Friday, November 28, 2008

విండోస్ స్టార్ట్ అప్ టైమ్ తగ్గించటానికి ...

విండోస్ ఎక్స్పీ స్టార్ట్ అవ్వటానికి ఎక్కువ సమయం పడుతుందా దానికి చాలా కారణాలు వుండవచ్చు డీఫ్రాగ్మెంటెడ్ ఫైళ్ళ వలన, మాల్ వేర్ ఇన్ఫెక్షన్ వలన, తక్కువ మెమొరీ మరియు డిస్క్ స్పేస్ వలన, హార్డ్ వేర్ సమస్యల వలన , క్రొత్త ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసినప్పుడు స్టార్ట్ అప్ ఎంట్రీలు యాడ్ అవటం వలన మరియు ఇతర కారణాలు.

అనవసరమైన స్టార్ట్ అప్ ఎంట్రీలను ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం:

౧.ముందుగా Start ---> Run కి వెళ్ళి msconfig అని టైప్ చేసి ’Ok' బటన్ పై క్లిక్ చెయ్యాలి.



౨.System Configuration Utility ఓపెన్ అవుతుంది. దానిలో Startup టాబ్ క్లిక్ చేస్తే స్టార్ట్ అప్ ఎంట్రీలు కనబడతాయి. వాటిలో అనవసరమైన ఎంట్రీల దగ్గర వున్న టిక్( అన్ చెక్ ) తీసి వేయాలి. Windows ఫోల్డర్ వున్న వాటిని (విండోస్ స్టార్ట్ అప్ ఎంట్రీలు), యాంటీ వైరస్, యాంటీ స్పై వేర్ మరియు ఫైర్ వాల్ ని అన్ చెక్ చెయ్యకపోవటం వుత్తమం.



౩.ఇప్పుడు General టాబ్ కి వెళ్ళి Selective Startup ని సెలెక్ట్ చేసుకొని ముందు Apply తర్వాత Ok బటన్ పై క్లిక్ చేసి, సిస్టం రీస్టార్ట్ చెయ్యాలి.



ధన్యవాదాలు

Thursday, November 27, 2008

Picasa 3 - కీబోర్డ్ షార్ట్ కట్లు

Shortcuts for Selecting Photos:
[Crtl]+[A] - Select all photos in album
[Crtl]+[D] - De-select Photos
[Crtl]+[I] - Invert Photo selection
[Home] - Select the first photo in the album
[End] - Select the last photo in the album
[Ctrl]+[H] - Hold selected photos photo tray
[Ctrl]+[Enter] - Locate the photo file on your computer
[Ctrl]+[O] - Open a photo file on your computer
Shortcuts for Viewing Photos:
[Ctrl]+[1] - View your photos as small thumbnails
[Ctrl]+[2] - View your photos as large thumbnails
[F11] - Use Picasa in full-screen mode
[Ctrl]+[4] - Start a slideshow
[Ctrl]+[5] - View your timeline
Shortcuts for Editing Photos:
[Ctrl]+[3] - Open an image in Edit mode
[Ctrl]+[R] - Rotate the image clockwise
[Ctrl]+[Shift]+[R] - Rotate the image Counter clockwise
[Ctrl]+[Shift]+[H] - Flip image horizontally
[Ctrl]+[Shift]+[V] - Flip image vertically
[Ctrl]+[Shift]+[B] - Add Black & White effect
Others:
[Ctrl]+[E] - E-mail selected photos
[Ctrl]+[P] - Print selected images
[Ctrl]+[Shift]+[P] - Print album contact sheet
[Ctrl]+[F] - Search
[Ctrl]+[K] - Add keywords to your photos
[Ctrl]+[N] - Create new album
[F1] - View help content
[X] - Exclude a photo in import mode
Shortcuts for Watching Videos:
[/] - Pause/play Video
[,] - Rewing Video
[.] - Fast forward video

ధన్యవాదాలు

Monday, November 24, 2008

Picasa - The easy way to find, edit, and share your photos

Picasa 3 - గూగుల్ విడుదల చేసిన క్రొత్త సాప్ట్ వేర్. ఫోటోలను సరియైన పధ్ధతిలో ఆర్గనైజ్ చేసుకోవటానికి, ఫోటోల పై వున్న గీతలను, రెడ్ ఐ మొ. వాటిని తొలగించటానికి, ఫోటోలను స్లైడ్ షో, మూవీ మొ. వాటిలోకి మార్చటానికి,అప్ లోడ్ చేసుకొని బంధుమిత్రులతో షేర్ చేసుకోవటానికి Picasa ఎంతగానో వుపయోగపడుతుంది. దీనిని http://picasa.google.com/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సాప్ట్ వేర్ ని ఇనస్టలేషన్ చేసిన తర్వాత మొదటిసారి రన్ చేసినప్పుడు వచ్చే Automatic Scanning ఆప్షన్ల లో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొంటే హార్డ్ డిస్క్ / MyDocuments, My Picture మరియు డెస్క్ టాప్ పూర్తిగా స్కాన్ చెయ్యబడి ఇమేజ్ లు వున్న ఫోల్డర్ లు ఆటోమాటిక్ గా Picasa కి యాడ్ చెయ్యబడతాయి. మెయిన్ మెనూ లోని Tools --> Folder Manager క్లిక్ చేసి Picasa 3లో కనబడవలసిన ఫోల్డర్లను సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చెయ్యబడిన ఫోల్డర్ల లో ఎప్పుడైనా క్రొత్త ఇమేజ్ లు కానీ, అవి వున్న ఫోల్డర్లు కానీ కాపీ చేస్తే ఆటోమాటిక్ గా Picasa 3 లో అప్ డేట్ చెయ్యబడతాయి. మెయిన్ మెనూ లో File ---> Add folder to Picasa పై క్లిక్ చేసి కూడా ఇమేజ్ ఫోల్డర్లను యాడ్ చెయ్యవచ్చు. యాడ్ చేసిన ఫైళ్ళ మరియు ఫోల్డర్ల ఒరిజినల్ లొకేషన్ మారదు.

Picasa 3 యొక్క కొన్ని ఫీచర్లను ఇప్పుడు చూద్దాం:

1.ముఖాలు వున్న ఇమేజ్ లు చూడటానికి సెర్చ్ బార్ కి ఎడమ చేతి ప్రక్కన వున్న ’Show only Photos With Faces' ఐకాన్ పై క్లిక్ చెయ్యాలి మరల వెనక్కి వెళ్ళటానికి ’Back to View all' బటన్ పై క్లిక్ చెయ్యాలి. అదే విధంగా Starred మరియు మూవీలను మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు.



2. ఫోల్డర్ పేరు క్రింద వున్న 'Create Movie Presentation' బటన్ పై కానీ లేదా Picasa Bottom bar లోని Movie బటన్ పై కానీ క్లిక్ చేసి స్లైడ్ షో క్రియేట్ చేసుకోవచ్చు మరియు చిన్న చిన్న వీడియోలను కలపి ఒకే వీడియో గా చేసుకొని 1GB సైజ్ వరకు ’Upload to Youtube' పై క్లిక్ చేసి యూట్యూబ్ కి మీ మూవీ ని అప్ లోడ్ చేసుకోవచ్చు.



3.Picasa రన్ అవుతున్నప్పుడు [Print Scrn] బటన్ ప్రెస్ చేస్తే స్క్రీన్ షాట్ ఆటోమాటిక్ గా సేవ్ అయ్యి Picasa కి యాడ్ చెయ్యబడుతుంది.

4.మెయిన్ మెనూ లోని Tools ---> Experimental----> Show Duplicate files పై క్లిక్ చేసి డూప్లికేట్ ఫైళ్ళను చూడవచ్చు. అవసరం లేదు అనుకొంటే ఒక కాపీ తొలగించవచ్చు.

5.వెబ్ ఆల్బమ్స్ లో 1GB వరకు ఇమేజ్ లను అప్ లోడ్ చేసుకోవచ్చు. అన్ని ఫోటోలకు ఆటోమాటిక్ గా వాటర్ మార్క్ యాడ్ చెయ్యటానికి మెయిన్ మెనూలోని Tools ---> Options లో Web Albums టాబ్ సెలెక్ట్ చేసుకొని దానిలోని Watermarks దగ్గర వున్న Add a watermarks for all photo uploads దగ్గర టిక్ చేసి దాని క్రింద వున్న టెక్స్ట్ బాక్స్ లో టెక్స్త్ టైప్ చెయ్యాలి. అప్ లోడ్ చేసిన ఇమేజ్ లకు మాత్రమే వాటర్ మార్క్ యాడ్ అవుతుంది, ఒరిగినల్ ఇమేజ్ లు యధాతదంగా వుంటాయి.

6.ఇమేజ్ రంగుని బట్టి సెర్చ్ చెయ్యటానికి Tools ---> Experimental---> Search for... లో వచ్చే కలర్ ని సెలెక్ట్ చేసుకొంటే ఆ కలర్ వున్న ఇమేజ్ లు చూపబడతాయి.

7. Picasa లో వున్న ఇమేజ్ ఫోల్డర్ని కానీ కావలసిన ఇమేజ్ లను కానీ సెలెక్ట్ చేసుకొని, Bootom Bar లో వున్న Collage బటన్ ప్రెస్ చేస్తే Collage Window ఓపెన్ అవుతుంది. ఇక్కడ లభించే వివిధ ఆప్షన్ల ద్వారా సెలెక్ట్ చేసుకోబడిన ఇమేజ్ లని ఒకేసారి చూడవచ్చు. సెట్టింగ్స్ లో వున్న ఆప్షన్లలో Multiple Exposure ఆప్షన్ సెలెక్ట్ చేసుకొంటే ఇమేజ్ లన్నీ ఒకదాని పై మరొకటి చేర్చబడతాయి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్రమత్తంగా లేకుంటే ఇమేజ్ లన్నీ ఒకదాని పై మరొకటి చేర్చబడి అసలుకే మోసం వస్తుంది,దీనిని వాడకపోవటమే బెటర్. ఇమేజ్ లకు ఎప్పుడైనా మార్పులు చేసి అవి వద్దు అనుకొంటే సేవ్ చెయ్యకుండా వుంటే సరిపోతుంది.



8.ఇమేజ్ ని ఎడిట్ చెయ్యటానికి దానిపై డబల్ క్లిక్ చేస్తే వచ్చే విండోలో లభించే వివిధ ఆప్షన్లతో ఇమేజ్ కి మార్పులు చేసుకోవచ్చు, మార్పులు వద్దనుకొంటే సేవ్ చెయ్యకుండా UNDO చేసుకోవచ్చు.



9.కావలసిన ఫోటోలను కానీ లేదా మొత్తం ఫోల్డర్ లోని ఇమేజ్ లని e-mail చెయ్యాలంటే మెయిన్ మెనూ లోని File---> E-Mail కాని [Ctrl]+[E] ప్రెస్ చేస్తే Outlook లేదా Google Account వుపయోగించి మెయిల్ పంపవచ్చు.

10. Sync to Web బటన్ పై క్లిక్ చేసి Picasa Web Albums లోకి ఇమేజ్ లను అప్ లోడ్ చేసుకోవచ్చు.దీని కోసం గూగుల్ ఎకౌంట్ తప్పనిసరి.



ఇంకా ఎన్నో ఫీచర్లు Picasa 3 లో వున్నాయి, ఇది చాలా యూజ్ ఫుల్ అని చెప్పవచ్చు.

ధన్యవాదాలు

Wednesday, November 19, 2008

వాచ్ టీవీ ఆన్ ఇంటర్ నెట్

విశ్వవ్యాప్తంగా వున్న టీవీ ఛానళ్ళను ఇంటర్ నెట్ లో చూడాలంటే http://tvunetworks.com/ కి వెళ్ళాలి. ఇక్కడ న్యూస్, స్పోర్ట్స్, ఫన్, కార్టూన్, మూవీస్, మ్యూసిక్ సంబంధించిన వివిధ ఛానళ్ళను చూడవచ్చు. ఇదే సైట్ లో దొరికే TVU Player డౌన్ లోడ్ చేసుకొని డైరెక్ట్ గా ఛానళ్ళను ఫ్లేయర్ లోనే చూడవచ్చు. 3G మొబైల్ ఫోన్ల లో టీవీ చూడాలంటే TVUMobile సాప్ట్ వేర్ ఇదే సైట్ లో దొరుకుతుంది.





ఒక చిన్న చిట్కా:
వివిధ వీడియో లను Paint లో ప్లే చెయ్యాలంటే, ముందుగా వీడియో ను ప్లే చేసి కీబోర్డ్ లోని ’Print Scrn' బటన్ ప్రెస్ చేసి తర్వాత paint ఓపెన్ చేసి Edit---> Paste లేదా [Ctrl]+[V] బటన్లు ప్రెస్ చెయ్యాలి. అంతే వీడియో Paint లో ప్లే అవుతుంది.

ఇది నా 100 వ టపా ఈ సందర్భంగా ఇప్పటివరకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఎందరో మహానుభావులు సహాయ సహకారాలు అందించారు వారందరికి నా వందనాలు...

స్పూర్తి: శ్రీ నల్లమోతు శ్రీధర్ గారు
పత్రికలు: కంప్యూటర్ విజ్ఞానం , కంప్యూటర్ ఎరా, డిజిట్, ఈనాడు
సైట్లు: అనేకం

ధన్యవాదాలు

Friday, November 14, 2008

iSpring - పవర్ పాయింట్ టు ఫ్లాష్ కన్వర్షన్ సాప్ట్ వేర్

పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లను ఫ్లాష్ మూవీ లు గా మార్చ్టానికి iSpring సాప్ట్ వేర్ వుపయోగపడుతుంది. దీనిని http://www.ispringsolutions.com/products/ispring_free.html నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. iSpring వుచిత సాప్ట్ వేర్ మరియు డౌన్లోడ్ ఫైల్ సైజ్ 7 MB. iSpring functions ని పవర్ పాయింట్ స్టాండర్డ్ టూల్ బార్ లో పొందవచ్చు. ’Quick Publish' పై క్లిక్ చేసి ఒకే ఒక క్లిక్ తో ఫ్లాష్ లోకి మార్చవచ్చు. లేకుంటే ’Publish' పై క్లిక్ చేసి విజార్డ్ వుపయోగించి కావలసిన విధంగా మార్చుకోవచ్చు.







ధన్యవాదాలు

Wednesday, November 12, 2008

Evonsoft Computer Repair - సిస్టం పనితనం మెరుగుపర్చే వుచిత సాప్ట్ వేర్!!!

Evonsoft Computer Repair - స్పైవేర్ తొలగించటానికి, రిజిస్ట్రీ క్లీన్ చెయ్యటానికి, వ్యక్తిగత బ్రౌసింగ్ హిస్టరీ మరియు జంక్ ఫైళ్ళను తొలగించటానికి ఈ యుటిలిటీ వుపయోగపడుతుంది. దీనిని http://www.evonsoft.com/computer-repair.html నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫైల్ సైజ్ 1.51 MB మాత్రమే.







ధన్యవాదాలు

Wednesday, November 5, 2008

Adeona - లాప్ టాప్ ట్రాకింగ్ సిస్టం - ఉచిత సాప్ట్ వేర్


University of Washington కంఫ్యూటర్ సైంటిస్ట్ లచే మొదటి వుచిత లాప్ టాప్ ట్రాకింగ్ సిస్టం రూపోదించబడినది... అదే Adeona ...ఒక గ్రీకు దేవత పేరునే ఈ సాప్ట్ వేర్ కు పెట్టారు. దొంగిలించబడిన లేదా పోయిన లాప్ టాప్ లను కనుక్కోవటానికి ఈ సిస్టమ్ వుపయోగపడుతుంది.లాప్ టాప్ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన తర్వాత Adeona ఒక కీ జెనెరేట్ చేస్తుంది, దొంగిలించబడిన లాప్ టాప్ ట్రాక్ చెయ్యటానికి ఆ కీ అవసరమవుతుంది. లాప్ టాప్ ట్రాక్ చెయ్యటానికి Adeona వివిధ పధ్ధతులను అనుసరిస్తుంది. లాప్ టాప్ వుపయోగించే లొకేషన్ లోని ఐపి అడ్రస్ బ్రాడ్ కాస్ట్ చేస్తుంది మరియు సిస్టం లోని ఇన్ బిల్ట్ కెమేరా ను వుపయోగించి యూజర్ యొక్క ఫోటోలను ప్రతి 30 సెకన్లకొకసారి తీస్తుంది.

మరింత సమాచారం మరియు వుచిత Adeona సాప్ట్ వేర్ కోసం http://adeona.cs.washington.edu/ కి వెళ్ళండి.

ధన్యవాదాలు

Tuesday, November 4, 2008

యాహూ మెయిల్ కాంటాక్ట్ లను జీ-మెయిల్ కి ఇంపోర్ట్ చెయ్యండిలా!!!

ఈ మధ్యకాలంలో జీ-మెయిల్ వాడకం బాగా పెరిగింది...అది అందిస్తున్న సర్వీసెస్ వల్ల కానీ మరి ఏ యితర కారణాల వల్ల కానీ చాలా మంది యహూ మరియు యితర మెయిల్ యూజర్లు జీ-మెయిల్ కి మారారు. ఈ పరిస్ధితిలో యాహూ లో వున్న Contacts ని జీ-మెయిల్ కి ఎలా ఇంపోర్ట్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం...

1.ముందుగా యాహూ మెయిల్ కి లాగిన్ అవ్వాలి. ’Contacts' టాబ్ పై క్లిక్ చేసి ’Import/Export' పై క్లిక్ చెయ్యాలి.

2.క్రింద వున్న ’Export' దగ్గర 'Yahoo!CSC:' దగ్గరవున్న ’Export Now' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

3.CSV ఫైల్ ని ’Save' బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి.

4.ఇప్పుడు Gmail లాగిన్ చేసి ’Contacts' పై క్లిక్ చెయ్యాలి.

5.ఇక్కడ ’Import' పై క్లిక్ చెయ్యాలి.

6.’Browse' బటన్ పై క్లిక్ చేసి ఇంతకుముందు యాహూ నుండి సేవ్ చేసుకొన్న CSV ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్రిందవున్న ’Import' పై క్లిక్ చెయ్యాలి.

7.కాంటాక్ట్స్ ఇంపోర్ట్ చెయ్యబడిన తర్వాత ’Ok' పై క్లిక్ చెయ్యాలి. అంతే యాహూ మెయిల్ లోని Contacts అన్నీ Gmail లోకి వచ్చేస్తాయి.


ధన్యవాదాలు