Showing posts with label ట్యుటోరియళ్ళు. Show all posts
Showing posts with label ట్యుటోరియళ్ళు. Show all posts

Monday, March 18, 2013

ఫేస్ బుక్ అకౌంట్ బ్యాక్ అప్ తీసుకుకోవటం ఎలా?

ప్రముఖ సోషల్ నెట్ వర్క్ ని బ్యాక్ అప్ తీసుకోవటం ఎలాగో ఇక్కడ చూద్దాం.

౧. ముందుగా ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అవ్వాలి, తర్వాత కుడి చేతి ప్రక్క పై మూలన ఉన్న’ గేర్ ’  గుర్తు పై క్లిక్ చేసి ’Account Settings'  ని సెలెక్ట్ చేసుకోవాలి. 


౨. ఇప్పుడు ‘Download a copy of your Facebook data’ లింక్ పై క్లిక్ చెయ్యాలి. 

౩. ఇక్కడ మనకు రెండు రకాల ఆప్షన్లు ఉంటాయి, ఒకటి రెగ్యులర్ Archive మరొకటి Expended Archive. రెగ్యులర్ దానిలో ఫోటోస్, ఛాట్, మెసేజెస్ , అకౌంట్ వివరాలు  మొ. ఉంటాయి. అదే  Expended  లో ఇంకా ఎక్కువ వివరాలు ఉంటాయి ఇనస్టలేషన్ చేసుకున్న అప్లికేషన్లు, అన్-ఫ్రెండ్,ఐపీ అడ్రస్ మరిన్ని వివరాలు ఉంటాయి. రెండింటీ మధ్య తేడాను అక్కడే ఉన్న హెల్ప్ లిం పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు,రెగ్యులర్ Archive కోసం Start My Archive పై క్లిక్ చెయ్యాలి. 

౪.  Request My Download వస్తుంది అక్కడ Start My Archive పై క్లిక్ చెయ్యాలి.


౫.  ఇక్కడ Confirm  పై క్లిక్ చేసిన తర్వాత డాటా మొత్తం సేకరించి డౌన్లోడ్ సమాచారం మన మెయిల్ కి 
పంపబడుతుంది.


౬. Your Download is ready అంటూ మనకు మెయిల్ వస్తుంది, అది రావటానికి కొంత సమయం పడుతుంది, వెయిట్ చెయ్యాలి. మెయిల్ లోని లింక్ పై క్లిక్ చెయ్యగా వచ్చే పేజీలో ఫేస్ బుక్ పాస్ వార్డ్ ఎంటర్ చేసి ’Continue' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Download Archive పై క్లిక్ చెయ్యాలి.  జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది , దానిని అన్ జిప్ చేసుకోవాలి.





ధన్యవాదాలు 

Thursday, March 14, 2013

హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటానికి...[గూగుల్ క్రొత్త ప్రోగ్రామ్]

 తరచూ  పలానా వెబ్ సైట్ హ్యాక్ చెయ్యబడిందని వింటూ ఉంటాం... సెక్యూరిటీ తక్కువగా ఉన్న వెబ్ సైట్లను హ్యాకర్లు సులభంగా చేస్తూ ఉంటారు...  అలా హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటానికి గూగుల్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది అదే  Help for hacked sites . అది హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటం లో సహాయపడగలదు.


వెబ్ సైట్ ని రికవర్ చేసుకోవటానికి సైట్ ఓనర్ల కోసం వ్యాసాలు మరియు విడియోలను గూగుల్ రూపొందించింది, మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

హ్యాక్ అయిన తర్వాత రికవర్ చేసుకోవటానికే కాకుండా అసలు హ్యాక్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా గూగుల్ తెలియ చేస్తుంది. ధన్యవాదాలు

Wednesday, March 21, 2012

ఫోటోఫాప్ నేర్చుకోవటానికి వీడియో ట్యుటోరియల్స్!

ప్రముఖ ఇమేజ్ ఎడిటింగ్ అప్లికేషన్ ఫోటోషాప్ ని ఆన్ లైన్ లో నేర్చుకోవటానికి బెస్ట్ యూట్యూబ్ ఛానెల్స్ ఇక్కడ చూడండి:

౧. Adobe Photoshop Channel

అడోబ్ తమ స్వంత వీడియో ఛానెల్ Lightroom మరియు Photoshop Elements లలో ఫోటోషాప్ వీడియో ట్యుటోరియల్స్ ని చూడవచ్చు.


౨.IceflowStudios Photoshop Video Training

ఈ యూట్యూబ్ ఛానెల్ లో బేసిక్స్ నుండి అడ్వాన్స్ డు ట్యుటోరియల్స్ దాదాపు 50 పైగా వీడియోలు ఇక్కడ ఉన్నాయి.


౩.Photoshopmama’s OPD

ఇక్కడ 140 పైగా వీడియో ట్యుటోరియల్స్ ఉన్నాయి.


౪. TutorVid


౫.Gavin Hoey Photo Videos


౬.Pixel For Life


౭. Creative Sweet TV


ధన్యవాదాలు

Tuesday, February 28, 2012

యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ తొలగించటం ఎలా?

ఇంతకు ముందు పోస్ట్ లో గూగుల్ సెర్చ్ హిస్టరీ ఎలా తొలగించాలో చూశాం కదా ఇప్పుడు యూట్యూబ్ వ్యూయింగ్ మరియు సెర్చ్ హిస్టరీ ఎలా తొలగించాలో చూద్దాం: 

1. Log in to your Google account.
2. Go to https://www.youtube.com
3. Click on your icon.
4. Click “Video Manager”
5. Click “History”
6. Click “Clear all viewing history.”
7. Click “Pause viewing history."
8. Click "Search History."
9. Click "Clear all search history."
10. Click “Pause search history.”
సేకరణ: Electronic Frontier Foundation నుండి.
ధన్యవాదాలు

గూగుల్ ప్రైవసీ పాలసీ మలులోకి రాకముందే గూగుల్ సెర్చ్ హిస్టరీని తొలగించండి!!

మార్చి 1 నుండి గూగుల్ ప్రైవసీ పాలసీ అమలులోకి రానుంది. పాలసీ ని ఇప్పటికే చదివి ఉంటే ఓకే లేకుంటే దానిని ఇక్కడ ఒకసారి చదవండి.  గూగుల్ ప్రోడక్ట్స్ లో మనం సెర్చ్ లు మరియు సందర్శించిన వెబ్ సైట్ల వివరాలు గూగుల్ వెబ్ హిస్టరీ లో ఉంటాయి. మార్ఛి ౧ తర్వాత ఆ వివరాలను గూగుల్ సేకరించే అవకాశం ఉంది. దీంతో ఒక్కొక్కసారి మన వ్యక్తిగత సమాచారం కూడా గూగుల్ కి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి, అర్జెంట్ గా గూగుల్ వెబ్ హిస్టరీ లోని క్లియర్ చెయ్యాలి మరియు Web History is on దగ్గర Pause ని క్లిక్ చెయ్యాలి. 

Google Web History ని ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం:

1. Sign into your Google account(లేదంటే  డైరెక్ట్ గా https://www.google.com/history కి కూడా వెళ్ళి సైన్-ఇన్ చెయ్యవచ్చు).
2. Go to https://www.google.com/history
3. Click "remove all Web History."
4. Click "ok."
ధన్యవాదాలు

Thursday, August 25, 2011

HTTPS మరియు VPN ల గురించి తెలుసుకోవాటానికి వీడియో!!!

సురక్షిత వెబ్ బ్రౌజింగ్ కు కొరకు మనం ఉపయోగించే  Secure HTTP మరియు Virtual Private Network ల గురించి ఈ క్రింది వీడియోలలో చూడండి:








మరిన్ని సెక్యూరిటీకి సంబంధించిన ఉపయోగకరమైన వీడియోలను The Google Privacy Channel లో చూడండి. 


ధన్యవాదాలు 

Wednesday, July 6, 2011

స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి యూట్యూబ్ ఛానెల్స్!!



ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలనుకొనే వారు ఈ క్రింది యూట్యూబ్ చానెళ్ళలోని ఉచిత ట్యుటోరియల్స్ ని చూడండి.

౧. EF podEnglish

Time, Families, Directions, Grocery shopping, Weather, Pets, School friends, Relationships, Films and Technology మొదలగు టాపిక్స్ కి సంబంధించిన ఇంగ్లీష్ చిన్న చిన్న వీడియో ట్యుటోరియల్స్ ని podEnglish లో చూడవచ్చు. ఇది ముఖ్యంగా బిగినర్స్ కి ఉపయోగపడే ఛానెల్.



౨. English with Jennifer

జెన్నిఫర్ అనే ఇనస్ట్రక్టర్ నేర్పించే వీడియో ట్యుటోరియల్స్ ఇక్కడ ఉన్నాయి. Basic English Grammar Lessons, English Vocabulary, English Pronunciation, and American Slang మొదలగు వాటికి సంబంధించిన ప్లేలిస్ట్స్ ఉన్నాయి.



౩. engVid.com

ఇక్కడ 150 కి పైగా వీడియో పాఠాలు ఉన్నాయి:



౪. Hugosite.com



౫. Mister Duncan In England



ధన్యవాదాలు

Thursday, June 16, 2011

కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవటానికి యూట్యూబ్ వీడియో ట్యుటోరియల్స్!


కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవటానికి యూట్యూబ్ వీడియో ట్యుటోరియల్స్ లింకులను ఇక్కడ చూడండి:
    సేకరణ: మేక్ యూజ్ ఆఫ్ నుండి

    ధన్యవాదాలు

    Wednesday, June 1, 2011

    ఫోటోషాప్ లో యానిమేటెడ్ GIFs తయారుచెయ్యటం ఎలా? [ట్యుటోరియల్]

    ఫోటోషాప్ లో యానిమేటెడ్ GIFs తయారుచెయ్యటానికి ఫోటోషాప్ గురు Russell Brown రూపొందించిన వీడియో ట్యుటోరియల్ ఇక్కడ చూడండి:



    ఫోటోషాప్ పై Russell Brown మరిన్ని వీడియోలను Adobe TV లో చూడండి మరియు ఇక్కడ చూడండి.

    ధన్యవాదాలు

    Thursday, March 24, 2011

    షేక్ అయిన వీడియోలను స్టెబిలైజ్ చెయ్యటం ఎలా? [వీడియో]

    షేక్ అయిన (చెదిరిన) వీడియోలను యూట్యూబ్ ఆన్ లైన్ వీడియో ఎడిటర్ లో స్టెబిలైజ్ చెయ్యటం ఎలానో లాబ్ నాల్ వీడియో ఇక్కడ చూడండి.



    ధన్యవాదాలు

    Wednesday, February 23, 2011

    డ్రాప్‍బాక్స్ తో ఫైళ్ళను ఆటోమాటిక్ గా బ్యాక్‍అప్ తీసుకోవటం ఏలా?[వీడియో ట్యుటోరియల్]

    డ్రాప్‍బాక్స్ తో ఫైళ్ళను ఆటోమాటిక్ గా బ్యాక్‍అప్ తీసుకోవటానికి సంబంధించిన లాబ్ నాల్ వీడీయో ట్యుటోరియల్ ఇక్కడ చూడండి:




    ధన్యవాదాలు

    Tuesday, October 12, 2010

    GIMP బేసిక్ వీడియో ట్యుటోరియల్స్ !!!

    ఫోటోషాప్ కి ప్రత్యామ్నాయమైన GIMP నేర్చుకోవటానికి ఉపయోగపడే వీడియో ట్యుటోరియళ్ళు యిక్కడ చూడండి:





















    మరిన్ని ట్యుటోరియల్స్ కోసం GIMP సైట్ చూడండి.

    ధన్యవాదాలు

    Thursday, June 3, 2010

    మీరే స్వంతగా 3D కళ్ళద్దాలు తయారుచేసుకోండి !!!

    3D వీడియోలు లేదా సినిమాలు చూడాలంటే కనుక 3D కళ్ళద్దాలు అవసరమవుతాయి, అవి చాలా ఖరీదుగా వుంటాయి. మనమే సొంతగా 3D కళ్ళద్దాలు తయారుచేసుకుంటే....

    కావలసిన వస్తువులు:
    రెడ్ మరియు బ్లూ కలర్ పర్మినెంట్ మార్కర్ పెన్ లు మరియు ఏదైనా ప్లాస్టిక్ ట్రాన్సపరెంట్ షీటు ఉదా. CD కవర్ (jewel case) లోని ట్రాన్సపరెంట్ భాగం.

    తయారుచేసే విధానం:
    CD Case లోని ట్రాన్సపరెంట్ సైడ్ ని తీసుకొని మన కళ్ళ సైజ్ కి రెడ్ మరియు బ్లూ మార్కర్లతో చతురస్రాకారం లో దిద్దాలి. గ్లాసెస్ రెడీ... 3D మూవీ లేదా వీడీయో చూసేటప్పుడు బ్లూ భాగం కుడి కంటికి , ఎరుపు భాగం ఎడమ కంటికి వుండేలా చూడాలి.



    ట్రాన్సపరెంట్ సైడ్ మనకు అనుకూలంగా కావలసిన విధంగా కళ్ళజోడు లా చేసుకోవచ్చు.

    వీడియో:


    అదేవిధంగా సన్ గ్లాసెస్ ని 3D గ్లాసెస్ గా మార్చటానికి వీడియో:


    ఇంకెందుకు ఆలశ్యం ట్రై చెయ్యండి!!!

    ధన్యవాదాలు

    Saturday, May 1, 2010

    వికీపీడియా పేజీలను పీడీఎఫ్ బుక్స్ గా డౌన్లోడ్ చేసుకోవటానికి...

    వికీపీడియా పేజీలను పీడీఎఫ్ బుక్స్ గా డౌన్లోడ్ చేసుకోవటానికి ఈ క్రిందివిధంగా చెయ్యండి:

    ౧. వికీపీడియో లో అంతర్బాగంగా వున్న book creator (ప్రక్కన క్లిక్ చెయ్యండి) టూల్ ని ’start book creator' బటన్ పై క్లిక్ చేసి ప్రారంభించాలి.

    ౨. ఇప్పుడు పీడిఎఫ్ బుక్ గా మార్చవలసిన పేజీలను సెర్చ్ చేసుకొని పైన Book Creator దగ్గర వున్న ’Add this page to your book’ పై క్లిక్ చెయ్యాలి. బుక్ లో యాడ్ చెయ్యవలసిన పేజీ లు పూర్తి అయ్యే వరకు ఈ విధంగానే చెయ్యాలి.

    ౩. జత చెయ్యవలసిన పేజీలు పూర్తి అయిన తర్వాత పైన వున్న ’Show book' పై క్లిక్ చెయ్యాలి.

    ౪. ఇప్పుడు వచ్చే Manage your book పేజీ లో Title ఇచ్చి ’Download' బటన్ క్లిక్ చేసి బుక్ ని సేవ్ చేసుకోవటమే.

    వీడీయో:


    స్టార్ట్: book creator

    ధన్యవాదాలు

    Thursday, March 25, 2010

    ఇతరులు మన మెయిల్ ఎకౌంట్ ఉపయోగిస్తుంటే జీ-మెయిల్ వార్నింగ్ మెసేజ్ యిస్తుంది...

    జీమెయిల్ క్రొత్త ఫీచర్ ని లాంచ్ చేసింది అదేమిటంటే ఎవరైనా మన ఈ-మెయిల్ ఎకౌంట్ అనుమానాస్పదంగా ఉపయోగిస్తున్నారు అనిఅనుకొంటే కనుక మనం ఎకౌంట్ యాక్సెస్ చేసినప్పుడు ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా హెచ్చరిస్తుంది.



    వార్నింగ్ మెసేజ్ ప్రక్కన వున్న ’Show details' పై క్లిక్ చేసి నప్పుడు యాక్టివిటీ విండోలో మోస్ట్ రీసెంట్ యాక్సెస్ పాయింట్స్ ని లొకేషన్( దేశం), ఐపీ అడ్రస్, డేట్ / టైమ్ తదితర వివరాలు చూపిస్తుంది.



    మీకు అనుమానంగా వుంటే అక్కడే పాస్ వార్డ్ మార్చుకోవచ్చు లేదా మీరే మీ ఎకౌంట్ వివిధ ప్రదేశాల నుండి యాక్సెస్ చేస్తే కనుక "Dismiss" పై క్లిక్ చేసి మెసేజ్ తొలగించవచ్చు.

    మరింత సమాచారం కోసం జీమెయిల్ అఫీషియల్ బ్లాగ్ ని చూడండి.

    ధన్యవాదాలు

    Thursday, February 25, 2010

    గూగుల్ సెర్చ్ లో అడల్ట్ కంటెంట్ బ్లాక్ చెయ్యటం ఎలా?

    మన పిల్లలు గూగుల్ లో దేని కోసమైనా సెర్చ్ చేసినప్పుడు అడల్ట్ కంటెంట్ వుండే టెక్స్ట్, ఇమేజెస్, వీడీయో లేదా లింకులు రాకుండా గూగుల్ సెర్చ్ సెట్టింగ్స్ లో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా వాటిని నిరోధించవచ్చు. దాని కోసం ఈ క్రింది విధంగా చెయ్యండి.

    ౧. మీ డీపాల్ట్ బ్రౌజర్ లో గూగుల్ సెర్చ్ (http://www.google.com/)సైట్ ని ఓపెన్ చెయ్యాలి. సెర్చ్ పేజీలో కుడి చేతి ప్రక్క పైన వున్న ’Search Settings’ పై క్లిక్ చెయ్యాలి.



    ౨. ఇప్పుడు Google Preferences పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Safe Search Filtering దగ్గర Google's SafeSearch లో వున్న ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డు సెట్టింగ్స్ కోసం 'LockSafeSearch' పై క్లిక్ చెయ్యాలి.



    ౩. ఇప్పుడు గూగుల్ ఎకౌంట్ యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ యిచ్చి sign in చెయ్యాలి.



    ౪. Google Safeserch Filtering పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ’Lock SafeSearch' బటన్ పై క్లిక్ చెయ్యాలి.





    ౫. అన్ని సెర్చెస్ కి Safe Search లాక్ అయిన తర్వాత ’Back to Search settings' పై క్లిక్ చెయ్యాలి.



    ౬. ఇప్పుడు గూగుల్ ప్రిఫెరెన్సెస్ పేజ్ కి వెళతాము. క్రింద వున్న ’Save Preferences' బటన్ పై క్లిక్ చెయ్యాలి.



    ధన్యవాదాలు

    Saturday, February 13, 2010

    Google Buzz కి సంబంధించిన వీడియో!!

    Google Buzz ఎలా పనిచేస్తుందో తెలియచేసే వీడియో :



    ధన్యవాదాలు

    Friday, December 4, 2009

    గూగుల్ Public DNS సెటప్ వీడియో

    ఒక వెబ్ సైట్ ని మన బ్రౌజర్ నుండి యాక్సెస్ చెయ్యటానికి, దానికి సంబంధించిన వెబ్ సర్వర్ హోస్ట్ చెయ్యబడిన డొమైన్ యొక్క ఐపి అడ్రస్ అవసరమవుతుంది, ఆ ఐపిని వెతకటం లో Public DNS Server మనకు సహాయపడుతుంది. వెబ్ సర్ఫింగ్ "faster, safer and more reliable" గా వుండటం కోసం గూగుల్ తమ స్వంత Public DNS Service ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి. సాధారణంగా DNS Server Address ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) ఇస్తారు, దానిని ప్రత్యామ్నాయంగా గూగుల్ DNS Server IP address యివ్వవచ్చు, అవి 8.8.8.8 మరియు 8.8.4.4, ఇది పూర్తిగా ఉచితం.

    Google Public DNS వలన ప్రయోజనాలు:
    - Speed up your browsing experience.
    - Improve your security.
    - Get the results you expect with absolutely no redirection.

    Windows XP లో Google DNS ని Setup చెయ్యటానికి వీడియో:



    Windows 7 / Vista లో Google DNS ని Setup చెయ్యటానికి వీడియో:



    ధన్యవాదాలు

    Monday, May 4, 2009

    జీ-మెయిల్ లో వెయ్యికి పైగా ఎమోషన్లు ...

    గూగుల్ ఇప్పుడు జీ-మెయిల్ లో వెయ్యికి పైగా ఎమోషన్లు యాడ్ చేసింది ...కొత్త ఎమోషన్లలో జాతీయ పతాకలు, పండ్లు, జంతువులు, వాహనాలు, వివిధ యానిమేషన్లు యిలా విడివిడిగా 13 క్యాటగిరీల్లో వున్నాయి. ఈ-మెయిల్ పంపేటప్పుడు కొన్ని పదాలకు బదులుగా ఈ ఎమోషన్లను ఉపయోగించుకోవచ్చు. జీ-మెయిల్ లో ఈ ఫీచర్ పొందటం కోసం ...జీ-మెయిల్ లాగిన్ అయ్యి ...settings ---> Labs---> Extra Emoji దగ్గర Enable సెలెక్ట్ చేసుకుని....క్రిందవున్న Save Changes బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు ’Compose Mail' లో అధనపు ఎమోషన్లు పొందవచ్చు.



    జీ-మెయిల్ కి సంబంధించిన సమాచారం, టిప్స్ మరియు ట్రిక్స్ కోసం జీ-మెయిల్ ఆఫీషియల్ బ్లాగ్ http://gmailblog.blogspot.com/ ని సందర్శించండి.

    ధన్యవాదాలు

    Tuesday, March 24, 2009

    మీ చేతి వ్రాత నే ఫాంట్ గా మార్చుకోండి...

    మన చేతి వ్రాత నే ఫాంట్ గా మార్చుకొని వివిధ అప్లికేషన్లలో వాడుకోవచ్చు. దానికోసం ముందుగా http://www.yourfonts.com/ సైట్ కి వెళ్ళండి అక్కడ వివరించిన 7 స్టెప్పుల్లో ఒక దాని తర్వాత మరొకటి ఫాలో అవుతూ చేతి వ్రాత ని ఫాంట్ గా మార్చుకోవచ్చు... అదీ ఫ్రీగా.

    Step 1. Print Template

    Print Template పై క్లిక్ చేసి టెంప్లేట్స్ ని ఫీడీఎఫ్ లో కాని లేదా ఇమేజ్ గా కాని ఓపెన్ చేసి ప్రింట్ తీసుకోవాలి.


    Step 2. Complete Template

    ప్రింట్ తీసుకున్న టెంప్లేట్స్ ని నల్ల ఇంక్ పెన్ లేదా మార్కర్ ని ఉపయోగించి దానిలోని ABCD లు మరియు యితర అక్షరాలను మీడియం మందంగా నాల్గు రూళ్ళ బుక్ లో వ్రాసే విధంగా పూరించండి. ఉదాహరణకి ఈ క్రింది చిత్రాన్ని చూడండి.



    Step 3. Scan & Save Template

    పూరించిన టెంప్లేట్లను స్కాన్ చేసి .gif, .jpg, .jpeg, .png, .tif, లేదా .tiff ఫైళ్ళ గా సేవ్ చేసుకోవాలి.

    Step 4. Upload Template

    ఫాంట్ కి ఒక్ పేరు యిచ్చి ... సేవ్ చేసుకున్న టెంప్లేట్లను ’Chose File' పై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ’Upload' పై క్లిక్ చెయ్యాలి.


    Step 5. Preview your font

    టెంప్లేట్లు అప్ లోడ్ అయి 1 నుండి 15 నిమిషాలలో ఫాంట్ జెనెరేట్ అయి ప్రివ్యూ వస్తుంది.

    Step 6. Download

    Download పై క్లిక్ చేసి మీ ఫాంట్ ని సేవ్ చేసుకోవాలి.



    Step 7. Install & Use

    సేవ్ చేసుకున్న ఫాంట్ ని ఇనస్టలేషన్ చేసుకోవటం కోసం Start ---> Settings ---> Control Panel ----> Fonts ఫోల్డర్ ఓపెన్ చెయ్యాలి. File---> Install New Font సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌజ్ చేసి ఫాంట్ ని సెలెక్ట్ చేసుకొని ’Ok' పై క్లిక్ చెయ్యాలి. లేదంటే సేవ్ చేసుకొన్న ఫాంట్ ని Copy చేసి Fonts ఫోల్డర్ లో Paste కూడా చెయ్యవచ్చు. ఫాంట్ ఇనస్టలేషన్ అయిన తర్వాత దానిని వుపయోగించుకోవచ్చు.

    ధన్యవాదాలు