Monday, February 13, 2012

SocialSafe - ఫేస్ బుక్ స్టేటస్ అప్ డేట్స్, టైమ్ లైన్, ఫ్రెండ్స్ లిస్ట్ మొదలగు వాటిని బ్యాక్ అప్ తీసుకోవటానికి!

ఫేస్ బుక్ మన జీవితంలో డిజిటల్ స్క్రాప్ బుక్ గా మారిపోయింది. దానిలో మన పోటోలు , ఫ్రెండ్స్ లిస్ట్, స్టేటస్ అప్ దేట్స్ బ్యాక్ అప్ తీసుకోవటం ఉత్తమం ... ఫేస్ బుక్ ఎప్పుడైనా భవిష్యత్ లో పాలసీలను మార్చి మన కంటెంట్ ని తొలగించముందే జాగ్రత్త పడదాం... ఒక్క ఫేస్ బుక్ కాకుండా ఇతర సోషల్ నెట్ వర్క్స్ లోని మన సమాచారాన్ని బ్యాక్ అప్ తీసుకోవటానికి అడోబ్ ఎయిర్ ఆధారిత SocialSafe అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది. 



డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం SocialSafe సైట్ చూడండి.

ధన్యవాదాలు

Friday, February 10, 2012

USB డ్రైవ్ లలో స్పేస్ ఫుల్ డాటా నిల్ అని చూపిస్తుందా?

ఒక్కొక్కసారి మన USB Drives (పెన్ డ్రైవ్, ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్, మెమొరీ కార్డ్ మొదలగునవి) లలో డాటా ఏమీ కనబడకుండా  డిస్క్ స్పేస్ మాత్రం ఫుల్ గా చూపిస్త్తూ ఉంటే దానికి వైరస్ లు కారణం కావచ్చు. వైరస్ లు మన డాటాని కనబడకుండా చేస్తాయి. అయితే ఒక్కొక్కసారి యాంటీ వైరస్ సాప్ట్ వేర్లతో స్కాన్ చేసినా కూడా ఫైళ్ళు కనబడకపోతే ఈ క్రింది విధంగా చెయ్యండి:

౧. ముందుగా USB Drive ని పీసీ కి కనెక్ట్ చెయ్యాలి. My Computer లో దాని డ్రైవ్ లెటర్ తెలుసుకోవాలి.

౨. Start---> Run కి వెళ్ళి cmd అని టైప్ చేసి Enter కొట్టండి. 

౩. కమాండ్ ప్రాంమ్ట్ వస్తుంది. అక్కడ USB Drive లెటర్ ప్రక్కన : టైప్ చేసి Enter చెయ్యాలి. (ఉదా మీ USB Drive letter I అయితే కనుక కమాండ్ ప్రాంమ్ట్ దగ్గర I: అని టైప్ చేసి ఎంటర్ చెయ్యాలి)

౪. ఇప్పుడు కమాండ్ పాంమ్ట్ దగ్గర ఈ క్రింది విధంగా కమాండ్ ఎంటర్ చెయ్యాలి

attrib -s -h /s /d *.*




పైన చెప్పిన కమాండ్ లో -s, -h, /s మరియు /d ల మధ్య ఒక స్పేస్ ఉండాలి. Enter కొట్టండి. కొన్ని సెకన్ల తర్వాత  తిరిగి కమాండ్ పాంమ్ట్ వస్తుంది. అప్పుడు USB Drive ని తొలగించి తిరిగి మరల కనెక్ట్ చెయ్యండి. అంతే ఇంతకు ముందు వైరస్ లచే దాచబడిన ఫైల్స్ మరియు పోల్డర్లు ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు యాంటీ వైరస్ ప్రోగ్రామ్ లను రన్ చేసి వైరస్ లను క్లీన్ చేసుకోవచ్చు.

ధన్యవాదాలు

Thursday, February 9, 2012

జీమెయిల్ మరియు ఇతర గూగుల్ డాటా ని డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?

మన డాక్యుమెంట్లు, ఫోటోలు, కాంటాక్ట్స్ , మెయిల్స్ మరియు ఇతర సమాచారం ఎక్కువగా ఆన్ లైన్ లోనే స్టోర్ చేస్తూ ఉంటాం.  ఒక్కసారి ఆ సర్వర్లు డౌన్ అయితే మన పరిస్థితి ఏమిటి? ఈ రోజు ఉచితం రేపు పెయిడ్ ఐతే ఏం చెయ్యాలి?  యూఎస్ ప్రభుత్వం మెగాఅప్ లోడ్ ని సీజ్ చేసినప్పుడు మెగా అప్ లోడ్ సర్వర్లలోని డాటా ని చాలా మంది కోల్పోయారు. గూగుల్ ప్రైవసీ పాలసీ మరియు అమెరికా SOPA/PIPA చట్టాలు... మన డాటా ని మనమే జాగ్రత్త చేసుకోవటం మన బాధ్యత అని తెలియచేస్తున్నాయి. 


అయితే జీమెయిల్ మరియు ఇతర గూగుల్ అకౌంట్లలో ఉన్న మన డాటాని డౌన్లోడ్ చేసుకోవటానికి Google Takeout అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. దీని గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ చూడండి. 


అలానే Mozilla Thunderbird అనే ఈ- మెయిల్ క్లైంట్  సహాయంతో మన జీమెయిల్ ని మన పీసీ లోనే పొందవచ్చు. దీని  గురించి గతం లో చేసిన పోస్ట్ ఇక్కడ చూడండి. 

ధన్యవాదాలు

Wednesday, February 8, 2012

thinkb4u - గూగుల్ నుండి వెబ్ సేఫ్టీ ట్యుటోరియల్స్!!

thinkb4u సైట్ లో గూగుల్ మరియు దాని భాగస్వాములు వెబ్ సేప్టీ కి సంబంధించిన వివిధ ట్యుటోరియల్స్ ని అందిస్తున్నారు.  ఆన్ లైన్ లో జరిగే మోసాల బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలి, ఒక బాధ్యతాయుతమైన డిజిటల్ పౌరుడిగా ఎలా ఉండాలి తదితర విషయాలకు సంబంధించిన ట్యుటోరియల్స్ ఉన్నాయి. thinkb4u సైట్ లో ముఖ్యంగా మూడు విభాగాలున్నాయి అవి: 1) Student 2) Parents 3) Educators. ఒక్కొక్క విభాగం లో 9 వివిధ టాపిక్స్ ఉన్నాయి.  ప్రతీ టాపిక్ దానికి సంబంధించిన సమాచారం తో పాటు షార్ట్ వీడియో కూడా ఉంటుంది. ఒక Educators విభాగం లో Common Sense Media మరియు the National Consumer League నుండి టాపిక్స్ ఉంటాయి. 


మరింత సమాచారం కోసం Google Public Policy Blog చూడండి.

వెబ్ సైట్: thinkb4u 

ధన్యవాదాలు

Monday, February 6, 2012

గూగుల్ ఉద్యోగులు మన జీమెయిల్ చదువుతున్నారా?

గూగుల్ ఉద్యోగులు మన జీమెయిల్ చదువుతున్నారా? అవుననే అంటున్నారు Christopher Nguyen గూగుల్ మాజీ ఉద్యోగి. ఆయన మాటల్లోనే.... 



A small number of GMail related engineers have access to the servers as a matter of necessity to do their jobs; a very small number of people actually access the contents as a matter of necessity to do their jobs, and even then, almost always only the associated metadata.
The rest have to file a request and justify any access they ever need, which is extremely rare. All have to sign paperwork re users’ privacy at the risk of dismissal & legal action, knowing that whatever they do is discoverable. And ultimately, an internal culture of respecting users’ privacy helps keep one another in check.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు కాని మైక్రోసాప్ట్ తన అఫీషియల్ బ్లాగ్ లో దీని గురించి ఒక కధనాన్ని పోస్ట్ చేసింది. దానిలో
Some email services, like Gmail, actually read the contents of your mail (both sent and received, even if you aren’t a Gmail user but just sending to someone who is) in order to decide what kind of ads to serve up to you. They may call it “scanning” and attempt to equate it with less invasive activities like “checking for spam” but it’s quite different. For you, and the people you send mail to, it’s not spam, it’s personal.


దీనికి తోడు జీమెయిల్ మాన్ అని ఒక వీడియోని తయారు చేసి యూట్యూబ్ లో కూడా పెట్టింది.  మైక్రోసాఫ్ట్ స్వార్ధం కూడా కనిపిస్తుంది, జీమెయిల్ యూజర్లు హాట్ మెయిల్ కి మారవచ్చనేమో...





ధన్యవాదాలు

Saturday, February 4, 2012

ooVoo - ఉచిత ఆడియో & వీడియో చాట్ టూల్!!

ఉచిత క్రాస్ ఫ్లాట్‌ఫార్మ్ కమ్యూనికేషన్ టూల్ ని ఉపయోగించి ఇనస్టంట్ మెసేజెస్, ఆడియో & వీడియో చాట్ తో పాటు వీడియో మెసేజెస్ ని రికార్డ్ చేసి కావలసిన వారికి పంపవచ్చు మరియు యూట్యూబ్ కి అప్‌లోడ్ చెయ్యవచ్చు. మీ ఫ్రెండ్స్ ఏ ఆపరేటింగ్ సిస్టం ఉపయోగిస్తున్నా కాని  ooVoo తో చాట్ చెయ్యవచ్చు. అందుకే ఇది క్రాస్ ఫ్లాట్‌ఫార్మ్ కమ్యూనికేషన్ టూల్ .. ooVoo ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ పూర్తిచెయ్యటానికి ooVoo లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. వీడియో చాటింగ్ చేసేటప్పుడు అవసరమైతే డెస్క్టాప్ స్క్రీన్ ని షేర్ చేసుకోవచ్చు. గ్రూప్ వీడియో చాట్ గరిష్టంగా 12 మందితో చెయ్యవచ్చు.    


డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం ooVoo సైట్ చూడండి.

ధన్యవాదాలు

Wednesday, February 1, 2012

Makebadge - ఆన్‌లైన్ లో బాడ్జెస్/ బిజినెస్ కార్డులు తయారుచేసుకోవటానికి!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా మనకు నచ్చిన సైజ్ లో కావలసిన విధంగా ఐడీ కార్డ్ లు/బిజినెస్ కార్డ్స్ ఉచితంగా తయారుచేసుకొని ప్రింట్ తీసుకోవటానికి Makebadge అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ముందుగా ఈ సైట్ కి వెళ్ళి బాడ్జ్ టైప్, సైజ్, టెంప్లేట్ ని వాటిపై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.   


Text పై క్లిక్ చేస్తే బాడ్జ్ లో టెక్స్ట్ బాక్స్ వస్తుంది, దానిపై మౌస్ డబల్ క్లిక్ చేసి దానిలో కావలసిన టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. image పై క్లిక్ చేసి ఇమేజ్ ని యాడ్ చేసుకోవచ్చు, దాని కోసం ఇమేజ్ బాక్స్ ప క్లిక్ చేసి ప్రక్కన ఉన్న Upload బటన్ పై క్లిక్ చేసి కావలసిన ఫోటో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకొన్న బాడ్జ్ ని పీసీ లో సేవ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు.


వెబ్ సైట్: http://makebadge.com/

ధన్యవాదాలు