గూగుల్ కిడ్స్ గురించి నిన్నటి పోస్ట్ లో తెలుసుకున్నాం... ఈ పోస్ట్ లో పిల్లలకు ఉపయోగపడే మరిన్ని సైట్స్ గురించి తెలుసుకుందాం..
౧.
యాహూ కిడ్స్ :
ఈ సైట్ లో పిల్లలకోసం మ్యూజిక్, మూవీ, జోక్స్, ఈ-కార్డ్స్, ఎన్ సైక్లోపీడియా, హారోస్కోప్, రిఫెరెన్స్ మెటీరియల్ యిలా చాలానే వున్నాయి. పేరెంట్స్ కోసం ప్రత్యేక సెక్షన్ కూడా వుంది, ఇక్కడ మూవీ రివ్యూ, ఆన్ లైన్ సేఫ్టీ గురించి పిల్లలకు ఎలా తెలియ చెయ్యాలి, యిలా చాలానే వున్నాయి.
వెబ్ సైట్:
http://kids.yahoo.com/౨.
నేషనల్ జియోగ్రాఫిక్ కిడ్స్:
ఇక్కడ స్టోరీస్, యాక్టివిటీస్, వీడియోలు, యానిమల్స్, గేమ్స్, ఫోటోలు, ఇంకా ఇతర ఎడ్యుకేషనల్ లింకులు వున్నాయి.
వెబ్ సైట్:
http://kids.nationalgeographic.com/kids/౩.
ఫనాలజీ:జోక్స్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, మాజిక్ ట్రిక్స్, Weird Science సెక్షన్ లో పిల్లలు చెయ్యగలిగే ఫిజిక్స్, కెమిస్ట్రీ , బయాలజీ మొ. వాటికి సంబంధించిన ప్రయోగాలు వున్నాయి. నూరూరించే రుచులు యింకా ఎన్నో...
వెబ్ సైట్:
http://funology.com/౪.
ఫన్ బ్రెయిన్: ఎంటర్ టైన్ మెంట్ తో కూడిన ఎడ్యుకేషనల్ సైట్ ఇది. వెబ్ బుక్స్ + కామిక్స్, మెదడుకు పదును పట్టే ఇంటరాక్టివ్ గేమ్స్, టీచర్స్ మరియు పేరెంట్స్ కోసం సలహాలు యింకా చాలావున్నాయి.
వెబ్ సైట్:
http://www.funbrain.com౫.
పీబీఎస్ కిడ్స్: పిల్లల కోసం గేమ్స్, వీడియోస్, ఈ-కార్డ్స్ యిలా చాలా వున్నయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరదాగా మరియు ఆసక్తికరంగా వుంటుంది.
వెబ్ సైట్:
http://pbskids.org/ధన్యవాదాలు