Wednesday, February 22, 2012

templesdiary - రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ దేవాలయాల చారిత్రక ప్రాదాన్యతో పాటు ఆధ్యాత్మిక విషయాలను తెలియచేసే సైట్!!

మన రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శనం తోపాటు ఆధ్యాత్మిక, ధర్మ సూక్ష్మాలను తెలుగులో అందిస్తున్న సైట్          templesdiary. దాదాపు అన్ని ప్రసిద్ధి ఆలయాల విశిష్ఠత, సేవల వివరాలు, పురాణాలు, యోగా, ఆయుర్వేదం, హోమియోపతి, ధర్మ సూక్ష్మాలు , వ్రతాలు-నోములు, పండుగలు వాటి విశిష్ఠత ఇలా ఎన్నో విషయాలు ఈ సైట్ లో ఉన్నాయి. ఆధ్యాత్మిక పధంలో పయనించే వారికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. 



ఈ సైట్ నిర్వాహకులు ఏమంటున్నారో వారి మాటల్లోనే " ప్రపంచం లోని నలుమూలల ఉన్న తెలుగు వారికి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన దేవాలయాల గురించి సమ్గ్ర సమాచారాన్ని, వాటి ఔన్నత్యాన్ని తెలియచేసే ఉద్దేశ్యంతో టెంపుల్ డైరీ డాట్ కామ్ వెబ్ సైట్ నెలకొల్పబడింది. కేవలం దేవాలయ సమాచారానికే పరిమితం కాకుండా రోజు వారీ పూజా విధానాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు, రాశి ఫలాలు, వాస్తు శాస్త్రం, ధ్యానం, యోగా, వేదాలు, పురాణాలకు సంబంధించిన అనేక విషయాలను ఇందులో పొందుపరుస్తున్నాం. అలాగే ప్రతి దేవాలయం యొక్క స్థల పురాణం, క్షేత్రమహత్యం తదితర  వివరాలను పొందుపరుస్తున్నాం.

మన రాష్ట్రంలో ఉన సుప్రసిద్ధ దేవాలయాల చారిత్రక ప్రాదాన్యతను వాటి విశిష్టతను పూజా విశేషాలను, ఉత్సవ విశేషాలను,వాటి సందర్సన మార్గాలను తెలియజేయాలన్న లక్ష్యంతో తెలుగులో రూపుదిద్దుకుంటున్న మొట్ట మొదటి వెబ్ సైట్ టెంపుల్స్ డైరీ డాట్ కాం ప్రపంచం లో నలుమూలల జరిగే దైవ సంబంధ కార్యక్రమాల వివరాలను అందరికంటే ముందుగా భక్తులకు అందించడంతో పాటు,వారి ప్రతిస్పందనలను దేవస్థానం యాజమాన్యాలకు తెలియజేసే వెసులుబాటును టెంపుల్స్ డైరీ డాట్ కామ్ కల్పిస్తోంది."


వెబ్ సైట్: http://www.templesdiary.com/

ధన్యవాదాలు