Monday, June 14, 2010

Blackle - ఎనర్జీ సేవింగ్ సెర్చ్ ఇంజిన్

గ్లోబర్ వార్మింగ్ గురించి సర్వత్రా చర్చ జరుగుతున్న ఈ తరుణం లో మన వంతు గా కొంతైనా ఎనర్జీ సేవ్ చేస్తే అది భావి తరాలకు ఉపయోగపడుంది. ఇప్పుడు Blackle అనే ఎనర్జీ సేవింగ్ సెర్చ్ ఇంజిన్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఇంటర్నెట్ లో ఏదైనా సెర్చ్ చెయ్యలంటే కనుక గూగుల్ కి వెళతాం అలా కాకుండా ఈ సారి http://www.blackle.com/ సైట్ కి వెళ్ళండి. ఇక్కడ అంతా నల్లగా వుండి కావలసిన టెక్స్ట్ మాత్రం వైట్ గా డిస్ప్లే అవుతుంది. స్క్రీన్ మొత్తం వైట్ (లేదా లైట్) వుండటం కన్నా బ్లాక్ గా (వెలిగే పిక్సెల్స్ తక్కువగా) ఉండటం వలన విద్యుత్తు ను ఆదాచెయ్యవచ్చు. ఇక్కడ ఆదా అయ్యే విద్యుత్తు చాలా తక్కువ అయినా మనవంతు సహాయం.



వెబ్ సైట్: http://www.blackle.com/

ధన్యవాదాలు