జీమెయిల్ లో ఎవరికైనా ఏదైనా ఫైల్ జత చేసి పంపటానికి 'Attach a file' పై క్లిక్ చేసి కావలసిన ఫైల్ ని అప్ లోడ్ చేస్తుంటాం.
అలాకాకుండా ఇప్పుడు ముందుగా అటాచ్ చెయ్యవలసిన ఫైల్ వున్న ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోవాలి.
ఇప్పుడు అటాచ్ చెయ్యవలసిన ఫైల్ ని ఓపెన్ చేసిన ఫోల్డర్ నుండి డ్రాగ్ (Drag) చేసి జీమెయిల్ Compose Mail లో డ్రాప్ (Drop) చెయ్యాలి. అంతే ఆ ఫైల్ మెయిల్ కి అటాచ్ చెయ్యబడుతుంది.
ఈ విధంగా కొంత సమయం ఆదా అవుతుంది, కాని ఈ సదుపాయం Google Chrome లేదా Mozilla Firefox 3.6 బ్రౌజర్లు ఉపయోగించే వారికి మాత్రమే. మిగతా బ్రౌజర్ల లో కూడా ఈ పీచర్ ని త్వరలో ఎనేబుల్ చేస్తామని గూగుల్ చెపుతుంది.
మరింత సమాచారం కోసం GMail Blog చూడండి.
ధన్యవాదాలు