్తుంది.



ఇక కావలసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ’ఓకే’ పై క్లిక్ చెయ్యటమే అంతే.

డౌన్లోడ్: Autorun Disabler

ధన్యవాదాలు