Monday, May 31, 2010

Microsoft Joulemeter - పీసీ పవర్ వినియోగాన్ని తెలుసుకోవటానికి...

Microsoft Joulemeter అనే ప్రయోగాత్మక ప్రోగ్రామ్ ని ఉపయోగించి పీసీ Power consumption ని ట్రాక్ చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ ఇనస్టలేషన్ కోసం .Netframework తప్పనిసరి. Joulemeter ని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఐకాన్ సిస్టం ట్రే లో కూర్చుంటుంది, దాని పై క్లిక్ చేస్తే CPU, Disk, Minitor ఎంత పవర్ ని వినియోగిస్తున్నాయో తెలుసుకోవచ్చు, దీంతో పవర్ ని ఆదా చెయ్యలంటే కనుక అవసరమైతే మోనిటర్ ని ఆఫ్ చేసుకోవచ్చు.




మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కోసం మైక్రో సాప్ట్ సైట్ చూడండి.

డౌన్లోడ్: Microsoft Joulemeter (0.76 MB)

ధన్యవాదాలు

Thursday, May 20, 2010

ఈ-బుక్స్ డౌన్లోడ్ కోసం వెబ్ సైట్లు ...

కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్, మేథ్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ మరియు లెక్చర్ నోట్స్ మొదలగు వాటికి సంబంధించిన ఈ-బుక్స్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవటం కోసం ఈ క్రింది వెబ్ సైట్లు చూడండి:



1. Zillr

ధన్యవాదాలు


Wednesday, May 19, 2010

ZEDGE - Free stuff for your phone

క్లోజప్ యాడ్ చూస్తున్నప్పుడు ’దగ్గరగా రా.... దగ్గరగా రా...’ అనే జింగిల్ వస్తుంది, దానినే రింగ్ టోన్ గా మార్చేసుకుంటే బాగుండు అనిపిస్తుందా ... అదే కాదు అలాంటి ఎన్నో జింగిల్స్ ని మీ మొబైల్ పోన్ రింగ్ టోన్స్ గా మార్చాలనుకుంటున్నారా... అయితే ZEDGE సైట్ కి ఒక్కసారి వెళ్ళాల్సిందే ... ఇక్కడ మీ మొబైల్ ఫోన్ కోసం ఉచిత స్టఫ్ చాలానే వుంది. రింగ్ టోన్స్, థీమ్స్, వీడియోస్, గేమ్స్ యిలా ఎన్నో.... డైరెక్ట్ గా మొబైల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే పీసీ లోకి డౌన్లోడ్ చేసుకొని తర్వాత మొబైల్ కి కాపీ చేసుకోవచ్చు. ఈ సైట్ లో వున్న వాటిని డౌన్లోడ్ చేసుకోవటమే కాదు మీ దగ్గర వున్న వాటిని కూడా ఈ సైట్ కి అప్ లోడ్ చెయ్యవచ్చు. ఇవేకాకుండా వాల్ పేపర్, థీమ్, స్క్రీన్ సేవర్ మొదలగునవి తయారుచెయ్యటానికి టూల్స్ కూడా వున్నాయి.




కావలసిన వాటిని సెర్చ్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్ : ZEDGE

ధన్యవాదాలు

Tuesday, May 18, 2010

iSendr - ఆన్ లైన్ లో ఫైల్ ట్రాన్స్ ఫర్ చెయ్యటానికి ...

ఎటువంటి రిజిస్ట్రేషన్ మరియు సర్వర్ కి ఫైల్ అప్ లోడ్ చెయ్యకుండా కావల్సిన ఫైళ్ళను కావలసిన వారికి పంపటానికి iSendr - P2P ఫైల్ ట్రాన్స్ పర్ సైట్ ఉపయోగపడుతుంది.



iSendr సైట్ కి వెళ్ళి ’Send a File' పై క్లిక్ చేసి ట్రాన్స్ ఫర్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ యొక్క peer లింక్ కాపీ చేసుకొని కావలసిన వారికి పంపవచ్చు. ఫైల్ డౌన్లోడ్ కోసం iSendr సైట్ కి వెళ్ళి 'Claim a File' పై క్లిక్ చేసి లింక్ ఎంటర్ చేసి ’Retrieve' పై క్లిక్ చేసి తర్వాత ’Save' పై క్లిక్ చేసి ఫైల్ ని సేవ్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్ : iSendr



ధన్యవాదాలు

Wednesday, May 12, 2010

GMail క్రొత్త ఫీచర్: మెయిల్ లో డ్రాగ్ చేసి ఇమేజ్ ని చొప్పించటానికి...

ఇంతకుముందు జీ మేయిల్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ పధ్ధతిలో అటాచ్ మెంట్లను జత చెయ్యటం గురించి తెలుసుకున్నాం. అలానే ఇప్పుడు ఇమేజ్ లను కూడా డ్రాగ్ చేసి మెయి లో ఇన్సర్ట్ చెయ్యవచ్చు. దీనికోసం ముందుగా మన మెయిల్ ఎకౌంట్ లో లాబ్స్ లో Inserting Images ఫీచర్ ఎనేబుల్ చెయ్యాలి. ఇక ఇప్పుడు డ్రాగ్ చేసి ఇమేజ్ లను ఇన్సర్ట్ చేసుకోవచ్చు.



ప్రస్తుతం ఈ ఫీచర్ క్రోమ్ లో మాత్రమే పని చేస్తుంది, త్వరలోనే మిగతా బ్రౌజర్లలో కూడా పనిచేస్తుందని గూగుల్ చెపుతుంది.

మరింత సమాచారం కోసం గూగుల్ అఫీషియల్ బ్లాగ్ ని చూడండి.

ధన్యవాదాలు

thumba - ఉచిత ఆన్ లైన్ ఇమేజ్ ఎడిటర్

thumba - మైక్రోసాప్ట్ సిల్వర్ లైట్ ఆధారంగా పనిచేసే ఒక బెస్ట్ ఉచిత ఆన్ లైన్ ఇమేజ్ ఎడిటర్. thumba సైట్ నుండే సిల్వర్ లైట్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌజర్ ఇమేజ్ ఎడిటర్ లా మారుతుంది. ఎడిట్ చెయ్యవలసిన ఫోటోలను డ్రాగ్-అండ్-డ్రాప్ పద్ధతిలో thumba లో ఓపెన్ చెయ్యవచ్చు, లేదంటే thumba మెనూ లో ’Get Started'---> ’Open' పై క్లిక్ చేసి ఎడిట్ చెయ్యవలసిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని thumba లో ఓపెన్ చెయ్యవచ్చు. వెబ్ కెమెరా ఉపయోగించి కూడా ఫోటోలను ఫ్రెష్ గా లోడ్ చేసుకోవచ్చు.



ఇమేజ్ కి టెక్స్ట్ జతచెయ్యటం, వేరొక ఇమేజ్ యాడ్ చెయ్యటం, బ్రషెస్, రెడ్ ఐ ని తొలగించటం, ఇమేజ్ లో కావలసిన భాగాన్ని డిస్టార్ట్ చెయ్యటం, రీ సైజ్, ఇమేజ్ ని టెక్స్ట్ లోకి మార్చటం, ఇమేజ్ రొటేషన్, కలర్ బ్యాలన్స్, ఇమేజ్ ని గ్రేస్కేల్ కి మార్చటం, బ్లర్ ని తగ్గించటం, డిస్టార్షన్ కరెక్షన్ యిలా చాలనే ఫీచర్లు వున్నాయి. ఎడిట్ చేసిన ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ కూడా చేసుకోవచ్చు.


thumba ని ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఆన్ లైన్ లోనే ఉపయోగించవచ్చు, అంతే కాకుండా డెస్క్ టాప్ లో కూడా ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్: thumba

ధన్యవాదాలు

Friday, May 7, 2010

Luxand - Blink - మీ పీసీ ని చూస్తూ లాగిన్ అవ్వండి!!!

Luxand - Blink అనే ఉచిత సాప్ట్ వేర్ మన ముఖాన్ని గుర్తించి విండోస్ లో లాగిన్ అవటానికి దోహదపడుతుంది, ఇది విండోస్ 7 లేదా విస్టా 32 బిట్ ఆపరేటింగ్ సిస్టం గల పీసీ లలో పనిచేస్తుంది. అయితే దీనికోసం మన సిస్టం లో వెబ్ కెమేరా తప్పక వుండాలి. Blink వెబ్ కెమేరా సహాయంతో మన ముఖాన్ని రీడ్ చేసి , ముందుగా భద్రపరచిన యూజర్ ముఖాలతో సరిపోల్చుకొని సరైన యూజర్ ఎకౌంట్ లో లాగిన్ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ జుట్టు కత్తిరించుకున్నా, కాంటాక్ట్ లెన్స్ లేదా కళ్ళజోడు ధరించినా కూడా Blink రికగ్నైజేషన్ అల్ గారిథమ్ మిమ్మల్ని గుర్తిస్తుంది. Blink ఇనస్టలేషన్ చేసి తర్వాత సెట్టింగ్స్ అన్నీ సరిగా చేసుకున్నాక , నెక్స్ట్ టైమ్ సిస్టం స్టార్ట్ చేసినప్పుడు వెబ్ కామ్ ఆటోమాటిక్ గా ఎనేబుల్ చెయ్యబడి లాగిన్ కి సిద్ధంగావుంటుంది. మనం వెబ్ కామ్ కి ఎదురుగా కూర్చోవటమే, ఎటువంటి పాస్ వార్డ్ అవసరం లేకుండా పీసీ లాగిన్ అవుతుంది.



మరింత సమాచారం మరియు డౌనోడ్ కొరకు Luxand - Blink సైట్ చూడండి.


డౌన్లోడ్: Luxand - Blink (సైజ్:8.3 MB)

ధన్యవాదాలు

పిల్లల కోసం బెస్ట్ వెబ్ సైట్స్...

గూగుల్ కిడ్స్ గురించి నిన్నటి పోస్ట్ లో తెలుసుకున్నాం... ఈ పోస్ట్ లో పిల్లలకు ఉపయోగపడే మరిన్ని సైట్స్ గురించి తెలుసుకుందాం..

౧. యాహూ కిడ్స్ :

ఈ సైట్ లో పిల్లలకోసం మ్యూజిక్, మూవీ, జోక్స్, ఈ-కార్డ్స్, ఎన్ సైక్లోపీడియా, హారోస్కోప్, రిఫెరెన్స్ మెటీరియల్ యిలా చాలానే వున్నాయి. పేరెంట్స్ కోసం ప్రత్యేక సెక్షన్ కూడా వుంది, ఇక్కడ మూవీ రివ్యూ, ఆన్ లైన్ సేఫ్టీ గురించి పిల్లలకు ఎలా తెలియ చెయ్యాలి, యిలా చాలానే వున్నాయి.



వెబ్ సైట్: http://kids.yahoo.com/

౨. నేషనల్ జియోగ్రాఫిక్ కిడ్స్:

ఇక్కడ స్టోరీస్, యాక్టివిటీస్, వీడియోలు, యానిమల్స్, గేమ్స్, ఫోటోలు, ఇంకా ఇతర ఎడ్యుకేషనల్ లింకులు వున్నాయి.



వెబ్ సైట్: http://kids.nationalgeographic.com/kids/

౩. ఫనాలజీ:

జోక్స్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, మాజిక్ ట్రిక్స్, Weird Science సెక్షన్ లో పిల్లలు చెయ్యగలిగే ఫిజిక్స్, కెమిస్ట్రీ , బయాలజీ మొ. వాటికి సంబంధించిన ప్రయోగాలు వున్నాయి. నూరూరించే రుచులు యింకా ఎన్నో...


వెబ్ సైట్: http://funology.com/

౪. ఫన్ బ్రెయిన్:
ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన ఎడ్యుకేషనల్ సైట్ ఇది. వెబ్ బుక్స్ + కామిక్స్, మెదడుకు పదును పట్టే ఇంటరాక్టివ్ గేమ్స్, టీచర్స్ మరియు పేరెంట్స్ కోసం సలహాలు యింకా చాలావున్నాయి.


వెబ్ సైట్: http://www.funbrain.com

౫. పీబీఎస్ కిడ్స్:
పిల్లల కోసం గేమ్స్, వీడియోస్, ఈ-కార్డ్స్ యిలా చాలా వున్నయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరదాగా మరియు ఆసక్తికరంగా వుంటుంది.



వెబ్ సైట్: http://pbskids.org/

ధన్యవాదాలు

Thursday, May 6, 2010

Googlekids - పిల్లల కోసం ఒక మంచి యాక్టివిటీ సైట్

Pre-school మరియు Kindergarten పిల్లలు ఈ వేసవికాలంలో చక్కగా టైం పాస్ చెయ్యటానికి Googlekids సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ పిల్లల కోసం చాలా యాక్టివిటీస్ వున్నాయి ప్రతి దానిని ప్రింట్ చేసుకొనే సదుపాయం కూడా వుంది. ఇక్కడ రైమ్స్, పిక్చర్ కలరింగ్, బొమ్మల మాచింగ్, నంబర్ చార్ట్ లు, ఆంగ్ల పదాలకు సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్, జంతువుల పై ఆర్టికల్స్, బుక్లెట్స్, యానిమల్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజెటబుల్స్ మొదలగు వాటికి సంబంధించిన ఎక్సర్ సైజ్ లు, గ్రీటింగ్ కార్డ్స్, గేమ్స్ యిలా చాలానే వున్నాయి.



Pre-school మరియు Kindergarten పిల్లలకు ఈ సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

వెబ్ సైట్: గూగుల్ కిడ్స్

ధన్యవాదాలు

Monday, May 3, 2010

ఆరోగ్యానికి సంబంధించిన ఇంటరాక్టివ్ ట్యుటోరియళ్ళు...

ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఇంటరాక్టివ్ ట్యుటోరియళ్ళ లింక్స్ ఇక్కడ యిస్తున్నాను... ఇవి అవగాహన కోసం మాత్రమే... గమనించగలరు.

Diseases and Conditions



Tests and Diagnostic Procedures


Prevention and Wellness


ధన్యవాదాలు

Saturday, May 1, 2010

వికీపీడియా పేజీలను పీడీఎఫ్ బుక్స్ గా డౌన్లోడ్ చేసుకోవటానికి...

వికీపీడియా పేజీలను పీడీఎఫ్ బుక్స్ గా డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ క్రిందివిధంగా చెయ్యండి:

౧. వికీపీడియో లో అంతర్బాగంగా వున్న book creator (ప్రక్కన క్లిక్ చెయ్యండి) టూల్ ని ’start book creator' బటన్ పై క్లిక్ చేసి ప్రారంభించాలి.

౨. ఇప్పుడు పీడిఎఫ్ బుక్ గా మార్చవలసిన పేజీలను సెర్చ్ చేసుకొని పైన Book Creator దగ్గర వున్న ’Add this page to your book’ పై క్లిక్ చెయ్యాలి. బుక్ లో యాడ్ చెయ్యవలసిన పేజీ లు పూర్తి అయ్యే వరకు ఈ విధంగానే చెయ్యాలి.

౩. జత చెయ్యవలసిన పేజీలు పూర్తి అయిన తర్వాత పైన వున్న ’Show book' పై క్లిక్ చెయ్యాలి.

౪. ఇప్పుడు వచ్చే Manage your book పేజీ లో Title ఇచ్చి ’Download' బటన్ క్లిక్ చేసి బుక్ ని సేవ్ చేసుకోవటమే.

వీడీయో:


స్టార్ట్: book creator

ధన్యవాదాలు