Thursday, March 28, 2013

కంప్యూటర్స్ నేర్చుకోవటానికి ఒక మంచి సైట్ [వీడియో ట్యుటోరియల్స్]

నెట్ లో సెర్చ్ చేస్తుంటే నాకు ఒక మంచి సైట్ కనబడింది అదే http://computerseekho.com/ ఈ సైట్ లో 200 పైగా కంప్యూటర్స్ కి సంబంధించిన పాఠాలు/ వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి. వీడియోస్  వివరణ మాత్రం హిందీలో ఉంటుంది, స్లైడ్స్ మాత్రం ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. మనలో కూడా చాలా మందికి హిందీ వచ్చు కాబట్టి కొందరికైనా ఉపయోగపడుతుందని ఈ సైట్ ని ఇక్కడ్ షేర్ చేస్తున్నాను. ఈ సైట్ ని మూడు విభాగాలుగా విభజించారు ౧) Basic Learning 2) Intermediate Learning 3) Advanced Learning. ఇక్కడ పాఠాలన్నీ పూర్తిగా ఉచితం మరియు ఎటువంటి రిజిస్ట్రేషన్ చెయ్యనవసరం లేదు.


మాధ్యమం హిందీ అనే కానీ పాఠాలు చాలా బాగున్నాయి. ఈ సైట్ రూపొందించిన వారికి హాట్సాఫ్!!!

వెబ్ సైట్: http://computerseekho.com

ధన్యవాదాలు

Monday, March 25, 2013

eBooks డౌన్లోడ్ చేసుకోవటం కోసం కొన్ని బెస్ట్ వెబ్ సైట్లు...

వివిధ రంగాలకు సంబంధించిన ఉచిత ఈబుక్స్  డౌన్లోడ్ కోసం ఈ క్రింది వెబ్ సైట్లను చూడండి, కొన్ని సైట్లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని సైట్లలో రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే బుక్స్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ సైట్లు:
౧౦.MartView

ధన్యవాదాలు

Friday, March 22, 2013

Google Keep - నోట్స్ మరియు టు-డు లిస్ట్స్ కొరకు [వెబ్ & ఆండ్రాయిడ్]

Google Keep అనే వెబ్ సర్వీస్ మరియు ఆండ్రాయిడ్ ఆప్ నోట్స్ తీసుకోవటానికి మరియు To-do లిస్ట్ లు తయారు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది. Google Keep లో టెక్స్ట్ మెసేజెస్ తో పాటు ఇమేజ్ లను కూడా జత చెయ్యవచ్చు. ఇది గూగుల్ డ్రైవ్  డొమైన్ ని ఉపయోగించుకుంటుంది. సింపుల్ ఇంటర్ ఫేస్ కలిగిన దీనిలో నోట్ లను సెర్చ్ చెయ్యటం సులువు.


ఫీచర్లు:

• Keep track of your thoughts via notes, lists and photos
• Have voice notes transcribed automatically
• Use homescreen widgets to capture thoughts quickly
• Color-code your notes to help find them later
• Swipe to archive things you no longer need
• Turn a note into a checklist by adding checkboxes
• Use your notes from anywhere - they are safely stored in the cloud and available on the web 

వెబ్ సైట్: Google Keep

ఆండ్రాయిడ్ అప్లికేషన్: Google Keep

ధన్యవాదాలు

Wednesday, March 20, 2013

Social Media Image Maker - సోషల్ నెట్ వర్క్స్ కోసం సరిపోయే ఇమేజ్ లను క్రియేట్ చేసుకోండి!

Social Media Image Maker అనే ఉచిత ఆన్ లైన్ టూల్ ని ఉపయోగించి ప్రముఖ సోషల్ వెట్ వర్క్ సైట్లైన ఫేస్ బుక్ , గూగుల్ ప్లస్, టంబ్లర్, పింటెరెస్ట్, లింక్డ్ ఇన్ ఇలా మెదలగు సైట్ల కోసం సరిపడే తగిన బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్, ప్రొఫైల్ ఇమేజ్ , కవర్ ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ లో ఆయా సైట్లకు తగిన ఇమేజ్ లెంగ్త్ ముందుగా సెట్ చేసి ఉండటం వలన దీనిలో తయారు చేసిన ఇమేజ్ లు ఆయా సైట్లకు సైట్లకు సరిగ్గా సరిపోతాయి.


Social Media Image Maker సైట్ కి వెళ్ళి కావలసిన సోషల్ నెట్ వర్క్ ఆప్షన్ ను ఎంచుకోవటం వలన అక్కడ ఆయా సైట్లకు తగిన ఇమేజ్ లను తయారు చేసుకోవటానికి ఆప్షన్ వస్తుంది . ఉదా ఫేస్ బుక్ కవర్ ఇమేజ్ తయారు చేసుకోవాలన్నప్పుడు ’Facebook' పై క్లిక్ చేసి ’Cover Image' దగ్గర ఉన్న 'Create' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత పేజీలో ’Add your File ' పై క్లిక్ చేసి ఇమేజ్ పైల్ అప్ లోడ్ చెయ్యవచ్చు, లేదంటే సింపుల్ గా ఇమెజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యటం ద్వారా అక్కడ ఉన్న ఆప్షన్లను ఉపయోగించి కవలసిన మార్పులు చేసుకుని ’Apply' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత కలర్ బ్రైట్ నెస్ లో కావాలంటే మార్పులు చేసుకుని అక్కడే పైన ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసి ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్: Social Media Image Maker

ధన్యవాదాలు

Monday, March 18, 2013

ఫేస్ బుక్ అకౌంట్ బ్యాక్ అప్ తీసుకుకోవటం ఎలా?

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ని బ్యాక్ అప్ తీసుకోవటం ఎలాగో ఇక్కడ చూద్దాం.

౧. ముందుగా ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అవ్వాలి, తర్వాత కుడి చేతి ప్రక్క పై మూలన ఉన్న’ గేర్ ’  గుర్తు పై క్లిక్ చేసి ’Account Settings'  ని సెలెక్ట్ చేసుకోవాలి. 


౨. ఇప్పుడు ‘Download a copy of your Facebook data’ లింక్ పై క్లిక్ చెయ్యాలి. 

౩. ఇక్కడ మనకు రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి, ఒకటి రెగ్యులర్ Archive మరొకటి Expended Archive. రెగ్యులర్ దానిలో ఫోటోస్, ఛాట్, మెసేజెస్ , అకౌంట్ వివరాలు  మొ. ఉంటాయి. అదే  Expended  లో ఇంకా ఎక్కువ వివరాలు ఉంటాయి ఇనస్టలేషన్ చేసుకున్న అప్లికేషన్లు, అన్-ఫ్రెండ్,ఐపీ అడ్రస్ మరిన్ని వివరాలు ఉంటాయి. రెండింటీ మధ్య తేడాను అక్కడే ఉన్న హెల్ప్ లిం పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు,రెగ్యులర్ Archive కోసం Start My Archive పై క్లిక్ చెయ్యాలి. 

౪.  Request My Download వస్తుంది అక్కడ Start My Archive పై క్లిక్ చెయ్యాలి.


౫.  ఇక్కడ Confirm  పై క్లిక్ చేసిన తర్వాత డాటా మొత్తం సేకరించి డౌన్లోడ్ సమాచారం మన మెయిల్ కి 
పంపబడుతుంది.


౬. Your Download is ready అంటూ మనకు మెయిల్ వస్తుంది, అది రావటానికి కొంత సమయం పడుతుంది, వెయిట్ చెయ్యాలి. మెయిల్ లోని లింక్ పై క్లిక్ చెయ్యగా వచ్చే పేజీలో ఫేస్ బుక్ పాస్ వార్డ్ ఎంటర్ చేసి ’Continue' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Download Archive పై క్లిక్ చెయ్యాలి.  జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది , దానిని అన్ జిప్ చేసుకోవాలి.

ధన్యవాదాలు 

Friday, March 15, 2013

WebCopy - ఆఫ్ లైన్ బ్రౌజింగ్ కోసం వెబ్ సైట్ మొత్తాన్ని డౌన్లోడ్ చేసుకోవటానికి!!!

WebCopy అనే ఉచిత టూల్ ని ఉపయోగించి మనకు కావలసిన వెబ్ సైట్ ని పూర్తిగా కాని కావలసిన పేజీలను కాని లోకల్ హార్డ్ డిస్క్ లోకి కాపీ చేసుకొని వీలున్నప్పుడు దానిని చూడవచ్చు. ఒక వెబ్ సైట్ ని మొత్తం గా డౌన్లోడ్ చేసుకోవాలనుకునే వారికి ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. కావలసిన సైట్ డౌన్లోడ్ కొరకు ఆ సైట్ URL ని     మరియు డౌన్లోడ్ లొకేషన్ ని ఎంటర్ చెయ్యాలి ఎంటర్ చెయ్యాలి. 


డౌన్లోడ్ మరియు ఇతర సమాచారం కోసం WebCopy సైట్ చూడండి.

డౌన్లోడ్:WebCopy

 ఇటువంటివే  HTTrack Website Copier మరియు  PageNest.

ధన్యవాదాలు

Thursday, March 14, 2013

హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటానికి...[గూగుల్ క్రొత్త ప్రోగ్రామ్]

 తరచూ  పలానా వెబ్ సైట్ హ్యాక్ చెయ్యబడిందని వింటూ ఉంటాం... సెక్యూరిటీ తక్కువగా ఉన్న వెబ్ సైట్లను హ్యాకర్లు సులభంగా చేస్తూ ఉంటారు...  అలా హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటానికి గూగుల్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది అదే  Help for hacked sites . అది హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటం లో సహాయపడగలదు.


వెబ్ సైట్ ని రికవర్ చేసుకోవటానికి సైట్ ఓనర్ల కోసం వ్యాసాలు మరియు విడియోలను గూగుల్ రూపొందించింది, మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

హ్యాక్ అయిన తర్వాత రికవర్ చేసుకోవటానికే కాకుండా అసలు హ్యాక్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా గూగుల్ తెలియ చేస్తుంది. ధన్యవాదాలు

Tuesday, January 1, 2013

hellofax నుండి ఎక్కడికైనా ఉచితంగా ఫాక్స్ పంపండి!!!

****

మితృలకు ... ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..

****
hellofax అనే వెబ్ సైట్ నుండి ప్రపంచం లో ఎక్కడికైనా నెలకు పరిమిత సంఖ్యలో (50 పేజీలు) ఉచితంగా ఫాక్స్ పంపవచ్చు. హెలోఫాక్స్ సైట్ కి వెళ్ళి గూగుల్ అకౌంట్ లేదా మైక్రోసాప్ట్ అకౌంట్ తో లాగిన్ అయ్యి లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ముందుగా ఫాక్స్ పంపవలసిన ఫైల్ ని అప్ లోడ్ చేసుకోవాలి, తర్వాత ఫాక్స్ నంబర్ ఆయా దేశాలా కోడ్ తో సహా ఎంటర్ చెయ్యాలి, తర్వాత 'Send it Now' బటన్ పై క్లిక్ చెయ్యాలి. వర్డ్ డాక్యుమెంట్స్ , పీడీఎఫ్ పైల్స్, ఇమేజెస్, టెక్స్ట్ పైల్ ఇలా వివిధ ఫార్మేట్లలో ఉన్న ఫైళ్లను హెలోఫాక్స్  ద్వారా పంపవచ్చు. అంతేకాకుండా క్లౌడ్ స్టోరేజ్ లనుండి కూడా ఫైళ్ళను తీసుకోవచ్చు. వెబ్ సైట్: hellofax

ధన్యవాదాలు