Sunday, December 27, 2009

giveawayoftheday.com - ఖరీదైన సాప్ట్ వేర్ల ను ఉచితంగా పొందటానికి...

giveawayoftheday.com సైట్ లో అన్ని అవసరాలకు ఉపయోగపడే అనేక లైసెన్స్ డు సాప్ట్ వేర్లను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. Give away of the day అంటూ ప్రతిరోజూ అనేక లైసెన్స్ డు సాప్ట్ వేర్లను ఉచితంగా అందిస్తున్నారు. ఉచిత సాప్ట్ వేర్లు ఆ ఒక్కరోజుకు మాత్రమే పరిమితం. పబ్లిసిటీ లో భాగంగా ఖరీదైన సాప్ట్ వేర్ల ను డెవలపర్లు ఉచితంగా యిస్తున్నారు...



giveawayoftheday.com సైట్ నుండి సాప్ట్ వేర్లు డౌన్లోడ్ చేసుకోవటానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ మరియు పరిమితి లేవు.

సైట్: giveawayoftheday.com

ధన్యవాదాలు

Saturday, December 26, 2009

7 Quick Fix 1.0 - విండోస్ 7 లో వచ్చే 21 కామన్ ప్ర్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యటానికి పోర్టబుల్ అప్లికేషన్

ఇంతకుముందు విండోస్ ఎక్స్పీ లో వచ్చే 40 వరకు వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యటానికి XP QuickFix అనే పోర్టబుల్ అప్లికేషన్ ని అందించిన Leelu Soft ఇప్పుడు విండోస్ 7 లో వచ్చే 21 కామన్ ప్రాబ్లమ్స్ ని పిక్స్ చెయ్యటానికి 7 Quick Fix 1.0 అనే పోర్టబుల్ అప్లికేషన్ రూపొందించింది. 7 Quick Fix 1.0 ఇనస్టలేషన్ చెయ్యనవసరం లేదు ఉపయోగించటం కూడా చాలా సులువు.



ప్రతి విండోస్ 7 కంప్యూటర్ లో వుండవలసిన సాప్ట్ వేర్. మరిన్ని వివరాలకు Leelu Soft బ్లాగ్ ని చూడండి.

డౌన్లోడ్: 7 Quick Fix 1.0 (సైజ్: 472 KB)

ధన్యవాదాలు

Tuesday, December 15, 2009

Microsoft Photo Story 3 - డిజిటల్ ఫోటోలను స్లైడ్ షోస్ గా మార్చటానికి ...

మైక్రోసాప్ట్ ఫోటో స్టోరీ 3 ని ఉపయోగించి మన దగ్గర వున్న డిజిటల్ ఫోటోల నుండి అందమైన స్లైడ్ షోస్ తయారుచేసుకోవచ్చు. జెన్యూన్ మైక్రోసాప్ట్ విండోస్ కస్టమర్లు ఫోటో స్టోరీ 3 సాప్ట్ వేర్ ని మైక్రోసాప్ట్ సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ లను ఒకేఒక క్లిక్ తో కలర్ అడ్జస్ట్ మెంట్, రెడ్ ఐ కరెక్షన్, ఎడిట్, రొటేట్ చేసుకోవచ్చు మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా టైటిల్స్, మన వాయిస్ తో ఇమేజ్ నెరేషన్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా జత చెయ్యవచ్చు. చివరగా స్లైడ్ షో ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ ద్వారా యితరులకు పంపే అవకాశం వుంది.




మైక్రోసాప్ట్ ఫోటో స్టోరీ 3 ని ఉపయోగించే విధానం:



సైట్: మైక్రోసాప్ట్ ఫోటో స్టోరీ 3

డౌన్లోడ్: మైక్రోసాప్ట్ ఫోటో స్టోరీ 3

ధన్యవాదాలు

Friday, December 11, 2009

GMER - రూట్ కిట్ డిటెక్టర్ మరియు రిమూవర్

సిస్టం ఫైల్స్ మరియు ప్రాసెస్సెస్ ని టాంపర్ చేసి ఆపరేటింగ్ సిస్టం కంట్రోల్ ని సీజ్ చెయ్యటానికి హ్యాకర్లు రూట్ కిట్ అనే ప్రోగ్రామ్ ని ఉపయోగిస్తారు. సిస్టం లోని రూట్ కిట్ లను కనుగొని వాటిని తొలగించటానికి GMER ఉపయోగపడుతుంది. hidden process, hidden threads, hidden modules, hidden services, hidden files, hidden Alternate Data Streams, hidden registry keys, drivers hooking SSDT, drivers hooking IDT, drivers hooking IRP calls, and inline hooks మొదలగు వాటి కోసం GMER స్కాన్ చేస్తుంది.


GMER runs on Windows NT/W2K/XP/VISTA

డౌన్లోడ్: GMER

Wednesday, December 9, 2009

FixWin - Windows 7/Vista రిపేర్ మరియు ఫిక్స్ చెయ్యటానికి ఉచిత పోర్టబుల్ యుటిలిటీ

ప్రముఖ విండోస్ క్లబ్ వారిచే రూపొందించబడిన FixWin అనే ఉచిత పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి Windows 7 లేదా Vista లో యూజర్లకు కామన్ గా వచ్చే సుమారు 50 ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యవచ్చు. FixWin మన సిస్టం లో ఇనస్టలేషన్ చెయ్యబడిన ఆపరేటింగ్ సిస్టం ను కనుగొని దానికి అనుగుణంగా ఫిక్సెస్ ని చూపిస్తుంది.


50 problems … 1 solution … FixWin is the Windows Doctor all have been waiting for!

మరింత సమాచారం కోసం విండోస్ క్లబ్ సైట్ ని చూడండి.
డౌన్లోడ్: FixWin

ధన్యవాదాలు

Tuesday, December 8, 2009

kngine.com - విప్లవాత్మక సిమాంటిక్ సెర్చ్ ఇంజిన్

Kngine - ఒక వెబ్ 3.0 సెర్చ్ ఇంజిన్. యూజర్ ఇచ్చే సెర్చ్ ఇన్ పుట్స్ కి సంబంధించిన అర్ధవంతమైన మరియు దగ్గరగా వుండే సెర్చ్ ఫలితాలను ఇవ్వటం కోసం రూపొందించబడినది.


kngine గురించి వారి మాటల్లోనే :

Kngine is revolutionary Semantic Search Engine and Question Answer Engine designed to provide meaningful search result, such as: Semantic Information about the keyword/concept, Answer the user’s questions, Discover the relations between the keywords/concepts, and link the different kind of data together, such as: Movies, Subtitles, Photos, Price at sale store, User reviews, and Influenced story.

We working on new indexing technology to unlock meaning; rather than indexing the document in Inverted Index fashion, Kngine tries to understand the documents and the search queries in order to provide meaningful search result.

Kngine వెబ్ సైట్: http://kngine.com/


ధన్యవాదాలు

Friday, December 4, 2009

గూగుల్ Public DNS సెటప్ వీడియో

ఒక వెబ్ సైట్ ని మన బ్రౌజర్ నుండి యాక్సెస్ చెయ్యటానికి, దానికి సంబంధించిన వెబ్ సర్వర్ హోస్ట్ చెయ్యబడిన డొమైన్ యొక్క ఐపి అడ్రస్ అవసరమవుతుంది, ఆ ఐపిని వెతకటం లో Public DNS Server మనకు సహాయపడుతుంది. వెబ్ సర్ఫింగ్ "faster, safer and more reliable" గా వుండటం కోసం గూగుల్ తమ స్వంత Public DNS Service ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. సాధారణంగా DNS Server Address ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) ఇస్తారు, దానిని ప్రత్యామ్నాయంగా గూగుల్ DNS Server IP address యివ్వవచ్చు, అవి 8.8.8.8 మరియు 8.8.4.4, ఇది పూర్తిగా ఉచితం.

Google Public DNS వలన ప్రయోజనాలు:
- Speed up your browsing experience.
- Improve your security.
- Get the results you expect with absolutely no redirection.

Windows XP లో Google DNS ని Setup చెయ్యటానికి వీడియో:



Windows 7 / Vista లో Google DNS ని Setup చెయ్యటానికి వీడియో:



ధన్యవాదాలు

Thursday, December 3, 2009

StartUpLite - కంప్యూటర్ StartUp వేగాన్ని పెంచటానికి ఉచిత అప్లికేషన్

కాలం గడుస్తున్నకొద్దీ మన కంప్యూటర్ లో వివిధ ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసుకొంటూ పోతూ, అనవసరమైనవి తొలగించకుండా వుంటే కనుక కొన్ని అనవసర ప్రోగ్రాములు సిస్టం స్టార్ట్ అప్ లో స్టార్ట్ అయ్యి కంప్యూటర్ Startup ప్రాసెస్ మందగింపచేస్తాయి. సాధారణంగా విండోస్ లో డీఫాల్ట్ గా వుండే msconfig కమాండ్ ని ఉపయోగించి Startup లో అనవసర ప్రోగ్రాములను డిసేబుల్ చేస్తూవుంటాం, అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే msconfig - Startup లో కేవలం ప్రోగ్రాముల పేర్లు మాత్రమే వుంటాయి అవి సిస్టం ప్రోగ్రాములా లేదా యితర అనవసర ప్రోగ్రాములా, దేనిని వుంచాలి లేదా దేనిని తొలగించాలి అని తెలుసుకోవటం కొద్దిగా కష్టం. అయితే StartUpLite అనే సింపుల్ అప్లికేషన్ ని ఉపయోగించి సురక్షితంగా మరియు సమర్ధవంతంగా స్టార్ట్ అప్ లో స్టార్ట్ అయ్యే అనవసర ప్రోగ్రాములను డిసేబుల్ లేదా అనవసర స్టార్ట్ అప్ ఎంట్రీలను తొలగించటం ద్వారా కంప్యూటర్ త్వరగా స్టార్ట్ అవుతుంది. msconfig లో లా కాకుండా ఇక్కడ ప్రతి ఎంట్రీ కి సంబంధించిన క్లుప్త సమాచారం వుంటుంది, దీంతో వుంచవలసిన లేదా తొలగించవలసిన ఎంట్రీలను నిర్ణయించుకోవటం సులభమవుతుంది.




StartUpLite ఒక మంచి స్టార్ట్ అప్ మేనేజర్ అని చెప్పవచ్చు. మరింత సమాచారం కోసం StartUpLite సైట్ ని చూడండి.

డౌన్లోడ్: StartUpLite (సైజ్: 199.70 KB)

ధన్యవాదాలు