Saturday, February 28, 2009

TinyPic - ఉచిత ఇమేజ్ మరియు వీడియో హోస్టింగ్ సైట్


TinyPic వెబ్ సైట్ లో ఎటువంటి రిజిస్ట్రేషన్ లేదా సైన్ అప్ చెయ్యకుండా ఉచితంగా ఇమేజ్ లేదా వీడియో లను హోస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్ లోడ్ చెయ్యబడిన ఇమేజ్ లేదా వీడియో లను సోషల్ నెట్వర్క్, ఫోరమ్, బ్లాగ్,ఈ-మెయిల్ లేదా ఏదైనా వెబ్ సైట్లకు లింక్ చేసుకోవచ్చు. ఇమేజ్ లను రీ సైజ్ చేసుకోవచ్చు, వీడియోలను హై -డెఫినిషన్ లోకి మార్చుకోవచ్చు మరియు ఎడిట్ చేసుకొనే అవకాశం కూడా వుంది. 200MB ఫైల్ సైజ్ వరకు అప్ లోడ్ చేసుకోవచ్చు.

Tinypic® is a fast, simple and reliable video and image hosting site.

ధన్యవాదాలు

Friday, February 27, 2009

USB డ్రైవ్ ల కోసం ఉచిత పోర్టబుల్ అప్లికేషన్లు దొరికే వెబ్ సైట్లు


PortableApps.com సైట్ నుండి పోర్టబుల్ డివైజెస్ (USB flash drive, iPod, portable hard drive మొదలగు) కోసం అవసరమయ్యే లేటెస్ట్ అప్లికేషన్లను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అలానే మరొక సైట్ The Portable Freeware Collection ఇక్కడనుండి కూడా వివిధ అప్లికేషన్లను వుచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. వందకు పైగా వుపయోగకరమైన అప్లికేషన్లను ఈ సైట్స్ నుండి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ధన్యవాదాలు

Wednesday, February 25, 2009

f.lux - సమయానుకూలంగా మోనిటర్ బ్రైట్ నెస్ లో మార్పు కోసం...

రోజంతా విశ్రాంతి లేకుండా కంప్యూటర్ పై వర్క్ చేస్తుంటే సాయంత్రం అయ్యేసరికి కళ్ళు మండుతూ వుంటాయి. f.lux అనే ఉచిత యుటిలిటీ మీ సమస్యకు కొంతవరకు పరిష్కారాన్ని చూపవచ్చు. f.lux ని డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ’Change Settings' పై క్లిక్ చేసి మీరు వుంటున్న ప్రదేశం (దగ్గర లోని పెద్ద నగరాలు) యొక్క అక్షాంశరేఖ (Latitude and Longitude) వివరాలు ఎంటర్ చెయ్యాలి. మీరు వుంటున్న ప్రదేశం యొక్క అక్షాంశరేఖ వివరాలు వికీపీడియా లో తెలుసుకోవచ్చు. ఈ యుటిలిటీ సమయానుకూలంగా మోనిటర్ బ్రైట్ నెస్ ని ఎడ్జస్ట్ చేస్తుంది.



మరింత సమాచారం కోసం f.lux సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Tuesday, February 24, 2009

www.mustseeindia.com - One Stop Travel Guide to India


సెలవల్లో సరదాగా ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నారా, హిల్ స్టేషన్లు, ఫుణ్యక్షేత్రాలు, బీచ్ లు, చారిత్రక ప్రదేశాలు చూడాలనుకుంటాన్నారా, హనీమూన్ కి వెళ్ళాలను కుంటున్నారా అయితే మీరు www.mustseeindia.com సైట్ ని ఒకసారి సందర్శించాల్సిందే. ఈ సైట్ లో మీరు వెళ్ళానుకుంటున్న ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రదేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే చూడదగిన ప్రదేశాలు, మ్యాప్, అక్కడకు ఎలా చేరుకోవాలి, ఫోటోలు, వాతావరణ వివరాలు, హోటళ్ళ వివరాలు మొదలగునవి తెలుసుకోవచ్చు. ఇది ఒక మంచి ట్రావెల్ గైడ్ సైట్.

ధన్యవాదాలు

Defraggler - డీఫ్రాగ్మెంటేషన్ టూల్


సాధారణంగా హార్డ్ డ్రైవ్ ని డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి విండోస్ తో పాటు వచ్చే డీఫ్రాగ్మెంటేషన్ టూల్ ని వుపయోగిస్తాం, కాని ఇది చాలా స్లోగా మరియు ఎక్కువ సమయం పడుతుంది. ఇంటర్నెట్ లో లభించే వుచిత డీఫ్రాగ్మెంటేషన్ టూల్స్ ని వుపయోగించి హార్డ్ డ్రైవ్ లేదా సెలెక్టెడ్ పార్టీషన్ ని మాత్రమే డీఫ్రాగ్మెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా Defraggler కావలసిన ఫైల్, ఫోల్డర్ లేదా డ్రైవ్ ని డీఫ్రాగ్మెంట్ చేసుకోవచ్చు. కావలసిన ఫైల్, ఫోల్డర్ డీఫ్రాగ్మెంట్ చెయ్యటంవలన డీఫ్రాగ్మెంటేషన్ కి తక్కువ సమయం పడుతుంది. ఇది Windows 2000, 2003, XP and Vista లలో పని చేస్తుంది. USB డ్రైవ్ ల నుండి కూడా ఈ అప్లికేషన్ ని రన్ చేసుకోవచ్చు.
Defraggler ప్రముఖ సాప్ట్ వేర్లు CCleaner మరియు Recuva రూపొందించిన కంపెనీ వారు అందిస్తున్న ఉచిత సాప్ట్ వేర్.

ధన్యవాదాలు

Thursday, February 19, 2009

DiskDigger - డాటా రికవరీ టూల్

DiskDigger అనే ఉచిత యుటిలిటీ ని ఉపయోగించి ఏదైనా స్టోరేజ్ మీడియా అంటే USB flash drives, memory cards (SD, CompactFlash, Memory Stick, etc), మరియు hard drive ల నుండి తొలగించబడిన లేదా ఫార్మేట్ చెయ్యబడిన ఫైళ్ళను రికవర్ చెయ్యవచ్చు. ఈ యుటిలిటీ డౌన్ లోడ్ జిప్ ఫైల్ సైజ్ 604 KB మాత్రమే. అన్ జిప్ చేసి ఇనస్టలేషన్ చెయ్యకుండా DiskDigger రన్ చేసుకోవచ్చు. DiskDigger విండో లో సిస్టం లోని డ్రైవ్స్ ని చూపిస్తుంది, కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి. సెలెక్ట్ చేసుకున్న డ్రైవ్ ని పూర్తిగా స్కాన్ చేసి రికవర్ చెయ్యగలిగిన ఫైళ్ళ ను ఫోటోలు, డాక్యుమెంట్లు (వార్డ్, ఎక్సెల్, పీడీఎఫ్ మొ.), వీడియోలు /మ్యూజిక్ అని వేరు వేరు క్యాటగిరీ లలో చూపిస్తుంది. రికవర్ చేసుకోదలచిన ఫైల్ పై క్లిక్ చేసి పైన వున్న ’Save' బటన్ పై క్లిక్ చెయ్యాలి.





USB drives లేదా Memory Cards నుండి తొలగించబడిన ఫైళ్ళను రికవర్ చెయ్యటానికి ఈ యుటిలిటీ బాగా వుపయోగపడుతుంది.

మరింత సమాచారం కోసం DiskDigger సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Utility Launcher - ఒకే ఒక క్లిక్ తో మల్టిపుల్ అప్లికేషన్లు రన్ చెయ్యటానికి


సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే స్టార్ట్ కావటానికి ప్రోగ్రాములను లేదా సిస్టం యుటిలిటీలను స్టార్ట్ అప్ లో పెడతాం, దీనివలన సిస్టం నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా Utility Launcher అనే ఉచిత యుటిలిటీ ని వుపయోగించి గరిష్టంగా 20 యుటిలిటీలను ఒకేఒక క్లిక్ తో రన్ చెయ్యవచ్చు. ఈ ప్రోగ్రామ్ ని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసర౦ లేదు.

ఇటువంటిదే మరొక వుచిత యుటిలిటీ Lacuna Launcher .

ధన్యవాదాలు

Wednesday, February 18, 2009

ఆఫ్ లైన్ లో జీ-మెయిల్ యాక్సెస్ చెయ్యటం ఎలా?


గూగుల్ తన జీ-మెయిల్ కి క్రొత్త ఫీచర్లను అందిస్తూ వస్తుంది. వాటిలో ఒకటే Gmail Offline. ఇది మీరు ఇంటర్నెట్ కి కనెక్ట్ అవ్వకున్ననూ మీ మెయిల్ ఎకౌంట్ ని చూసుకోవటం లో సహాయపడుతుంది. దీని ద్వారా రీసెంట్ ఈ-మెయిళ్ళు గూగుల్ సర్వర్ నుండి మీ సిస్టం లోకి డౌన్ లోడ్ అవుతాయి. డౌన్ లోడ్ అయిన మెయిళ్ళను ఇతరులు చూడకుండా వుండాలంటే సెక్యూరిటీ పరంగా Gmail Offline పీచర్ ని మీ వ్యక్తిగత సిస్టం లో మాత్రమే ఎనేబుల్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో జీ-మెయిల్ ఎలా యాక్సెస్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం.

౧. ముందుగా మీ జీమెయిల్ కి లాగిన్ అయ్యి, కుడి చేతి ప్రక్క పైన వున్న 'Settings' పై క్లిక్ చేసి తర్వాత ’Labs'పై క్లిక్ చెయ్యాలి. GMail Lab ఫీచర్ల లో ’Offline' దగ్గర వున్న ’Enable’ ని సెలెక్ట్ చేసుకొని ’Save changes’ బటన్ పై క్లిక్ చెయ్యాలి.


౨. ఇప్పుడు మీ మెయిల్ ఎకౌంట్ లో పైన గ్రీన్ కలర్ లో జీమెయిల్ లాబ్ ఐకాన్ వస్తుంది. దాని ప్రక్కన ’Offline 0.1' అని వుంటుంది. ఇప్పుడు దానిపై క్లిక్ చెయ్యాలి.



౩. ’Install offline access for Gmail' వస్తుంది. ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.



౪. ’Google Gears' ఇనస్టలేషన్ చెయ్యబడతాయి. ఇక్కడ ’I trust this site' దగ్గర టిక్ చేసి ’Allow' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


౫.ఇప్పుడు 'Gmail' షార్ట్ కట్ ఎక్కడ క్రియేట్ చెయ్యాలని అడుగుతుంది. కావలసిన చోట టిక్ పెట్టుకొని ’Ok' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ’Offline Installation' పూర్తి అయిన తర్వాత ఈ 'Gmail' షార్ట్ కట్ ని వుపయోగించే మీ మెయిల్ ని ఆఫ్ లైన్ లో యాక్సెస్ చెయ్యవచ్చు.



ఆన్ లైన్ లో మీ మెయిల్ ని ఎలా వుయోగిస్తారో ఆఫ్ లైన్ లో కూడా అలానే వుపయోగించుకోవచ్చు. ఉదా: మీరు ఆఫ్ లైన్ లో మెయిల్ కంపోస్ చేసి పంపిస్తే అది అవుట్ బాక్స్ కి వెళుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ అయిన వెంటనే మెయిల్ పంపబడుతుంది.

ధన్యవాదాలు

గాలి నుంచి నీరు!


గాలి నుంచి నీటి ని ఉత్పత్తి చేసే యంత్రం గురించి ఈనాడు దిన పత్రికలో వచ్చిన వివరాలు యధాతదంగా...
అమెరికాకు చెందిన వాటర్ మేకర్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ నూతన శాస్త్రసాంకేతిక పధ్ధతిలో గాలి నుండి నీటిని ఉత్పత్తి చేసే యంత్రాన్ని రూపొందించారు. ఈ యంత్రాన్ని ప్రపంచంలోనే మొదటి సారిగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం జాలిముడి గ్రామ ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. మినరల్ వాటర్ కు ఏమాత్రం తీసిపోని ఈ నీటి వుత్పాదనకు అయ్యే ఖర్చు 25 పైసలేనట. ఏడాదికోమారు ఫిల్టర్లు మార్చుకోవాలి. దీనికి అదనంగా నిర్వహణ కి అయ్యే ఖర్చు ప్రత్యేకంగా ఏమీ వుండదు. ఓ ప్రత్యేకమైన ఎత్తైన స్ధలంలో విద్యుత్తుతో యంత్రం తిరుగుతుంటే ...ట్యాంకుల్లోకి అలా నీరు వచ్చి చేరటం నిజంగా అబ్బురమే. గాలిలోని తేమను ఒడిసిపట్టి నీటిగా మార్చటమే దీని ఫ్రత్యేకత. ఈ యంత్రం ఖరీదు రూ.18 లక్షలు, నిర్వహణకు ఏడాది కి రూ.15 వేల వరకు వుంటుంది. గ్రుహ అవసరాల కోసాం వుపయోగపడే 25 లీటర్ల యంత్రం ధర రూ.40 వేల వరకు వుంటుందట!!!

ధన్యవాదాలు

Tuesday, February 17, 2009

Computer Repair Utility Kit - కంప్యూటర్ రిపైర్ టూళ్ళ సమాహారం


Computer Repair Utility Kit లో 60 కి పైగా కంప్యూటర్ రిపైర్ టూల్స్ ఒకే చోట ఒకే పాకేజ్ లో వున్నాయి. దీనిలో File Management, Information, Repair, Recovery, Network, Virus and Malware Removal, Tweaks, Scripts మొదలగు వాటికి సంబందించిన చాలా వుపయోగకరమైన టూల్స్ ని ఒకే చోట పొందుపర్చారు. దీనిని Computer Repair Utility Kit సైట్ నుండి వుచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ ఫైల్ సైజ్ 88 MB.

డౌన్ లోడ్ లింకులు:

Deposit Files: http://depositfiles.com/files/mzil03xv9
Rapidshare: http://rapidshare.com/files/191770265/Computer-Repair-Utility-Kit-V2.zip.html
Badongo: http://www.badongo.com/file/13152677
zShare: http://www.zshare.net/download/548857193b6b4114/
Megaupload: http://www.megaupload.com/?d=E8PTG42A

ఈ అప్లికేషన్ ని పోర్టబుల్ డివైజెస్ నుండి కూడా రన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా వుండవలసిన టూల్ కిట్ ఇది.

ధన్యవాదాలు

Monday, February 16, 2009

MP3 Search - మ్యూజిక్ సెర్చ్ ఇంజిన్


మనకు నచ్చిన పాటలను వినటానికి లేదా డౌన్ లోడ్ చేసుకోవటానికి MP3 Search అనే మ్యూజిక్ సెర్చ్ ఇంజిన్ వుపయోగపడుతుంది. MP3 Search సైట్ కి వెళ్ళి ట్యూన్ లేదా ఆర్టిస్ట్ పేరు టైప్ చేసి Search కొడితే పాటల లిస్ట్ వస్తుంది. కావలసిన పాటను వినవచ్చు లేదంటే డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం MP3 Search సైట్ కి వెళ్ళండి కావలసిన పాటను వినండి లేదా డౌన్ లోడ్ చేసుకోండి.

ధన్యవాదాలు

GSplit 3 - పెద్ద ఫైళ్ళను చిన్నవి గా విడగొట్టటానికి (split) ఉచిత సాప్ట్ వేర్


ఇంటర్నెట్ లో కొన్ని సైట్లలో లేదా ఈ-మెయిళ్ళ లో పెద్ద పెద్ద ఫైళ్ళను పంపలేము వాటిని చిన్నవిగా స్ప్లిట్ చేసి పంపటం సులువు. పెద్ద పెద్ద మీడియా, సౌండ్, జిప్ మొదలగు ఫైళ్ళను చిన్నవిగా విడగొట్టటానికి వుపయోగపడే వుచిత మరియు శక్తివంతమైన ఫైల్ స్ప్లిట్టర్ - GSplit. ఫైల్ ని స్ప్లిట్ చెయ్యటం చాలా సులువు ముందుగా స్ప్లిట్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి, స్ప్లిట్ చేసిన తర్వాత ఫైళ్ళను కాపీ చెయ్యటానికి డెస్టినేషన్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. Split File పై క్లిక్ చేస్తే ఫైల్ స్ప్లిట్ చెయ్యబడుతుంది, తర్వాత ఒక Executable ఫైల్ క్రియేట్ చెయ్యబడుతుంది. ఈ Executable ఫైల్ ని వుపయోగించే స్ప్లిట్ అయిన ఫైళ్ళను ఒక్కటిగా చెయ్యవచ్చు.

మరింత సమాచారం కోసం GSplit సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Thursday, February 12, 2009

PhotoPerfect Express - ఇమేజ్ ఆప్టిమైజేషన్ టూల్


డిజిటల్ కెమేరా వుపయోగించే సాధారణ ఫోటోగ్రాఫర్లకు PhotoPerfect Express వుపయోగపడుతుంది. ఇది ఒక శక్తివంతమైన ఉచిత ఇమేజ్ ఆప్టిమైజేషన్ టూల్. ఎటువంటి ఫోటో ఎడిటింగ్ నాలెడ్జ్, శ్రమ మరియు సమయం వ్రుధా కాకుండా కేవలం మూడే మూడు స్టెప్స్ లో మీ ఇమేజ్ లను ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు.

స్టెప్ ౧ : ఫోటో సెలెక్ట్ చేసుకోవటం.
స్టెప్ ౨ : PhotoPerfect Express లో ముందే సెట్ చెయ్యబడిన 5 శక్తివంతమైన ఆప్టిమైజేషన్ పధ్ధతులలో ఒక దానిని సెలెక్ట్ చేసుకోవటం.
స్టెప్ ౩ : ఫోటో సేవ్ చేసుకోవటం.

ఒక ఫోటో కి సంబంధించి అన్ని ఆప్టిమైజేషన్స్ ని ఒకేసారి చూసే సదుపాయం కూడా వుంది.

మరింత సమాచారం కోసం PhotoPerfect Express సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Hard Drive Eraser - డాటా శాశ్వతంగా తొలగించటానికి ఉచిత సాప్ట్ వేర్


మనం హార్డ్ డిస్క్ ని పూర్తిగా ఫార్మేట్ చేసిన తరువాత కూడా కమర్షియల్ డాటా రికవరీ టూల్స్ ని వుపయోగించి తొలగించబడిన ఫైళ్ళను తిరిగి పొందవచ్చు. Hard Drive Eraser అనే వుచిత సాప్ట్ వేర్ ని వుపయోగించి హార్డ్ డిస్క్ లోని ఫైళ్ళను శాశ్వతంగా తొలగించవచ్చు. ఎక్కువసార్లు మాగ్నెటిక్ సర్ఫేస్ ని అనవసరమైన బైనరీ డాటా తో నింపటం వలన డాటా రికవర్ చెయ్యటం సాధ్యపడదు. సాధారణ ఫార్మేటింగ్ కన్నా ఎక్కువ సమయం పట్టినా డాటాని శాశ్వతంగా తొలగిస్తుంది. ఇది శక్తివంతమైన వుచిత సాప్ట్ వేర్. ఈ సాప్ట్ వేర్ వుపయోగించే విధానం మరియు తీసుకొనవలసిన జాగ్రత్తలు Hard Drive Eraser సైట్ లో చాలా చక్కగా వివరించారు.

ధన్యవాదాలు

Wednesday, February 11, 2009

ఫ్లోచార్ట్ లు, సైట్ మాప్ లు, నెట్ వర్క్ డయాగ్రమ్ లు తయారు చేసుకోవటానికి ఆన్ లైన్ అప్లికేషన్...


Lovely Charts అనే వుచిత వెబ్ బేస్డ్ అప్లికేషన్ ని వుపయోగించి ఫ్లోచార్ట్ లు, సైట్ మాప్ లు, నెట్ వర్క్ డయాగ్రమ్, ఆర్గనైజేషన్ చార్ట్ లు యిలా ఎన్నో తయారు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ వుపయోగించటానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. డ్రాగ్ అండ్ డ్రాప్ పధ్ధతి లో డయాగ్రమ్స్ కి కావలసిన బాక్స్ లను వాటిని కలపటానికి బాణం గుర్తు గీతలను డ్రా చేసుకోవచ్చు. డయాగ్రమ్ పూర్తి అయిన తర్వాత కావలసిన సైజ్ లో JPG లేదా PNG లోకి ఎక్స్ పోర్ట్ చేసుకొనే సదుపాయం వుంది. ఉచిత ఎకౌంట్ యూజర్లు ఒక ఫైల్ మాత్రమే సేవ్ చేసుకోగలరు, కావలసినన్ని ఫైల్స్ ని ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.

ఈ అప్లికేషన్ సంబంధించిన ట్యుటోరియల్ కూడా సైట్ లో దొరుకుతుంది.

ఫ్లోచార్ట్ లు తయారుచేసుకోవటానికి వుపయోగపడే మరొక అప్లికేషన్ DIA ను డౌన్ లోడ్ చేసుకోండి.

ధన్యవాదాలు

Tuesday, February 10, 2009

USB drives ఆటో ప్లే కాకుండా చెయ్యటానికి...

USB drives వలన వైరస్ లు చాలా త్వరగా మరియు సులభం గా మనకు తెలియకుండా మన సిస్టం లోకి చొరబడతాయి. USB drives సిస్టం కి కనెక్ట్ చేసినప్పుడు ఆటో ప్లే అయ్యి ఈ క్రింది విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ’OK' కాకుండా ’Cancel' బటన్ క్లిక్ చెయ్యాలి.



అసలు USB drives ఆటో ప్లే కాకుండా వుండాలంటే ఈ క్రింది విధంగా చెయ్యాలి.
1.Start--> Run కి వెళ్ళి gpedit.msc అని టైప్ చేసి ’OK' బటన్ క్లిక్ చెయ్యాలి.
2.ఇప్పుడు ఓపెన్ అయిన Group Policy విండో లో computer configuration ---> administrative templates --> System పై క్లిక్ చెయ్యాలి. కుడి చేతిప్రక్క వున్న విండో లో Turn off Autoplay పై డబుల్ క్లిక్ చెయ్యాలి.



3.Turn off Autoplay properties లో Enabled సెలెక్ట్ చేసుకొని క్రింద All drives సెలెక్ట్ చేసుకొని ముందుగా Apply తర్వాత Ok బటన్ పై క్లిక్ చెయ్యాలి.


పై విధంగా చెయ్యటం USB drives ఆటో ప్లే కావు మరియు ఆటోమాటిక్ గా రన్ అయ్యే వైరస్ ల నుండి రక్షణ పొందవచ్చు.

చివరగా ఒక్కమాట: వైరస్ ల బారి నుండి పూర్తి రక్షణ కోసం యాంటీ వైరస్ సాప్ట్ వేర్ సిస్టం లో లోడ్ చేసుకొని తరచూ అప్ డేట్ చేసుకొంటూ వుండాలి.

ధన్యవాదాలు

CD/DVD కవర్లు ప్రింట్ చెయ్యటానికి ఉచిత సాప్ట్ వేర్


UndercoverXP - ఈ ఉచిత సాప్ట్ వేర్ ని వుపయోగించి CD/DVD కవర్లు ప్రింట్ చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తం లో కవర్లు ప్రింట్ చేసే వారికి ఇది వుపయోగపడుతుంది. కవర్ల పై ఇమేజ్ లు యాడ్ చేసుకోవటానికి JPEG, GIF, PNG, BMP ఫార్మేట్లను సపోర్ట్ చేస్తుంది. CD Front, CD Back, CD Front + inside, DVD Box మొదలగు వాటికి తగిన స్కేల్ (సైజ్-పొడవు/వెడల్పు) కరెక్ట్ గా సెట్ చెయ్యబడివుంది.

మరింత సమాచారం కోసం UndercoverXP సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు.

Monday, February 9, 2009

POP Peeper ని వుపయోగించి ఈ-టపా అలెర్ట్ పొందండి


POP Peeper - ఒక ఈ-టపా నోటిఫైయర్. POP Peeper అనే ఈ వుచిత చిన్న అప్లికేషన్ సిస్టం ట్రే లో రన్ అవుతూ మీ ఈ-మెయిల్ ఎకౌంట్స్ కి ఏదైనా క్రొత్త మెయిల్ వస్తే అలెర్ట్ చేస్తుంది. ఈ సాప్ట్ వేర్ ని ఇనస్టలేషన్ చేసిన తర్వాత మీ POP3 లేదా IMAP ఎకౌంట్లను యాడ్ చేసుకోవాలి. ఇది దాదాపు అన్ని ఈ-మెయిల్ ప్రొవైడర్లు అంటే Gmail, Hotmail, Rediffmail, Yahoo మొదలగు వాటిని సపోర్ట్ చేస్తుంది. ఈ మెయిల్ ఎకౌంట్స్ కాన్ఫిగర్ చేసుకొన్న తర్వాత మీ ఎకౌంట్ కి క్రొత్త మెయిల్ వస్తే ఆడియో సౌండ్, స్క్రీన్ సేవర్, Scroll Lock LED ఫ్లాష్ అయ్యేటట్లు ఇలా అలెర్ట్ పెట్టుకోవచ్చు. ఈ సాప్ట్ వేర్ వుపయోగించి ఈ-మెయిల్ చదవటం లేదా పంపటం చెయ్యవచ్చు. అడ్రస్ బుక్ లో మెయిల్ ఐడి లు సేవ్ చేసుకోవచ్చు. ఇతరులు మీ మెయిల్ అలెర్ట్ లు చూడకుండా పాస్ వార్డ్ లో రక్షించుకోవచ్చు. లిమిట్ అంటూ లేకుండా ఎన్నైనా మెయిల్ ఎకౌంట్స్ దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఎన్నో సదుపాయాలున్న ఈ సాప్ట్ వేర్ డౌన్ లోడ్ మరియు మరింత సమాచారం కోసం POP Peeper సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Friday, February 6, 2009

CD Recovery Toolbox - గీతలు పడిన/ పాడైన CD/DVD ల నుండి ఫైళ్ళను రికవర్ చేసే సాప్ట్ వేర్


డాటా స్టోర్ చేసుకోవటానికి సాధారణంగా మనం CD/DVD లను వుపయోగిస్తూవుంటాం. CD/DVD లు తరచూ వాడటం వలన కానీ మరి యేయితర వలన గీతలు పడి వాటిలోని ఫైళ్ళు రీడ్ చెయ్యలేము. అటువంటప్పుడు CD Recovery Toolbox అనే వుచిత టూల్ ని వుపయోగించి గీతలు పడిన/ పాడైన CD/DVD/HD DVD/Blu Ray Disc ల నుండి ఫైళ్ళను రికవర్ చెయ్యవచ్చు. ఒక్కొక్క సారి మరీ బాగా పాడైన డిస్క్ ల లోని ఫైళ్ళ ఈ సాప్ట్ వేర్ రికవర్/రీస్టోర్ చెయ్యలేకపోవచ్చు. రికవర్ చెయ్యగలిగిన ఫైళ్ళ లిస్ట్ చూపెడుతుంది, వాటిలో మనకు కావలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని రికవర్ చేసుకోవచ్చు.

ఇది చాలా వుపయోగపడే వుచిత టూల్.

ధన్యవాదాలు

Efficient Diary - వ్యక్తిగత ఎలక్ట్రానిక్ డైరీ సాప్ట్ వేర్


మన జీవితం లో ఎదురయ్యే అనుభవాలను, ఎవరితోను పంచుకోని వ్యక్తిగత విషయాలను వ్రాసుకోవటానికి డైరీ వుపయోగిస్తాం. ఎలక్ట్రానిక్ యుగం లో జీవితమంతా కంప్యూటర్ పై గడిచిపోతూ సాధారణ డైరీలలో చేతితో వ్రాసే తీరిక లేనివారికి Efficient Diary చక్కగా వుపయోగపడుతుంది. ఈ వుచిత వ్యక్తిగత డైరీ సాప్ట్ వేర్ లో మీ అనుభవాలు,ఐడియాలు మరియు కావల్సిన సంగతులను పొందుపర్చుకోవచ్చు. మైక్రోసాప్ట్ వర్డ్ వలె రిచ్ టెక్స్ట్ ఎడిటర్ కలిగియున్న ఈ సాప్ట్ వేర్ లో మీ ఎంట్రీలకు టేబుల్, ఎమోషన్స్, పిక్చర్,బ్యాక్ గ్రౌండ్ కలర్, ఎటాచ్మెంట్స్ జతచేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం Efficient Diary సైట్ సందర్శించండి. ఇది Windows 98/ME/NT4/2000/XP/2003/Vista లలో పనిచేస్తుంది.

ధన్యవాదాలు

Thursday, February 5, 2009

విండోస్ 7 బీటా డౌన్ లోడ్ కొరకు...


విండోస్ క్రొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 7 బీటా డౌన్ లోడ్ కొరకు విండోస్ 7 సైట్ ని సందర్శించండి. 32 bit లేదా 64 bit విండోస్ 7 బీటా ఇనస్టలేషన్ కి కావలసిన కనీస సిస్టం కాన్ఫిగరేషన్, ఇనస్టలేషన్ విధానం ఇక్కడ వివరించారు. Windows Live ID వుపయోగించి విండోస్ 7 బీటా ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు మరియు జెన్యూన్ కీ కూడా పొందవచ్చు. విండోస్ 7 బీటా ని డాటా లేని టెస్టింగ్ కోసం వుపయోగించే కంప్యూటర్ లో ఇనస్టలేషన్ చేసుకొంటే ఎటువంటి సమస్యలు లేకుండా అవసరమైనప్పుడు అన్ ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.

విండోస్ 7 బీటా డౌన్ లోడ్ లో సమస్య తలెత్తుతుంటే ఈ క్రింద యివ్వబడిన డైరెక్ట్ లింక్ ల పై క్లిక్ చెయ్యండి:

Download Windows 7 Public Beta ISO (32-bit)

Download Windows 7 Public Beta ISO (64-bit)

Genuine Windows 7 Beta Keys to activate windows 7 Unlimited Times

Windows 7 Beta 64-bit Product Key

7XRCQ-RPY28-YY9P8-R6HD8-84GH3
JYDV8-H8VXG-74RPT-6BJPB-X42V4
482XP-6J9WR-4JXT3-VBPP6-FQF4M
JYDV8-H8VXG-74RPT-6BJPB-X42V4
D9RHV-JG8XC-C77H2-3YF6D-RYRJ9
JYDV8-H8VXG-74RPT-6BJPB-X42V4
RFFTV-J6K7W-MHBQJ-XYMMJ-Q8DCH
482XP-6J9WR-4JXT3-VBPP6-FQF4M
D9RHV-JG8XC-C77H2-3YF6D-RYRJ9
7XRCQ-RPY28-YY9P8-R6HD8-84GH3
RFFTV-J6K7W-MHBQJ-XYMMJ-Q8DCH
D9RHV-JG8XC-C77H2-3YF6D-RYRJ9
482XP-6J9WR-4JXT3-VBPP6-FQF4M
7XRCQ-RPY28-YY9P8-R6HD8-84GH3
482XP-6J9WR-4JXT3-VBPP6-FQF4M
JYDV8-H8VXG-74RPT-6BJPB-X42V4
D9RHV-JG8XC-C77H2-3YF6D-RYRJ9
JYDV8-H8VXG-74RPT-6BJPB-X42V4
JYDV8-H8VXG-74RPT-6BJPB-X42V4
RFFTV-J6K7W-MHBQJ-XYMMJ-Q8DCH
D9RHV-JG8XC-C77H2-3YF6D-RYRJ9
7XRCQ-RPY28-YY9P8-R6HD8-84GH3
482XP-6J9WR-4JXT3-VBPP6-FQF4M
JYDV8-H8VXG-74RPT-6BJPB-X42V4

Windows 7 Beta 32-bit Product Key

6JKV2-QPB8H-RQ893-FW7TM-PBJ73
TQ32R-WFBDM-GFHD2-QGVMH-3P9GC
GG4MQ-MGK72-HVXFW-KHCRF-KW6KY
4HJRK-X6Q28-HWRFY-WDYHJ-K8HDH
QXV7B-K78W2-QGPR6-9FWH9-KGMM7
6JKV2-QPB8H-RQ893-FW7TM-PBJ73
4HJRK-X6Q28-HWRFY-WDYHJ-K8HDH
GG4MQ-MGK72-HVXFW-KHCRF-KW6KY
QXV7B-K78W2-QGPR6-9FWH9-KGMM7
TQ32R-WFBDM-GFHD2-QGVMH-3P9GC
QXV7B-K78W2-QGPR6-9FWH9-KGMM7
6JKV2-QPB8H-RQ893-FW7TM-PBJ73
4HJRK-X6Q28-HWRFY-WDYHJ-K8HDH
QXV7B-K78W2-QGPR6-9FWH9-KGMM7
GG4MQ-MGK72-HVXFW-KHCRF-KW6KY
6JKV2-QPB8H-RQ893-FW7TM-PBJ73
GG4MQ-MGK72-HVXFW-KHCRF-KW6KY
TQ32R-WFBDM-GFHD2-QGVMH-3P9GC
TQ32R-WFBDM-GFHD2-QGVMH-3P9GC
6JKV2-QPB8H-RQ893-FW7TM-PBJ73
QXV7B-K78W2-QGPR6-9FWH9-KGMM7
TQ32R-WFBDM-GFHD2-QGVMH-3P9GC
GG4MQ-MGK72-HVXFW-KHCRF-KW6KY
6JKV2-QPB8H-RQ893-FW7TM-PBJ73
4HJRK-X6Q28-HWRFY-WDYHJ-K8HDH

విండోస్ 7 బీటా వెర్షన్ లో కంప్యూటర్ కి హాని కలిగించే కొన్ని బగ్స్ వున్నాయి. windows media player 12 లో ఒక బగ్ ను కనుగొన్నారు. windows media player 12 సంబంధించిన అప్ డేట్ డౌన్ లోడ్ చేసుకోకుండా దానిని వాడటం వలన MP3 ఫైళ్ళు పాడయ్యే అవకాశం వుంది. కాబట్టి http://support.microsoft.com/kb/961367 నుండి అప్ డేట్ డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాతే windows media player 12 ను వుపయోగించండి.

విండోస్ 7 బీటా వెర్షన్ ను ఇనస్టలేషన్ చేసిన తర్వాత బగ్స్ నుండి రక్షణ పొందటానికి అప్ డేట్స్ కూడా ఇనస్టలేషన్ చేసుకోవటం మరువవద్దు.

General availability for the Windows 7 Beta to end

ధన్యవాదాలు

Monday, February 2, 2009

తెలుగు MP3 పాటల డౌన్ లోడ్ కొరకు ఒక మంచి వెబ్ సైట్...


తెలుగు MP3 పాటల డౌన్ లోడ్ కొరకు ఒక మంచి వెబ్ సైట్/బ్లాగు http://www.ezeemp3.com/. ఇక్కడ వేలకొద్దీ పాత, క్రొత్త పాటలు MP3 రూపంలో డౌన్ లోడ్ కి సిధ్ధంగా వుంటాయి. సినిమా పేర్లను అక్షర క్రమం లో వుంచారు, అక్కడ దొరకనివి సైట్ లో ఇచ్చిన సెర్చ్ లో పాట లేదా సినిమా పేరు టైప్ చేసి కావలసిన పాట ను పొందవచ్చు. భక్తి పాటలు, మెలోడీ పాటలు, సంగీత దర్శకులు, సినిమా విడుదలైన సంవత్సరం ఇలా వివిధ క్యాటగిరీలలో పాటలను వుంచటం వలన కావలసిన పాటలను వెతుక్కోవటం సులువు. చిన్నారులకు అవసరమైన చిట్టిగీతాలు కూడా ఇక్కడ వున్నాయి. ఈ సైట్ కు 26 లక్షల పైగా హిట్స్ వున్నాయి.

గమనిక: డౌన్ లోడ్ చేసుకొనే ముందు సైట్ లోని Disclaimer Notice చూడండి.

ధన్యవాదాలు