Thursday, December 3, 2009

StartUpLite - కంప్యూటర్ StartUp వేగాన్ని పెంచటానికి ఉచిత అప్లికేషన్

కాలం గడుస్తున్నకొద్దీ మన కంప్యూటర్ లో వివిధ ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసుకొంటూ పోతూ, అనవసరమైనవి తొలగించకుండా వుంటే కనుక కొన్ని అనవసర ప్రోగ్రాములు సిస్టం స్టార్ట్ అప్ లో స్టార్ట్ అయ్యి కంప్యూటర్ Startup ప్రాసెస్ మందగింపచేస్తాయి. సాధారణంగా విండోస్ లో డీఫాల్ట్ గా వుండే msconfig కమాండ్ ని ఉపయోగించి Startup లో అనవసర ప్రోగ్రాములను డిసేబుల్ చేస్తూవుంటాం, అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే msconfig - Startup లో కేవలం ప్రోగ్రాముల పేర్లు మాత్రమే వుంటాయి అవి సిస్టం ప్రోగ్రాములా లేదా యితర అనవసర ప్రోగ్రాములా, దేనిని వుంచాలి లేదా దేనిని తొలగించాలి అని తెలుసుకోవటం కొద్దిగా కష్టం. అయితే StartUpLite అనే సింపుల్ అప్లికేషన్ ని ఉపయోగించి సురక్షితంగా మరియు సమర్ధవంతంగా స్టార్ట్ అప్ లో స్టార్ట్ అయ్యే అనవసర ప్రోగ్రాములను డిసేబుల్ లేదా అనవసర స్టార్ట్ అప్ ఎంట్రీలను తొలగించటం ద్వారా కంప్యూటర్ త్వరగా స్టార్ట్ అవుతుంది. msconfig లో లా కాకుండా ఇక్కడ ప్రతి ఎంట్రీ కి సంబంధించిన క్లుప్త సమాచారం వుంటుంది, దీంతో వుంచవలసిన లేదా తొలగించవలసిన ఎంట్రీలను నిర్ణయించుకోవటం సులభమవుతుంది.




StartUpLite ఒక మంచి స్టార్ట్ అప్ మేనేజర్ అని చెప్పవచ్చు. మరింత సమాచారం కోసం StartUpLite సైట్ ని చూడండి.

డౌన్లోడ్: StartUpLite (సైజ్: 199.70 KB)

ధన్యవాదాలు