Friday, December 31, 2010

Wylio - the fastest photo finder for bloggers - ఇమేజ్ లను వెతికి వాటిని బ్లాగుల్లో ఎంబెడ్ చెయ్యటానికి !!! [500 వ పోస్ట్]

ఇమేజ్ లను సెర్చ్ చెయ్యటానికి అంతర్జాలంలో చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, కాని వాటన్నిటికి భిన్నమైనది Wylio. అదెలాగో చూద్దాం Wylio సైట్ కి వెళ్ళి కావలసిన ఇమేజ్ కి సంబంధించిన కీవార్డ్ ఎంటర్ చేసి 'Search' పై క్లిక్ చేస్తే ఇమేజ్ లు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి.



ఇప్పుడు కావలసిన ఇమేజ్ పై క్లిక్ చేస్తే Adjustments పేజీ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఇమేజ్ ని రీసైజ్ చేసుకోవచ్చు మరియు ఎలైన్మెంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ’get the code' పై క్లిక్ చేస్తే బ్లాగులో ఎంబెడ్ చేసుకోవటానికి కోడ్ వస్తుంది.



వెబ్ సైట్: Wylio

ఇది నా 500 వ పోస్ట్ మరియు ఈ సంవత్సరానికి కూడా ఇదే లాస్ట్. మూడు సంవత్సరాల క్రితం కంప్యూటర్ ఎరా మ్యాగజైన్ లో బ్లాగులు మరియు తెలుగులో టైప్ చెయ్యటం గురించి తెలుసుకొని మనం కూడా ఒక బ్లాగు మొదలెడితే ఎలా ఉంటుంది అని ఈ బ్లాగ్ ని మొదలు పెట్టటం జరిగింది, ఇందుకు ముందుగా శ్రీధర్ గారికి నా ధన్యవాదాలు. కధలూ, కవితలూ రావు కాబట్టి మనకి టచ్ ఉన్న కంప్యూటర్ రంగమే బెటర్ అని అదే కంటిన్యూ అవుతున్నా. అంతర్జాలంలో వివిధ సైట్లనుండి సేకరించిన తాజా సమాచారాన్ని తెలుగులో అందించటం జరిగింది. ఇందులో కొన్ని మిత్రుల సహకారాలు కూడా ఉన్నాయి. కొన్ని హిట్లు మరియు కొన్ని ఫట్లతో బ్లాగు ప్రయాణం లో 500 వ మైలు రాయిని చేరుకున్నా. కొంత కాలం క్రితం కొందరు కామెంట్లలో అసభ్యకర లింకులు పెట్టటంతో కామెంట్లను డిసేబుల్ చెయ్యటం జరిగింది.

ఇంతకాలం ఆదరించిన రీడర్స్ కి నా ధన్యవాదాలు, ఇక ముండు కూడా మరిన్ని పోస్టులతో రచన - The Creation మీ ముందుకు వస్తుంది.

నూతన సంవత్సర శుభాకాంక్షలతో

మీ

శ్రీనివాస బాబు తోడేటి

పీసీ బూటింగ్ వేగాన్ని పెంచటానికి స్టార్ట్ అప్ లో ఉంచవలసిన లేదా తొలగించవలసిన అప్లికేషన్ల వివరాలు తెలుసుకోవటానికి!!!

పీసీ బూటింగ్ వేగం మందగించటం లో స్టార్ట్ అప్ అప్లికేషన్లు కూడా ఒక కారణం, అనవసరమైన స్టార్ట్ అప్ అప్లికేషన్లు తొలగించటం వలన బూటింగ్ సమయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే దీనికోసం మనం Srart ---> Run కి వెళ్ళి msconfig.exe అని టైప్ చేసి ఓకే చేస్తే ఓపెన్ అయ్యే సిస్టం కాన్ఫిగరేషన్ యుటిలిటీ Startup టాబ్ లో అనవసరమైన స్టార్ట్ అప్ ఐటమ్ దగ్గర టిక్ తీసివేయాలి.



అయితే ఇక్కడొక ప్రమాదం ఉంది, అనుభవం లేని వారు ఏ ప్రోగ్రామ్ కావాలో/ వద్దో తెలియక ఏదో ఒక టిక్ తీసివేస్తే కనుక మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అటువంటి వారికోసం Sysinfo సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ స్టార్ట్ అప్ ఐటమ్, దానికి సంబంధించిన సమాచారం, దానిని ఉంచాలా వద్దా అనే వివరాలు పొందుపర్చారు.



వెబ్ సైట్: Sysinfo

ధన్యవాదాలు

Wednesday, December 29, 2010

BackStreet Browser - వెబ్‌సైట్లను పీసీ లోకి డౌన్లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్ లో బ్రౌజ్ చెయ్యటానికి!!!

మనకు నచ్చిన సైట్ ని ఆన్‌లైన్ లో చూడటానికి సమయం లేనప్పుడు ఆ సైట్ మొత్తాన్ని యధాతధంగా మన హార్డ్‌డిస్క్ లోకి డౌన్లోడ్ చేసుకొని అవసరమైనప్పుడు చూడటానికి BackStreet Browser అనే చిన్న అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ముందుగా BackStreet Browser ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. 'New' పై క్లిక్ చేసి URL దగ్గర డౌన్లోడ్ చెయ్యవలసిన వెబ్ సైట్ అడ్రస్ ఇస్తే సరిపోతుంది, సైట్ మొత్తం మన హార్డ్ డిస్క్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది.


Major Features of BackStreet Offline Browser:

  • High-speed, multi-threading website download.

  • Resume feature to pick up a session where left off.

  • Update feature to download new or modified files.

  • Built-in file viewer in onboard browser window to view files offline.

  • Print/Preview downloaded files within same offline browser window.

  • Built-in Zip/Unzip facility for downloaded websites.

  • Option of duplicating the original directory structure of a site.

  • Filters files by URL, size, type, date modified, text.

  • User-selectable recursion levels, retrieval threads, timeout and proxy support.

  • Accesses password-protected sites.



డౌన్లోడ్: BackStreet Browser (1.48 MB)

ఇలాంటిదే మరొక సాప్ట్ వేర్ Fresh WebSuction.

ధన్యవాదాలు

Tuesday, December 28, 2010

ConvertToCartoon - ఫోటోలను కార్టూన్లగా మార్చటానికి!!!

మన ఫోటోలను కార్టూన్ క్యారక్టర్ గా మార్చితే ఎలా ఉంటుందో చూసుకోవాలని ఉందా? అదీ ఒకేఒక క్లిక్ తో! అయితే ConvertToCartoon సైట్ కి వెళ్ళాల్సిందే, ముందుగా URL ద్వారా లేదా Disk నుండైనా మన ఫోటోని అప్లోడ్ చెయ్యాలి. డిస్క్ నుండి అయితే కనుక ’Choose file' పై క్లిక్ చేసి కార్టూన్ గా మార్చవలసిన ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత అక్కడే ఉన్న ’Cartoonize now' పై క్లిక్ చెయ్యాలి అంతే ఫోటో కార్టూన్ గా మారిపోతుంది. అవసరం అనుకొంటే ఆ కార్టూన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనంతటికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ConvertToCartoon gif, jpeg, jpg, png, bmp,లేదా xbm మొదలగు ఇమేజ్ ఫార్మేట్లని సపోర్ట్ చేస్తుంది.





వెబ్ సైట్: ConvertToCartoon

ధన్యవాదాలు

Monday, December 27, 2010

allmymacapps - Mac ఉచిత అప్లికేషన్ల సమాహారం!!!

Mac యూజర్ల కోసం ఉచిత మరియు పెయిడ్ అప్లికేషన్లు అన్నీ ఒకే చోట allmymacapps సైట్ లో లభిస్తాయి మరియు ఇక్కడ కావలసిన అప్లికేషన్ కై సెర్చ్ చేసుకొనే సదుపాయం కూడా కలదు. క్యాటగిరీ వారీగా సాప్ట్ వేర్లను చూడవచ్చు మరియు అవసరమైన అప్లికేషన్లను ఈ సైట్ నుండే నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.



Mac యూజర్లు తప్పక చూడవలసిన సైట్ ఇది.

వెబ్ సైట్: AllMyMacApps

ధన్యవాదాలు

Saturday, December 25, 2010

FreeFileConvert - ఆన్‌లైన్ లో ఫైళ్ళను ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చటానికి!!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ మరియు ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యకుండా ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి సులభంగా మార్చవచ్చు, అదీ కేవలం మూడేమూడు స్టెప్పుల్లో, దీనికోసం freefileconvert సైట్ కి వెళ్ళాలి, అక్కడ Convert File టాబ్ పై క్లిక్ చెయ్యాలి. అక్కడ ఉన్న స్టెప్ 1) Input File దగ్గర ఉన్న Choose File పై క్లిక్ చేసి కన్వర్ట్ చెయ్యవలసిన ఫైల్ ని ఎంచుకోవాలి, ఫైల్ సైజ్ 300 MB వరకు ఉండవచ్చు. 2) Output Format దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ కి అనుగుణంగా మార్చదగిన ఫైల్ ఫార్మేట్లను చూపిస్తుంది, వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి. 3) Convert దగ్గర ఉన్న Convert బటన్ పై క్లిక్ చెయ్యాలి అంతే.



ఫైల్ కన్వర్ట్ చెయ్యబడిన తర్వాత డౌన్లోడ్ లింక్ జెనెరేట్ అవుతుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ సైట్ సర్వర్ లో ౧౨ గంటల వరకు ఉంటుంది.



వెబ్‌సైట్: FreeFileConvert

Friday, December 24, 2010

Autorun Disabler - విండోస్ లో ఆటోరన్ ని డిసేబుల్ చెయ్యటానికి పోర్టబుల్ అప్లికేషన్!!!

పీసీ లో సీడీ/డీవీడీ లేదా USB డ్రైవ్ లను ఇన్సర్ట్ చేసినప్పుడు ఆటోరన్ ఫంక్షన్ ద్వారా చిన్న విండో పాప్ అప్ అవటం మనం గమనించే ఉంటాం. దీనివలన కావలసిన ఫైల్/ ఫోల్డర్ ని త్వరగా ఓపెన్ చెయ్యవచ్చు. ఒక్కొక్కసారి ఇది ప్రమాదకారి కూడా, దీనివలన వైరస్ లు సులభంగా పీసీ లోకి చేరే అవకాశం ఉంది, ఈ ప్రమాదం మరీ ముఖ్యంగా USB డ్రైవ్ ల వలన కలుగుతుంది. విండోస్ లో ఈ ఆటోరన్ ఫంక్షన్ ని డిసేబుల్ చెయ్యాలంటే కనుక రిజిస్ట్రీ లో కొన్ని మార్పులు చెయ్యాలి, అవగాహన లేకుండా రిజిస్ట్రీ ని కదిపించటం కూడా ప్రమాదమే. అటువంటి వారు ఆటోరన్ ఫంక్షన్ ని డిసేబుల్ చెయ్యటానికి Autorun Disabler అనే పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించవచ్చు. దీనిని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేసి Autorun Disabler ఫైల్ రన్ చేస్తే ఈ క్రిందివిధంగా వస్తుంది.



ఇక కావలసిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ’ఓకే’ పై క్లిక్ చెయ్యటమే అంతే.

డౌన్లోడ్: Autorun Disabler

ధన్యవాదాలు

Thursday, December 23, 2010

101 ఉపయోగకరమైన వెబ్‌సైట్లు!!!

అంతర్జాలం లో ప్రతి అవసరానికి ఉపయోగపడే ఎన్నో వెబ్‌సైట్లు ఉన్నాయి, వాటిలో మనకి తెలిసినవి కొన్ని, తెలియనివి చాలా. రచన-The Creation బ్లాగ్ ద్వారా ఇప్పటివరకు దాదాపుగా 150 పైగా వెబ్ సైట్ల గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ తప్పకుండా బుక్ మార్క్ చేసుకోవలసిన 101 బెస్ట్ వెబ్ సైట్ల వివరాలను ఇస్తున్నాను, ఈ లిస్ట్ ఒకరకంగా రెడీ రిఫరెన్స్ లాగా కూడా ఉపయోగపడుతుంది, అవసరమైతే సేవ్ చేసుకోండి లేదా ప్రింట్ తీసుకోండి.

01. screenr.com – record movies of your desktop and send them straight to YouTube.
02. bounceapp.com – for capturing full length screenshots of web pages.
03. goo.gl – shorten long URLs and convert URLs into QR codes.
04. untiny.me – find the original URLs that’s hiding behind a short URLs.
05. localti.me – know more than just the local time of a city
06. copypastecharacter.com – copy special characters that aren’t on your keyboard.
07. topsy.com – a better search engine for twitter.
08. fb.me/AppStore – search iOS app without launching iTunes.
09. iconfinder.com – the best place to find icons of all sizes.
10. office.com – download templates, clipart and images for your Office documents.
11. woorank.com – everything you wanted to know about a website.
12. virustotal.com – scan any suspicious file or email attachment for viruses.
13. wolframalpha.com – gets answers directly without searching – see more wolfram tips.
14. printwhatyoulike.com – print web pages without the clutter.
15. joliprint.com – reformats news articles and blog content as a newspaper.
16. isnsfw.com – when you wish to share a NSFW page but with a warning.
17. e.ggtimer.com – a simple online timer for your daily needs.
18. coralcdn.org – if a site is down due to heavy traffic, try accessing it through coral CDN.
19. random.org – pick random numbers, flip coins, and more.
20. mywot.com – check the trust level of any website .
21. viewer.zoho.com – Preview PDFs and Presentations directly in the browser.
22. tubemogul.com – simultaneously upload videos to YouTube and other video sites.
23. truveo.com – the best place for searching web videos.
24. scr.im – share you email address online without worrying about spam.
25. spypig.com – now get read receipts for your email.
26. sizeasy.com – visualize and compare the size of any product.
27. whatfontis.com – quickly determine the font name from an image.
28. fontsquirrel.com – a good collection of fonts – free for personal and commercial use.
29. regex.info – find data hidden in your photographs.
30. tineye.com – this is like an online version of Google Googles.
31. iwantmyname.com – helps you search domains across all TLDs.
32. tabbloid.com – your favorite blogs delivered as PDFs.
33. join.me – share you screen with anyone over the web.
34. onlineocr.net – recognize text from scanned PDFs and images.
35. flightstats.com – Track flight status at airports worldwide.
36. wetransfer.com – for sharing really big files online.
37. pastebin.com – a temporary online clipboard for your text and code snippets.
38. polishmywriting.com – check your writing for spelling or grammatical errors.
39. awesomehighlighter.com – easily highlight the important parts of a web page.
40. typewith.me – work on the same document with multiple people.
41. whichdateworks.com – planning an event? find a date that works for all.
42. everytimezone.com – a less confusing view of the world time zones.
43. warrick.cs.odu.edu – you’ll need this when your bookmarked web pages are deleted.
44. gtmetrix.com – the perfect tool for measuring your site performance online.
45. imo.im – chat with your buddies on Skype, Facebook, Google Talk, etc. from one place.
46. translate.google.com – translate web pages, PDFs and Office documents.
47. youtube.com/leanback – enjoy a never ending stream of YouTube videos in full-screen.
48. similarsites.com – discover new sites that are similar to what you like already.
49. wordle.net – quick summarize long pieces of text with tag clouds.
50. bubbl.us – create mind-maps, brainstorm ideas in the browser.
51. kuler.adobe.com – get color ideas, also extract colors from photographs.
52. followupthen.com – setup quick reminders via email itself.
53. lmgtfy.com – when your friends are too lazy to use Google on their own.
54. tempalias.com – generate temporary email aliases, better than disposable email.
55. pdfescape.com – lets you can quickly edit PDFs in the browser itself.
56. faxzero.com – send an online fax for free .
57. feedmyinbox.com – get RSS feeds as an email newsletter.
58. isendr.com – transfer files without uploading to a server.
59. tinychat.com – setup a private chat room in micro-seconds.
60. privnote.com – create text notes that will self-destruct after being read.
61. flightaware.com – live flight tracking service for airports worldwide.
62. boxoh.com – track the status of any shipment on Google Maps.
63. chipin.com – when you need to raise funds online for an event or a cause.
64. downforeveryoneorjustme.com – find if your favorite website is offline or not?
65. example.com – this website can be used as an example in documentation.
66. whoishostingthis.com – find the web host of any website.
67. google.com/history – found something on Google but can’t remember it now?
68. errorlevelanalysis.com – find whether a photo is real or a photoshopped one.
69. google.com/dictionary – get word meanings, pronunciations and usage examples.
70. urbandictionary.com – find definitions of slangs and informal words.
71. seatguru.com – consult this site before choosing a seat for your next flight.
72. sxc.hu – download stock images absolutely free.
73. imo.im – chat with your buddies on Skype, Facebook, Google Talk, etc. from one place.
74. wobzip.org – unzip your compressed files online.
75. vocaroo.com – record your voice with a click.
76. scribblemaps.com – create custom Google Maps easily.
77. buzzfeed.com – never miss another Internet meme or viral video.
78. alertful.com – quickly setup email reminders for important events.
79. encrypted.google.com – prevent your ISP and boss from reading your search queries.
80. formspring.me – you can ask or answer personal questions here.
81. snopes.com – find if that email offer you received is real or just another scam.
82. typingweb.com – master touch-typing with these practice sessions.
83. mailvu.com – send video emails to anyone using your web cam.
84. ge.tt – quickly send a file to someone, they can even preview it before downloading.
85. timerime.com – create timelines with audio, video and images.
86. stupeflix.com – make a movie out of your images, audio and video clips.
87. aviary.com/myna – an online audio editor that lets record, and remix audio clips online.
88. noteflight.com – print music sheets, write your own music online.
89. disposablewebpage.com – create a temporary web page that self-destruct.
90. namemytune.com – when you need to find the name of a song.
91. homestyler.com – design from scratch or re-model your home in 3d.
92. snapask.com – use email on your phone to find sports scores, read Wikipedia, etc.
93. teuxdeux.com – a beautiful to-do app that looks like your paper dairy.
94. livestream.com – broadcast events live over the web, including your desktop screen.
95. bing.com/images – automatically find perfectly-sized wallpapers for mobiles.
96. historio.us – preserve complete web pages with all the formatting.
97. dabbleboard.com – your virtual whiteboard.
98. whisperbot.com – send an email without using your own account.
99. sumopaint.com – an excellent layer-based online image editor.
100. lovelycharts.com – create flowcharts, network diagrams, sitemaps, etc.
101. nutshellmail.com – Get your Facebook and Twitter streams in your inbox.



సేకరణ: డిజిటల్ ఇన్స్ఫిరేషన్ నుండి.

ధన్యవాదాలు

Wednesday, December 22, 2010

easyhi - ఉచితంగా ఆన్ లైన్ లో మల్టీమీడియా గ్రీటింగ్ కార్డులు తయారు చేసుకోవటానికి!!!

క్రిస్టమస్ మరియు న్యూయర్ దగ్గర పడుతున్నాయి ఇష్టమైన వారికి అందమైన ఆకర్షణీయమైన గ్రీటింగ్స్ పంపాలని అందరికీ ఉంటుంది, ఈ-గ్రీటింగ్స్ పంపాలనుకొనేవారు స్వంతగా మల్టీమీడియా గ్రీటింగ్స్ తయారుచేసుకోవాలంటే కనుక easyhi అనే సైట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ లభించే ఇమేజ్, ఆడియో, వీడియోలతో గ్రీటింగ్స్ తయారుచేసుకోవచ్చు అంతేకాకుండా మన స్వంత ఇమేజ్, ఆడియో, వీడియో, యానిమేషన్ ఎఫెక్టులు, ఫాంట్స్ మరియు స్వంత మెసేజ్ లతో అందమైన సరదా గ్రీటింగ్స్ తయారు చేసుకొని నచ్చిన వారికి పంపవచ్చు. easyhi ని ఉపయోగించటం చాలా సులువు.




వెబ్ సైట్: easyhi

ధన్యవాదాలు

Bu.tt - URL షార్ట్ నర్!!!

పొడవైన URL లను ఎవరికైనా చెప్పాలన్నా / తెలియచెయ్యాలన్నా కొద్దిగా కష్టం, దానిని పొట్టి గా చెయ్యటం వలన ఎవరికైనా చెప్పాలన్నా / తెలియచెయ్యాలన్నా చాలా సులభం. దానికోసం Bu.tt అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఇక్కడ కూడా కస్టమ్ టోకెన్ లో మన నచ్చిన పేరు ఇచ్చి URL షార్ట్ నర్ క్రియేట్ చేసుకోవచ్చు.




ఇటువంటివే మరికొన్ని వెబ్ సర్వీసెస్ గూగుల్ , furly, Bitly , Safly , cligs , budURL , imfyus .

ధన్యవాదాలు

Tuesday, December 21, 2010

గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చునే వారి కోసం చిన్న చిన్న వ్యాయామాలు!!!

గంటలకొద్దీ కంప్యూటర్ ముందు కూర్చునేవారు సరైన పద్ధతిలో కూర్చోవాలి లేకుండే నడుం లేదా మెడ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది, వాటిని నివారించటం కోసం చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. వాటికి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి.



మరిన్ని Desk Exercise Instructions ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు

Saturday, December 18, 2010

TeamTalk - ఉచిత వీడియో కాన్ఫరెన్స్ సాప్ట్ వేర్!!!

వివిధ ఆర్గనైజేషన్లలో బిజినెస్ అవసరాల కోసం వీడియో/ ఆడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తూ ఉంటారు. వీడియో కాన్ఫరెన్స్ లకు ఉపయోగించే హార్డ్ వేర్ ఎక్విప్మెంట్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి లక్షల్లో కూడా. అయితే కేవలం ఒక పీసీ దానిలో సౌండ్ కార్డ్, మైక్రోఫోన్, వెబ్ కెమెరా, ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు TeamTalk సాప్ట్ వేర్ ఉంటే సరిపోతుంది. ఇక ఎటువంటి ఖర్చు లేకుండా ఒకరికంటే ఎక్కువమందితో ఉచితంగా వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించుకోవచ్చు. TeamTalk తక్కువ విరామంతో రియల్ టైం వీడియో ని అందిస్తుంది.




TeamTalk ఫీచర్లు:

  • Real time audio and video conversations
  • Public and private instant text messaging
  • File sharing among group members
  • High quality audio codecs with both mono and stereo
  • Push-to-talk and voice activation
  • Record conversations to disk
  • Standalone server for both LAN and Internet environments
  • Private rooms/channels for every group
  • User authentication with accounts
  • Accessibility for visually impaired



డౌన్లోడ్: TeamTalk

ధన్యవాదాలు

మెరుగైన ఫీచర్లతో యాంటీ వైరస్ మైక్రోసాప్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ 2.0 బీటా విడుదల!!!


ఉచిత యాంటీ వైరస్ సాప్ట్‍వేర్ల లో మైక్రోసాప్ట్ సెక్యూరిటీ ఎస్సెన్షియల్ ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. ఇప్పుడు మరిన్ని మెరుగైన ఫీచర్లు Windows Firewall integration, network traffic inspection, మరియు heuristic scanning engine లతో మైక్రోసాప్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ 2.0 విడుదల అయింది.

క్రొత్తగా ఏముంది?
Windows firewall integration – It includes the option to turn Windows firewall on or off during installation.

Better protection against web based threats – It integrates with Internet Explorer to provide better security against different web based threats.

New protection engine - It has an updated malware engine that offers better threat detection and cleanup.

Network inspection system – It provides protection against network based exploits. It prevents malicious scripts from running. Unfortunately, this feature does not work on Windows XP. Since this feature requires Windows Filtering Platform (WFP), only Windows Vista and Windows 7 users can access it.


పరిమిత విండోస్ జెన్యూన్ యూజర్లు ఫస్ట్ కం-ఫస్ట్ సెర్వ్ ఆధారంగా US, Israel, Brazil, China దేశాలలోని వారు మైక్రోసాప్ట్ కనెక్ట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే అక్కడ రిజిస్టర్ చేసుకొని లాగిన్ అయ్యి బీటా వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.

డౌన్లోడ్: మైక్రోసాప్ట్ సెక్యూరిటీ ఎస్సెన్షియల్ Microsoft Connect ద్వారా

ధన్యవాదాలు

Thursday, December 16, 2010

పాస్ వార్డ్ షేర్ చెయ్యకుండా ఇతరులు మన జీమెయిల్ అకౌంట్ యాక్సెస్ చెయ్యటానికి అనుమతి ఇవ్వటం ఎలా?

ఇప్పుడు మనకు బదులుగా వేరొకరు మన జీమెయిల్ ని యాక్సెస్ చేసి మెయిల్స్ చదవటానికి, పంపటానికి లేదా తొలగించటానికి అనుమతిని ఇవ్వవచ్చు, ఈ ఫీచర్ ఇంతకుముందు ఇదే ఫీచర్ గూగుల్ అప్స్ లో ఉంది, బిజినెస్ ఆర్గనైజేషన్లలో బాస్ లో తీరిక లేక తమ మెయిల్స్ ని అసిస్టెంట్ లు యాక్సెస్ చెయ్యటానికి వీలుగా అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు అదే ఫీచర్ ని గూగుల్ జీమెయిల్ యూజర్లకు కూడా అందుబాటులోకి తెచ్చింది.

మన జీమెయిల్ యాక్సెస్ చెయ్యటానికి అనుమతిని ఎలా యివ్వాలో స్టెప్-బై-స్టెప్ చూద్దాం:

౧. ముందుగా మన జీమెయిల్ అకౌంట్ సైన్-ఇన్ చెయ్యాలి.

౨. ఇప్పుడు ’Settings' ---> 'Accounts and Import' లో 'Grant access to your account: ' దగ్గర వున్న 'Add another account' పై క్లిక్ చెయ్యాలి.

౩. ఇప్పుడు ఓపెన్ అయిన విండోలో మనం ఎవరికైతే యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామో వారి జీమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ’Next Step' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

౪. మన అకౌంట్ యాక్సెస్ చెయ్యటానికి పైన మనం ఎంటర్ చేసిన మెయిల్ ఐడీ కీ కన్ఫర్మేషన్ మెయిల్ పంపబడుతుంది, దాని కోసం ’Send email to grant access' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


౫. అవతలి వాళ్ళు యాక్సెప్ట్ / రిజెక్ట్ చెయ్యటానికి రెండు వేర్ వేరు లింకులు పంపబడతాయి. యాక్సెప్ట్ చెయ్యటనికి యాక్సెప్టన్స్ లింక్ పై క్లిక్ చెయ్యాలి.

అంతే మిగతాది ఒకరి అకౌంట్ ఇంకొకరు ఎలా యాక్సెస్ చెయ్యలో ఈ క్రింది వీడీయో చూడండి:



మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు