Wednesday, May 12, 2010

thumba - ఉచిత ఆన్ లైన్ ఇమేజ్ ఎడిటర్

thumba - మైక్రోసాప్ట్ సిల్వర్ లైట్ ఆధారంగా పనిచేసే ఒక బెస్ట్ ఉచిత ఆన్ లైన్ ఇమేజ్ ఎడిటర్. thumba సైట్ నుండే సిల్వర్ లైట్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌజర్ ఇమేజ్ ఎడిటర్ లా మారుతుంది. ఎడిట్ చెయ్యవలసిన ఫోటోలను డ్రాగ్-అండ్-డ్రాప్ పద్ధతిలో thumba లో ఓపెన్ చెయ్యవచ్చు, లేదంటే thumba మెనూ లో ’Get Started'---> ’Open' పై క్లిక్ చేసి ఎడిట్ చెయ్యవలసిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని thumba లో ఓపెన్ చెయ్యవచ్చు. వెబ్ కెమెరా ఉపయోగించి కూడా ఫోటోలను ఫ్రెష్ గా లోడ్ చేసుకోవచ్చు.



ఇమేజ్ కి టెక్స్ట్ జతచెయ్యటం, వేరొక ఇమేజ్ యాడ్ చెయ్యటం, బ్రషెస్, రెడ్ ఐ ని తొలగించటం, ఇమేజ్ లో కావలసిన భాగాన్ని డిస్టార్ట్ చెయ్యటం, రీ సైజ్, ఇమేజ్ ని టెక్స్ట్ లోకి మార్చటం, ఇమేజ్ రొటేషన్, కలర్ బ్యాలన్స్, ఇమేజ్ ని గ్రేస్కేల్ కి మార్చటం, బ్లర్ ని తగ్గించటం, డిస్టార్షన్ కరెక్షన్ యిలా చాలనే ఫీచర్లు వున్నాయి. ఎడిట్ చేసిన ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ కూడా చేసుకోవచ్చు.


thumba ని ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే ఉపయోగించవచ్చు, అంతే కాకుండా డెస్క్ టాప్ లో కూడా ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్: thumba

ధన్యవాదాలు