Friday, April 30, 2010

కావలసిన అప్లికేషన్లను ఒకేసారి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చెయ్యటానికి...

క్రొత్త కంప్యూటర్ కొన్నప్పుడు లేదా ఉన్న కంప్యూటర్ ఫార్మేట్ చేసినప్పుడు ఇంటర్నెట్ లో దొరికే ఉచిత అప్లికేషన్లను ఒకేసారి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చెయ్యాలంటే కనుక AllMyApps సైట్ కి వెళ్ళాల్సిందే.



ఇక్కడ వివిధ ఉచిత అప్లికేషన్లను వివిధ క్యాటగిరీల్లో వుంచారు.



ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా కావలసిన అప్లికేషన్ పై మౌస్ వుంచితే 'Inastall' లేదా '+ List' వస్తాయి, '+ List' పై మౌస్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసుకున్న అప్లికేషన్లు మన లిస్ట్ (My List)కి యాడ్ చెయ్యబడతాయి వాటిని ఒకేసారి డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. లిస్ట్ చేసినవి వద్దు అనుకుంటే మౌస్ ఆ అప్లికేషన్ పై వుంచితే '- Unlist' వస్తుంది, అప్పుడు దానిపై క్లిక్ చెయ్యాలి.



వెబ్ సైట్:AllMyApps

ధన్యవాదాలు

Wednesday, April 28, 2010

Web2PDF - వెబ్ పేజీలని పీడీఎఫ్ లోకి మార్చటానికి ...

ఆన్ లైన్ లో వెబ్ పేజీలని పీడీఎఫ్ లోకి మార్చటానికి Web2PDF సైట్ కి వెళ్ళి పీడీఎఫ్ లోకి మార్చవలసిన వెబ్ పేజీ లింక్ ని ఎంటర్ చేసి Convert to PDF బటన్ పై క్లిక్ చేస్తే ఆ వెబ్ పేజీ పీడీఎఫ్ లోకి మార్చబడుతుంది. అలా మార్చబడిన ఫైల్ ని డౌన్లోడ్ లేదా గూగుల్ డాక్స్ లో చూడవచ్చు. మెయిన్ పేజీ లో Options బటన్ పై క్లిక్ చేసి పేపర్ సైజ్, మార్జిన్లు, కంప్రెషన్ లెవల్ మార్చుకోవచ్చు.





వెబ్ సైట్: Web2PDF

ధన్యవాదాలు

గూగుల్ మాప్స్ లో గూగుల్ ఎర్త్ - మాప్స్ ని 3D లో చూడటానికి...

గూగుల్ మాప్స్ లో Earth View ఆప్షన్ ద్వారా మాప్స్ ని 3D లో చూడవచ్చు. దీనికోసం గూగుల్ ఎర్త్ ప్లగిన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి.

Earth View in Google Maps కి సంబంధించిన వీడియోని చూడండి.


దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గూగుల్ అఫీషియల్ బ్లాగ్ ని చూడండి.

సైట్: గూగుల్ మాప్స్

ధన్యవాదాలు

Tuesday, April 27, 2010

Microsoft USB Flash Drive Manager

Microsoft USB Flash Drive Manager అనే ఉచిత అప్లికేషన్ USB Flash Drive లను మేనేజ్ చెయ్యటానికి ఉపయోగపడుతుంది అంటే డ్రైల్ లోని ఫోల్డర్స్ మరియు ఫైళ్ళను చూడవచ్చు, డ్రైవ్ లోకి లేదా డ్రై నుండి ఫైళ్ళను కాపీచేసుకోవచ్చు, డాటా బ్యాకప్ లేదా రీస్టోర్ చేసుకోవచ్చు.



Microsoft USB Flash Drive Manager విండోస్ XP మాత్రమే పనిచేస్తుంది. .Net Framework తప్పనిసరి. మరింత సమాచారం కోసం మైక్రోసాప్ట్ సైట్ చూడండి.

డౌన్లోడ్: Microsoft USB Flash Drive Manager

ధన్యవాదాలు

AudioBox - Cloud Web Player

ఎటువంటి అప్లికేషన్ ఇనస్టలేషన్ చెయ్యకుండా మనకు నచ్చిన పాటలు ఎప్పుడైనా ఎక్కడైనా వినాలంటే కనుక AudioBox అనే క్లౌడ్ వెబ్ ప్లేయర్ లో వినవచ్చు. ముందుగా AudioBox సైట్ కి వెళ్ళి ఎకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, ఈ-మెయిల్ కి పంపబడిన వెరిఫికేషన్ నోటిఫికేషన్ పై క్లిక్ చేసి అకౌంట్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఉచిత అకౌంట్ లో 1 GB వరకు ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ స్పేస్ వుంటుంది. నచ్చిన పాటలను అప్ లోడ్ చేసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చు.



పాటలు అప్ లోడ్ చెయ్యటానికి సంబంధించిన వీడియో:


వెబ్ సైట్: AudioBox

ధన్యవాదాలు

Monday, April 26, 2010

Clean Temporary Places - టెంపరరీ ఫైళ్ళను తొలగించటానికి ఓపెన్ సోర్స్ అప్లికేషన్

Clean Temporary Places అనే టెంపరరీ ఫైల్స్ క్లీనర్ ని ఉపయోగించి మనం కనుగొనలేనటువంటి టెంపరరీ ఫైళ్ళను తొలగించటం లో సహాయపడుతుంది. అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మెయిన్ విండో లో ’Selected Tasks' దగ్గర వున్న పోల్డర్లను సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ’Perform Cleanup Now' బటన్ పై క్లిక్ చెయ్యాలి. క్లీనింగ్ పూర్తి అయిన తర్వాత సేవ్ అయిన స్పేస్ గ్రాఫ్ రూపంలో చూపబడుతుంది.



సెలెక్ట్ చేసుకొన్న టాస్క్ లను సిస్టం స్టార్ట్ అప్ లో ఎక్జిక్యూట్ అవ్వాలనుకొంటే కనుక ’Options' టాబ్ కి వెళ్ళి ’Execute application on logon' దగ్గర టిక్ వుంచాలి.


అంతేకాకుండా నెట్ వర్క్ లోని వివిధ కంప్యూటర్లలోని టెంపరరీ ఫైళ్ళను కూడా తొలగించవచ్చు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ చూడండి.


డౌన్లోడ్: Clean Temporary Places

ధన్యవాదాలు

Tuesday, April 20, 2010

Microsoft Fix It Center - విండోస్ లో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యటానికి..

విండోస్ లో వచ్చే సాధారణంగా వచ్చే ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యటానికి మైక్రోసాప్ట్ Fix It Center అనే ప్రోగ్రామ్ ని రూపొందించింది... ఇది ఇంకా బీటా దశ లోనే వుంది మరియు Windows 7, Vista, మరియు XP లలో వచ్చే కామన్ ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చెయ్యవచ్చు. Fix It Center ని మైక్రోసాప్ట్ సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ని సెలెక్ట్ చేసుకొని Run పై క్లిక్ చేయగా వచ్చే స్టెప్ బై స్టెప్ సూచనలను పాటిస్తూ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు.



ఇదంతా ఎందుకు అనుకొంటే కనుక Fix It Center సైట్ కి వెళ్ళి విండోస్ లైవ్ ఐడీ తో సైన్ ఇన్ అయ్యి కూడా ఆన్ లైన్ లో మన సమస్యలకు సొల్యూషన్స్ పొందవచ్చు.

సైట్ : మైక్రోసాప్ట్ Fix It Center

ధన్యవాదాలు

Monday, April 19, 2010

tinySpell - స్పెల్లింగ్ మిస్టేక్స్ ని చెక్ మరియు కరెక్ట్ చెయ్యటానికి !!!

విండోస్ లోని ఏదైనా అప్లికేషన్ లోని స్పెల్లింగ్ తప్పులను ని కనుగొని మరియు సరైన పదాన్ని సూచించటానికి tinySpell అనే ఉచిత స్పెల్ చెకర్ ఉపయోగపడుతుంది. స్పెల్ చెకర్ లేని అప్లికేషన్ల లో ఇది బాగా ఉపయోగపడుతుంది.




tinySpell ఫీచర్లు:
  • Checks spelling in any Windows application
  • Checks spelling on-the-fly (alerts if the last typed word was misspelled)
  • Checks spelling of text that is copied to the clipboard
  • Allows you to specify applications for which tinySpell is disabled or enabled
  • Optionally beeps on error (beep sound can be easily set to any wav file)
  • Optionally displays a spelling tip
  • Provides easy access to on-line web services
  • (Search, Dictionary, Thesaurus, Encyclopedia)
  • Opens replacements list with a simple mouse click or a hot-key
  • Optionally copies the selected replacement word to the clipboard
  • Optionally inserts the selected replacement word into the document
  • Allows you to add words to the dictionary
  • Easy Enable/Disable
  • Uses little system resources


డౌన్లోడ్ మరియు యితర సమాచారం కోసం tinySpell సైట్ చూడండి.

ధన్యవాదాలు

Friday, April 16, 2010

GMail లో ఇప్పుడు ఫైళ్ళ ను డ్రాగ్ & డ్రాప్ పద్ధతిలో జతచెయ్యవచ్చు

జీమెయిల్ లో ఎవరికైనా ఏదైనా ఫైల్ జత చేసి పంపటానికి 'Attach a file' పై క్లిక్ చేసి కావలసిన ఫైల్ ని అప్ లోడ్ చేస్తుంటాం.

అలాకాకుండా ఇప్పుడు ముందుగా అటాచ్ చెయ్యవలసిన ఫైల్ వున్న ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోవాలి.



ఇప్పుడు అటాచ్ చెయ్యవలసిన ఫైల్ ని ఓపెన్ చేసిన ఫోల్డర్ నుండి డ్రాగ్ (Drag) చేసి జీమెయిల్ Compose Mail లో డ్రాప్ (Drop) చెయ్యాలి. అంతే ఆ ఫైల్ మెయిల్ కి అటాచ్ చెయ్యబడుతుంది.





ఈ విధంగా కొంత సమయం ఆదా అవుతుంది, కాని ఈ సదుపాయం Google Chrome లేదా Mozilla Firefox 3.6 బ్రౌజర్లు ఉపయోగించే వారికి మాత్రమే. మిగతా బ్రౌజర్ల లో కూడా ఈ పీచర్ ని త్వరలో ఎనేబుల్ చేస్తామని గూగుల్ చెపుతుంది.

మరింత సమాచారం కోసం GMail Blog చూడండి.

ధన్యవాదాలు

Thursday, April 15, 2010

Microsoft SharedView - ఉచిత స్క్రీన్ షేరింగ్ సాప్ట్ వేర్

TeamViewer లా Microsoft SharedView ని ఉపయోగించి స్నేహితుల లేదా కొలోగ్స్ తో డాక్యుమెంట్లు మరియు స్క్రీన్ వ్యూ లను వేగంగా మరియు సులభంగా ఎప్పుడైనా ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు షేర్ చేసుకోవటమే కాదు మీ ఫ్రెండ్స్ కంప్యూటర్లలో ప్రాబ్లమ్స్ ఏమైనా వుంటే ఫిక్స్ చెయ్యవచ్చు. అయితే Microsoft SharedView సాప్ట్ వేర్ మీ మరియు మీ మిత్రుల కంప్యూటర్ల లో కూడా ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ అయిన తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేసి Windows Live ID తో Sign in చెయ్యాలి లైవ్ ఐడి లేకుంటే క్రియేట్ చేసుకోవచ్చు.



join a session పై క్లిక్ చేసి ఇతరులు మనల్ని గుర్తించటం కోసం నిక్ నేమ్ లేదా ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు వేరువేరు లొకేషన్లలో వున్న వారిని invite చెయ్యటం కోసం Start new session పై క్లిక్ చెయ్యగా వచ్చే Invitation Instructions ని మెయిల్ ద్వారా ఫ్రెండ్స్ కి పంపాలి.


అవతలి వాళ్ళు మెయిల్ లో వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే SharedView లాంచ్ అవుతుంది. ముందే చెప్పినట్లుగా SharedView అవతలి వారి కంప్యూటర్ లో కూడా ఇనస్టలేషన్ చెయ్యబడి వుండాలి. SharedView తో దాదాపు 15 మంది వరకు invite చెయ్యవచ్చు

Microsoft SharedView ఫీచర్లు:
  • It is a free screen sharing application from Microsoft.
  • It lets you connect up to 15 people wherever they are located in the world.
  • It helps you share documents with different people on real-time basis.
  • It has a very easy-to-use interface and you will not require any assistance to access all its features.
  • The chat feature of the application lets you communicate with session participants.
  • It is a completely safe application and is free from bugs, malware and spyware.
  • The Personal Mouse Pointers feature will make available separate mouse pointers to the session participants.
  • It can be used separately from your Windows Live Instant Messenger by accessing SharedView from the Activities menu.


Microsoft SharedView డౌన్లోడ్ మరియు పూర్తి సమాచారం కోసం మైక్రోసాప్ట్ సైట్ చూడండి.

ధన్యవాదాలు

Friday, April 9, 2010

Dmailer Backup - ఉచిత ఆన్ లైన్ డాటా బ్యాక్ అప్

Dropbox ప్రముఖ ఆన్ లైన్ ఫైల్ హోస్టింగ్ సైట్, Dropbox లో ఉచితంగా 2GB వరకు ఆన్ లైన్ డాటా బ్యాక్ అప్ తీసుకోవచ్చు. Dropbox కి చక్కని ప్రత్యామ్నాయమే Dmailer Backup. దీనిలో కూడా ఉచితంగా 2GB వరకు ఆన్ లైన్ డాటా బ్యాక్ అప్ తీసుకోవచ్చు. ముందుగా Dmailer సైట్ కి వెళ్ళి Dmailer Backup అప్ప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఆన్ లైన్ బ్యాక్ అప్ కోసం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అప్లికేషన్ ని ఓపెన్ చేసి మెయిన్ మెనూ లో ’Settings' కి వెళ్ళి ఆన్ లైన్ లో బ్యాక్ అప్ తీసుకోవలసిన ఫైల్స్ లేదా ఫోల్డర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.



Dmailer Backup ఫీచర్లు:

  • Live Backup: Continuously and automatically back up your files
  • Versioning: Maintain several versions of a file at once
  • Multiple profiles: Manage multiple profiles, maintain log files & view backup summaries
  • Security: Password protected and AES 128-bit encrypted
  • Contextual help: Access to application features guide
  • Simplicity: Restore your data in one single click

Dmailer ని ఉపయోగించే విధానం మరియు యూజర్ గైడ్ కోసం Dmailer సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Monday, April 5, 2010

WinPenPack - USB డ్రైవ్ ల కోసం ఊచిత పోర్టబుల్ అప్లికేషన్ల సమాహారం

USB డ్రైవ్ లలో పోర్టబుల్ అప్లికేషన్లను లోడ్ చేసుకొని మనతో పాటు తీసుకొని వెళితే ఎప్పుడైనా ఏదైనా కంప్యూటర్ పై పనిచేసేటప్పుడు కావలసిన ప్రోగ్రామ్స్ లేకుంటే కనుక మనదగ్గర వున్న పోర్టబుల్ అప్లికేషన్లతో పని చేసుకోవచ్చు. అది సిస్టం ట్రబుల్ షూటింగ్ అయినా కావచ్చు. USB డ్రైవ్ ల కోసం ఇంటర్నెట్ లో చాలానే ఉచిత అప్లికేషన్ల ప్యాకేజెస్ లభిస్తున్నాయి వాటిలో ఒకటే WinPenPack (ప్రోగ్రామ్ లాంచర్) . ఇది 2GB USB (పెన్) డ్రైవ్ లలో కూడా ఫిట్ అవుతుంది. WinPenPack లోని అప్లికేషన్లను సిస్టం లో ఇనస్టలేషన్ చెయ్యకుండానే నేరుగా USB డ్రైవ్ నుండి ఉపయోగించవచ్చు. WinPenPack లో వెబ్ బ్రౌజర్లు, ఈ-మెయిల్ క్లైంట్లు,ఇమేజ్ ఎడిటర్లు, ఛాట్ క్లైంట్లు, పిసి సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ టుల్స్, ఓపెన్ ఆఫీస్, ఫీడీఎఫ్ రీడర్లు యిలా చాలానే అప్లికేషన్లు ఉన్నాయి.



డౌన్లోడ్: WinPenPack

ధన్యవాదాలు