Friday, February 10, 2012

USB డ్రైవ్ లలో స్పేస్ ఫుల్ డాటా నిల్ అని చూపిస్తుందా?

ఒక్కొక్కసారి మన USB Drives (పెన్ డ్రైవ్, ఎక్స్ టర్నల్ హార్డ్ డిస్క్ డ్రైవ్, మెమొరీ కార్డ్ మొదలగునవి) లలో డాటా ఏమీ కనబడకుండా  డిస్క్ స్పేస్ మాత్రం ఫుల్ గా చూపిస్త్తూ ఉంటే దానికి వైరస్ లు కారణం కావచ్చు. వైరస్ లు మన డాటాని కనబడకుండా చేస్తాయి. అయితే ఒక్కొక్కసారి యాంటీ వైరస్ సాప్ట్ వేర్లతో స్కాన్ చేసినా కూడా ఫైళ్ళు కనబడకపోతే ఈ క్రింది విధంగా చెయ్యండి:

౧. ముందుగా USB Drive ని పీసీ కి కనెక్ట్ చెయ్యాలి. My Computer లో దాని డ్రైవ్ లెటర్ తెలుసుకోవాలి.

౨. Start---> Run కి వెళ్ళి cmd అని టైప్ చేసి Enter కొట్టండి. 

౩. కమాండ్ ప్రాంమ్ట్ వస్తుంది. అక్కడ USB Drive లెటర్ ప్రక్కన : టైప్ చేసి Enter చెయ్యాలి. (ఉదా మీ USB Drive letter I అయితే కనుక కమాండ్ ప్రాంమ్ట్ దగ్గర I: అని టైప్ చేసి ఎంటర్ చెయ్యాలి)

౪. ఇప్పుడు కమాండ్ పాంమ్ట్ దగ్గర ఈ క్రింది విధంగా కమాండ్ ఎంటర్ చెయ్యాలి

attrib -s -h /s /d *.*




పైన చెప్పిన కమాండ్ లో -s, -h, /s మరియు /d ల మధ్య ఒక స్పేస్ ఉండాలి. Enter కొట్టండి. కొన్ని సెకన్ల తర్వాత  తిరిగి కమాండ్ పాంమ్ట్ వస్తుంది. అప్పుడు USB Drive ని తొలగించి తిరిగి మరల కనెక్ట్ చెయ్యండి. అంతే ఇంతకు ముందు వైరస్ లచే దాచబడిన ఫైల్స్ మరియు పోల్డర్లు ఇప్పుడు కనిపిస్తాయి. ఇప్పుడు యాంటీ వైరస్ ప్రోగ్రామ్ లను రన్ చేసి వైరస్ లను క్లీన్ చేసుకోవచ్చు.

ధన్యవాదాలు