Tuesday, June 30, 2009

APSRTC ఆన్ లైన్ రిజర్వేషన్

ఎట్టకేలకి APSRTC కుడా ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పించింది. ఈ విషయంలో మనకన్నా KSRTC ఒక అడుగు ముందే వుంది. APSRTC ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ కొరకు http://www.apsrtc.in/ సైట్ కి వెళ్ళాలి లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది New User పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ప్రస్తుతానికి సర్వర్ పై లోడ్ తగ్గించటానికి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే రిజిర్వేషన్ చేసుకొనే వీలు కల్పిస్తున్నారు. అయినా కాని ఒక్కొక్క సారి Server is busy. Please try after sometime...sorry for the inconvenience అనే మెసేజ్ దర్శనమిస్తుంది. ఇంకా బాలారిష్టాలనుండి బయట పడటానికి కొంత సమయం పట్టవచ్చు. అయినా ఇది ఒక మంచి పరిణామం.ధన్యవాదాలు

BSNL GPRS సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ చెయ్యటం ఎలా?

మీరు BSNL - CellOne కస్టమర్లు అయ్యి, మీ మొబైల్ ఫోన్ లో General Packet Radio Service (GPRS) సదుపాయం వుంటే కనుక దానిని ఎలా కాన్ఫిగరేషన్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం:

౧.GPRS యాక్టివేషన్:

ముందుగా GPRS యాక్టివేషన్ కోసం మీ మొబైల్ ఫోన్ నుండి ప్రీపెయిడ్ కస్టమర్లు GPRSPRE అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి అదే పోస్ట్ పెయిడ్ అయితే GPRS49 లేదా GPRS123 (ఇక్కడ 49 లేదా 123 ఇవి పోస్ట్ పెయిడ్ ప్లాన్స్) అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి.

౨. GPRS సెట్టింగ్స్ డౌన్లోడ్:

24 గంటల్లో GPRS యాక్టివేట్ చెయ్యబడుతుంది. తర్వాత సెట్టింగ్స్ డౌన్లోడ్ కోసం Mobile Make ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి MobileModelno ఎంటర్ చేసి 58355 కి SMS పంపాలి. ఉదాహరణకి మీరు SAMSUNG mobile make మరియు E1410 MobileModelno వాడుతుంటే కనుక SAMSUNG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి E1410 అని టైప్ చేసి 58355 కి SMS పంపాలి.

౩. GPRS సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్:
సెట్టింగ్స్ మొబైల్ ఫోన్ కి డౌన్లోడ్ అయిన తర్వాత వాటిని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఆ సమయంలో సెక్యూరిటీ PIN అడుగుతుంది అక్కడ 1111 ఎంటర్ చెయ్యాలి.

అంతే మీ మొబైల్ ఫోన్ లో GPRS కాన్ఫిగర్ చెయ్యబడింది. ఇంటర్నెట్ చూసుకోవచ్చు, MMS లు కూడా పంపుకోవచ్చు. GPRS యాక్టివేషన్ ఉచితం.

GPRS డీయాక్టివేట్ చెయ్యటానికి:

౧.ప్రీ పెయిడ్ కస్టమర్లు GPRSDE అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి.
౨.పోస్ట్ పెయిడ్ కస్టమర్లు GPRSDC అని టైప్ చేసి 53733 కి SMS పంపాలి.

ధన్యవాదాలు

రాజశ్రీ.కామ్ - Enjoy films.... free


ప్రేమ పావురాలు, ప్రేమాలయం తదితర సూపర్ హిట్ కుటుంబ కధా చిత్రాలను రూపొందించిన రాజశ్రీ సంస్థ ఇప్పుడు తమ వెబ్ సైట్ లో భారతీయ చిత్రాలను ఉచితంగా చూసే అవకాశాన్ని కల్పించింది. దాని కోసం రాజశ్రీ వారి వెబ్ సైట్ http://www.rajshri.com/ ని సందర్శించండి, ఈ సైట్ లో హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ తదితర భాషల చిత్రాలతో పాటు పాటలు, వీడీయోలు , సీన్లు మొదలగునవి ఆన్ లైన్ లో చూసే అవకాశం వుంది కానీ డౌన్లోడ్ చెయ్యలేము. ఆన్ లైన్ లో సినిమాలు చూడాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
తెలుగు సినిమాలు చూడటానికి డైరెక్ట్ లింక్: http://www.rajshritelugu.com/ .


ధన్యవాదాలు

Thursday, June 25, 2009

హార్డ్ డిస్క్ లోని ఖాళీ ఫోల్డర్లను తొలగించటానికి ఉచిత టూల్స్

హార్డ్ డిస్క్ లోని ఖాళీ ఫోల్డర్లను తొలగించటానికి ఉచిత టూల్స్:

౧. Remove Empty Directories (RED):

RED searches and deletes empty directories recursively below a given start folder and shows the result in a well arranged tree. Further you can create some custom rules for keeping and deleting folders. Empty files in directories can also be ignored. Just try RED to see the other features - no registry keys or system files will be touched.Microsoft .NET Framework 2.0 అవసరం.

౨. Fast Empty Folder Finder:

With Fast Empty Folder Finder you can quickly scan for empty folders, preview them, and delete them. The built in preview method allows you to instantaneously see what is in the folder so you never delete anything you don't want by accident.
౩. ఖాళీ ఫోల్డర్లను తొలగించటానికి ఉపయోగపడే మరో టూల్ DelEmpty.

ధన్యవాదాలు

'Not Responding' ప్రోగ్రాములను టెర్మినేట్ (అంతం) చెయ్యండిలా....

విండోస్ యూజర్లకి పరిచయమున్న మెసేజ్ ’Not Responding'... ఏదైనా ప్రోగ్రాములు రన్ చేస్తున్నప్పుడు అవి రెస్పాండ్ కావటానికి ఎక్కువ సమయం పట్టినప్పుడు ’Not Responding' అనే మెసేజ్ వస్తుంది, అప్పుడు అది ఏ కమాండ్లను తీసుకోదు, దానంతట అదే ఓపెన్ అవ్వటమో లేదా క్లోజ్ అవ్వటమో జరుగుతుంది. ఇది కొద్దిగా చిరాకు తెప్పించే మెసేజ్... అలాంటప్పుడు Task Manager కి వెళ్ళి సరైన ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకొని దానిని ’End Process' చేస్తాము. అలాకాకుండా డెస్క్ టాప్ పై క్రింద చెప్పిన విధంగా ఒక ఐకాన్ క్రియేట్ చేసుకుంటే అదే ఆటోమాటిక్ గా రెస్పాండ్ కాని ప్రాసెస్ లను కనుగొని ఆ ప్రాసెస్ ని అంతం చేస్తుంది.

౧. ముందుగా Desktop పై రైట్ క్లిక్ చేసి New ---> Shortcut పై క్లిక్ చెయ్యాలి.

౨. ఓపెన్ అయిన Create Shortcut విండోలో Type the location of the item: దగ్గర ఈ విధంగా taskkill.exe /f /fi “status eq not responding” టైప్ లేదా దీనినే కాపీ చేసి పేస్ట్ చెయ్యాలి.౩. తర్వాత ’Next' బటన్ పై క్లిక్ చేసి Shortcut కి ఒక పేరు పెట్టుకొని ’Finish' బటన్ క్లిక్ చెయ్యాలి. అంతే షార్ట్ కట్ రెడీ...ఇక ఎప్పుడైనా ’Not Responding' అని వస్తే దానిని క్లోజ్ చెయ్యటానికి ఈ షార్ట్ కట్ ని ఉపయోగించవచ్చు.

ఈ చిట్కా Windows XP Professional, అన్ని Windows Vista versions మరియు Windows 7 లలో పనిచేస్తుంది కాని XP Home Edition లో పని చేయదు.

Windows XP Home Edition లో ’Not Responding' ప్రోగ్రాములను అంతం చెయ్యటానికి ఈ క్రింది విధంగా చెయ్యండి:

౧. Notepad ఓపెన్ చేసి క్రింద యివ్వబడిన కోడ్ ని కాపీ చెయ్యాలి:

@echo off
taskkill.exe /f /fi “status eq not responding”
exit

౨. నోట్ పాడ్ ఫైల్ ని File ---> Save కి వెళ్ళి Taskkill.bat ఫైల్ గా సేవ్ చేసుకోవాలి. బ్యాచ్ ఫైల్ క్రియేట్ అవుతుంది, దీనిని ఊపయోగించి Windows XP Home Edition లో ’Not Responding' ప్రోగ్రాములను అంతం చెయ్యవచ్చు.

ధన్యవాదాలు

Wednesday, June 24, 2009

Free Nokia Video Converter - ప్రముఖ వీడియో ఫార్మేట్లను నోకియా సపోర్టెడ్ వీడియో ఫార్మేట్లగా మార్చటానికి ...

3GP మరియు MPEG-4 వీడియోలను నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు. Free Nokia Video Converter అనే వీడియో కన్వర్టర్ ని ఉపయోగించి ప్రముఖ వీడియో ఫార్మేట్లైన AVI, MPG(MPEG), WMV, MP4, MOV, VOB, ASF, RM, RMVB, 3GP, 3G2, M4V, DAT, MKV, M4V, TS, H.264/MPEG-4 AVC(*.mp4), MPEG2 HD Video (*.mpg; *.mpeg), MPEG-4 TS HD Video(*.ts), MPEG-2 TS HD Video (*.ts), Quick Time HD Video (*.mov), WMV HD Video(*.xwmv), Audio-Video Interleaved HD Video (*.avi), DV, NUT, YUV లను 3GP మరియు MPEG-4 వీడియోలుగా మార్చుకొని దాదాపు అన్ని నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు.మరింత సమాచారం కోసం Free Nokia Video Converter సైట్ ని సందర్శించండి.

డౌన్లోడ్ : Free Nokia Video Converter

ఇతర Free video converter programs కోసం http://www.aneesoft.com/win-products.html సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Monday, June 22, 2009

SKTimeStamp - ఫైల్ క్రియేషన్ డేట్స్ మార్చటానికి...

ఏదైనా ఫైల్ యొక్క Created, Modified మరియు Accessed ల timestamp లను మార్చటానికి SKTimeStamp అనే ఎక్స్ ప్లోరర్ యాడ్-ఆన్ ఉపయోగపడుతుంది. ముందుగా SKTimeStamp ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. తర్వాత Created, Modified మరియు Accessed ల timestamp లను మార్చవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకొని దానిపై రైట్ క్లిక్ చేసి ’Properties' సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ ప్రోపర్టీస్ లో ’TimeStamps' టాబ్ పై క్లిక్ చెయ్యాలి. డ్రాప్ డౌన్ యారో ఉపయోగించి డేట్ మార్చవచ్చు అలాగే అప్ అండ్ డౌన్ యారో లను ఉపయోగించి సమయాన్ని కూడా మార్చుకోవచ్చు. ముందుగా ’Apply' తర్వాత ’Ok' బటన్ పై క్లిక్ చేసి మార్పులను సేవ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు అదే ఫైల్ పై రైట్ క్లిక్ చేసి ’Properties' కి వెళ్ళి మారిన తారీఖు లను చూడవచ్చు. ఫైల్ ప్రోపర్టీస్ లో ’TimeStamps' టాబ్ పై క్లిక్ అక్కడవున్న ’Touch' బటన్ పై క్లిక్ చేస్తే 'Last Modified:' అప్పటి (current) తారీఖు మరియు సమయానికి మార్చబడుతుంది.

ధన్యవాదాలు

Fast Duplicate File Finder - సిస్టం లోని డూప్లికేట్ ఫైళ్ళను కనుక్కోవటానికి...

స్టాండ్ ఎలోన్ సిస్టం లేదా నెట్ వర్క్ లోని ఏదైనా సిస్టం లో డూప్లికేట్ ఫైళ్ళను కనుక్కోవటానికి... Fast Duplicate File Finder అనే చిన్న అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఫైల్ డౌన్లోడ్ సైజ్ 1.53 మాత్రమే. ఈ పోగ్రామ్ డౌన్లోడ్ చేసి... ఇనస్టలేషన్ చేసి ... రన్ చేస్తే మెయిన్ విండో ఈ క్రింది విధంగా వుంటుంది:
ఏ ఫోల్డర్ లో అయితే డూప్లికేట్ ఫైళ్ళను వెతకాలనుకుంటున్నామో ... మెయిన్ విండోలోని ’Add Folder' బటన్ పై క్లిక్ చేసి ఆ ఫోల్డర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకటి కంటే ఎక్కువ ఫోల్డర్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. అవసరం లేని ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకొని ’Remove Folder' బటన్ పై క్లిక్ చేసి దానిని తొలగించవచ్చు.

ఇప్పుడు ’Start Scan' బటన్ ప్రెస్ చెయ్యాలి. సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్లు స్కాన్ చేసి డూప్లికేట్ ఫైళ్ళ లిస్ట్ వస్తుంది. ఆటోమాటిక్ గా డూప్లికేట్ ఫైళ్ళు చెక్ చెయ్యబడి వుంటాయి లేదంటే ’Auto Check' బటన్ పై క్లిక్ చేసి డూప్లికేట్ ఫైళ్ళను తెలుసుకోవచ్చు. check చెయ్యబడిన ఫైళ్ళను వేరొక చోటికి మూవ్ చెయ్యటం లేదా డిలీట్ చెయ్యవచ్చు.

మరింత సమాచారం మరియు ట్యుటోరియల్ కోసం Fast Duplicate File Finder సైట్ ని సందర్సించండి.

ఈ అప్లికేషన్ Windows 98 నుండి Windows 7 వరకు అన్నిటిలో పని చేస్తుంది.ధన్యవాదాలు

Monday, June 15, 2009

FreeRapid Downloader - నాన్ ప్రీమియం Rapidshare యూజర్లకోసం డౌన్ లోడ్ మేనేజర్

Rapidshare మరియు యితర ఫైల్ షేరింగ్ సర్వీసెస్ నుండి ఫ్రీ యూజర్ గా డౌన్ లోడ్ చెయ్యటానికి FreeRapid Downloader అనే జావా డౌన్ లోడర్ బాగా ఉపయోగపడుతుంది. బ్రౌజర్ నుండి డౌన్లోడ్ లింక్ ని కాపీ చేసి FreeRapid లో పేస్ట్ చెయ్యాలి...అంతే మిగతాది FreeRapid చూసుకుంటుంది...Main Features:

- support for concurrent downloading from multiple services
- downloading using proxy list
- download history
- smart clipboard monitoring
- automatic checking for file's existence on server
- auto shutdown options
- automatic plugins updates
- simple CAPTCHA recognition
- works on MS Windows, Linux and MacOS
- easy to use
- multilanguage interface
- looks amazingly
- simply works!

ఈ అప్లికేషన్ ని రన్ చెయ్యటానికి SUN JAVA అవసరమవుతుంది.

డౌన్లోడ్: FreeRapid

ధన్యవాదాలు

Excel లో డబల్ క్లిక్ ట్రిక్స్ ...

Microsoft Excel లో వేగంగా పని చెయ్యటానికి డబల్ క్లిక్ ట్రిక్స్ గురించి తెలుసుకుందాం...

౧. Excel ని క్లోజ్ చెయ్యటానికి ఆఫీస్ బటన్/ఎక్సెల్ లోగో పై డబల్ క్లిక్ చెయ్యాలి. ఒక వేళ వర్క్ బుక్ సేవ్ చెయ్యకపోతే ’Do you want to save ....' డైలాగ్ ఓపెన్ అవుతుంది. సేవ్ చెయ్యాలంటే ’YES' లేదంటే ’NO' బటన్ పై క్లిక్ చెయ్యాలి.౨. Column Width లను cell లో వున్న టెక్స్ట్ కు adjust చెయ్యటానికి కావలసిన column ని సెలెక్ట్ చేసుకొని column separator పై డబల్ క్లిక్ చెయ్యాలి. అదేవిధంగా Row Width కూడా adjust చేసుకోవచ్చు.౩.వరుసక్రమం లో వున్న Cells లో ఫార్ములాలు, ఆటో ఫిల్స్ (డేట్, సీరియల్ నంబర్లు మొదలగునవి)చెయ్యటానికి మొదటి cell లో ఫార్ములా ఎంటర్ చేసి ఆ సెల్ ని సెలెక్ట్ చేసుకొని దాని మూలన (Cornor) డబల్ క్లిక్ చేస్తే ఆ సెల్ లోని ఫార్ములా క్రిందవున్న అన్ని సెల్స్ కి కాపీ చెయ్యబడుతుంది. అదేవిధంగా సీరియల్ నంబర్లు వరుసగా కావాలంటే మొదటి సెల్ లో నంబరు 1, రెండవ సెల్ లో నంబరు 2 ఎంటర్ చేసి ఆ రెండు సెల్స్ ని సెలెక్ట్ చేసుకొని కార్నర్ లో డబల్ క్లిక్ చేస్తే నంబర్లు వరుసగా 1,2,3,4... వస్తాయి.౪. ఒక టేబుల్ లో ఒక cell ని సెలెక్ట్ చేసుకొని దాని బోర్డర్ పై కావల్సిన డైరెక్షన్ లో కిక్ చేస్తే ఆ టేబుల్ లోని చివరి సెల్ కి వెళతాము. ఉదాహరణకి ఒక టేబుల్ లో ఒక Column లో చివరి సెల్ కి వెళ్ళాలంటే ఒక సెల్ ని సెలెక్ట్ చేసుకొని దాని బోర్డర్ పై క్రింద ప్రక్క డబల్ క్లిక్ చెయ్యాలి, అదే Row లో అయితే సెలెక్ట్ చేసుకొన్న సెల్ బోర్డర్ కుడి చేతి ప్రక్క డబల్ క్లిక్ చెయ్యాలి.౫. రిబ్బన్ మెనూ లోని ఐకాన్లన్నీ ఒకే లైన్ లో రావటానికి దాని పై డబల్ క్లిక్ చెయ్యాలి.

౭. ఒక Cell లోని ఫార్ములాని లేదా ఫార్మేట్ Format Painter (బ్రష్) ఉపయోగించి యితర సెల్స్ లో కూడా అలాగే కాపీ చెయ్యాలంటే ఫార్ములా వున్న సెల్ ని సెలెక్ట్ చేసుకుని Format Painter పై డబల్ క్లిక్ చేసి కావల్సిన సెల్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.ధన్యవాదాలు

Friday, June 12, 2009

మైక్రోసాప్ట్ నుండి ఉచిత యాంటీవైరస్ సాప్ట్ వేర్ ...


Windows 7, Vista మరియు XP SP3 యూజర్ల కోసం మైక్రోసాప్ట్ త్వరలో ఉచిత యాంటీవైరస్ సాప్ట్ వేర్ విడుదల చెయ్యనుంది...దాని కోడ్ నేమ్:Morro. దీని గురించి మైక్రోసాప్ట్ నవంబర్ ౨౦౦౮ లో ప్రకటించింది. ఖచ్చితమైన రిలీజ్ తేదీ చెప్పకపోయినా త్వరలోనే Morro మన ముందుకు రావచ్చు. ఈ యాంటీ వైరస్ తో వైరస్, మాల్వేర్, స్పైవేర్, రూట్ కిట్స్ మరియు ట్రోజన్ల నుండి సిస్టం కి రక్షణ కల్పించవచ్చు. Windows Live OneCare ని ఇది రీప్లేస్ చెయ్యవచ్చు. ఎందుకంటే Windows Live OneCare ని ఈ నెలాఖరినుండి డిస్కంటిన్యూ చేస్తున్నారు.


మరింత సమాచారం కోసం మైక్రోసాప్ట్ సైట్ ని సందర్శించండి .

ధన్యవాదాలు

LiberKey - USB డ్రైవ్ ల కోసం 200 పైగా పోర్టబుల్ అప్లికేషన్లు


LiberKey - పోర్టబుల్ అప్లికేషన్ల సమాహారం... LiberKey లో ఆడియో, సీడీ-డీవీడీ బర్నింగ్, ఫైల్ మేనేజ్మెంట్, ఫోటో ఎడిటింగ్, ఇంటర్నెట్, నెట్ వర్కింగ్, ఆఫీస్, సెక్యూరిటీ, సిస్టం యుటిలిటీస్, వీడియో మొదలగు వాటికి సంబంధించిన సాప్ట్ వేర్లు వుంటాయి.

LiberKey - LiberKey Ultimate, LiberKey Standard, LiberKey Basic అని మూడు రకాలగా దొరుకుతుంది.
LiberKey Basic లో 28 అప్లికేషన్లు వుంటాయి సెటప్ సైజ్ 56 MB
LiberKey Standard లో 106 అప్లికేషన్లు వుంటాయి సెటప్ సైజ్ 144 MB
LiberKey Ultimate లో 202 అప్లికేషన్లు వుంటాయి సెటప్ సైజ్ 197 MB


LiberKey ఒక ఉపయోగకరమైన సాప్ట్ వేర్ అని చెప్పవచ్చు.

ధన్యవాదాలు

Thursday, June 11, 2009

యాడ్-ఆన్స్ కొరకు ఫైర్ ఫాక్స్ వెబ్ సైట్


ఫైర్ ఫాక్స్ యాడ్-ఆన్స్ కొరకు Add-ons for Firefox వెబ్ సైట్ ని సందర్శించండి. ఈ సైట్ లో యాడ్-ఆన్ లను వివిధ క్యాటగిరీల్లో వుంచారు, కావలసిన క్యాటగిరీకి వెళ్ళి కావలసిన యాడ్-ఆన్ ని ఫైర్ ఫాక్స్ కి జత చేసుకోవచ్చు. ఇక్కడ లభించే యాడ్-ఆన్ లను ఉపయోగించి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ని మీ అవసరాలకు తగినట్లుగా మలచుకోవచ్చు. వీటి ఇనస్టలేషన్ కూడా చాలా సులువు.

అలానే Editor Picks, పాపులర్ మరియు మోస్ట్ పాపులర్ యాడ్-ఆన్ లను Collections గా ఒకే చోటవుంచారు. మీ స్వంత కలెక్షన్ కూడా క్రియేట్ చేసుకొనే సదుపాయం కలదు.

ఫైర్ ఫాక్స్ యాడ్-ఆన్ లు మరియు Mozilla గురించి Mozilla Blog http://blog.mozilla.com/ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Wednesday, June 10, 2009

NasBackup - the powerful rsync backup utility

NasBackup is an open source backup solution. It is a high-performance, enterprise-grade system for backing up MS Windows desktop PCs, laptops and servers to network disks. NasBackup is a highly configurable solution and easy to install and maintain.

NasBackup is a backup solution that can replace traditional tape backup. The information is backed up to network storage using the rsync utility in a way that only the file differences are sent over the network.For Features of this utility http://www.nasbackup.com/wiki/Features click here.

Download: NasBackupThank you,

Tuesday, June 9, 2009

యాపిల్ వారి సఫారీ 4 వెబ్ బ్రౌజర్ - the world's fastest web browser

యాపిల్ సఫారీ 4 వెబ్ బ్రౌజర్ విడుదల చేసింది . సఫారీ world's fastest web browser అని చెప్తున్నారు.
సఫారీ ఫీచర్లు:

౧. Top Sites:
Safari 4 tracks the sites you browse and ranks your favorites, presenting up to 24 thumbnails on a single page.
౨.Cover Flow:
Cover Flow offers a highly visual way of reviewing your site history and bookmarked sites, presenting full-page previews of the websites that look exactly as they did when you last visited them.
౩.Full History Search:
Easily retrieve sites you have seen before. Spot the one you want in cover flow.
౪.Nitro Engine:
Wait less, browse more. Surf the web with world's fastest web browser.
౫. Windows Native Look and Feel:
Windows Vista or Windows XP users: feel right at home in safari for windows.
౬.Developer Tools:
Access the best suit of development tools ever included in a browser.

మరిన్ని ఫీచర్లు మరియు వివరాల కోసం http://www.apple.com/safari/whats-new.html లో చూడండి.

డౌన్లోడ్: సఫారీ
ధన్యవాదాలు

Monday, June 8, 2009

Windows Hider - ఓపెన్ అయి వున్న విండోస్ ని వేగంగా దాచి పెట్టటానికి మరియు కిల్ చెయ్యటానికి....

మీరు ఇంటర్నెట్ లో మీకు నచ్చిన సైట్లు చూస్తున్నారు లేదా గేమ్స్ ఆడుతున్నారు... ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరి కంటా పడకుండా ఆ విండోలను త్వరగా దాచి పెట్టాలన్నా లేదా వాటిని కిల్ చెయ్యాలన్నా ... దానికి ఒక ఉపాయం వుంది...అదే Windows Hider ...ఈ చిన్న మరియు ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి ప్రాసెసెస్ కి మీకు సులువుగా వుండే షార్ట్ కట్ కీలను పెట్టి వాటిని హైడ్ లేదా కిల్ చెయ్యవచ్చు.’Add' బటన్ పై క్లిక్ చేస్తే ఓపెన్ అయ్యే ’Add New Process' విండోలో కుడి చేతి ప్రక్కవున్న ఐకాన్ ని మౌస్ తో డ్రాగ్ చేసి కావలసిన విండో టాప్ పై వుంచితే దాని ప్రాసెస్ మరియు టైటిల్ ఆటోమాటిక్ గా అక్కడ వస్తాయి. తర్వాత ’OK' బటన్ పై ప్రెస్ చెయ్యాలి. అంతే ప్రాసెస్ యాడ్ చెయ్యబడుతుంది. ’Edit' బటన్ ను ఉపయోగించి ఎడిట్ చేసుకోవచ్చు.కావల్సిన ప్రాసెస్ ని సెలెక్ట్ చేసుకొని ’Hide' లేదా ’Show' బటన్లను ఉపయోగించి దాచిపెట్టవచ్చు లేదా దాచిపెట్టిన వాటిని తిరిగి పొందవచ్చు.

లేదంటే మీ సొంత షార్ట్ కట్ కీ లు ఉపయోగించి హైడ్ లేదా కిల్ చెయ్యాలంటే ...ముందుగా ప్రాసెస్ సెలెక్ట్ చేసుకొని ’Settings' బటన్ పై క్లిక్ చెయ్యాలి ...ఓపెన్ అయిన సెట్టింగ్స్ విండోలో మీకు నచ్చిన కీ లను మరియు వాటి కాంబినేషన్లను ప్రెస్ చేస్తే ఆటోమాటిక్ గా అక్కడ వస్తాయి.ఇంకెందుకు ఆలశ్యం Windows Hider డౌన్లోడ్ చేసుకోండి మీ బాస్ కంట పడకుండా మీ నచ్చిన ప్రోగ్రాములు రన్ చెయ్యండి.

ధన్యవాదాలు

Friday, June 5, 2009

TeraCopy తో మీ ఫైళ్ళను వేగంగా మరియు సులభంగా కాపీ చెయ్యండి...

TeraCopy విండోస్ లో వుండే ఫైల్ కాపీయింగ్ కి ప్రత్యామ్నాయ ప్రోగ్రాం.. TeraCopy ని ఉపయోగించి ఫైళ్ళను త్వరగా Copy/ Move చెయ్యవచ్చు. ఫైల్ కాపీ ఎర్రర్ వచ్చినప్పుడు దానిని కాపీ చెయ్యటానికి చాలాసార్లు ట్రై చేసి కుదరనప్పుడు ఆ ఫైల్ ని స్కిప్ చేసి మిగిలినవి కాపీ చేస్తుంది. విండోస్ ఫైల్ కాపీయింగ్ లో అలా జరగదు.TeraCopy ఫీచర్లు:
-Copy files faster : TeraCopy uses dynamically adjusted buffers to reduce seek times. Asynchronous copy speeds up file transfer between two physical hard drives.
-Pause and resume file transfers: Pause copy process at any time to free up system resources and continue with a single click.
-Error recovery:In case of copy error, TeraCopy will try several times and in the worse case just skips the file, not terminating the entire transfer।
-Interactive file list: TeraCopy shows failed file transfers and lets you fix the problem and recopy only problem files.
-Shell integration: TeraCopy can completely replace Explorer copy and move functions, allowing you work with files as usual.
-Full Unicode support.


డౌన్లోడ్: TeraCopy

ధన్యవాదాలు

Thursday, June 4, 2009

CPU-Z - CPU సమాచారం తెలుసుకోవటానికి డయాగ్నొస్టిక్ టూల్

CPU-Z అనే చిన్న డయాగ్నొస్టిక్ టూల్ ని ఉపయోగించి మీ CPU సమాచారం తెలుసుకోవచ్చు. ప్రాసెస్సర్ పేరు మరియు వెండర్, కోర్ స్టెప్పింగ్ మరియు ప్రాసెస్, ప్రాసెస్సర్ ప్యాకేజ్, క్లాక్స్, ఓవర్ క్లాక్ డిటెక్షన్, L1 మరియు L2 cache ఇన్ఫర్మేషన్, మదర్ బోర్డ్ చిప్ సెట్ , మోడల్, BIOS, RAM టైప్, సైజ్, టైమింగ్స్ తదితర సమాచారం ఈ టూల్ సహాయం తో తెలుసుకోవచ్చు.ఈ టూల్ ని ఉపయోగించి ఈ క్రింది సమాచారం తెలుసుకోవచ్చు:

CPU:
- Name and number
- Core stepping and process
- Package
- Core voltage
- Internal and external clocks, clock multiplier
- Supported instructions sets
- Cache information
Mainboard:
- Vendor, model and revision
- BIOS model and date
- Chipset (northbridge and southbridge) and sensor
- Graphic interface
Memory :
- Frequency and timings
- Module(s) specification using SPD (Serial Presence Detect) : vendor, serial number, timings table

ధన్యవాదాలు

Tuesday, June 2, 2009

గూగుల్ సెర్చ్ టిప్స్...


ఇంటర్నెట్ లో ఏదైనా విషయం మీద సెర్చ్ చెయ్యాలంటే చాలా మందికి ముందుగా గుర్తు వచ్చే సెర్చ్ ఇంజిన్ .... గూగుల్... గూగుల్ సైట్ కి వెళ్ళి సెర్చ్ బాక్స్ లో వెతక వలసిన విషయం టైప్ చేసి [Enter] బటన్ ప్రెస్ చేస్తాం... ఒక్కొక్కసారి మనకు కావల్సినది తప్ప మిగతావి సెర్చ్ రిజల్ట్ లో వస్తాయి. అలా కాకుండా కొన్ని టిప్స్ పాటిస్తే మనకు కావల్సిన విషయాలను పొందవచ్చు.

౧. Exact phrase సెర్చ్ :

మనకు కావల్సిన విషయం యధాతదంగా కావాలంటే సెర్చ్ చేసే పదాలను డబల్ కోట్స్ లో వుంచాలి. ఉదాహరణకి Internet Marketing గురించి సెర్చ్ చేస్తుంటే ఆ పదాలను(search phrase) "Internet Marketing" ఇలా కోట్స్ లో పెట్టి సెర్చ్ చెయ్యాలి.

౨. Exclude Words:

అనవసరమైన పదాలకు సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రాకుండా ’-’ ఆపరేటర్ ని ఉపయోగించాలి. ఉదాహరణకి Internet Marketing గురించి సెర్చ్ చేస్తుంటే advertising అనే పదానికి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రాకుండా వుండాలంటే Internet Marketing -advertising అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౩. Similar Words and Synonyms:

సెర్చ్ చేసే విషయంలో ఒక పదానికి అదే అర్ధం వచ్చే వేరే పదాలకు సంబంధించిన (పర్యాయ పదాలు) సెర్చ్ రిజల్ట్స్ రావాలంటే ఆ పదానికి Tilde (~) ని జత చెయ్యాలి. ఉదాహరణకి Nutrition గురించి సెర్చ్ చేస్తూ Nutrition, food మరియు Health గురించి కూడా కావాలంటే కనుక ~nutrition అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౪. Asterix Operator:

Asterix Operator(*) దీనిని DOS లో ఎలా ఉపయోగిస్తామో (Dir *.exe) సెర్చ్ లో కూడా అదేవిధంగా ఉపయోగించవచ్చు. ఉదాహరణకి adavanced * cleaner అని టైప్ చేసి సెర్చ్ చేస్తే Adavced Windows CLeaner, Advanced Registry Cleaner, Advanced Disk Cleaner ఇలా రిజల్ట్స్ వస్తాయి.

౫. 'OR' ఆపరేటర్:

సెర్చ్ లో పదాలు ఇది.. లేక ...అది అని సెర్చ్ చెయ్యాలంటే కనుక 'OR' ఆపరేటర్ ని ఉపయోగించాలి. ఉదాహరణకి Internet Marketing లేదా Advertising గురించి సెర్చ్ చెయ్యాలంటే Internet Marketing or Advertising అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౬. Specific Site Search:

కావల్సిన విషయం పలానా సైట్ లో వుందో లేదో సెర్చ్ చెయ్యాలంటే కనుక కావల్సిన పదం టైప్ చేసి site:సైట్ అడ్రస్ ఇచ్చి సెర్చ్ చెయ్యాలి. ఉదాహరణకి bing సెర్చ్ ఇంజిన్ గురించి కంప్యూటర్ ఎరా ఫోరమ్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే bing site:computerera.co.in/forum/ అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౭. Specific file type:

Word, Excel, Power Pont, PDF ఇలా వివిధ ఫైల్ టైప్ కి సంబంధించిన సెర్చ్ రిజల్ట్స్ రావాలంటే కనుక "filetype:" ని ఉపయోగించాలి. filetype:pdf internal architecture అని సెర్చ్ చేస్తే internal architecture సంబంధించిన సెర్చ్ ఫలితాలు వస్తాయి.

౮. Results for a Particular dare range:
"daterange: " ఉపయోగించి రెండు తేదీల మధ్య వున్న సమాచారం సెర్చ్ చెయ్యవచ్చు. తేదీలను జూలియన్ ఫార్మేట్ లో మాత్రమే ఎంటర్ చెయ్యాలి. తేదీలను జూలియన్ ఫార్మేట్ లోకి మార్చటానికి ఆన్ లైన్ కన్వర్టర్లు దొరుకుతాయి. ఉదాహరణకి Web 2.0 గురించి April 16 2000 మరియు April 16 2003 మధ్య సెర్చ్ చెయ్యాలంటే web 2.0 daterange:2451650-2452745 అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౯. Numeric range:

రెండు న్యూమెరిక్ విలువల మధ్య డాటాని సెర్చ్ చెయ్యటానికి ’..’ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి Sony Cybershot Camera లు రూ.11,000 నుండి రూ.25,000 లలోపు వెతకటానికి Sony cybershot 11000..25000 అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౦.Terms in the Title of Webpage:

మన సెర్చ్ చేసే పదం వెబ్ పేజ్ టైటిల్ లో వున్న వాటిని సెర్చ్ చెయ్యటానికి allintitle: ని ఉపయోగించాలి. ఉదాహరణకి వెబ్ పేజ్ రచన అనే పదం సెర్చ్ చెయ్యటానికి allintitle: రచన అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౧. Exact Word:

సాధారణంగా సెర్చ్ ఫలితాలలో పర్యాయపదాలు వస్తుంటాయి..అలా కాకుండా Exact Word కావాలంటే ఆ పదం ముందు ’+’ వుంచాలి. ఉదాహరణకి రచన అనే పదం సెర్చ్ లో కావాలంటే +రచన - The creation అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౨. Terms in URL:

మనం వెతికే పదాలు URL లో వున్న వాటిని సెర్చ్ చెయ్యటానికి inurl: ని ఉపయోగించాలి. ఉదాహరణకి computerera అనే పదం వున్న URL సెర్చ్ చెయ్యటానికి inurl:computerera అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౩. Stock:

కంపెనీల Ticker code ఎంటర్ చేసి ఆ కంపెనీ కి సంబంధించిన స్టాక్ మర్కెట్ వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకి BSE లో Satyam స్టాక్ వివరాలు తెలుసుకోవాలంటే 500376 (ఇది సత్యం టికర్) అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౪. Word Definitions:

కావల్సిన పదాల డెఫినిషన్ తెలుసుకోవటానికి define: ని ఉపయోగించాలి. ఉదాహరణకి Plethora డెఫినిషన్ కోసం define:plethora అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౫. calculator:

గూగుల్ ని Calculator గా కూడా వాడుకోవచ్చు, కావల్సిన expression ఎంటర్ చేసి [Enter] ప్రెస్ చెయ్యాలి. ఉదాహరణకి
45288 ని 1562 తో గుణిస్తే ఎంత వస్తుందో తెలుసుకోవటాని 45288*1562 అని టైప్ చేసి [Enter] ప్రెస్ చెయ్యాలి.

౧౬. Local Time:

వివిధ నగరాల్లో ప్రస్తుత సమయం తెలుసుకోవటాని Time అని టైప్ చేసి ప్రదేశం పేరు ఇచ్చి సెర్చ్ చెయ్యాలి. Beijing లో ప్రస్తుత సమయం తెలుసుకోవటానికి time beijing అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౭. Weather:

వివిధ నగరాల్లోని వాతావరణ వివరాలు తెలుసుకోవటాని weather అని టైప్ చేసి ప్రదేశం పేరు లేదా Zip Code ఎంటర్ చెయ్యాలి. ఉదాహరణకి విజయవాడ లో వాతావరణ వివరాలు తెలుసుకోవటానికి weather vijayawada అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౧౮. Converter:

గూగుల్ ని కన్వర్టర్ గ కూడా ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకి 100 రూపాయలు ఎన్ని US డాలర్లు అని తెలుసుకోవటానికి 100 INR in USD అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి. ఇక్కడ కరెన్సీ నొటేషన్లు తెలిసివుండాలి. ఉదా: 50 yards in feet

౧౯. Movie Times:

ఒక ప్రదేశం లోని సినిమా టైమింగ్స్ తెలుసుకోవటాని movies: అని టైప్ చేసి ప్రదేశం పేరు లేదా Zip Code ఎంటర్ చెయ్యాలి. ఉదాహరణకి విజయవాడ లో సినిమా టైమింగ్స్ తెలుసుకోవటాని movies: Vijayawada అని టైప్ చేసి సెర్చ్ చెయ్యాలి.

౨౦. Track Packages:

Tracking number డైరెక్ట్ గా ఎంటర్ చేసి కొరియర్ ప్రస్తుత స్టేటస్ తెలుసుకోవచ్చు. (దీనిని నేను check చెయ్యలేదు)

౨౧. track Status of flight:

విమానాల రాక పోక ల వివరాల కోసం Flight Number ఎంటర్ చేసి సెర్చ్ కొట్టాలి.


సేకరణ: ఇంటర్నెట్ మరియు సాంకేతిక పత్రికల నుండి..

ధన్యవాదాలు

Monday, June 1, 2009

BING - మైక్రో సాప్ట్ నుండి క్రొత్త సెర్చ్ ఇంజిన్...

BING - మైక్రో సాప్ట్ యొక్క క్రొత్త సెర్చ్ ఇంజిన్... ఇది మైక్రోసాప్ట్ కే చెందిన LIVE SEARCH ని రీప్లేస్ చేస్తుందని చెప్తున్నారు. BING కి సంబంధించిన పూర్తి సమాచారం మరియు దాని ఫీచర్ల కోసం http://www.discoverbing.com/ లో చూడండి.ధన్యవాదాలు