Wednesday, December 31, 2008

మైక్రోసాప్ట్ నుండి ఉచిత ఆన్ లైన్ ఛాట్ సపోర్ట్...


సాంకేతిక సమస్యలు మరియు మైక్రోసాప్ట్ వుత్పత్తుల సమాచారం పై 24/7 Small Business + ఆన్ లైన్ ఛాట్ సపోర్ట్ ని మైక్రోసాప్ట్ వుచితంగా అందిస్తోంది. రిజిస్ట్రేషన్ మరియు లాగిన్ అవటానికి http://www.microsoft.com/smallbusiness/small-business-plus/sign-up.aspx
కి వెళ్ళాలి. మీ సమస్యలకు experts నుండి సమాధానాలే కాకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఎమ్.ఎస్.ఆఫీస్ మరియు ఇతర మైక్రోసాప్ట్ సాప్ట్ వేర్ల పై ఆన్ లైన్ ట్రైనింగ్, మంత్లీ న్యూస్ లెటర్లు మరియు లైసెన్స్ స్టేట్ మెంట్లు కూడా పొందవచ్చు.

మరింత సమాచారం కోసం పైన తెలిపిన మైక్రోసాప్ట్ సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Tuesday, December 30, 2008

సిస్టం ట్రే లో ’Safely Remove Hardware' ఐకాన్ కనబడటం లేదా?

USB డివైజ్ లను సిస్టం కి కనెక్ట్ చేసినప్పుడు...మరల వాటిని సురక్షితంగా తొలగించటానికి సిస్టం ట్రే లో ’Safely Remove Hardware' ఐకాన్ పై క్లిక్ చేసి, డివైజ్ ని స్టాప్ చేసిన తర్వాత మాత్రమే సిస్టం నుండి తొలగించాలి. అలా చెయ్యకుండా డైరెక్ట్ గా తొలగిస్తే USB పోర్ట్ పాడయ్యే అవకాశం వుంటుంది.



కొన్ని కారణాల వలన సిస్టం ట్రే లో ’Safely Remove Hardware' ఐకాన్ కనబడకపోతే కనుక ఈ క్రింది విధంగా చెయ్యండి.

౧.Start ---> Run కి వెళ్ళి క్రింద ఇవ్వబడిన కమాండ్ టైప్ చేసి ’Ok' పై క్లిక్ చెయ్యాలి.

RunDll32.exe shell32.dll,Control_RunDLL hotplug.dll


౨.ఇప్పుడు ఓపెన్ అయ్యే ’Safely Remove Hardware' విండో లో కావలసిన డివైజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Stop' బటన్ పై క్లిక్ చెయ్యాలి.



ఒక్కొక్కసారి USB డివైజ్ ని స్టాప్ చేస్తుంటే "Problem Ejecting USB Mass Storage Device" అని వార్నింగ్ మెసేజ్ వచ్చి USB డివైజ్ స్టాప్ కాకుంటే కనుక EjectUSB అనే విండోస్ యుటిలిటీని డౌన్ లోడ్ చేసుకొని Zip ఫైల్ ని USB device లోకి extract చేసుకోవాలి. తర్వాత USB device లోని "EjectUSB.exe" అనే అప్లికేషన్ ని రన్ చెయ్యాలి. Eject USB రన్ అవుతున్న అన్ని అప్లికేషన్లను క్లోజ్ చేసి USB device సురక్షితంగా తొలగించటానికి దోహదపడుతుంది.

డౌన్ లోడ్: EjectUSB


ధన్యవాదాలు

Monday, December 29, 2008

ఈ - గ్రీటింగ్స్ కోసం....


ఇంకా రెండు మూడు రోజుల్లో నూతన్నోత్సాహం తో మరియు క్రొత్త ఆశలతో 2009 ని ఆహ్వానించబోతున్నాం...ఇదివరకు రోజుల్లో ముందుగా గ్రీటింగ్ కార్డ్స్ కొని పోస్టాఫీస్ కి వెళ్ళి స్టాంపులు అంటించి పోస్ట్ చేసే వాళ్ళం...కష్టపడి ఇంతా చేస్తే అనుకొన్న రోజుకి చేరదు... మొబైల్ ఫోన్ల వాడకం పెరిగిన SMS ద్వారా గ్రీటింగ్స్ పంపుదామంటే క్రొత్త సంవత్సరం రోజున నెట్ వర్క్ బిజీ వుంటుంది. ఈ ఇబ్బందులేమీ లేకుండా ఇంటర్నెట్ లో చక్కని మెసేజ్ లతో వుచిత ఈ-గ్రీటింగ్స్ దొరుకుతాయి, మనకు కావలసిన వారికి వారి ఈ-మెయిల్ ఐడి కి కావలసిన రోజున ఈ-గ్రీటింగ్స్ పంపవచ్చు. వినసొంపైన సంగీతం జతచేయబడిన మ్యూజికల్ గ్రీటింగ్స్,మన వాయిస్ మెసేజ్ నీ జత చేసుకోవటానికి అవకాశమున్న గ్రీటింగ్స్, యానిమేషన్, త్రీడీ ఇలా వెన్నో వెరైటీ ఈ-గ్రీటింగ్స్ నెట్ లో లభ్యమవుతాయి... అంతా వుచితంగానే ...కావలసినదల్లా మీ బంధు మిత్రుల ఈ-మెయిల్ ఐడీ లే....

ఈ-గ్రీటింగ్స్ దొరికే కొన్ని వెబ్ సైట్లు:
1.http://www.telugupeople.com/Greetings/GreetingsGallery.aspx
2. http://www.123greetings.com/
3. http://www.123newyear.com/
4. http://www1.egreetings.com/index.pd
5.http://egreetings.indiatimes.com/egreet/index.jsp
6.http://www.cry.org/cryegreetings/index.aspx
7. http://www.free-egreetings.net/
8. http://www.101egreetings.com/
9.http://www.in.com/
10.http://awesomecybercards.com/
11.http://www1.yahoo.americangreetings.com/index.pd
12.http://greetings.123india.com/
13.http://greetings.webdunia.com/telugu.html

ఇలా ఎన్నో వెబ్ సైట్ లు వున్నాయి ...యింకా ఆలశ్యం దేనికి ఈ-గ్రీటింగ్ పంపటం మొదలు పెట్టండి...

నూతన సంవత్సర శుభాకాంక్షలతో ....

ధన్యవాదాలు

Monday, December 22, 2008

ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ కోసం సెక్యూరిటీ అప్ డేట్...


ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ లోని సెక్యూరిటీ లోపాలను గురించి ఇటీవలే ఒక ప్రముఖ దిన పత్రికలో వచ్చింది మరియు ఇతర బ్రౌజర్లకు నెటిజన్లని మార్చే బాధ్యత తీసుకుందాం ...అనే టపాలో శ్రీధర్ గారు ఎక్స్ ఫ్లోరర్ లోని లోపాలు దాని ప్రత్యామ్నాయాల గురించి చాలా చక్కగా వివరించారు. అవి చదివిన తర్వాత కూడా ఇంకా ఇంటర్నెట్ ఎక్స్ ఫ్లోరర్ నే వాడతాం అంటే కనుక మైక్రో సాప్ట్ విడుదల చేసిన సెక్యూరిటీ అప్ డేట్ ని వెంటనే డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోండి. అటాకర్ల నుండి మీ సిస్టం కాపాడుకోండి.

డౌన్ లోడ్ లింక్: Security Update for Internet Explorer 7 for Windows XP

శ్రీధర్ గారి టపా: ఇతర బ్రౌజర్లకు నెటిజన్లని మార్చే బాధ్యత తీసుకుందాం

ధన్యవాదాలు

Thursday, December 18, 2008

3 జీ మొబైల్ గురించి మరింత సమాచారం...


3 జీ సేవలను ప్రధానమంత్రి MTNL ద్వారా ఇటీవలే ప్రారంభించారు. 3 జీ మొబైల్ గురించి సవివరంగా ఈనాడు దినపత్రికలో వచ్చింది. ఆ వివరాలు యధాతదంగా ....

ఏంటీ 3జీ?

3జీ అంటే సంక్షిప్తనామంతో అందరికీ పరిచయమైన దీని పూర్తి పేరు ’థర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ’. వేగంగా సమాచార మార్పిడి చేసుకొనేలా ఈ మొబైల్ నెట్ వర్క్ ని రూపొందించారు. ప్రస్తుతం వాడుతున్న 2G, 2.5G ల్లో 64-144 Kbps వేగంతో మాత్రమే డాటాని మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా రూపొందించిందే ఈ 3జీ.

అరచేతిలో టీవీ!
సినిమాలు, పాటలు, వార్తలు ...ఇలా వీడియో ఫైల్స్ ఏవైనప్పటికీ చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ రిజల్యూషన్ తో కూడిన మొబైల్ టీవీ ఫ్రోగ్రంలను వీడియో స్ట్రీమింగ్ ఛానల్స్ ద్వారా వీక్షించవచ్చు. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. ఫ్రస్తుతం మనం వినియోగిస్తున్న 2జీ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో ఏ విధంగా వినియోగించగలిగామో వీడియో ఫైల్స్ ని ౩జీ లో అంతే సులువుగా యాక్సెస్ చేసుకొనేలా ఈ నెట్ వర్క్ ని రూపొందించారు. డిజిటల్ వీడియో బ్రాడ్ క్యాస్టింగ్ - హ్యండ్ హోల్డ్ (DVB-H) ద్వారా ఆన్ లైన్ లో వీక్షించే ప్రోగ్రాంలను అతి తక్కువ సమయంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కనిపిస్తూ మట్లాడవచ్చు:
వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్ లో ఆన్ లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్ లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నే ’వీడియో కాలింగ్’ పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. దీనికోసం ఫోన్ కు ముందు భాగంలో కెమేరాను ఏర్పాటు చేసిన 3జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు.

మరికొన్ని:
౧.మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది.
౨.కంప్యూటర్ లోమాదిరిగా ఇంటర్నెట్ బ్రౌసింగ్ పూర్తిస్థాయిలో చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్ తో కూడిన ఎటాచ్ మెంట్లతో ఈ-మెయిల్స్ ని ఎలాంటి ఆలస్యం లేకుండా పంపేయచ్చు.
౩.వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇరువురి మొబైల్ 3జీ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం.
౪.ఇక వీడియో గేమ్ ల విషయానికొస్తే సైట్ ఏదైనప్పటికీ ఆన్ లైన్ గేమ్ లను అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్ లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.
౫.పోలీసు, రక్షణ వ్యవస్థలు ఈ నెట్ వర్క్ ద్వారా సీసీటీవీ లను యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు.
౬.మొబైల్ టూరిజం, మొబైల్ వాణిజ్యం, ఈ-లెర్నింగ్, స్టాక్ ఎక్స్చేంజ్, టెలీ మెడిసిన్, మొబైల్ వాణిజ్య ప్రకటనలు విస్త్రుతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల్ని పొందాలంటే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న GPRS సేవలకంటే ఎక్కువ ఛార్జ్ అవకాశముందని అంచనా.
౭.దేశంలో ౩జీ సదుపాయమున్న ఫోన్ లు రూ.12000 నుంచి రూ.50000 ధరల మధ్య అందుబాటులో వున్నాయి.


౩జీ నెట్ వర్క్ సర్వీస్ మొదటి సారిగా వ్యాపారాత్మకంగా అందుబాటులో కి తెచ్చిన ఘనత జప్పన్ కే దక్కుతుంది. నేటికి ప్రపంచ వ్యాప్తంగా 25 దేసాల్లో ఈ నెట్ వర్క్ విస్తరించింది.అయితే ఈ ౩జీ కంటే ముందు 1G, 2G, 2.5G, 2.75G అంటూ నాలుగు జెనెరేషన్లు వున్నాయి. మొదటి జెనెరేషన్ ఫోన్ గురించి చెప్పాలంటే అదో ఎనలాగ్ మొబైల్ ఫోన్ . 1980 ల్లో ఈ రకం ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడుతూ వీటితో సంభాషించేవారు. ఉదాహరణగా వాకీటాకీ లను చెప్పుకోవచ్చు. తర్వాత వీటి స్థానాన్నే 2Gలు ఆక్రమించాయి. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ లో డిజిటల్ యుగం దీనితో మొదలైంది. ఇదే టెక్నాలజీ 2.5G, 2.75Gలుగా మార్పు చెందుతూ నేటికి 3G కి చేరింది.

ధన్యవాదాలు

Wednesday, December 17, 2008

Avira AntiVir - ఫ్రీ పర్సనల్ యాంటీవైరస్


మాల్ వేర్, ట్రోజన్, వార్మ్ మొదలగు వైరస్ ల నుండి సిస్టం ను కాపాడుకోవటానికి Avira AntiVir Personal - Free Antivirus 8.2.0.337 వుపయోగపడుతుంది.ఇది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ విండోస్ లేదా మరియేయితర సాప్ట్ వేర్ల చే ఓపెన్ చెయ్యబడే ఫైళ్ళను చెక్ చేస్తూ వుంటుంది. హోమ్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన యాంటీవైరస్ ఇది. Herustic Scanning ద్వారా తెలిసిన మరియు తెలియని త్రెట్స్ నుండి రక్షణ పోందవచ్చు.

డౌన్ లోడ్ లింకు: AntiVir సైజ్ :21MB

ధన్యవాదాలు

ఆడియో కన్వర్టర్ సాప్ట్ వేర్...


ప్రముఖ ఆడియో ఫార్మేట్లైన WMV, MP4, WAV, WMA, OGG, AAC, MP3, M4A, MP2 మొ. వాటిని ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చటానికి మరియి వీడియోల నుండి ఆడియోలను సెపరేట్ చెయ్యటానికి Any Audio Converter సాప్ట్ వేర్ వుపయోగపడుతుంది. దీనిని వుచితంగా http://www.any-audio-converter.com/ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ధన్యవాదాలు

Friday, December 12, 2008

టెలికాంలో నవశకం...3జీ సేవలు ప్రారంభం...


భారతీయ టెలికాం రంగంలో కొత్త శకానికి పునాది పడింది. ప్రధానమంత్రి గురువారం ఢిల్లీలో మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)ఆధ్వర్యంలో 3జీ సాంకేతిక విజ్ఞానాధారిత టెలికాం సేవలను ప్రారంభించారు. దీంతో టెలివిజన్ ప్రసారాలను ఇక మొబైల్ లోనూ ప్రత్యక్షంగా వీక్షించే సదుపాయంతో పాటు వేగంగా డాటా డౌన్ లోడ్ చేసుకొనే సౌలభ్యం, వేగవంతమైన వీడియో స్ట్రీమింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమవుతోంది. MTNL వచ్చే నెలాఖరు నాటికి ఢిల్లీ, ముంబయిలలో 3G సేవలు అందుబాటులోకి తీసుకురానుంది.


సోర్స్: ఈనాడు దినపత్రిక

ధన్యవాదాలు

Wednesday, December 3, 2008

థండర్ బర్డ్ తో జీమెయిల్...

Mozilla Thunderbird 2.0.0.18 వుచిత ఈ మెయిల్ క్లైంట్లలలో వుత్తమమైనది, MS Outlook కి ప్రత్యామ్నాయంగా థండర్ బర్డ్ నే ఎక్కువగా వుపయోగిస్తారు. థండర్ బర్డ్ లో జీమెయిల్ కాన్ఫిగర్ చెయ్యటం చాలా సులువు. Mozilla Thunderbird 2.0.0.18 లో GMail ఎకౌంట్ ఎలా కాన్ఫిగర్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం.

1. ముందుగా జీమెయిల్ ఎకౌంట్ సైన్ ఇన్ చేసి, కుడి చేతి ప్రక్క పైన వున్న 'Settings' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత
'Settings'లో ’Forwarding and POP/IMAP' టాబ్ పై క్లిక్ చేసి ’IMAP Access' దగ్గర ’Enable IMAP' ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ’Save Changes' పై క్లిక్ చెయ్యాలి.





2.ఇప్పుడు Mozilla Thunderbird 2.0.0.18 ని http://www.mozilla.com/en-US/thunderbird/ నుండి డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి.

3.థండర్ బర్డ్ ని మొదటిసారి రన్ చేసినప్పుడు 'Outlook Express' లేదా ’MS Outlook' లో ఇంతకుముందే కాన్ఫిగర్ చెయ్యబడిన ఏదైనా ఈమెయిల్ ఎకౌంట్ వున్నట్లయితే దానిని థండర్ బర్డ్ కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకుంటే డైరక్ట్ గా స్టెప్ 5లో చూపబడిన ’Account Wizard' ఓపెన్ అవుతుంది.

4.పాత ఈమెయిల్ ఎకౌంట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత థండర్ బర్డ్ మెయిన్ మెనూ లో Tools ---> Account Settings పై క్లిక్ చెయ్యాలి. తర్వాత 'Account Settings' లో 'Add Account' పై క్లిక్ చెయ్యాలి.





5.ఇప్పుడు ఓపెన్ అయ్యిన ’Account Wizard' లో ’Gmail' ని సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


6.Identity లో Name మరియు Email Address ఎంటర్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.


7.ఇక్కడ ’Finish' బటపై క్లిక్ చెయ్యాలి. అంతే మీ జీమెయిల్ థండర్ బర్డ్ లో కాన్ఫిగర్ చెయ్యబడుతుంది.


థండర్ బర్డ్ లో అవుట్ లుక్ కన్నా బెటర్ ఫీచర్స్ వున్నాయి, ట్రై చెయ్యండి. ఇతర వివరాలకు థండర్ బర్డ్ సైట్ కి వెళ్ళండి.

మరికొన్ని Email Clients - Incredimail Xe 5.7.0, eM Client 1.1.3 BETA, Eudora 7.1, Pegasus Mail v4.41

ధన్యవాదాలు

Tuesday, December 2, 2008

పెన్సిల్ - వుచిత డ్రాయింగ్/యానిమేషన్ సాప్ట్ వేర్

పెన్సిల్ - సాంప్రదాయ డ్రాయింగ్ మరియు 2D యానిమేషన్ సాప్ట్ వేర్, దీనిని http://www.les-stooges.org/pascal/pencil/ నుండి వుచితం గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.



యూజర్ మాన్యుయల్ కూడా ఇదే సైట్ లో దొరుకుతుంది.

ధన్యవాదాలు