Friday, November 27, 2009

On-Screen Keyboard Portable - కీలాగర్ల నుండి రక్షణ పొందటానికి వర్చువల్ కీబోర్డ్

కీలాగర్ అనే ప్రోగ్రామ్ లు మన కంప్యూటర్ లో చేరి కీబోర్డ్ పై టైప్ చేసే స్ట్రోక్స్ ని ఫైళ్ళ రూపంలో హ్యాకర్లకు చేరవేస్తాయి. ఆన్ లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు కీలాగర్ల నుండి చాలా జాగ్రత్తగా వుండాలి, దీనికి తరుణోపాయం వర్చువల్ కీబోర్డ్ లను ఉపయోగించటమే. కొన్ని యాంటీవైరస్ సాప్ట్ వేర్లలో వర్చువల్ కీబోర్డ్ అంతర్గతంగానే వుంటుంది, అలానే కొన్ని ఆన్ లైన్ పేమెంట్ల సైట్లలో కూడా వర్చువల్ కీబోర్డ్ వుంటుంది. ఒకవేళ యాంటీవైరస్ సాప్ట్ వేర్లలో మరియు సైట్లలో వర్చువల్ కీబోర్డ్ లేని పక్షంలో On-Screen Keyboard Portable ఉపయోగపడుతుంది.


మరింత సమాచారం కోసం On-Screen Keyboard Portable సైట్ ని చూడండి.

డౌన్లోడ్: On-Screen Keyboard

ధన్యవాదాలు

Wednesday, November 25, 2009

Virtual Drive Manager - వర్చువల్ డ్రైవ్స్ మేనేజ్ చెయ్యటానికి ఉచిత పోర్టబుల్ యుటిలిటీ

Virtual Drive Manager అనే చిన్న ఉచిత పోర్టబుల్ యుటిలిటీని ఉపయోగించి వర్చువల్ డ్రైవ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇనస్టలేషన్ అవసరం లేకుండా కావలసిన ఫోల్డర్ వర్చువల్ డ్రైవ్ ని వేగంగా క్రియేట్ చెయ్యటానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకసారి క్రియేట్ చెయ్యబడిన వర్చువల్ డ్రైవ్ లు సిస్టం రీస్టార్ట్ చేసిన తర్వాత కూడా అలానే వుంటాయి. ఎంత వేగంగా అయితే వర్చువల్ డ్రైవ్ క్రియేట్ చేస్తామో అంతే వేగంగా దానిని తొలగించవచ్చు.





మరింత సమాచారం కోసం Virtual Drive Manager సైట్ ని చూడండి.

డౌన్లోడ్: Virtual Drive Manager (సైజ్: 560 KB)

ధన్యవాదాలు

Tuesday, November 24, 2009

SMSjosh - ఉచిత సంక్షిప్త సందేశాలు పంపటానికి మరొక సైట్

ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపటానికి చాలా వెబ్ సైట్లు వున్నాయి ... గత మాసం కంప్యూటర్ ఎరా పాఠకుల సమావేశం లో SMSjosh సైట్ గురించి తెలుసుకోవటం జరిగింది... SMSjosh నుండి కూడా ఇతర సైట్ల మాదిరిగా ఇండియాలో ఏదైనా మొబైల్ కి ఉచిత SMS లు పంపవచ్చు కాకపోతే ఈ సైట్ లో ఇతర సైట్ల లా ప్రకటనల గజిబిజీ మరియు కన్పూజన్ లేకుండా చూడచక్కగా వుంది అంతేకాకుండా ఉచిత అకౌంట్ లో ఒకేసారి 5 మొబైల్ నంబర్లకు గరిష్టంగా 120 అక్షరాల వరకు మెసేజ్ పంపవచ్చు.


వెబ్ సైట్: SMSjosh

ధన్యవాదాలు

Monday, November 23, 2009

Google Chrome OS కి సంబంధించిన వీడియో మరియు స్క్రీన్ షాట్లు

Google Chrome OS కి సంబంధించిన సమాచారాన్ని Official Google Blog లో చూడవచ్చు.

What is Google Chrome OS? (వీడియో)



క్రోమ్ OS కి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు:
1. Chrome OS Application Menu:

2. Chrome OS Media Browser:

3. Cloud Storage:

4. Arrington from TechCrunch :

5. Switching between Chrome instances :

ధన్యవాదాలు

Stereomood - ఎమోషనల్ ఇంటర్నెట్ రేడియో

మంచి సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని మరియు ఆనందాన్ని యిస్తుంది. మన మూడ్ బట్టి పాటలు వినాలంటే కనుక Stereomood సైట్ కి వెళ్ళాల్సిందే ... అక్కడ మన మూడ్ మరియు యాక్టివిటీలకు అనుగుణంగా పాటలను వుంచారు...కావలసిన మూడ్/యాక్టివిటీ లింక్ పై క్లిక్ చేసి పాటలను వినవచ్చు.


వెబ్ సైట్: Stereomood
ధన్యవాదాలు

CutMyPic - Cut & Customize your picture

CutMyPic అనే వెబ్ సైట్ కి వెళ్ళి ఇమేజ్ లో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ కొని రీ-సైజ్ చేసుకోవచ్చు అదీ కేవలం మూడేమూడు స్టెప్పుల్లో


స్టెప్ ౧. CutMyPic సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Go' పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౨. ఇమేజ్ లో కావల్సిన భాగాన్ని సెలెక్ట్ చేసుకొని ’Preview' బటన్ పై క్లిక్ చేసి ప్రివ్యూ చూసిన తర్వాత ’Done' పై క్లిక్ చెయ్యాలి.

స్టెప్ ౩. ఇప్పుడు ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ కూడా పంపవచ్చు.

ఇలాంటివే మరికొన్ని వెబ్ సైట్లు Pixenate, rsizr, Resize Your Image .

ధన్యవాదాలు

GreenPrint తో ప్రింటింగ్ వ్యయాన్ని తగ్గించుకోండి...

సర్వత్రా గ్లోబల్ వార్మింగ్ పై చర్చలు జరుపుతున్న ఈ సందర్భంలో.... పేజీల ప్రింటింగ్ తగ్గించండి...చెట్లను కాపాడండి నినాదంతో GreenPrint ముందుకు వచ్చింది. సాధారణంగా వెబ్ పేజీలను ప్రింట్ చేసేటప్పుడు కావలసిన టెక్స్ట్ తో పాటు అనవసర ఇమేజ్లతో వ్రుధాగా ఒకటి లేదా రెండు పేజీలు ప్రింట్ అవటం జరుగుతుంది. దీనిని అరికట్టడానికి GreenPrint వుపయోగపడుతుంది. GreenPrint తో అనవసర చిత్రాలను తొలగించి కావలసిన పుటల్ని మాత్రమే ముద్రించే అవకాశం వుంది. దీనితో కాగితాలను తక్కువగా వాడి చెట్లను కాపాడి పర్యావరణ పరిరక్షణలో మనవంతు క్రుషి కి ప్రయత్నిద్దాం. GreenPrint ఉచిత వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేస్తే అది మన కంప్యూటర్ లో ఒక ప్రింటర్ గా జతచెయ్యబడుతుంది . ఇనస్టలేషన్ సమయంలో Do you know? అంటూ పర్యావరణం మరియు కాగితాల వ్రుధా కి సంబంధించిన విషయాలను మనం చూడవచ్చు. వెబ్ పేజెస్ ప్రింట్ చేసే సమయంలో GreenPrint ఓపెన్ అవుతుంది, అక్కడ అనసర చిత్రాలు మరియు పేజీలను తొలగించి ఇప్పుడు డీఫాల్ట్ గా వున్న నార్మల్ ప్రింటర్ లో ప్రింట్ చేసుకోవచ్చు లేదంటే పీడీఎఫ్ లోకి కూడా మార్చుకోవచ్చు.




గ్రీన్ ప్రింట్ ఉపయోగించే విధానానికి సంబంధించిన వీడియో ట్యుటోరియల్:



డౌన్లోడ్: GreenPrint (సైజ్: 9 MB)

ధన్యవాదాలు

Friday, November 20, 2009

PHOTOSnack - ఉచితంగా ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి...

PHOTOSnack - ఆన్ లైన్ లో ప్రొఫెషనల్ ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి ఒక సులభమైన మార్గం ... ముందుగా photosnack అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.



స్టెప్ ౧. UPLOAD: PHOTOSnack సైట్ కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత 'Make a Slideshow' పై క్లిక్ చెయ్యాలి, టెంఫ్లేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Upload Photos' పై క్లిక్ చేసి గరిష్టంగా 250 MB వరకు ఒక్కొక్క ఫైల్ సైజ్ 10 MB వరకు jpg, jpeg, png and gif ఫార్మేట్ లో వున్న ఫైళ్ళను అప్ లోడ్ చేసుకోవాలి.

స్టెప్ ౨. CUSTOMIZE: Customize Album లో ఆల్బమ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, ఇమేజ్ జతచెయ్యవచ్చు, వ్యక్తిగత లోగో జత చెయ్యవచ్చు. అలాగే Navigation లో స్లైడ్ షో స్పీడు, యూజర్ ఇంటరాక్షన్ మరియు ఆటో హైడ్ కంట్రోల్స్ సెట్ చేసుకోవచ్చు.

స్టెప్ ౩. SHARE: తయారుచేసుకొన్న ఆల్బమ్ ని ఇతరులతో పంచుకోవటానికి లింక్ మరియు ఎంబెడ్ కోడ్ వస్తాయి.

ధన్యవాదాలు

Thursday, November 19, 2009

Microsoft Office Professional Plus 2010 Beta డౌన్లోడ్ చేసుకోండి

మైక్రోసాప్ట్ ఆఫీస్ ఫ్రొఫెషనల్ ప్లస్ 2010 బీటా ఇప్పుడు డౌన్లోడ్ కి సిద్ధంగా వుంది, ఇది అక్టోబర్ 2010 వరకు పనిచేస్తుంది. మైక్రోసాప్ట్ ఆఫీస్ ఫ్రొఫెషనల్ ప్లస్ 2010 రెగ్యులర్ Word, Excel, Powerpoint, Access, Outlook, OneNote తో పాటు InfoPath, Publisher, SharePoint Workspace, Communicatior వున్నాయి. ఫైల్ డౌన్లోడ్ సైజ్ 700 MB వరకు వుంటుంది మరియు ఇనస్టలేషన్ కొరకు 3GB వరకు డిస్క్ స్పేస్ అవసరం.

1. Microsoft Word 2010 Features
2. Microsoft Excel 2010 Features
3. Microsoft PowerPoint 2010 Features
4. Microsoft Access 2010 Features

మరింత సమాచారం కోసం మైక్రోసాప్ట్ సైట్ చూడండి.
డౌన్లోడ్: Microsoft Office Professional Plus 2010 Beta (సైజ్ : 700 MB)

ధన్యవాదాలు

Wednesday, November 18, 2009

Draw Anywhere - Create diagrams online. No download, no-install!

Draw Anywhere సైట్ కి వెళ్ళి ఆన్ లైన్ లోనే ఫ్లోచార్ట్స్, నెట్ వర్క్ డయాగ్రమ్స్, ఆర్గనైజేషన్ చార్ట్స్, ఫ్లోర్ ప్లాన్స్ మరియు లే అవుట్లు యిలా వివిధ రకాల ఫ్లోచార్ట్స్ మరియు డయాగ్రమ్స్ తయారుచేసుకోవచ్చు. ఉచిత బేసిక్ అకౌంట్ తో ఉచితంగా 3 డయాగ్రమ్స్ తయారుచేసుకోవచ్చు. 3 డయాగ్రమ్స్ లలో అవసరం లేని వాటిని తొలగించి మరల డయాగ్రమ్స్ తయారుచేసుకోవచ్చు అంటే గరిష్టంగా మూడు డయాగ్రమ్స్ సేవ్ చేసుకోవచ్చు. తయారుచేసుకొన్న డయాగ్రమ్స్ ని సేవ్ చేసుకోవచ్చు , షేర్ కూడా చేసుకోవచ్చు మరియు పీడీఎఫ్ లేదా ఇమేజ్ ఫైల్ గా ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.



సైట్ లో వున్న షేప్స్ కాకుండా మన స్వంత ఇమేజ్ లను కూడా అప్ లోడ్ చేసుకొని డయాగ్రమ్ తయారిలో వుపయోగించుకోవచ్చు.

Draw Anywhere ... డయాగ్రమ్స్ తయారుచెయ్యటానికి ఉపయోగించే ఖరీదైన సాప్ట్ వేర్ల కు మంచి ప్రత్యామ్నాయం... ఎటువంటి ఇనస్టలేషన్ లేకుండా ఆన్ లైన్ లోనే డయాగ్రమ్స్ తయారుచేసుకోవచ్చు.

వెబ్ సైట్: Draw Anywhere

ధన్యవాదాలు

Tuesday, November 17, 2009

Auto Shutdown - కావలసిన సమయానికి విండోస్ షట్ డౌన్, లాగ్ ఆఫ్, రీస్టార్ట్ చెయ్యటానికి

Auto Shutdown అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి మన సిస్టం కావలసిన సమయానికి Shutdown, Log Off లేదా Restart చెయ్యవచ్చు. ఇది చాలా సింపుల్ ప్రోగ్రామ్ ... Set దగ్గర Shutdown, Log Off లేదా Restart చెయ్యవలసిన సమయం ఎంటర్ చేసి Action దగ్గర Shutdown, Log Off, Restart లలో ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని Start బటన్ పై క్లిక్ చెయ్యాలి, అప్లికేషన్ సిస్టం ట్రే లో కూర్చుంటుంది. సెట్ చేసిన సమయానికి సిస్టం Shutdown, Log Off లేదా Restart అవుతుంది.



డౌన్లోడ్: Auto Shutdown

ఇది Windows XP, Windows Vista మరియు Windows 7 లలో పనిచేస్తుంది.

ధన్యవాదాలు

XP Quick Fix Plus - విండోస్ XP లో వచ్చే 40 వరకు కామన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యటానికి ...

XP QuickFix అనే ఉచిత పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి విండోస్ XP లో సాధారణంగా వచ్చే 25 వరకు సమస్యలను ఫిక్స్ చెయ్యవచ్చు. Leelu Soft ఇప్పుడు XP QuickFix Plus పేరుతో రూపొందించిన అప్లికేషన్ లో విండోస్ XP లో వచ్చే 40 కామన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యవచ్చు.

XP Quick Fix Plus ని ఉపయోగించటం చాలా సులువు మరియు ఇనస్టలేషన్ చెయ్యనవసరం లేదు. జిప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేస్తే రెండు ఫైళ్ళు వస్తాయి ... వాటిలో LFX.exe మెయిన్ GUI ప్రోగ్రామ్ దీనిలోనే 40 ప్రాబ్లమ్స్ కి ఫిక్సెస్ వున్నాయి, రెండవది QFC.exe ఇది కమాండ్ లైన్ యుటిలిటీ దీనిలో ౫ ఫిక్సెస్ వున్నాయి.



మరింత సమాచారం కోసం XP QuickFix Plus సైట్ ని చూడండి.

డౌన్లోడ్: XP Quick Fix Plus (సైజ్: 550 KB)

ధన్యవాదాలు

Friday, November 6, 2009

IE7Pro - ద అల్టిమేట్ యాడ్ ఆన్ ఫర్ ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్

ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ లో తప్పకుండా వుండవలసిన యాడ్ ఆన్ IE7Pro , Tabbed Browsing Management, Spell Check, Inline Search, Super Drag Drop, Crash Recovery, Proxy Switcher, Mouse Gesture, Tab History Browser, Web Accelerator, User Agent Switcher, Webpage Capturer, AD Blocker, Flash Block, Greasemonkey like User Scripts platform, User Plug-ins, MiniDM, Google sponsored search,IE Faster మొదలగు ఫీచర్లు IE7Pro లో వున్నాయి. దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, సైజ్ 2.50MB మాత్రమే. డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ స్టేటస్ బార్ పై IE7Pro ఐకాన్ వస్తుంది, దానిపై మౌస్ రైట్ క్లిక్ చేసి కావలసిన సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.



IE7Pro ఫీచర్స్ మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: IE7Pro

ధన్యవాదాలు

Wednesday, November 4, 2009

MediaPortal - Windows Media Center కి ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్

MedaPortal అనే ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్ ని Windows Media Center కి ఖచ్చితమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. విండోస్ మీడియా సెంటర్ రాని విండోస్ ఎడిషన్ లో దీనిని ఉపయోగించవచ్చు, MedaPortal ని ఉపయోగించి ఫేవరేట్ మ్యూజిక్ మరియు రేడియో వినవచ్చు, వీడీయోలు స్టోర్ లేదా చూడవచ్చు, లైవ్ టీవీ చూడవచ్చు మరియు ఒక షెడ్యూల్ ప్రకారం రికార్డ్ చెయ్యవచ్చు యిలా యింకా చాలా ప్రయోజనాలు వున్నాయి.

MediaPortal Features కోసం http://www.team-mediaportal.com/features.html లో చూడండి.



డౌన్లోడ్: MediaPortal (సైజ్: 22 MB)

ధన్యవాదాలు

Jotti's malware scan - 20 యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోండి...

Jotti's malware scan సైట్ లో దాదాపు 20 ప్రముఖ యాంటీ-వైరస్ ప్రోగ్రాములను ఉపయోగించి మీ ఫైళ్ళను ఆన్ లైన్ లో స్కాన్ చేసుకోవచ్చు. Jotti's malware scan సైట్ కి వెళ్ళి ’Browse' పై క్లిక్ చేసి స్కాన్ చెయ్యవలసిన ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Submit file' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఫైల్ అప్ లోడ్ చెయ్యబడి దాదాపు ౨౦ ప్రముఖ యాంటీ వైరస్ ప్రోగ్రాములైన Bit Defender, Clam AV, NOD 32, Mormon, AVG, A-Squared, Dr. Web, Avast మొ. వాటితో ఫైల్ స్కాన్ చెయ్యబడి స్కాన్ రిజల్ట్ చూపెడుతుంది.







వెబ్ సైట్ : Jotti's malware scan

ధన్యవాదాలు

Tuesday, November 3, 2009

ADrive - 50 GB వరకు ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ స్పేస్

ADrive - 50 GB వరకు ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ స్పేస్ మరియు బ్యాక్ అప్ సదుపాయాన్ని అందిస్తుంది. మన సిస్టం లో వున్న మ్యూజిక్ లేదా వీడియో ఫైళ్ళను అప్ లోడ్ చేసుకొని ఎక్కడ నుండైనా యాక్సెస్ చేసుకోవచ్చు.

ADrive ఫీచర్లు:
౧. Completely free 50GB online space for Individual and Personal use.
౨. You can upload entire folders and directory.
౩. You can easily share any file with your friends. When you choose the Share option for any file, ADrive will generate a unique URL for that. Anyone can download you file directly by clicking on that unique URL.
Access files from anywhere.
౪. Access files from anywhere.
౫. ADrive lets you edit your Word and Excel files online directly using Zoho editor.

ఉచిత వెర్షన్ లో డెస్క్ టాప్ బ్యాక్ అప్ టూల్ రాదు, దీంతో ఆటోమాటిక్ గా బ్యాక్ అప్ తీసుకోలేము. దాని కోసం ధర్డ్ పార్టీ బ్యాక్ అప్ సర్వీసెస్ వాడాలి.

ADrive ని ఉపయోగించాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకొని, ఈ-మెయిల్ కి పంపబడిన లింక్ పై క్లిక్ చేసి ఎకౌంట్ యాక్టివేట్ చేసుకోవాలి.

మరింత సమాచారం కోసం ADrive సైట్ ని చూడండి.


సైట్ : ADrive

ధన్యవాదాలు