Thursday, March 25, 2010

ఇతరులు మన మెయిల్ ఎకౌంట్ ఉపయోగిస్తుంటే జీ-మెయిల్ వార్నింగ్ మెసేజ్ యిస్తుంది...

జీమెయిల్ క్రొత్త ఫీచర్ ని లాంచ్ చేసింది అదేమిటంటే ఎవరైనా మన ఈ-మెయిల్ ఎకౌంట్ అనుమానాస్పదంగా ఉపయోగిస్తున్నారు అనిఅనుకొంటే కనుక మనం ఎకౌంట్ యాక్సెస్ చేసినప్పుడు ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా హెచ్చరిస్తుంది.వార్నింగ్ మెసేజ్ ప్రక్కన వున్న ’Show details' పై క్లిక్ చేసి నప్పుడు యాక్టివిటీ విండోలో మోస్ట్ రీసెంట్ యాక్సెస్ పాయింట్స్ ని లొకేషన్( దేశం), ఐపీ అడ్రస్, డేట్ / టైమ్ తదితర వివరాలు చూపిస్తుంది.మీకు అనుమానంగా వుంటే అక్కడే పాస్ వార్డ్ మార్చుకోవచ్చు లేదా మీరే మీ ఎకౌంట్ వివిధ ప్రదేశాల నుండి యాక్సెస్ చేస్తే కనుక "Dismiss" పై క్లిక్ చేసి మెసేజ్ తొలగించవచ్చు.

మరింత సమాచారం కోసం జీమెయిల్ అఫీషియల్ బ్లాగ్ ని చూడండి.

ధన్యవాదాలు

Wednesday, March 24, 2010

ZeuAPP - 82 పైగా ఓపెన్ సోర్స్ విండోస్ యుటిలిటీస్ అన్నీ ఒకే చోట!!!

క్రొత్త కంప్యూటర్ కొన్నప్పుడు లేదా ఉన్న కంప్యూటర్ ఫార్మేట్ చేసినప్పుడు మనకవసరమయ్యే ఉచిత అప్లికేషన్లను ఇనస్టలేషన్ చెయ్యాలంటే కనుక దానిని వెతికి పలానా సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకొంటాం. అలాకాకుండా ప్రతీ అవసరానికి ఉపయోగపడే సాప్ట్ వేర్లు అన్నీ ఒకే చోట దొరికితే హ్యాపీ కదా!!!. ZeuAPP అనే పోర్టబుల్ టూల్ లో విండోస్ కోసం 80 పైగా ఉచిత అప్లికేషన్లు డౌన్లోడ్ కి సిద్ధంగా వున్నాయి. Archivers, Audio, Video, Chat-IM, Internet, CD Burners, P2P-File sharing, Games, Graphic, Secutity, Utility యిలా వివిధ క్యాటగిరీల్లో ఉచిత సాప్ట్ వేర్లను ఉంచారు. కావలసిన టాబ్ కి వెళ్ళి కావలసిన అప్లికేషన్ దగ్గర డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. చూశారా ! ఒకే ఒక క్లిక్ తో డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.మరిన్ని వివరాలకు ZeuAPP సైట్ చూడండి.

డౌన్లోడ్: ZeuAPP

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

ధన్యవాదాలు

Tuesday, March 23, 2010

ClipGrab - డెస్క్ టాప్ వీడియో డౌన్లోడర్

YouTube.com, MyVideo.de, DailyMotion.com, Vimeo.com, MySpass.de మొదలగు సైట్ల నుండి వీడియోలను డౌన్లోడ్ చేసుకోవటానికి ClipGrab అనే ఉచిత వీడియో డౌన్లోడింగ్ సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించటం చాలా సులువు. ClipGrab ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. మనం పైన చెప్పిన ఏదైనా సైట్ కి వెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు, వీడియో డౌన్లోడబుల్ అయితే కనుక సిస్టం ట్రే లో కూర్చున్న ఈ అప్లికేషన్ ఆటోమాటిక్ గా నోటిఫై చేస్తుంది, ఇక ఒకేఒక క్లిక్ తో దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక బ్రౌజర్ నుండి డౌన్లోడ్ చెయ్యవలసిన వీడియో లింకు ని కాపీచేసి ClipGrab అప్లికేషన్ ని ఓపెన్ చేసి క్రింది చిత్రంలో చూపిన విధంగా ’Please enter the link to video ....' క్రిందవున్న బాక్స్ లో పేస్ట్ చెయ్యాలి. తర్వాత Format మరియు Quality సెలెక్ట్ చేసుకొని ’Grab this clip!' పై క్లిక్ చెయ్యాలి. ’Settings'టాబ్ లో సెలెక్ట్ కొన్న ఫోల్డర్ లోకి వీడియో ఫైల్ డౌన్లోడ్ చెయ్యబడుతుంది.
డౌన్లోడ్: ClipGrab

ధన్యవాదాలు

Friday, March 19, 2010

Disk Space Fan - న్యూ స్టైల్ డిస్క్ స్పేస్ ఎనలైజర్

విండోస్ లో హార్డ్ డిస్క్ స్పేస్ ని ఎనాలిసిస్ చెయ్యటానికి Disk Space Fan అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. Disk Space Fan డిస్క్ లో ఫోల్డర్లు మరియు వాటిలోని ఫైళ్ళు ఎంత స్పేస్ ఆక్యుపై చేశాయో చక్కని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. దీంతో ఏ ఫైల్ లేదా ఫోల్డర్ ఎక్కువ స్పేస్ ఆక్రమించాయి మరియు అనవసరమైన ఫోల్డర్లు లేదా ఫైళ్ళను తొలగించుకోవచ్చు. Disk Space Fan ని విండోస్ ఎక్స్ ప్లోరర్ తో ఇంటిగ్రేట్ చెయ్యవచ్చు.ఫీచర్లు:
౧. Fantastic visualization
Disk visualization, fantastic animation, to manage disk space is not a dull work at all.
౨. Finding useless files easily
Folders and files are sorted by their size. You can catch "bad guys" easily.
౩. Integrated with Windows Explorer
Browse, open, and delete, all are same as explorer. Get file details quickly.

డౌన్లోడ్: Disk Space Fan

ధన్యవాదాలు

Monday, March 15, 2010

SteganographX 1.0 - Bitmap ఇమేజ్ లో సీక్రెట్ టెక్ట్స్ దాచటానికి...

ప్రముఖ Leelu Soft వారిచే రూపొందించబడిన SteganographX 1.0 అనే అప్లికేషన్ ని ఉపయోగించి 16, 24 లేదా 32 bit bitmap ఇమేజెస్ లో సీక్రెట్ టెక్స్ట్ ని దాచవచ్చు (Encrypt) చెయ్యవచ్చు మరలా సీక్రెట్ కోడ్ ని Decrypt ఆప్షన్ ద్వారా తిరిగి చూడవచ్చు.

SteganographX 1.0 ని Leelu Soft సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇనస్టలేషన్ అవసరం లేకుండా SteganographX అప్లికేషన్ పై క్లిక్ చేసి ’Enter your Text here' దగ్గర కావలసిన టెక్స్ట్ టైప్ చేసి ’Click to load a bitmap image' పై క్లిక్ చేసి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని, ఎడమచేతి ప్రక్కనున్న 'Encrypt' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు ఇమేజ్ ని సేవ్ కొని దాచుకోవచ్చు లేదా ఎవరికైనా పంపవచ్చు. సీక్రెట్ టెక్స్ట్ ని తిరిగి పొందటానికి Steganograph అప్లికేషన్ లో ఇమేజ్ ని ఓపెన్ చేసి ’Decrypt' బటన్ పై క్లిక్ చేస్తే హైడ్ చేసిన టెక్స్ట్ ని చూడవచ్చు.


Steganography పై మరింత సమాచారం కోసం వికీపీడియా చూడండి.

డౌన్లోడ్: SteganographX 1.0

ధన్యవాదాలు

Saturday, March 13, 2010

Universal Viewer - ఏదైనా ఫైల్ ని Open మరియు View చెయ్యటానికి...

Universal Viewer అనే అడ్వాన్స్ డు ఉచిత ఫైల్ వ్యూయర్ ని ఉపయోగించి దాదాపు అన్ని ఫార్మేట్ల లోని ఫైళ్ళను ఓపెన్ చెయ్యవచ్చు మరియు చూడవచ్చు. యూనివర్సల్ వ్యూయర్ లో ఓపెన్ చేసి చూడగలిగే ఫైల్ ఫార్మేట్లు:
 • Text, Binary, Hex, Unicode: any files, of unlimited size (even 4Gb+ sizes are allowed)
 • RTF, UTF-8: RTF and UTF-8 encoded texts
 • Image: all general graphics formats: BMP JPG GIF PNG TGA TIFF... plus all formats supported by IrfanView/XnView external viewers
 • Multimedia: all formats supported by MS Windows Media Player: AVI MPG WMV MP3...
 • Internet: all formats supported by MS Internet Explorer: HTML PDF XML MHT...
 • Plugins: all formats supported by Total Commander Lister plugins
 • MS Office: all file types of MS Office (if installed): DOC DOCX XLS PPT...
 • Converters: some types can be viewed as plain text: DOC DOCX PDF PPT ODT...
Universal Viewer హైలైట్స్:
 • Built-in functions of several plugins: images, multimedia, webpages view
 • Support for multiple codepages: ANSI, OEM, EBCDIC, ISO etc.
 • Support for text converters for DOC, DOCX, ODT, PDF etc.
 • Support for user tools
 • Toolbar, status bar, other interface improvements
 • Auto-reloading of file on changing, "Follow tail" option
 • Displaying of line numbers
 • Displaying of non-printable characters
 • Combined Unicode/Hex mode (call Unicode mode twice)
 • Modern RegEx search library
 • Print preview
 • EXIF viewer


డౌన్లోడ్: Universal Viewer
ధన్యవాదాలు

Tuesday, March 9, 2010

BSNL మొబైల్ కాల్ చార్జెస్ తగ్గించటానికి స్పెషల్ టారీఫ్ వోచర్లు...

మొన్న ఈ మధ్య మా మిత్రులు/కొలీగ్స్ తో కలసి బెంగళూరు అఫీషియల్ టూర్ వెళ్ళాము. మాలో కొంతమంది BSNL సెల్ వన్ ప్రీపెయిడ్ వినియోగదారులు వున్నారు. వారిలో కొంతమందికి రోమింగ్ ఇన్ కమింగ్ చార్జీ ఎక్కువ అవటం, నాకు మాత్రం 49 పైసలే అయ్యేది. దానికి కారణం నేను కాల్ చార్జెస్ తగ్గించటానికి స్పెషల్ టారీఫ్ వోచర్ వేశాను. Special Tariff Voucher (STV) గురించి వారికి తెలియక పోవటం తో వారికి ఎక్కువ చార్జెస్ పడ్డాయి. ఇలా వాళ్ళలా ఎవరైనా వుంటే వారికి ఉపయోగపడుతుందని ఈ పోస్ట్ చేస్తున్నాను. BSNL ప్రీ-పెయిడ్ జెనెరల్, సరళ్ అనంత్, పవర్ ప్యాక్, వెన్నెల మరియు వెన్నెల ప్లస్ వినియోగదార్లు క్రింద యివ్వబడిన STV లతో కాల్ చార్జెస్ తగ్గించుకోవచ్చు, మిగతా సదుపాయాలు ఆయా ప్లాను అనుసరించి వుంటాయి.మరింత సమాచారం కోసం కస్టమర్ కేర్ ని సంప్రదించండి.

ధన్యవాదాలు

Monday, March 8, 2010

ఫోటోలను స్కెచ్ లు గా మార్చటానికి ఉచిత ఆన్ లైన్ టూల్స్..

డిజిటల్ ఫోటోలను ఆర్టిస్టిక్ స్కెచ్ లు గా మార్చటానికి ఆన్ లైన్ లో చాలా ఉచిత టూల్స్ లభిస్తాయి, వాటిలో కొన్నింటిని యిక్కడ తెలియచేస్తున్నాను:

౧. DUMPR - Photo Pencil Sketch:

DUMPR సైట్ కి వెళ్ళి ముందుగా కావలసిన ఫోటోను అప్ లోడ్ చేసి ఒకేఒక క్లిక్ తో ఫోటోను పెన్సిల్ స్కెచ్ గా మార్చవచ్చు, అలా మారిన ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఇతరులకు ఈ-మెయిల్ పంపవచ్చు.
౨. tjshome - ఆన్ లైన్ ఇమేజ్ కన్వర్టర్:
ఈ సైట్ కి వెళ్ళగానే స్టెప్ ౧ లో వివిధ అప్శన్లు వుంటాయి అవి ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ లేదా రెడ్ షేడ్ లేదా స్కెచ్ మొదలగునవి. వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొని స్టెప్ ౨ లో ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Submit' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇమేజ్ కావలసిన విధంగా మార్చబడుతుంది. అలా మార్చబడిన ఇమేజ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.
౩. befunky :
Befunky సైట్ కి వెళ్ళి ’Get started' పై క్లిక్ చేస్తే Photo Effects ని సెలెక్ట్ చెయ్యమంటుంది. అక్కడ కావలసిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ’Browse Files' పై క్లిక్ చేసి ఇమేజ్ ని అప్ లోడ్ చెయ్యాలి. కావలసిన విధంగా మారిన ఇమేజ్ ని ’Save' బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.

ఆన్ లైన్ లో కాకుండా మనసిస్టం లోనే ఇమేజ్ లను అందమైన పెయింటింగ్స్ గా , స్కెచెస్ గా లేదా డ్రాయింగ్స్ గా మార్చుకోవటానికి fotosketcher అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడూతుంది.

ధన్యవాదాలు

Friday, March 5, 2010

Wikibooks - ఉచిత ఎడ్యుకేషనల్ టెక్స్ట్ బుక్స్ ....

ప్రముఖ వికీపీడియా వారి వికీబుక్స్ లో కేజీ నుండి పీజీ వరకు వివిధ సబ్జెక్టులలో వివిధ బుక్స్ ఉన్నాయి. వాటిలో పీడీఎఫ్ లేదా వార్డ్ లో వున్న కొన్ని బుక్స్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. పిల్లల కోసం Wikijunior మరియు రకరకాల వంటల కోసం Cookbook అని ప్రత్యేక లింకులున్నాయి. వికీబుక్స్ లో 36000 పైగా పేజీలున్నాయి. వికీపీడియా లో లాగా ఎడిట్ మరియు సొంత బుక్స్ కూడా ప్రారంభించవచ్చు.
వెబ్ సైట్ : వికీబుక్స్

ధన్యవాదాలు

Wednesday, March 3, 2010

BSNL 3G మొబైల్ సర్వీసెస్ నేడే ప్రారంభం...

BSNL ఆంధ్రప్రదేశ్ లో తమ 3G మొబైల్ సర్వీసెస్ ఈ రోజు ప్రారంభిస్తుంది. 3G లో BSNL అందిస్తున్న సర్వీసులు:
1. Video Calling
2. Broadband Connectivity
3. Mobile TV
4. Video Downloads
5. Music Downloads
6. Video Conferencing
7. Online Gaming

SIM మరియు యాక్టివేషన్ కొరకు Rs.59/- చెల్లించాలి. 2G వాడుతున్న వినియోగదారులు 3G కి మారే సదుపాయం కలదు, ఎటువంటి చార్జీలు లేకుండా 2G SIM నే వాడుకోవచ్చు లేదంటే ఎక్కువ మెమొరీ కోసం 3G SIM కావాలంటే కనుక Rs.59/- చెల్లించాలి. 2G ఎకౌంట్ లో కనుక బ్యాలన్స్ వుంటే అది 3G కి క్యారీ ఫార్వార్డ్ చెయ్యబడుతుంది.

టారిఫ్ ప్లాన్లు:

౧. ఫ్రీపెయిడ్ కోసం ఇక్కడ చూడండి.
౨. పోస్ట్ పెయిడ్ కోసం ఇక్కడ చూడండి.
౩. డాటా కోసం ఇక్కడ చూడండి.
౪. మొబైల్ టీవీ కోసం ఇక్కడ చూడండి.

కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, మన దగ్గర వున్న పోన్ 3G ఎనేబుల్డ్ అయి వుండాలి.

అంతా బాగానే వుంది అసలు 3G అంటే ఎమిటి అని సందేహం ఇప్పుడు రావచ్చు, కొన్ని నెలల క్రితం 3G పై నేను చేసిన పోస్ట్ ని ఇక్కడ యిస్తున్నాను:

ఏంటీ 3జీ?

3జీ అంటే సంక్షిప్తనామంతో అందరికీ పరిచయమైన దీని పూర్తి పేరు ’థర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ’. వేగంగా సమాచార మార్పిడి చేసుకొనేలా ఈ మొబైల్ నెట్ వర్క్ ని రూపొందించారు. ప్రస్తుతం వాడుతున్న 2G, 2.5G ల్లో 64-144 Kbps వేగంతో మాత్రమే డాటాని మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా రూపొందించిందే ఈ 3జీ.

అరచేతిలో టీవీ!
సినిమాలు, పాటలు, వార్తలు ...ఇలా వీడియో ఫైల్స్ ఏవైనప్పటికీ చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ రిజల్యూషన్ తో కూడిన మొబైల్ టీవీ ఫ్రోగ్రంలను వీడియో స్ట్రీమింగ్ ఛానల్స్ ద్వారా వీక్షించవచ్చు. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. ఫ్రస్తుతం మనం వినియోగిస్తున్న 2జీ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో ఏ విధంగా వినియోగించగలిగామో వీడియో ఫైల్స్ ని ౩జీ లో అంతే సులువుగా యాక్సెస్ చేసుకొనేలా ఈ నెట్ వర్క్ ని రూపొందించారు. డిజిటల్ వీడియో బ్రాడ్ క్యాస్టింగ్ - హ్యండ్ హోల్డ్ (DVB-H) ద్వారా ఆన్ లైన్ లో వీక్షించే ప్రోగ్రాంలను అతి తక్కువ సమయంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కనిపిస్తూ మట్లాడవచ్చు:
వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్ లో ఆన్ లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్ లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నే ’వీడియో కాలింగ్’ పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. దీనికోసం ఫోన్ కు ముందు భాగంలో కెమేరాను ఏర్పాటు చేసిన 3జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు.

మరికొన్ని:
౧.మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది.
౨.కంప్యూటర్ లోమాదిరిగా ఇంటర్నెట్ బ్రౌసింగ్ పూర్తిస్థాయిలో చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్ తో కూడిన ఎటాచ్ మెంట్లతో ఈ-మెయిల్స్ ని ఎలాంటి ఆలస్యం లేకుండా పంపేయచ్చు.
౩.వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇరువురి మొబైల్ 3జీ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం.
౪.ఇక వీడియో గేమ్ ల విషయానికొస్తే సైట్ ఏదైనప్పటికీ ఆన్ లైన్ గేమ్ లను అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్ లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.
౫.పోలీసు, రక్షణ వ్యవస్థలు ఈ నెట్ వర్క్ ద్వారా సీసీటీవీ లను యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు.
౬.మొబైల్ టూరిజం, మొబైల్ వాణిజ్యం, ఈ-లెర్నింగ్, స్టాక్ ఎక్స్చేంజ్, టెలీ మెడిసిన్, మొబైల్ వాణిజ్య ప్రకటనలు విస్త్రుతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల్ని పొందాలంటే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న GPRS సేవలకంటే ఎక్కువ ఛార్జ్ అవకాశముందని అంచనా.
౭.దేశంలో ౩జీ సదుపాయమున్న ఫోన్ లు రూ.12000 నుంచి రూ.50000 ధరల మధ్య అందుబాటులో వున్నాయి.


౩జీ నెట్ వర్క్ సర్వీస్ మొదటి సారిగా వ్యాపారాత్మకంగా అందుబాటులో కి తెచ్చిన ఘనత జప్పన్ కే దక్కుతుంది. నేటికి ప్రపంచ వ్యాప్తంగా 25 దేసాల్లో ఈ నెట్ వర్క్ విస్తరించింది.అయితే ఈ ౩జీ కంటే ముందు 1G, 2G, 2.5G, 2.75G అంటూ నాలుగు జెనెరేషన్లు వున్నాయి. మొదటి జెనెరేషన్ ఫోన్ గురించి చెప్పాలంటే అదో ఎనలాగ్ మొబైల్ ఫోన్ . 1980 ల్లో ఈ రకం ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడుతూ వీటితో సంభాషించేవారు. ఉదాహరణగా వాకీటాకీ లను చెప్పుకోవచ్చు. తర్వాత వీటి స్థానాన్నే 2Gలు ఆక్రమించాయి. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ లో డిజిటల్ యుగం దీనితో మొదలైంది. ఇదే టెక్నాలజీ 2.5G, 2.75Gలుగా మార్పు చెందుతూ నేటికి 3G కి చేరింది.

ధన్యవాదాలు

Tuesday, March 2, 2010

Income Tax డిపార్ట్ మెంట్ పేరుతో వచ్చే నకిలీ ఈ-మెయిళ్ళను నమ్మవద్దు...

Income Tax డిపార్ట్ మెంట్ ఇటీవల ఇక హెచ్చరికను జారీ చేసింది... అదేమిటంటే టాక్స్ రిఫండ్ చేస్తాం మీ క్రెడిట్ కార్డ్ వివరాలు తెలపండీ అంటూ వచ్చే ఈ-మెయిళ్ళను నమ్మవద్దని. ఐటీ డిపార్ట్ మెంట్ టాక్స్ రిఫండ్ల విషయంలో ఎటువంటి మెయిల్స్ పంపదని మరియు టాక్స్ పేయర్స్ నుండి క్రెడిట్ కార్డ్ వివరాలు కోరదనీ స్పష్టం చేసింది. టాక్స్ రిఫండ్ల పేరుతో ఐటీ డిపార్ట్ మెంట్ పంపినట్లుగా మచ్చే ఈ-మెయిల్స్ కి రిప్లై యివ్వకుండా జాగ్రత్తగా వుండాలని సూచించింది. ఈ విషయంలో టాక్స్ పేయర్స్ తో పూర్తి భాద్యత అని తెలిపింది.పూర్తి సమాచారం కోసం Income Tax డిపార్ట్ మెంట్ సైట్ ని చూడండి.

ధన్యవాదాలు