Friday, January 30, 2009

సమర్ధవంతమైన పాస్ వార్డ్ మేనేజర్...


సమాచారం/డాటా ని సురక్షితంగా వుంచటం లో పాస్ వార్డ్ కీలకపాత్ర పోషిస్తుంది. అన్ని అప్లికేషన్లకు ఒకే పాస్ వార్డ్ పెట్టడం మంచిది కాదు. అలా అని అన్ని పాస్ వార్డ్స్ గుర్తు పెట్టుకోవటం కూడా కష్టమే. అన్ని పాస్ వార్డ్స్ ని ఒకచోట దాచి పెట్టి దానికి ఒక పాస్ వార్డ్ పెట్టి దానిని గుర్తుపెట్టుకోవటం సులువేకదా! దానికోసం మనం పాస్ వార్డ్ మేనేజర్ల పై ఆధారపడవలసివుంటుంది. నెట్ లో చాలానే వుచిత పాస్ వార్డ్ మేనేజర్లు దొరుకుతాయి వాటిలో ఒకటే ’Efficient Password Manager', అప్లికేషన్ డౌన్ లోడ్ సైజ్ 2.6MB మాత్రమే. ఈ అప్లికేషన్ లో వివిధ వెబ్ సైట్ల, ఈ-మెయిల్ అకౌంట్ల, FTP అకౌంట్ల యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ లను సేవ్ చేసుకోవచ్చు. ఇవేకాకుండా సాప్ట్ వేర్ రిజిస్ట్రేషన్ కోడ్ లను భద్రపరచుకొనే సదుపాయం వుంది. అంతే కాకుండా Password Generator కూడా ఇదే అప్లికేషకి జతచేయబడివుంది. Password Generator ని వుపయోగించి కావలసిన లెంగ్త్ లో అక్షరాలు, నంబర్లు మరియు ప్రత్యేకాక్షరాల కలయికలో కావలసిన పాస్ వార్డ్ రూపొందించుకోవచ్చు. పాస్ వార్డ్స్ అన్నిటినీ Efficient Password Manager లో సేవ్ చేసుకొని దానికి ఒక పాస్ వార్డ్ పెట్టుకుని అది గుర్తు పెట్టుకోవాలి. అలా అని మిగతావి మర్చిపోమని కాదు, అవి మర్చిపోకుండా ఇదొక ప్రత్యామ్నాయమే.

ధన్యవాదాలు

విండోస్ ఎక్స్ ప్లోరర్ నుండే మీ ఆన్ లైన్ ఫైళ్ళను యాక్సెస్ చెయ్యండి...

ఆన్ లైన్ లో స్టోర్ చెయ్యబడిన ఫైళ్ళను విండోస్ ఎక్స్ ప్లోరర్ నుండి యాక్సెస్ చెయ్యటానికి ’GLADINET' అనే చిన్న విండోస్ అప్లికేషన్ వుపయోగపడుతుంది. GLADINET ని వుపయోగించి Google Docs, Picasa Web Albums, Windows Live Skydrive and Amazon S3 లలో స్టోర్ చెయ్యబడిన ఆన్ లైన్ ఫైళ్ళను యాక్సెస్ చెయ్యవచ్చు. GLADINET ని డౌన్ లోడ్ (సైజ్ 11 MB) చేసి ఇనస్టలేషన్ చేసిన తర్వాత మాప్ చెయ్యబడిన నెట్ వర్క్ డ్రైవ్ లా 'My Computer' లో కనబడుతుంది. Google Docs సంబంధించిన వర్చువల్ డైరెక్టరీ క్రియేట్ చెయ్యటానికి 'My Computer' లో కనబడే 'resources on 127.0.0.1' అనే నెట్ వర్క్ డ్రైవ్ ఓపెన్ చేసి అక్కడ 'Click to Mount[Google Docs]' పై క్లిక్ చెయ్యాలి. 'Virtual Directory Manager' విండోలో Google Docs డైరెక్టరీ క్రియేట్ చెయ్యటానికి Google user name మరియు Password ఇచ్చి ’Add' బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే Google Docs ఫోల్డర్ క్రియేట్ చెయ్యబడుతుంది, దీని ద్వారా ఆన్ లైన్ లో స్టోర్ చెయ్యబడిన Google Docs ఫైళ్ళని యాక్సెస్ చెయ్యవచ్చు.







GLADINET డౌన్ లోడ్ మరియు మరింత సమాచారం కోసం GLADINET సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Friday, January 16, 2009

ఆటో కాడ్ డ్రాయింగ్ ఫైళ్ళను చూడటానికి ఒక శక్తివంతమైన యుటిలిటీ


సిస్టం లో AutoCAD సాప్ట్ వేర్ లేకుండా ఆటో కాడ్ డ్రాయింగ్ ఫైళ్ళను చూడటానికి ఒక శక్తివంతమైన యుటిలిటీ - AutoCAD Drawing Viewer 2.1.9. ఇది అన్ని AutoCAD వెర్షన్లకు సంబంధించిన డ్రాయింగ్ ఫైళ్ళను ఓపెన్ చెయ్యటానికి మరియు చూడటానికి (View)వుపయోగపడుతుంది. డ్రాయింగ్ కి సంబంధించిన యాట్రిబ్యూట్ విలువలు, టెక్స్ట్ విలువలు , లేయర్ సమాచరం మొదలగునవి చూడవచ్చు. డ్రాయింగ్ ఫైళ్ళని BMP గా సేవ్ చేసుకొనే అవకాశం కూడా వుంది.

ఉచిత డౌన్ లోడ్: AutoCAD Drawing Viewer 2.1.9 సైజ్: 5MB

ధన్యవాదాలు

Tuesday, January 13, 2009

వెబ్ సైట్ నుండి ఫ్లాష్ ఫైళ్ళను కాపీ చెయ్యటం ఎలా?

కొన్ని వెబ్ సైట్లను సందర్శించినప్పుడు వాటిలో ఆకర్షణీయమైన ఇమేజ్ లు , యానిమేషన్ తో కూడిన ఫ్లాష్ ఫైళ్ళను చూస్తూవుంటాం. ఒక్కొక్కసారి ఫ్లాష్ ఫైళ్ళను సిస్టం లో కాపీ చేసుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లు వుపయోగిస్తూవుంటే ఎటువంటి సాప్ట్ వేర్లు లేదా ప్లగిన్లు అవసరం లేకుండా ఫ్లాష్ ఫైళ్ళను ఎలా కాపీ చెయ్యాలో చూద్దాం.

ఫైర్ ఫాక్స్:
1.ముందుగా ఫ్లాష్ కంటెంట్ కలిగిన వెబ్ సైట్ ని సందర్శించండి. ఫ్లాష్ కంటెంట్ పూర్తిగా లోడ్ అవ్వనివ్వాలి.
2.ఫైర్ ఫాక్స్ లో మెయిన్ మెనూ లో Tools---> Page Info పై క్లిక్ చెయ్యాలి.
3.Page Info విండో లో Media టాబ్ పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు అన్ని మీడియా ఫైల్స్ కనబడతాయి. .swf ఫైల్ ఎక్స్ టెన్షన్ కోసం వెదికి దానిని సెలెక్ట్ చేసుకొని క్రిందవున్న ’Save As' బటన్ పై క్లిక్ చేసి కావలసిన చోట సిస్టం లో ఫ్లాష్ ఫైల్ ని సేవ్ చేసుకోవచ్చు.


ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ :
1.ముందుగా ఫ్లాష్ కంటెంట్ కలిగిన వెబ్ సైట్ ని సందర్శించండి. ఫ్లాష్ కంటెంట్ పూర్తిగా లోడ్ అవ్వనివ్వాలి.
2.ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లోని మెయిన్ మెనూ లో Tools ---> Internet Options పై క్లిక్ చెయ్యాలి.
3.Internet Options లోని General టాబ్ లో Browsing History దగ్గర Settings బటన్ పై క్లిక్ చెయ్యాలి.

4.Temporary Internet Files and History settings లో 'View Files' బటన్ పై క్లిక్ చేస్తే Temporary Internet Files ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ View---> Dtails సెలెక్ట్ చేసుకొని, Type వారీగా ఫైళ్ళను ఎరేంజ్ చేసుకొని ఫైల్ టైప్ .swf extension కోసం వెదికి దానిని కాపీ చెసుకొని కావలసిన చోట పేస్ట్(సేవ్)చేసుకోవచ్చు.



సేవ్ చెయ్యబడిన Shock Wave Flash (.swf) ఫైళ్ళను ఫ్లాష్ ప్లేయర్ లో లేదా ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ లో ప్లే చేసుకోవచ్చు.
Sparkle Flash Keeper అనే ప్రోగ్రామ్ ను వుపయోగించి ఫ్లాష్ ఫైళ్ళను .exe లోకి మార్చుకోవచ్చు.

ఫ్లాష్ మరియు ఇతర మీడియా ఫైళ్ళను వెబ్ సైట్లనుండి సేవ్ చేసుకోవటానికి వుపయోగపడే సాప్ట్ వేర్లు మరియు ప్లగిన్:
1.Flash Saver
2.Flash Favorite
3.Flash Saving Plugin

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

ధన్యవాదాలు

Friday, January 9, 2009

ప్రభుత్వ ఉద్యోగులకు బి ఎస్ ఎన్ ఎల్ బ్రాడ్ బాండ్ సేవలపై 20% తగ్గింపు

ప్రభుత్వ ఉద్యోగులు - రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు (పబ్లిక్ సెక్టార్ యూనిట్స్) సర్వీస్ లో వున్న వారికి మరియు పదవీ విరమణ పొందిన వారికి బ్రాడ్ బాండ్ సేవలపై (వాడకం మరియు అద్దె)బి ఎస్ ఎన్ ఎల్ వారు 20% రాయితీని అందిస్తున్నారు.

ఇప్పటికే బి ఎస్ ఎన్ ఎల్ వారి బ్రాడ్ బాండ్ సేవలను వుపయోగిస్తున్న పైన పేర్కొనబడిన ఉద్యోగులు కూడా ఈ రాయితీని ఒక దరఖాస్తు ద్వారా పొందవచ్చును.

కావలసిన పత్రాలు:

పనిచేసే ఉద్యోగులకు:
పే డ్రాయింగ్ మరియు పంపిణీ అధికారి నుండి నమోదిత నమూనాలో బోనఫైడ్ సర్టిఫికెట్ జతపరచాలి.
పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు:
అటెస్ట్ చెయ్యబడిన పెన్షన్ పే ఆర్డర్ ప్రతిని జతచేయాలి.

మరిన్ని వివరాలకు బి ఎస్ ఎన్ ఎల్ సైట్ ని సందర్శించండి లేదా 1500 లేదా 1800-424-1600 లో సంప్రదించండి.

ధన్యవాదాలు

Wednesday, January 7, 2009

Cobian Backup - డాటా బ్యాక్ అప్ టూల్

ఏదైనా కారణాల వలన డాటా పోకుండా/కరప్ట్ కాకుండా సురక్షితంగా వుండాలంటే తరచూ బ్యాక్ అప్ తీసుకుంటూ వుండాలి. సాధారణంగా మనం మాన్యువల్ గా కావలసిన ఫైల్స్/ఫోల్డర్ లను హార్డ్ డిస్క్ లేదా స్టోరేజ్ డివైస్ లో తీసుకుంటాం. ఒక్కొక్కసారి మరచిపోతాం ...ఫైల్ లాస్/కరప్ట్ అయిన తర్వాత అయ్యో ముందే బ్యాక్ అప్ తీసుకుంటే బాగుండేదే అని అనిపిస్తుంది. అలా జరగకుండా ఒక షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా ఆటోమాటిక్ బ్యాక్ అప్ తీసుకోవటానికి నెట్ లో ఎన్నో వుచిత టూల్స్ లభిస్తున్నాయి. వాటిలో ఒకటే Cobian Backup 9.1.1.193, దీనిని వుపయోగించి కావలసిన ఫైల్స్/ఫోల్డర్లను ఒక షెడ్యూల్ ప్రకారం మన సిస్టం లో వేరే ఫోల్డర్ లో కాని లేదా నెట్ వర్క్ లోని ఏదైనా సిస్టం లో కానీ కావాలంటే జిప్ చేసి బ్యాక్ అప్ తీసుకోవటానికి వుపయోగపడుతుంది. FTP బ్యాక్ అప్ సపోర్ట్ కూడా దీనిలో వుంది.

డౌన్ లోడ్: Cobian Backup 9.1.1.193 సైజ్: 9 MB




ధన్యవాదాలు

Tuesday, January 6, 2009

ఆడియో క్యాసెట్ టేపులను కంప్యూటర్ లేదా సీడీ లలోకి మార్చటానికి....

టేప్ రికార్డర్ల వాడకం తగ్గిపోయి సీడీ ప్లేయర్లు, ఎమ్ పీ త్రీ/ఫోర్ , ఐపాడ్ మొ. వాటి వాడకం క్రమంగా పెరుగుతుండటంతో పాత క్యాసెట్లను అటక ఎక్కించేశాం. ఆపాతమధురాలను మన కంప్యూటర్ లేదా సీడీ లలోకి ఎలా మార్చాలో ఇక్కడ చూద్దాం.

ఆడియో క్యాసెట్ టేపులను కంప్యూటర్ లేదా సీడీ లలోకి మార్చటానికి కావలసినవి:

1.ఆడియో క్యాసెట్ ప్లేయర్
2.ఆడియో క్యాసెట్
3.మేల్-మేల్ 3.5 mm ఆడియో జాక్ (ఇది అన్ని ఎలక్ట్రానిక్స్ రిపైర్ దుకాణాలలో లభిస్తుంది)
4.మన కంప్యూటర్ లో సౌండ్ కార్డ్
5.ఏదైనా ఆడియో ఎడిటింగ్ సాప్ట్ వేర్ ఉదా: Audacity Sound Editor

విధానం:
1.ముందుగా Audacity Sound Editor సాప్ట్ వేర్ ని సిస్టం లో ఇనస్టలేషన్ చెయ్యాలి. మేల్-మేల్ 3.5 mm ఆడియో జాక్ ఒక ప్రక్క క్యాసెట్ ప్లేయర్ కి మరో ప్రక్క సిస్టం లోని సౌండ్ కార్డ్ లైన్-ఇన్ లేదా మైక్ పోర్ట్ కి కనెక్ట్ చెయ్యాలి. Audacity ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఇన్ పుట్ టైప్ మార్చాలి అదెలాగంటే Edit ---> Preferences పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Audio I/O టాబ్ లో Playback మరియు Recording Device దగ్గర సిస్టం సౌండ్ డివైజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Microsoft SoundMapper' సెలెక్ట్ చేసుకోకూడదు. Audio I/O టాబ్ లోనే Channels దగ్గర సౌండ్ క్వాలిటీ Stero సెలెక్ట్ చేసుకోవాలి. ’Ok' బటన్ క్లిక్ చెయ్యాలి.



2.ఇప్పుడు Audacity ప్రోగ్రామ్ లో రికార్డ్ బటన్ (ఎరుపు వ్రుత్తం వున్న బటన్) ప్రెస్ చెయ్యాలి, తర్వాత క్యాసెట్ ప్లేయర్ లో Play బటన్ ప్రెస్ చెయ్యాలి.
3.కావలసిన ట్రాక్ మొత్తం ప్లే అయిన తర్వాత Audacity ప్రోగ్రామ్ లో స్టాప్ (పసుపు చతురస్రం) బటన్ ప్రెస్ చెయ్యాలి. (గమనిక దీనికి ముందే క్యాసెట్ ప్లేయర్ స్విచ్ ఆఫ్ చెయ్యకూడదు)
4. Audacity ప్రోగ్రామ్ లో File ---> Export As Wav లేదా Export As MP3 ఇలా కావలసిన ఫార్మేట్ లోకి export చేసి సిస్టం లో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు CD లేదా DVD లలో బర్న్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం కోసం Audacity ట్యుటోరియల్ చూడండి.


ధన్యవాదాలు

Thursday, January 1, 2009

Google లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ మరియు ట్రాన్స్ లిటెరేషన్ వెబ్ సైట్లు...

క్రొత్త సంవత్సరం లో ప్రతి రోజు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని...మీ ఇంట నవ్వుల పువ్వులు విరబూయాలని ఆశిస్తూ ...మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు...

Google లాంగ్వేజ్ ట్రాన్స్ లేషన్ వెబ్ సైట్ http://translate.google.com/ ఇక్కడ వివిధ భాషల నుండి వేరొక భాషలోకి టెక్స్ట్ ను అనువదించవచ్చు. భారతీయ భాషలలో హిందీ మాత్రమే వుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో హిందీ ఎక్కువగా వుపయోగించాలనే నిభందన వుంటుంది. హిందీ టైపింగ్ /అనువాదం తెలియనివారు ఆంగ్లంలో టైప్ చేసి హిందీ లోకి అనువదించులోవచ్చు. వారికి ఈ సైట్ చాలా వుపయోగపడుతుంది.



Google వారిదే మరొక వెబ్ సైట్ http://www.google.com/transliterate/indic/Telugu. ఇక్కడ హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మళయాళం భాషలలో టైపింగ్ తెలియని వారు ఆ భాష టెక్స్ట్ ను ఆంగ్లం లో టైప్ చేస్తే అది ఆ భాషలోకి మార్చబడుతుంది. ఇక్కడ టైప్ చెయ్యబడిన టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్,వెబ్ సైట్లలో కాపీ,పేస్ట్ చేసుకోవచ్చు.



ధన్యవాదాలు