Monday, June 30, 2008

కంపాటబిలిటీ ప్యాక్ ఫర్ ఆఫీస్ 2007 ఫైల్ ఫార్మేట్స్

మైక్రోసాప్ట్ ఆఫీస్ 2007(word, excel మరియు powerpoint) ఫైళ్ళను ఆఫీస్ 2003, ఆఫీస్ XP లేదా ఆఫీస్ 2000 లో ఓపెన్ చెయ్యటానికి, ఎడిట్ చేసి సేవ్ చెయ్యటానికి ’కంపాటబిలిటీ ప్యాక్ ఫర్ ఆఫీస్ 2007 ఫైల్ ఫార్మేట్స్’ ని http://www.microsoft.com/downloads/details.aspx?FamilyId=941b3470-3ae9-4aee-8f43-c6bb74cd1466&displaylang=en నుండి డౌన్ లోడ్ చేసుకోండి.

ధన్యవాదాలు

Thursday, June 26, 2008

డ్యూయల్ బూటింగ్ లో విస్టా తొలగొంచటం ఎలా?

మీ సిస్టం లో విండోస్ XP మరియు Vista సెపరేట్ పార్టీషన్లలో ఇనస్టలేషన్ చేసి వుండి... XP తో సమస్య లేకుండా Vista ని తొలగించటానికి ఈ క్రింది విధంగా చెయ్యాలి....

1. ముందుగా Vista DVD ని డ్రైవ్ లో వుంచాలి
2. Start ---> Run లో E:\boot\bootsect.exe Int52ALL/force ని రన్ చెయ్యాలి (E అనేది DVD Drive Letter)
3. సిస్టం రీస్టార్ట్ చేసి...విస్టా ఇనస్టలేషన్ చేసిన పార్టీషన్ ని ఫార్మేట్ చెయ్యాలి మరియు Boot.bak, Bootsect.bak ఫైల్స్ ని తొలగించాలి.

Friday, June 20, 2008

పాస్ వార్డ్ మేనేజ్ మెంట్ టూల్స్ (Password Management Tools)


పాస్ వార్డ్ మేనేజ్ మెంట్ టూల్స్ వుచితంగా లభించే వెబ్ సైట్లు....(password management tools can be downloaded from the following web sites)...

http://sourceforge.net/projects/upm, http://keepass.info/, http://www.schneier.com/passsafe.html, http://www.keepassx.org/

ధన్యవాదాలు

Friday, June 13, 2008

స్లిప్ స్ట్రీమింగ్ ......


స్లిప్ స్ట్రీమింగ్ గురించి కంప్యూటర్ ఎరా మాస పత్రిక లో శ్రీ చిలకపాటి శివరామప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారు. మీరు చదవండి.
తక్కువ ఖర్చుతో ఎంతో సమాచారాన్ని అందిస్తున్న కంప్యూటర్ ఎరా శ్రీధర్ గారికి ధన్యవాదములు...

Thursday, June 12, 2008

సిస్టం రిస్టోర్ (System Restore)


రిజిస్ట్రీ లో మార్పుల వలన కానీ, కొత్త్తగా ఇనస్టలేషన్ చేసిన ప్రోగ్రాముల వలన కానీ, మనం తెలియకుండా చేసిన తప్పులు (సెట్టింగులు మార్చటం) వలన కానీ, ఏ యితర ప్రమాదకరమైన మార్పులు జరిగి... సిస్టం పనిచేయనపుడు దానిని సరిగా పని చేసిన రోజుకి తిరిగి తీసుకొని వెళ్ళటానికి (Rollback) సిస్టం రిస్టోర్ (System Restore)ఫీచర్ వుపయోగపడుతుంది. ఎక్స్పీ కి ముందు వచ్చిన విండోస్ లో ఈ ఫీచర్ లేదు.

ఆపరేటింగ్ సిస్టం (OS) మన సిస్టమ్ పనితీరుని గమనిస్తూ వుంటుంది, ఎప్పుడైనా భారీ మార్పులు జరుగుతున్నప్పుడు అప్పుడున్న సిస్టమ్ పరిస్ధిని స్టోర్ చేసుకొంటుంది, దీనినే రిస్టోర్ పాయింట్ లేదా చెక్ పాయింట్ అంటారు. సాధారణంగా విండోస్ ఆటోమాటిక్ గా రిస్టోర్ పాయింట్ ని క్రియేట్ చేస్తుంది, కాని క్రొత్త ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసే ముందు లేదా రిజిస్ట్రీ లో మార్పులు చేసే ముందు మనం కూడా రిస్టోర్ పాయింట్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

రిస్టోర్ పాయింట్ ని క్రియేట్ చెయ్యటానికి:
సిస్టంలో Start ---> Programs ---> Accessories ---> System Tools ---> System Restore ని సెలెక్ట్ చెయ్యాలి. అప్పుడు సిస్టం రిస్టోర్ విండో ఓపెన్ అవుతుంది. దానిలో రెండు ఆప్షన్లు వుంటాయి ఒకటి పాత డేట్ లోకి సిస్టం రిస్టోర్ చెయ్యటానికి, రెండవది రిస్టోర్ పాయింట్ క్రియేట్ చెయ్యటానికి. రెండవ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వచ్చే సూచన ఫాలో అవ్వాలి.

సిస్టం రిస్టోర్ సెట్టింగ్:

My Computer/ Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్ కి వెళ్ళాలి లేదా కంట్రోల్ ప్యానెల్ లో ’సిస్టం’ పై మౌస్ దబల్ క్లిక్ చెయ్యాలి. అప్పుడు ఓపెన్ అయిన విండో లో ’సిస్టం రిస్టోర్’ టాబ్ ని క్లిక్ చెయ్యాలి. అక్కడ డ్రైవ్ ల స్టేటస్ ’monitoring' అని వుంటే రిస్టోర్ ఎనేబుల్ అయినట్లు. ’turn off system restore on all drives' దగ్గర టిక్ వుంటే రిస్టోర్ డిసేబుల్ అయినట్లు, టిక్ తీసివేయాలి. లేదంటే కావలసిన డ్రైవ్ లను మాత్రమే కూడా ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చ, దీని కోసం డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకొని ప్రక్కనే వున్న ’సెట్టింగ్స్’ బటన్ క్లిక్ చెయ్యాలి, అక్కడ ఆప్షన్ వుంటుంది.


సిస్టం రిస్టోర్ ఎలా పని చేస్తుంది?
విండోస్ స్టార్ట్ కానప్పుడు:
1.సిస్టం ఆన్ చేసి [F8] బటన్ ప్రెస్ చేస్తే వచ్చే ఆప్షన్ల లో ’సేఫ్ మోడ్ విత్ కమాండ్ ప్రాంప్ట్’ ని సెలెక్ట్ చేసుకోవాలి
2.అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ చెయ్యాలి
3.కమాండ్ ప్రాంప్ట్ దగ్గర %systemroot%\system32\restore\rstrui.exe అని టైప్ చేసి ఎంటర్ చెయ్యాలి
4.సిస్టం రిస్టోర్ విండో వస్తుంది, తర్వాత వచ్చే ఇనస్ట్రక్షన్లు ఫాలో అయ్యి రిస్టోర్ చేసుకోవాలి.

విండోస్ స్టార్ట్ అయినప్పుడు:
1.అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ చెయ్యాలి
2.Start ---> Programs ---> Accessories ---> System Tools ---> System Restore ని సెలెక్ట్ చెయ్యాలి
3.సిస్టం రిస్టోర్ విండో ఓపెన్ అవుతుంది, ’Restore my computer to an earlier time' అప్షన్ సెలెక్ట్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి
4.Select a restore point window లో రిస్టోర్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ పైక్లిక్ చెయ్యాలి
5.Confirm restore point selection పేజీలో ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి. మనం సెలెక్ట్ చేసుకొన్న రిస్టోర్ పాయింట్ డేట్ లోకి సిస్టం రిస్టోర్ చేయబడుతుంది తర్వాత సిస్టం రీస్టార్ట్ అవుతుంది.
6.సిస్టం రీస్టార్ట్ అయిన తర్వాత ’System Restore Restoration complete' విండో లో ’OK' పై క్లిక్ చెయ్యాలి

సిస్టం రిస్టోర్ సిస్టం ఫైళ్ళను మాత్రమే రిస్టోర్ చేస్తుంది...అప్లికేషన్ (డాటా) ఫైళ్ళను చెయ్యదు...దీని కోసం ధర్డ్ పార్టీ సాప్ట్ వేర్లు లభిస్తాయి. వాటిలో ఒకటి "Roll back Rx 8.1 professional" ఇది లైఫ్ టైమ్ వాలిడిటీ తో రూ.2850/- కి లభిస్తుంది. సిస్టం రిస్టోర్ లో రిస్టోర్ పాయింట్ లాగానే దీనిలో ’Snopshots' క్రియేట్ చేయబడతాయి...

ధన్యవాదాలు

Wednesday, June 11, 2008

ఆధ్యాత్మిక వెబ్ సైట్లు (Bhakti Online)


కొన్ని ఆధ్యాత్మిక వెబ్ సైట్ల అడ్రస్ లు ఇక్కడ యివ్వటం జరిగింది...చూడండి...చూసితరించండి....

http://www.tirumala.org/, http://saibaba.org/ , http://www.geocities.com/ongolebaba/, http://eprarthana.com/, http://prarthana.com/, http://www.iskcon-hyderabad.com/, http://www.iskconbangalore.org/, http://www.rkmath.org/, http://www.telugubhakti.com/, http://www.teluguone.com/bhakti/, http://www.dwarakatirumala.org, http://srisailamonline.com/, http://www.durga-puja.org/, http://annavaramdevasthanam.nic.in/, http://www.indiantemples.com/, http://www.indiantemplesportal.com/, http://www.indiatemplesinfo.com/

Monday, June 9, 2008

రిజిస్ట్రీ క్లీనర్లు (Registry Cleaners )


క్రొత్త ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసి, తర్వాత వాటిని సరైన పధ్దతి లో అన్ ఇనస్టలేషన్ చేయనప్పుడు వాటికి సంబంధించిన ఎంట్రీలు రిజిస్ట్రీ లో మిగిలి పోతాయి. ఇలా మిగిలిపోయిన ఎంట్రీలను తొలగించకపోతే అవి సిస్టం యొక్క పనితనం మీద ప్రభావాన్ని చూపుతాయి. రిజిస్ట్రీ లో మిగిలి పోయిన పనికిరాని ఎంట్రీలను తొలగించటానికి రిజిస్ట్రీ క్లీనర్లు వుపయోగపడతాయి. రిజిస్ట్రీ క్లీనర్లు రిజిస్ట్రీ ని పూర్తిగా స్కాన్ చేసి ఎర్రర్లను ఫిక్స్ లేదా కరక్ట్ చేయటానికి ప్రయత్నిస్తాయి. ఒక్కొకసారి ఈ రిజిస్ట్రీ క్లీనర్లు మేలు కు బదులు కీడు కూడా చేస్తాయి, ఇవి స్కాన్ చేసి చూపించిన లిస్ట్ లోని ఎంట్రీ లను తొలగించే ముందు ఒకటి రెండు సార్లు సరి చూసుకోవాలి, డౌట్ వస్తే మాత్రం ఎంట్రీ లను తొలగించవద్దు. ముందుగా రిజిస్ట్రీ ని బాక్ అప్ తీసుకోవటం మరువవద్దు. క్లీన్ చేయబడిన రిజిస్ట్రీ వలన సిస్టం పనితనం మెరుగుపడుదుంది అనటం లో ఏమాత్రం సందేహం లేదు.

ఉచిత రిజిస్ట్రీ క్లీనర్లు దొరికే వెబ్ సైట్లు http://www.ccleaner.com/, http://personal.inet.fi/business/toniarts/ecleane.htm

Registry Cleaners are used to clean unwanted entries in the registry. For fee regitry cleaners visit http://www.ccleaner.com/, http://personal.inet.fi/business/toniarts/ecleane.htm

ధన్యవాదాలు

Friday, June 6, 2008

ఫ్రీ ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సెస్ (Free Online Training Courses)


ఫ్రీ ఆన్ లైన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పుస్తకాలు, ట్యుటోరియల్స్, లెక్చర్ నోట్స్ కోసం ఈ క్రింది వెబ్ సైట్ల ను సందర్శించండి...
http://www.e-learningcenter.com/free.htm, http://h30240.www3.hp.com/index.jsp, http://freecomputerbooks.com/, http://cslibrary.stanford.edu/ , http://www.freetechbooks.com/

For free online computer training cousres visit above said websites.

ధన్యవాదాలు

Thursday, June 5, 2008

COMODO Personal Firewall


ఫైర్ వాల్ - సాప్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ కావచ్చు- సిస్టం లో ప్రవేశించే అన్ ఆధరైజ్ద్ ఎంట్రీల నుండి కాపాడుతుంది. పర్సనల్ ఫైర్ వాల్ సాప్ట్ వేర్ల లో COMODO Personal Firewall బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిని http://www.personalfirewall.comodo.com/ నుండి వుచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Firewall prevents from unauthorised entries into a system. COMODO Personal Firewall is better than most other personal firewalls. This can be downloaded from http://www.personalfirewall.comodo.com/

ధన్యవాదాలు

Wednesday, June 4, 2008

ఈనాడు స్పోకెన్ ఇంగ్లీష్


ఈనాడు దిన పత్రిక లో ప్రచురించే స్పోకెన్ ఇంగ్లీష్ వ్యాసాల కోసం http://www.eenadu.net/spoken/spoken.htm కి వెళ్ళండి.

ధన్యవాదాలు

’సాప్ట్’ గా దగా !!

Monday, June 2, 2008

యాంటీ స్పైవేర్ - స్పైబాట్ ( Anti-spyware)


సాధరణంగా స్పైవేర్ లు వుచిత స్క్రీన్ సేవర్లు, వాతావరణ వివరాలు తెలిపే ప్రోగ్రాము ల ద్వారా మన కంప్యూటర్ లోకి చేరతాయి. సైవేర్ ను తొలగించటానికి వుపయోగించే యాంటీ స్పైవేర్ టూల్స్ లో Spybot - Search & Destroy బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిని http://www.safer-networking.org/en/spybotsd/index.html నుండి వుచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టూల్ ని ఇనస్టలేషన్ చేసి అప్లికేషన్ ని ఓపెన్ చేసి Serch & Destroy బటన్ పై క్లిక్ చేసి... Chek for Problems మీద క్లిక్ చేయండి. సిస్టం స్కాన్ చేయబడుతుంది...ఇది చాలా టైమ్ పడుతుంది... స్కానింగ్ పూర్తి అయిన తర్వాత ప్రాబ్లమ్ వున్న ఎంట్రీస్ ను చూపిస్తుంది, ఎంట్రీస్ ను సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు.

Recovery బటన్ ప్రాబ్లమ్ ఫిక్స్ చేసిన తర్వాత రిజిస్ట్రీ లో జరిగిన మార్ప్లను ’UNDO' చేయటానికి వుపయోగపడుతుంది. ప్రాబ్లమ్ ఫిక్స్ చేసిన తర్వాత ఏ అప్లికేషన్ అయినా పని చేయక పోతే ఈ విధంగా చెయ్యాలి.

Immunisation బటన్ సిస్టం స్పైవేర్ అటాక్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియచేస్తుంది.

Spybot -Search & Destroy is the best tool for countering Spyware, this can be downloded from http://www.safer-networking.org/en/spybotsd/index.html

ధన్యవాదాలు