Monday, October 27, 2008

యాహూ మెయిల్ ని అవుట్ లుక్ ఎక్స్ ప్రెస్ లో కాన్ఫిగర్ చెయ్యటానికి...

యాహూ మెయిల్ లో POP3 సర్వీస్ డిసేబుల్ చెయ్యబడి వుంటుంది, ధర్డ్ పార్టీ అప్లికేషన్ వుపయోగించి యాహూ మెయిల్ ని అవుట్ లుక్ ఎక్స్ ప్రెస్ లో యాక్సెస్ చెయ్యవచ్చు। ముందుగా YPOPS! అనే అప్లికేషన్ ని http://www.softpedia.com/progDownload/YahooPOPs-Download-3702.html నుండి డౌన్ లోడ్ చేసుకోని, ఇనస్టలేషన్ చేసుకోవాలి ... ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత YPOPS! ఐకాన్ సిస్టం ట్రే లో కనబడుతుంది. లేకుంటే Start ---> All Programs --->YPOPS!---> YPOPS! పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు అవుట్ లుక్ ఎక్స్ ప్రెస్ లో ఎలా కాన్ఫిగర్ చెయ్యాలో చూద్దాం.

1.ముందుగా Outlook Express ని ఓపెన్ చేసి, మెయిన్ మెనూ లోని Tools ---> Accounts పై క్లిక్ చెయ్యాలి

2.'Internet Accounts' విండో లో 'All' టాబ్ లో 'Add' బటన్ పై క్లిక్ చేసి ’Mail' సెలెక్ట్ చేసుకోవాలి.

3.'Internet Connection Wizard' లో ’Display Name'లో పేరు ఎంటర్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

4.'Internet E-mail Address' విండో లో 'E-mail address' దగ్గర yahoo e-mail Id ఎంటర్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

5.'E-mail Server Names' విండో లో ’My Incoming mail server is a' దగ్గర "POP3" సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Incoming mail (POP3. IMAP or HTTP)Server' దగ్గర మరియు 'Outgoing mail (SMTP)Server' దగ్గర localhost అని టైప్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

6.'Internet Mail Logon' విండో లో ’Account Name' దగ్గర ఫుల్ ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేసి, ’Password' దగ్గర పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. తర్వాత ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

7.Outlook Express లో Yahoo Mail కాన్ఫిగర్ చెయ్యబడినది, ’Finish' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

8.ఇప్పుడు మెయిన్ మెనూ లో 'Tools' ---> 'Send and Recive' ---> 'Localhost' పై క్లిక్ చేస్తే యాహూ మెయిల్స్ ’Inbox' లోకి చేరతాయి.


ధన్యవాదాలు .... బ్లాగ్ మిత్రులకు దీపావళి శుభాకాంక్షలు....