Tuesday, January 19, 2010

Microsoft KODU - మీ స్వంత వీడియో గేమ్ తయారు చేసుకోవటానికి ...

ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకున్నా స్వంత పీసీ వీడియో గేమ్ లు తయారుచేసుకోవటానికి మైక్రోసాప్ట్ వారి KODU Game Lab ఉపయోగపడుతుంది. KODU ఒక సులభమైన యూజర్ ఇంటఫేజ్ కలిగిన ఐకాన్ ఆధారిత వర్చువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. KODU తో క్రియేట్ చేసిన గేమ్స్ ని Xbox గేమ్ కంట్రోలర్ అవసరం లేకుండా విండోస్ పీసీ లో మౌస్ మరియు కీబోర్డ్ సహాయంతో ప్లే చెయ్యవచ్చు. గేమ్ తయారుచెయ్యటంలో ట్యుటోరియల్స్ సహాయపడతాయి. KODU రన్ అవ్వటానికి .NET 3.5 మరియు the XNA framework 3.1 అవసరం, అవి మన పీసీ లో లేకున్నా KODU ఇనస్టలేషన్ సమయంలో ఆటోమాటిక్ గా డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ అవుతాయి.

KODU ని ఉపయోగించి గేమ్ తయారుచేసిన విధానానికి సంబంధించిన వీడియో:


ఫీచర్లు:
Kodu provides an end-to-end creative environment for designing, building, and playing your own new games.

- High-level language incorporates real-world primitives: collision, color, vision
- Runs on Xbox 360 and PC
- Interactive terrain editor
- Bridge and path builder
- Terrain editor - create worlds of arbitrary shape and size
- 20 different characters with different abilities

ఉచిత డౌన్లోడ్ మరియు మరింత సమాచారం కోసం KODU Game Lab సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Friday, January 15, 2010

Comodo Time Machine - విండోస్ సిస్టం రిస్టోర్ కి ప్రత్యామ్నాయం

సిస్టం కి వైరస్ ఎటాక్ జరిగినప్పుడు లేదా టెస్టింగ్ సాప్ట్ వేర్లు ఇనస్టలేషన్ చేసినప్పుడు లేదా తెలియకుండా జరిగిన పొరపాటువలన సిస్టం కి డామేజ్ జరిగి మన కంప్యూటర్ సరిగా పనిచెయ్యనపుడు సాధారణంగా మనం విండోస్ సిస్టం టూల్స్ లో వచ్చే Sysytem Restore ని ఉపయోగించి అది సరిగ్గా పనిచేసిన రోజుకి తిరిగి తీసుకొని వెళ్ళవచ్చు. Sysytem Restore తో ఒక్కొక్కసారి సిస్టం రీస్టోర్ కాదు దీనిని మనం గమనించేవుంటాం. ప్రముఖ COMODO వారు విండోస్ సిస్టం రీస్టోర్ కి ప్రత్యామ్నాయంగా COMODO Time Machine CTM) అనే శక్తివంతమైన సిస్టం రోల్ బ్యాక్ యుటిలిటీని రూపొందించారు. CTM రిజిస్ట్రీ, ముఖ్యమైన ఆపరేటింగ్ సిస్టం ఫైళ్ళు, యూజర్ క్రియేటెడ్ డాక్యుమెంట్లు ఇలా సిస్టం మొత్తం రికార్డ్ యొక్క 'snapshots' తీసుకొంటుంది. 'snapshots' ని కావలసినప్పుడు తీసుకొనేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. వైరస్ లు ఎటాక్ చేసినప్పుడు లేదా క్రాష్ అయినప్పుడు ఈ స్నాప్ షాట్స్ ని ఉపయోగించి తిరిగి సిస్టం సరిగా పనిచేసేలా చెయ్యవచ్చు.COMODO Time Machine ఫీచర్లు:

- Easy to use - even beginners can quickly create system snapshots with a few mouse clicks
- Provides instant and comprehensive system recovery after virus or spyware infections
- Instantly reclaim your machine after devastating system crashes
- Rollback the changes to ALL your documents - not just changes to system files and the registry
- Boot-up console allows you to rollback even when your system will not boot to Windows
- Test new software and network configurations in the knowledge that you can quickly switch back if problems develop
- Completely remove unwanted software installations without the need to uninstall or clean the registry
- Flexible restore options allow you to mount and browse snapshots to recover individual files or folders
- Right click on any file or folder to synchronize it with a snapshot version
- Schedule regular system snapshots to ensure highly relevant restore points
- Network administrators have another way to quickly fix user or software problems
- Libraries, Internet cafes and other publicly shared networks can schedule a total system restore at the end of each session

COMODO Time Machine ఉపయోగించేవిధానం:మరింత సమాచారం కోసం COMODO Time Machine సైట్ ని చూడండి.

డౌన్లోడ్: COMODO Time Machine

ధన్యవాదాలు

Wednesday, January 13, 2010

మీ ఫైళ్ళను ఎక్కడినుండైనా యాక్సెస్ చెయ్యటానికి గూగుల్ డాక్స్ కి అప్ లోడ్ చెయ్యండి...

ముఖ్యమైన ఫైళ్ళను ఎప్పుడైన్నా ఎక్కడైనా యాక్సెస్ చెయ్యటానికి USB డ్రైవ్ లలో తీసుకొని వెళ్ళే అవసరం లేకుండా సింపుల్ గా గూగుల్ డాక్స్ అప్ లోడ్ చేసి వాటిని అవసరమైనప్పుడు ఆన్ లైన్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. గూగుల్ డాక్స్ లో 250 MB వరకు సైజ్ వున్న ఫైళ్ళను గరిష్టంగా 1 GB వరకు అప్ లోడ్ చెయ్యవచ్చు.

గూగుల్ డాక్స్ ఫీచర్లు:
- Upload from and save to your desktop
- Edit anytime, from anywhere
- Pick who can access your documents
- Share changes in real time
- Files are stored securely online
- It's free!

మరింత సమాచారం కోసం గూగుల్ అఫీషియల్ బ్లాగు ని చూడండి.

మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

ధన్యవాదాలు

Tuesday, January 12, 2010

Speccy - సిస్టం సమాచారం తెలుసుకోవటానికి ...

ప్రముఖ సాప్ట్ వేర్లు CCleaner, Defraggler, Recuva లను అందించిన Piriform నుండి వచ్చిన మరొక సాప్ట్ వేర్ Speccy. Speccy ని ఉపయోగించి మన కంప్యూటర్ కి సంబంధించిన సమగ్ర సమాచారం అంటే ప్రాసెసర్ బ్రాండ్ మరియు మోడల్, హార్డ్ డిస్క్ సైజ్ మరియు స్పీడ్, RAM, మదర్ బోర్డ్, ఆప్టికల్ డ్రైవ్, ఆపరేటింగ్ సిస్టం మొదలగు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties ని సెలెక్ట్ చేసుకొంటే మనకు మన సిస్టం కి సంబంధించిన కొంత సమాచారం మరియు Device Manager కి వెళితే హార్డ్ వేర్ కి సంబంధించిన సమాచారం టూకీ గా తెలుసుకోవచ్చు. అదే Speccy తో అయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.మరింత సమాచారం కోసం Speccy సైట్ ని చూడండి.

డౌన్లోడ్: Speccy (సైజ్: 1.29 MB)

ధన్యవాదాలు

Monday, January 11, 2010

WeTransfer - పెద్ద ఫైళ్ళు ట్రాన్స్ ఫర్ చెయ్యటానికి...

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా 2 GB వరకు చిన్న లేదా పెద్ద ఫైళ్ళను WeTransfer సైట్ కి వెళ్ళి ఉచితంగా కావల్సిన వారికి పంపవచ్చు.ముందుగా https://www.wetransfer.com/ సైట్ కి వెళ్ళి Add Files పై క్లిక్ చేసి పంపవలసిన ఫైళ్ళను 2GB వరకు యాడ్ చేసుకోవచ్చు. Enter friend's email address దగ్గర ఫైల్స్ ఎవరికైతే పంపాలో వారి ఈ-మెయిల్ అడ్రస్ ఎంటర్ చెయ్యాలి. Enter your email address దగ్గర మన మెయిల్ ఐడి ఎంటర్ చేసి ’Transfer' బటన్ పై క్లిక్ చెయ్యాలి. మనం పంపిన ఫైళ్ళ డౌన్లోడ్ లింక్ ఫ్రెండ్స్ ఈ-మెయిల్ ఐడి కి పంపబడుతుంది. దానిపై క్లిక్ చేసి ఫైళ్ళను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైళ్ళు 2 వారాల వరకు డౌన్లోడ్ కి అందుబాటులో వుంటాయి. అంతేకాకుండా ఒకేసారి 20 మెయిళ్ళకు పంపే సదుపాయం కలదు.

వెబ్ సైట్: https://www.wetransfer.com/

ధన్యవాదాలు

Thursday, January 7, 2010

పీసీ వేగాన్ని పెంచటానికి చిట్కాలు!!!

ఈనాడు లో వచ్చిన మందగించిపోయిన పీసీ వేగాన్ని పెంచాలంతే విధిగా చెయ్యాల్సిన పనులేంటి?, దీనికి సమాధానంగా నేను పంపిన వ్యాసం లో కొంత భాగం ఈనాడు దినపత్రికలో ప్రచురితమైంది. దాని పూర్తి పాఠాన్ని ఇక్కడ యిస్తున్నాను:

ఎంత ఉన్నత కాన్ఫిగరేషన్ కలిగిన కంప్యూటర్ అయినా సరే ప్రీగా వస్తున్నాయి కదా అని అవసరం వున్నా లేకున్నా సాప్ట్ వేర్లు సిస్టం లో ఇనస్టలేషన్ చేసుకొంటూ పోతే కొంత కాలానికి దాని వేగం మరియు పనితనం మందగిస్తాయి. అలాకాకుండా వుండాలంటే మనకు అవసరమైన ప్రోగ్రాములు మాత్రమే మన కంప్యూటర్ లో ఇనస్టలేషన్ చేసుకోవాలి, అనవసరమైన వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి.

దానితో పాటు ఇక్కడ చెప్పిన చిట్కాలు విండోస్ యూజర్లు విధిగా చేస్తుంటే పీసీ వేగాన్ని పెంచవచ్చు:
1. టెంపరరీ ఫైళ్ళను తొలగించటం:

ఏదైనా ఫైల్ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు టెంపరరీ ఫైళ్ళు క్రియేట్ చెయ్యబడతాయి. అన్నిసార్లూ విండోస్ వీటిని తొలగించదు దాంతో పీసీ పనితనం తగ్గుతుంది. టెంపరరీ ఫోల్డర్ లోని ఫైళ్ళను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వుండాలి. అది ఎలాగంటే ముందుగా Control Panel కి వెళ్ళి Folder Options పై డబుల్ క్లిక్ చెయ్యాలి, ఇప్పుడు ఓపెన్ అయిన Folder Options విండోలో View టాబ్ కి వెళ్ళి Show hidden files and folders ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని OK పై క్లిక్ చెయ్యాలి. ఇలా చెయ్యటం వలన సిస్టం లో దాగివున్న
ఫైళ్ళు మరియు ఫోల్డర్లను చూడవచ్చు. ఇప్పుడు My Computer ఓపెన్ చేసి C డైరెక్టరీ లో Temp ఫోల్డర్ కై C:\> Documents and Settings ----> User Name ----> Local Settings ----> Temp కి వెళ్ళి అక్కడవున్న ఫైళ్ళను
తొలగించాలి. ఫైళ్ళను తొలగించేముందు అన్ని ప్రోగ్రాములు మరియు ఫైళ్ళు క్లోజ్ చెయ్యాలి.

2. ఆపరేటింగ్ సిస్టం ను తరచూ అప్ డేట్ చెయ్యటం:

వ్యాలీడ్ యూజర్లు విండోస్ అప్ డేట్లను మైక్రోసాప్ట్ విండోస్ అప్ డేట్స్ సైట్ నుండి ఉచితంగా పొందవచ్చు. లేదంటే My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties సెలెక్ట్ చేసుకోగా వచ్చే విండో లో Automatic Updates టాబ్ కి వెళ్ళి Automatic ఆప్షన్ లో నిర్ణీత సమయాన్ని సెలెక్ట్ చేసుకొంటే విండోస్ అప్ డేట్స్ ఆటోమాటిక్ గా మైక్రోసాప్ట్ సైట్ నుండి డౌన్లోడ్ అయ్యి , ఇనస్టలెషన్ చెయ్యబడతాయి. దీనికోసం ఇంటర్నెట్ తప్పని సరిగా వుండాలి.

3. యాంటీ వైరస్ సాప్ట్ వేర్ ని అప్ డేట్ చెయ్యటం:
మన కంప్యూటర్ వైరస్ ఫ్రీ గా వుండేలా చూసుకోవాలి, దీని కోసం సిస్టం లో యాంటీ వైరస్ తప్పనిసరిగా వుండాలి, అంతేకాదు దానిని తరచూ అప్ డేట్ చేస్తూ వుండాలి.

4. యాంటీ స్పైవేర్ సాప్ట్ వేర్ ని ఇనస్టలేషన్ చేసుకోవటం:
అంతర్జాలం లో చాలా వుచిత యాంటీ స్పైవేర్ లభిస్తాయి, వాటిలో Spybot చాలా బాగా పనిచేస్తుంది. Spybot ని ఇనస్టలేషన్ చేసుకొని తరచూ సిస్టం ని స్కాన్ చేస్తూ వుండాలి.

5. టెంపరరీ ఇంటర్నెట్ ఫైళ్ళను తొలగించటం:
ఇంటర్నెట్ వాడుతుంటే కనుక రెగ్యులర్ గా హిస్టరీని, కుకీస్ ని ఫైళ్ళను డిలీట్ చేస్తూ వుండాలి.

6.Recycle Bin లో ఫైళ్ళను తొలగించటం:

డిలీట్ చేసిన ఫైళ్ళు Recycle Bin లో చేరతాయి, [Shift] + [Delete] కీలను ప్రెస్ చెయ్యటం ద్వారా డిలీట్ అయిన ఫైళ్ళు Recycle Bin కి చేరవు. Recycle Bin లో ఫైళ్ళను తొలగించటం ద్వారా డిస్క్ స్పేస్ ఆదా చెయ్యవచ్చు.

పైన చెప్పిన వాటిని రెగ్యులర్ గా చేస్తూ ఈ క్రింది వాటిని కూడా చేస్తే సిస్టం ఫెర్ఫామెన్స్ బాగుంటుంది:

1. Virtual Memory Settings:

ఫిజికల్ మెమొరీ ఫిల్ అయిన తర్వాత విండోస్ హార్డ్ డిస్క్ లోని స్పేస్ ని ఉపయోగించుకుంటుంది, దీనినే వర్చువల్ మెమొరీ అంటాం, వర్చువల్ మెమొరీ పెంచటం ద్వారా సిస్టం ఫెర్ఫామెన్స్ పెరుగుతుంది. Virtual Memory Sttings మార్చటానికి My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties సెలెక్ట్ చేసుకోగా వచ్చే విండోలో Advanced టాబ్ కి వెళ్ళి Performance దగ్గర వున్న
Settings పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు ఓపెన్ అయ్యే Performance Options లో Advanced టాబ్ కి వెళ్ళి క్రింద Virtual Memory దగ్గర Change పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు ఓపెన్ అయ్యే Virtual Memory లో Custom Size ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని Initial Size మరియు Maximum Size వివరాలు MB లలో ఎంటర్ చేసి Set పై క్లిక్ చెయ్యాలి.

2. Disable Visual Effects:

ఫ్యాన్సీ బటన్స్, షాడోస్, స్లైడింగ్ మెనూస్ మొదలగు విసువల్ ఎఫెక్ట్స్ అవసరం లేదంటే డిసేబుల్ చేసుకోవచ్చు. దీని కోసం My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties సెలెక్ట్ చేసుకోగా వచ్చే విండోలో Advanced టాబ్ కి వెళ్ళి Performance దగ్గర వున్న Settings పై క్లిక్ చెయ్యాలి. అప్పుడు ఓపెన్ అయ్యే Performance Options లో Visual Effects టాబ్ కి వెళ్ళి
Custom ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని క్రింద వున్న ఆప్షన్ల దగ్గర టిక్ తీసివేయాలి.

3. Hard Disk Defragmentation:

కంప్యూటర్ కొన్న క్రొత్తలో చాలా ఫాస్ట్ గా వుంటుంది, రాను రాను ప్రోగ్రాములు ఇనస్టలేషన్ మరియు అన్ ఇన్ స్టాల్ చెయ్యటం వలన హార్డ్ డిస్క్
లో మధ్య మధ్యలో కొన్ని బ్లాక్స్ లలో ఖాళీ ప్రదేశాలు ఏర్పడతాయి. తర్వాత ఏదైనా డిస్క్ పై వ్రాయాలంటే ఎక్కడ ఖాళీ దొరికితే అక్క్డడ వ్రాయబడుతుంది. దీనివలన డిస్క్ పై వ్రాయాలన్నా లేదా రీడ్ చెయ్యాలన్నా ఎక్కువ సమయం పడుతుంది. హార్డ్ డిస్క్ లోని non-consecutive parts ఒక దగ్గరికి తీసుకొని రావటానికి తరచూ హార్డ్ డిస్క్ ని డీఫ్రాగ్మెంట్ చేస్తూవుండాలి. Hard Disk Defragmentation కోసం My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Manage సెలెక్ట్ చేసుకొంటే Computer Management ఓపెన్ అవుతుంది, అక్కడ వున్న Disk Defragmenter పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Defragment చెయ్యవలసిన డిస్క్ ని సెలెక్ట్ చేసుకొని Defragment బటన్ పై క్లిక్ చెయ్యాలి.

4. Managing Startup Programs:

ఇనస్టలేషన్ చెయ్యబడిన ప్రోగ్రాములు సిస్టం స్టార్ట్ అప్ లో స్టార్ట్ అవ్వటం వలన స్టార్ట్ అవ్వటానికి ఎక్కువ సమయం పడుతుంది. Startup లో అనవసర ప్రోగ్రాములు తొలగించటం వలన స్టార్ట్ అప్ సమయం తగ్గించవచ్చు. దీని కోసం Start ---> Run కి వెళ్ళి msconfig అని టైప్ చేసి Ok క్లిక్ చెయ్యాలి. ఓపెన్ అయిన System Configuration Utility లో Startup టాబ్ కి వెళ్ళి జాగ్రత్తగా అనవసర ప్రోగ్రాముల ముందున్న టిక్ తీసివేయాలి.


ధన్యవాదాలు

Wednesday, January 6, 2010

PC Inspector File Recovery - ఉచిత డాటా రికవరీ సాప్ట్ వేర్

పొరపాటున లేదా కావలసి హార్డ్ డిస్క్ నుండి తొలగించబడిన డాటాని తిరిగి పొందటానికి PC Inspector File Recovery అనే ఉచిత డాటా రికవరీ సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది.

PC Inspector FILE RECOVERY ప్రత్యేకతలు:

- FAT మరియు NTFS ఫైల్ సిస్టమ్స్ ని సపోర్ట్ చేస్తుంది.
- రికవర్ చెయ్యబడిన ఫైళ్ళను నెట్ వర్క్ లోని ఏదైనా సిస్టం లో సేవ్ చేసుకోవచ్చు.
- ఒరిజినల్ టైమ్ మరియు డేట్ స్టాంప్ తో ఫైళ్ళు రికవర్ చెయ్యబడతాయి.
- పార్టీషన్లు తొలగించబడినా కూడా డాటా రికవర్ చెయ్యవచ్చు.
- హెడర్ ఎంట్రీ లేకున్నా ఫైళ్ళు రికవర్ చెయ్యవచ్చు.

PC Inspector FILE RECOVERY ని ఉపయోగించే విధానానికి సంబంధించిన వీడియో:


డౌన్లోడ్: PC Inspector FILE RECOVERY

ధన్యవాదాలు

GNU Typist - ఉచిత టైపింగ్ ట్యూటర్

GNU Typist లేదా Gtypist అనే యూనివర్సల్ టైపింగ్ ట్యూటర్ ని ఉపయోగించి మన టైపింగ్ వేగాన్ని మెరుగుపర్చుకోవచ్చు మరియు యాక్యురసీని పెంచుకోవచ్చు. Gtypist లో వున్న ఎక్సర్ సైజ్ లను రెగ్యులర్ గా ప్రాక్టీస్ చెయ్యటం ద్వారా టైపింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన అవసరానికి అణుగుణంగా ట్యుటోరియల్ ని మార్చుకోవచ్చు.మరింత సమాచారం కోసం GNU Typist సైట్ ని సందర్శించండి.

డౌన్లోడ్: GNU Typist

ధన్యవాదాలు