Thursday, February 25, 2010

గూగుల్ సెర్చ్ లో అడల్ట్ కంటెంట్ బ్లాక్ చెయ్యటం ఎలా?

మన పిల్లలు గూగుల్ లో దేని కోసమైనా సెర్చ్ చేసినప్పుడు అడల్ట్ కంటెంట్ వుండే టెక్స్ట్, ఇమేజెస్, వీడీయో లేదా లింకులు రాకుండా గూగుల్ సెర్చ్ సెట్టింగ్స్ లో కొద్దిపాటి మార్పులు చేసుకోవటం ద్వారా వాటిని నిరోధించవచ్చు. దాని కోసం ఈ క్రింది విధంగా చెయ్యండి.

౧. మీ డీపాల్ట్ బ్రౌజర్ లో గూగుల్ సెర్చ్ (http://www.google.com/)సైట్ ని ఓపెన్ చెయ్యాలి. సెర్చ్ పేజీలో కుడి చేతి ప్రక్క పైన వున్న ’Search Settings’ పై క్లిక్ చెయ్యాలి.౨. ఇప్పుడు Google Preferences పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ Safe Search Filtering దగ్గర Google's SafeSearch లో వున్న ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డు సెట్టింగ్స్ కోసం 'LockSafeSearch' పై క్లిక్ చెయ్యాలి.౩. ఇప్పుడు గూగుల్ ఎకౌంట్ యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ యిచ్చి sign in చెయ్యాలి.౪. Google Safeserch Filtering పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ’Lock SafeSearch' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

౫. అన్ని సెర్చెస్ కి Safe Search లాక్ అయిన తర్వాత ’Back to Search settings' పై క్లిక్ చెయ్యాలి.౬. ఇప్పుడు గూగుల్ ప్రిఫెరెన్సెస్ పేజ్ కి వెళతాము. క్రింద వున్న ’Save Preferences' బటన్ పై క్లిక్ చెయ్యాలి.ధన్యవాదాలు

Wednesday, February 24, 2010

Lyrics Plugin - విండోస్ మీడియా ప్లేయర్ లో పాటల లిరిక్ పొందటం కోసం ప్లగిన్

సంగీత ప్రియులకు శుభవార్త!!! Lyrics Plugin ని విండోస్ మీడీయా ప్లేయర్ లేదా విన్ యాంప్ తో జత చెయ్యటం వలన మనం వినే పాటల లిరిక్ ని చూడవచ్చు. ఇష్టమైన పాటలు వినేటప్పుడు ఆటోమాటిక్ గా లిరిక్ కూడా డిస్ప్లే అవుతుంది. Lyrics Plugin సైట్ లో Winamp మరియు Windows Media Player కోసం వేరు వేరుగా వున్న ప్లగిన్స్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.
డౌన్లోడ్: Lyrics Plugin

ధన్యవాదాలు

Monday, February 22, 2010

Extra RAM - RAM ఆప్టిమైజేషన్ టూల్ ...

పీసీ పై కొంత సమయం పనిచేసిన తర్వాత దాని వేగం మందగించటం ప్రతి పీసీ యూజర్ గమనిస్తూవుంటారు. సిస్టం మెమొరీ లో పేరుకుపోయిన అనవసరమైన ఫైళ్ళను తొలగించటం ద్వారా అది ఫ్రీ అయ్యి పీసీ వేగంగా పనిచేస్తుంది. సిస్టం మెమొరీని ఫ్రీ చేసి దాని పనితనాన్ని మెరుగుపరచటంలో Extra RAM అనే RAM ఆప్టిమైజేషన్ టూల్ ఉపయోగపడూతుంది. Extra RAM ఇక చిన్న అప్లికేషన్ ఇది బ్యాక్ గ్రౌండ్ లో పనిచేస్తూ (సిస్టం ట్రేలో వుంటుంది) సిస్టం మెమొరీ లో వున్న అనవసరమైన ఫైళ్ళని తొలగిస్తూవుంటుంది.డౌన్లోడ్ మరియు యితర సమాచారం కోసం Extra RAM సైట్ ని చూడండి. ఇది Windows XP, Windows Vista, Windows 7 లలో పనిచేస్తుంది.

డౌన్లోడ్: Extra RAM

ధన్యవాదాలు

Friday, February 19, 2010

Comodo Dragon - సురక్షితమైన ఉచిత ఇంటర్నెట్ బ్రౌజర్ !!!

గూగుల్ క్రోమ్ లో ఉపయోగించిన క్రోమియమ్ టెక్నాలజీ అధారంగా ప్రముఖ Comodo వారిచే రూపొందించబడిన వేగవంతమైన మరియు సురక్షితమైన ఉచిత ఇంటర్నెట్ బ్రౌజర్ Comodo Dragon...Comodo Dragon గురించి Comodo వారి మాటల్లో Comodo Dragon వేగవంతమైన వెబ్ సర్ఫింగ్ ని అందిస్తూ, ఎక్కువ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఫీచర్లు కలిగివుండి ఫిస్టెర్స్, స్కామర్స్, హ్యకర్స్, డౌన్లోడ్ ట్రాకింగ్, కుకీస్ నుండి కాపాడుతుంది. ఇతర ఇంటర్నెట్ బ్రౌజర్లతో పోలిస్తే దీనిలో ఎక్కువ సెక్యూరిటీ మరియు ప్రైవసీ ఫీచర్లు వున్నాయి. వివిధ సైట్ల నుండి కుకీస్ డౌన్లోడ్ కాకుండా ఆపుతుంది. డొమైన్ వ్యాలిడేషన్ టెక్నాలజీ, డౌన్లోడ్ ట్రాకింగ్ ని అదుపుచేయటం మరియు SSL Certificate Identification వలన ఇంటర్నెట్ ని సురక్షితంగా సర్ఫ్ చెయ్యవచ్చు.

Comodo Dragon Features:
- Improved Privacy over Chromium
- Easy SSL Certificate Identification
- Fast Website Access
- Greater Stability and Less Memory Bloat
- Incognito Mode Stops Cookies, Improves Privacy
- Very easy to switch from your Browser to the Dragon

కొమోడో డ్రాగన్ ఇంటర్నెట్ బ్రౌజర్ మైక్రోసాప్ట్ విండోస్ ఎక్స్పీ, విస్టా మరియు విండోస్ 7 లలో పనిచేస్తుంది.

డౌన్లోడ్: కొమోడో డ్రాగన్ (సైజ్: 20.9 MB)

ధన్యవాదాలు

Tuesday, February 16, 2010

LookInMyPC - మీ కంప్యూటర్ గురించి పూర్తిగా తెలుసుకోండి !!!

మన కంప్యూటర్ కాన్ఫిగరేషన్ మరియు ఇనస్టలేషన్ చెయ్యబడిన సాప్ట్ వేర్ / హార్డ్ వేర్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవటానికి LookInMyPC అనేటూల్ ఉపయోగపడుతుంది. సిస్టం కి సంబంధించిన సమాచారమే కాకుండా సిస్టం డయాగ్నాస్టిక్ ఇన్ఫర్మేషన్ అంటే రన్ అవుతున్న ప్రాసెస్ లు/ సర్వీసులు/ సాప్ట్ వేర్లు , స్టార్ట్ అప్ ప్రోగ్రాములు, విండోస్ అప్ డేట్స్, నెట్ వర్క్ సమాచారం, ఈవెంట్ లాగ్, యాంటీ వైరస్ ఇన్మర్మేషన్, బ్యాటరీ ఇన్మర్మేషన్ మొదలగు వాటికి సంబంధించిన రిపోర్ట్స్ జెనెరేట్ చెయ్యవచ్చు , జెనెరేట్ చెయ్యబడిన రిపోర్ట్స్ ని ప్రింట్ కూడా చేసుకోవచ్చు. దీనిలోని ఈ-మెయిల్ ఆప్షన్ ద్వారా జెనెరేట్ చెయ్యబడిన రిపోర్ట్స్ ని కావలసిన వారికి మెయిల్ చెయ్యవచ్చు.
ఇది అన్ని విండోస్ వెర్షన్లలో పనిచేస్తుంది. ఉచిత డౌన్లోడ్ మరియు మరింత సమాచారం కోసం LookInMyPC సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Monday, February 15, 2010

Gantt Chart - ఉచిత ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ & ప్లానింగ్ సాప్ట్ వేర్

Gantt Project ఉచిత ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ & ప్లానింగ్ సాప్ట్ వేర్, ఇది ప్రముఖ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సాప్ట్ వేర్ అయిన మైక్రోసాప్ట్ ప్రాజెక్ట్ కి ప్రత్యామ్నాయం. Gantt Project విండోస్, Mac OS X మరియు Linux లలో పనిచేస్తుంది.Gantt Project సంబంధించిన పరిచయ వీడియో ని ఇక్కడ చూడండి.

మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు Gantt Project సైట్ చూడండి.

ధన్యవాదాలు

Saturday, February 13, 2010

Google Buzz కి సంబంధించిన వీడియో!!

Google Buzz ఎలా పనిచేస్తుందో తెలియచేసే వీడియో :ధన్యవాదాలు

Friday, February 12, 2010

Drawspace - ఆన్ లైన్ లో డ్రాయింగ్ నేర్చుకోవటానికి!

పిల్లలు, పెద్దలు ఎవరైనా సులభ పధ్ధతుల్లో ఉచితంగా డ్రాయింగ్ నేర్చుకోవాలనుకొంటే కనుక Drawspace సైట్ కి వెళ్ళాల్సిందే, ఇక్కడ డ్రాయింగ్ నేర్చుకోవటానికి ఎన్నో పాఠాలున్నాయి, వాటిని Beginner, Intermediate, Advaced అనే మూడు విభాగాలుగా విభజించారు. ఇక్కడ సాధారణ డ్రాయింగ్, షేడింగ్, క్యారికేచర్, కార్టూన్లు మొదలగు వాటిని అందంగా మరియు ఆకర్షణీయంగా గీయటానికి ఎన్నో పాఠాలున్నాయి.


ఇంకా... ఎందుకు ఆలశ్యం Drawspace సైట్ కి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడవున్న పాఠాల ద్వారా అందమైన బొమ్మలు గీయటం మొదలు పెట్టండి.

వెబ్ సైట్: Drawspace

ధన్యవాదాలు

Fill Any PDF - పీడీఎఫ్ ఫార్మ్స్ ని ఫిల్ చెయ్యటానికి ఉచిత ఆన్ లైన్ ఎడిటర్

ఏదైనా పీడీఎఫ్ రూపం లో వున్న అప్లికేషన్/ఫారాలను ప్రింట్ తీసుకొని చేతితో వ్రాయకుండా లేదా తిరిగి టైప్ చెయ్యకుండా పీడీఎఫ్ డాక్యుమెంట్ లోనే నింపటానికి FillAnyPDF.com అనే సైట్ కి వెళ్ళి Upload Form to Fill దగ్గర 'Browse' పై క్లిక్ చేసి నింపవలసిన పీడీఎఫ్ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మన ఫార్మ్ ని ఇతరులతో షేర్ చేసుకోవాలంటే కనుక Share blank form with others దగ్గర టిక్ పెట్టాలి . ఇప్పుడు ’Fill Now' పై క్లిక్ చెయ్యాలి. ఖాళీ డాంక్యుమెంట్ ని ఇతరులతో పంచుకోవటానికి అడ్రస్ బార్ లోని లింక్ ని వారికి తెలియ చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ వున్న ఎడిటింగ్ టూల్స్ ని ఉపయోగించి ఫార్మ్ ని నింపవచ్చు. తర్వాత ’Download' పై క్లిక్ చేస్తే నింపిన ఫార్మ్ డౌన్లోడ్ లింక్ వస్తుంది, 12 గంటల లోపు ఆ లింక్ ని ఉపయోగించి ఫిల్ చేసిన ఫార్మ్ ని పొందవచ్చు.మరిన్ని వివరాలకు FillAnyPDF.com సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Thursday, February 11, 2010

రిమోట్ విండోస్ కంప్యూటర్ డెస్క్ టాప్ ని యాక్సెస్ చెయ్యటానికి...

విండోస్ లోని Remote Desktop Connection అనే ఫీచర్ ని వుపయోగించి నెట్ వర్క్ లో వున్న విండోస్ కంప్యూటర్ ని యాక్సెస్ చెయ్యవచ్చు. దీని కోసం ఈ క్రింది విధంగా చెయ్యాలి.

౧. నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ ని అయితే యాక్సెస్ చెయ్యాలనుకొంటున్నామో ఆ కంప్యూటర్ లో My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties ని సెలెక్ట్ చేసుకోవాలి.
౨. ఇప్పుడు System Properties డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది అక్కడ Remote టాబ్ ని సెలెక్ట్ చేసుకొని Remote Desktop దగ్గరవున్న Allow users to connect remotely to this computer దగ్గర క్లిక్ చెయ్యాలి. ఇలా చెయ్యటం వలన నెట్ వర్క్ లోని అందరు యూజర్లు ఆ కంప్యూటర్ డెస్క్ట్ టాప్ ని యాక్సెస్ చెయ్యగలరు లేదు కావలసిన యూజర్లను మాత్రమే allow చెయ్యటానికి ’Select Remote Users' పై క్లిక్ చేసి కావలసిన యూజర్లను యాడ్ చేసుకోవచ్చు.పైన చెప్పిన మార్పులు చేసిన తర్వాత System Properties డైలాగ్ బాక్స్ లో 'OK' పై క్లిక్ చెయ్యాలి. ఈ సిస్టం యొక్క computer name ని గుర్తు పెట్టు కోవాలి.

౩. ఇప్పుడు వేరొక కంప్యూటర్ కి వెళ్ళి Start ---> All Programs ---> Accessories ---> Remote Desktop Connection పై క్లిక్ చెయ్యాలి. Remote Desktop Connection డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఇంతకుముందు మార్పులు చేసిన సిస్టం యొక్క పూర్తి Computer Name ఎంటర్ చేసి Connect బటన్ పై క్లిక్ చేస్తే లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. అక్కడ యాక్సెస్ చెయ్యవలసిన సిస్టం యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ ఎంటర్ చేసి ఆ రిమోట్ సిస్టం డెస్క్ట్ టాప్ ని యాక్సెస్ చెయ్యవచ్చు.ధన్యవాదాలు