Monday, October 31, 2011

Pandora Recovery - మెమొరీ స్టోరేజ్ డివైసెస్ నుండి డిలీట్ అయిన ఫైళ్ళను రికవర్ చెయ్యటానికి!!


Pandora Recovery అనే పైల్ రికవరీ సాప్ట్ వేర్ ని ఉపయోగించి మెమొరీ స్టోరేజ్ డివైసెస్ నుండి డిలీట్ అయిన ఏదైనా ఫైల్ ని రికవర్ చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ మెమొరీ డివైసెస్ ని పూర్తిగా స్కాన్ చేసి వాటిలో ఉన్న మరియు తొలగించ బడిన ఫైళ్ళ ఇండెక్స్ ని తయారు చేస్తుంది, దీని ద్వారా యూజర్ నిర్ణయించిన లొకేషన్ లో తొలగించ బడిన ఫైళ్ళను రికవర్ చెయ్యవచ్చు, తొలగించబడిన ఫైళ్ళ పేరు, సైజ్, క్రియేటెడ్ డేట్ తదితర వివరాలతో సెర్చ్ కూడా చెయ్యవచ్చు అంతేకాకుండా రికవర్ చేసే ముందు ఫైళ్ళ ప్రివ్యూ కూడా చూడవచ్చు, సింపుల్ విజార్డ్ కలిగిన ఈ అప్లికేషన్ ని ఉపయోగించటం చాలా సులువు,  



మరింత సమాచారం కోసం Pandora Recovery సైట్ చూడండి.

డౌన్లోడ్: Pandora Recovery

ధన్యవాదాలు

Thursday, October 27, 2011

ఫేస్ బుక్ అప్ డేట్స్ మీ మొబైల్ లో పొందటం ఎలా??

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ఫేస్ బుక్ నోటిఫికేషన్స్ ఎస్ ఎమ్ ఎస్ రూపంలో మొబైల్ లో పొందాలంటే కనుక ఈ క్రింది విధంగా చెయ్యండి.

౧. ముందుగా ఫేస్ బుక్ లాగిన్ అవ్వాలి, తర్వాత కుడిచేతి ప్రక్కన Home ప్రక్కన ఉన్న డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేసి ’Account Settings' పై క్లిక్ చెయ్యాలి.


౨. ఎడమ చేతి ప్రక్కనున్న ’Mobile' పై క్లిక్ చేసి మొబైల్ సెట్టింగ్స్ కి వెళ్ళాలి.


౩.మొబైల్ సెట్టింగ్స్ లో ’+Add a Phone' పై క్లిక్ చెయ్యాలి.


౪. ఫేస్ బుక్ పాస్ వార్డ్ ఎంటర్ చేసి ’confirm' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


౫. మొబైల్ కారియర్ లో కొన్ని ఆపరేటర్ల పేర్లు వస్తాయి, వాటిలో మీ ఆపరేటర్ ఉంటే దానిని సెలెక్ట్ చేసుకోవాలి లేకుంటే ’Other Carrier' ని ఎంచుకుని ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


౬. మీ మొబైల్ నుండి F అని టైప్ చేసి 9232232665 కి SMS పంపితే కన్ఫర్మేషన్ కోడ్ మన మొబైల్ కి పంపబడుతుంది, దానిని ఎంటర్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే....



ధన్యవాదాలు

Wondershare Disk Manager Free - డిస్క్ పార్టీషన్స్ క్రియేట్, రీసైజ్, డిలీట్ మరియు రికవర్ చెయ్యటానికి!!!

Wondershare Disk Manager Free అనే ఉచిత విండోస్ పార్టీషన్ మేనేజ్మెంట్ టూల్ ని ఉపయోగించి  డిస్క్ పార్టీషన్స్ క్రియేట్, రీసైజ్, డిలీట్ మరియు రికవర్ చెయ్యవచ్చు. దీనిలోని సింపుల్ విజార్డ్ ఎటువంటి అనుభవం లేని వారు కూడా డిస్క్ పార్టీషన్ క్రియేట్, రీసైజ్, డిలీట్ మరియు రికవర్ చెయ్యవచ్చు. ఇక్కడ రెండు మోడ్స్ ఉంటాయి అవి Expert Mode మరియు Wizard Mode.  Expert Mode లో పార్టీషన్ ఆపరేషన్స్ మాన్యువల్ గా చేసుకోవాలి.



Main Functions:
  • Create Partition: Create a new partition or re-partition your hard drive for better usage.
  • Resize Partition: Extend a partition to a larger size or reduce a partition without losing data.
  • Copy Partition: Copy a partition as well as all files in it for backup. You can save the copy to another partition or another storage device.
  • Delete Partition: Delete a partition or delete all partitions. You can choose whether to shred data in the partition.
  • Fomat Partition: Prepare for installing OS or re-organizing your hard disk.
  • Recover Partition: Recover lost partitions as well as files in it from misoperation, software/hardware failure, or virus attack.
  • Convert Partition: Convert FAT to NTFS or vice versa.
  • Set Partition Active: Your computer will boot from the active partition.
  • Hide/unhide Partition: Make your sensitive partition invisible and prevent unauthorized access.
  • Explore Partition: You can view the structure of selected partition, but the content of the files will not display.
  • Change Volume Label: Allow you to change your volume label by right clicking mouse and select Advance.

డౌన్లోడ్: http://www.wondershare.com/disk-manager/

ధన్యవాదాలు

Saturday, October 22, 2011

F-Secure ShareSafe - spam and malicious links నుండి ఫేస్‍బుక్ ని కాపాడటానికి!!

F-Secure ShareSafe అనే ఫేస్‍బుక్ అప్లికేషన్ spam and malicious links నుండి ఫేస్‍బుక్ అకౌంట్  ని సురక్షితంగా ఉంచుతుంది. మనం పోస్ట్ చెయ్యబోయే లింక్స్ లేదా మన వాల్ పై మన్ మిత్రులు పోస్ట్ చేసిన లింక్ లను స్కాన్ చేస్తుంది. ఫేస్‍బుక్ అప్లికేషన్ సైట్ కి వెళ్ళి ’Go to App' పై క్లిక్ చేసి ఫేస్‍బుక్ అకౌంట్ లాగిన్ చేసి అప్లికేషన్ ఆథరైజ్ చెయ్యటానికి ’Allow' బటన్ పై క్లిక్ చెయ్యాలి అంతే.



Sharesafe ఫీచర్లు:
  • Stay safe from spam and malicious posts on your wall and news feed.
  • Be a responsible member of your network and scan links with ShareSafe before you post them to your wall to make sure they are safe to visit.
  • Discover interesting links from the ShareSafe community. The most popular links rise to the top!
  • Earn points, badges and redeem them for rewards! 




ధన్యవాదాలు

Thursday, October 20, 2011

గూగుల్ సెర్చ్ లో మీ ఐపి అడ్రస్ తెలుసుకోవటానికి!!!

గూగుల్ సెర్చ్ లో మీ  ఐపి అడ్రస్ తెలుసుకోవటానికి సెర్చ్ బాక్స్ లో my ip లేదా what is my ip లేదా my ip address అని టైప్ చేస్తే Your public IP address is 121.___.____.___ అని మన ఐపి అడ్రస్ చూపిస్తుంది. 




మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.


ధన్యవాదాలు 

Wednesday, October 19, 2011

TV for Google Chrome - బ్రౌజర్ లో టీవీ చూడటానికి గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్!!!

TV for Google Chrome అనే గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ని ఇనస్టలేషన్ చేసుకుని బ్రౌజర్ లోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 3000 పైగా sports, music, news, movies, lifestyle, entertainment, movies .. ఇలా వివిధ టీవీ చానెల్స్ ని చూడవచ్చు. 


విండోస్ మీడియా ప్లేయర్ ప్లగిన్ ఉంటే సరి, లేకుంటే ముందుగా దీనిని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి.  తర్వాత TV for Google Chrome ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. 

మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. 

ధన్యవాదాలు

Thursday, October 13, 2011

APCPDCL పరిధిలోని వారు విద్యుత్తు బిల్లులు ఆన్ లైన్ లో కట్టటానికి!!!

APCPDCL పరిధిలోని విద్యుత్తు బిల్లు వసూలు సిబ్బంది సకల జనుల సమ్మెలో పాల్గొనటం వలన కొన్ని కోట్ల రూపాయల బిల్లులు వసూలు కావలసి ఉంది.  గత నెలలో బిల్ చెల్లించ లేకపోయిన వారు ఈ-సేవా, ఏపీ ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. అలానే క్రెడిట్ లేదా డెబిట్ తో APCPDCL సైట్ కి వెళ్ళి కూడా ఆన్ లైన్ లో పేమెంట్ చెయ్యవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్ద్దాం:

౧. ముందుగా APDCL సైట్ కి వెళ్ళి కుడిచేతి ప్రక్క ఉన్న ’Pay your Bill' పై క్లిక్ చెయ్యాలి.


౨. తర్వాత ఇక్కడ మన జిల్లా, ERO, సర్వీస్ నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేసి ’Submit' పై క్లిక్ చెయ్యాలి.

౩. ఇప్పుడు బిల్ డెస్క్ సైట్ కి రీడైరెక్ట్ చెయబడుతుంది, అక్కడ మన సర్వీస్ నంబర్, మన్ పేరు , అడ్రస్ తదితర వివరాలు వస్తాయి, వాటిని సరిచూసుకోవాలి. తర్వాత పేమెంట్ మోడ్ ఎంచుకొని ’Submit' పై క్లిక్ చెయ్యాలి.

౪. ఇక్కడ నుండి పేమెంట్ గేట్ వే కి వెళుతుంది, అక్కడ మన క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ చెయ్యవచ్చు.

ఇకపోతే ఈ నెల రీడింగ్ తీసుకొని బిల్లులు ఇచ్చే వారు లేకపోయే సరికి ఈ నెల కూడా గత నెలలో కట్టిన బిల్ మొత్తాన్నే కట్టాలని సెంట్రల్ ఎండీ చెపుతున్నారు. ఎక్కువ/తక్కువ అడ్జస్ట్ మెమ్ట్స్ తదుపరి బిల్లులలో సరి చేస్తారు.

వెబ్ సైట్: APDCL

ధన్యవాదాలు

Monday, October 10, 2011

మొబైల్ ఫోన్ వినియోగదారులకు శుభవార్త!!!

కేంద్రం క్రొత్త టెలికాం పాలసీని ప్రవేశపెట్టనుంది ఇది మొబైల్ వినియోగదారులకు నిజంగా శుభవార్తే!!! దీనిలోని కొన్ని ముఖ్యాంశాలు...
౧.One Nation - Free Roaming-  సర్కిల్ బయట రోమింగ్ చార్జీలు ఉండవు మరియు ఇన్-కమింగ్ కాల్స్ చార్జ్ చెయ్యబడవు.
౨. intra-circle MNP (mobile number portability) - దేశం లో ఎక్కడికి వెళ్ళినా మొబైల్ నంబర్ మార్చవలసిన అవసరం లేదు.
క్రొత్త టెలికాం పాలసీ గురించి టెలికాం మంత్రి కపిల్ సిబాల్ మాటల్లో "Moving forward, we aim to create One Nation - One Licence across services and service areas. We aim to achieve One Nation - Full Mobile Number Portability and work towards One Nation - Free Roaming",

ధన్యవాదాలు

Saturday, October 8, 2011

ఎందరికో స్పూర్తిని ఇచ్చిన స్టీవ్ జాబ్స్ ప్రసంగాన్ని చూడండి[వీడియో]!!!

2005 లో స్టీవ్ జాబ్స్ స్టాన్ ఫోర్డ్ విద్యార్ధులను ఉద్దేసించి ప్రసంగించారు. ఆ ప్రసంగం ఎందరిలోనో స్పూర్తిని నింపింది. దానిని ఇక్కడ చూడండి.


స్టీవ్ జాబ్స్ ఆత్మ శాంతికి ఆ దేవుని ప్రార్ధిస్తున్నాం...

ధన్యవాదాలు

Thursday, October 6, 2011

Speckie- ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ కోసం స్పెల్ చెకింగ్ యాడ్-ఆన్!!!

విజయదశమి శుభాకాంక్షలు!!


Speckie అనే ఉచిత ఇంటర్నెట్ ఎక్స్‍ప్లోరర్ యాడ్-ఆన్ రియల్ టైమ్ స్పెల్ చెకింగ్ ని అందిస్తుంది, స్పెల్లింగ్ తప్పుగా ఉన్న పదాల క్రింద వర్డ్ లో లా రెడ్ కలర్ అండర్ లైన్ వస్తుంది. It is the first and only real-time, dedicated spell checking solution for IE అని Speckie చెపుతుంది. బ్రౌజర్ లో ఏదైన ఫార్మ్ లేదా ఫోరమ్ లేదా బ్లాగ్, సోషల్ నెట్‍వర్క్ లో కామెంట్స్ మొ. వ్రాస్తున్నప్పుడు స్పెల్లింగ్ తప్పైతే  దాని క్రింద అండర్ లైన్ వస్తుంది దానిపై మౌస్ రైట్ క్లిక్ చేసి సరైన స్పెల్లింగ్ ని ఎంచుకోవచ్చు. Speckie సెట్టింగ్స్ కి వెళ్ళటానికి ఏదైనా పదం పై మౌస్ రైట్ క్లిక్ చేసి క్రింద ఉన్న Speckie Settings సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత కావలసిన సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.


Speckie -  Internet Explorer 6, 7, 8, or 9 on Windows XP, Vista, and 7 (32 and 64 bit)లలో పని చేస్తుంది.

డౌన్లోడ్: Speckie

ధన్యవాదాలు

Monday, October 3, 2011

Qustodio - ఉచిత పేరెంటల్ కంట్రోల్ మరియు ఇంటర్నెట్ మోనిటరింగ్ అప్లికేషన్!!!

Qustodio అనే ఉచిత టూల్ పిల్లలు ఆన్ లైన్ లో అనవసరమైన/ అసభ్యకరమైన సైట్లను చూడకుండా నిరోధిస్తుంది. దీనిని ఇనస్టలేషన్ చేసిన తర్వాత కాన్ఫిగర్ చేసుకోవాలి,  ఇది సిస్టం ట్రే నుండి రన్ అవుతుంది అవసరం అనుకుంటే హిడ్డెన్ మోడ్ లో కూడా రన్ చెయ్యవచ్చు.  నెట్ యూసేజ్ ని మోనిటర్ చెయ్యటానికి Qustodio లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. 
Key benefits
  • Follow them wherever they go

    Qustodio’s advanced technology ensures that no content escapes supervision. Whenever your children are online, Qustodio is there to safely monitor and guide them.
  • Monitor social networking behaviors

    Qustodio monitors your child’s participation in social networks and chat programs as well as their surfing behavior. Discover who your kids talk to, and get instant alerts for suspicious activity.
  • Manage and limit online access

    Set healthy limits on your children’s online time. Qustodio’s web portal allows you to monitor and manage their activity from any location or device.
  • Protect against tampering

    Qustodio is designed to be tamper-proof, so no matter how technically advanced your kids are, they can’t find ways around the limits and controls you put in place.



డౌన్లోడ్: Qustodio

ధన్యవాదాలు

Saturday, October 1, 2011

Print Plus - వెబ్ పేజ్ లో కావలసిన భాగాన్ని ప్రింట్ చెయ్యటానికి గూగుల్ క్రోమ్ ఎక్స్‍టెన్షన్!!

Print Plus అనే గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ని ఉపయోగించి ఒక వెబ్ పెజిలోని ఎంచుకున్న భాగాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. దీనికై ముందుగా గ్రోమ్ వెబ్ స్టోర్ లోఉన్న Print Plus కి వెళ్ళి ’Install' పై క్లిక్ చెయ్యాలి, అప్పుడు ఈ ఎక్స్ టెన్షన్ పైన లిస్ట్ లో కనబడుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చెయ్యవలసిన వెబ్ పేజ్ ని ఓపెన్ చెయ్యాలి, తర్వాత Print Plus ఎక్స్ టెన్షన్ పై క్లిక్ చెయ్యాలి. అలా చెయ్యటం వలన పైన ’Print' 'Cancel' అనే బ్లూ రంగులో బార్ వస్తుంది. ఇప్పుడు మౌస్ సహాయం తో ఆ వెబ్ పేజ్ లో ప్రింట్ చెయ్యవలసిన భాగాలను సెలెక్ట్ చేసుకోవాలి, ఆరెంజ్ అవుట్ లైన్ వస్తుంది. సెలెక్ట్ చేసిన భాగం ఆరెంజ్ రంగులోకి మారుతుంది. ఎంచుకున్న భాగం వద్దనుకుంటే ’x' పై క్లిక్ చెయ్యాలి. ప్రింట్ చెయ్యవలసిన భాగాలు ఎంచుకోవటం పూర్తి అయిన త్రర్వాత పైన ఉన్న బ్లూ బార్ లోని ’Print' బటన్ పై క్లిక్ చెయ్యాలి. 



Install: Print Plus

ధన్యవాదాలు