Friday, May 7, 2010

Luxand - Blink - మీ పీసీ ని చూస్తూ లాగిన్ అవ్వండి!!!

Luxand - Blink అనే ఉచిత సాప్ట్ వేర్ మన ముఖాన్ని గుర్తించి విండోస్ లో లాగిన్ అవటానికి దోహదపడుతుంది, ఇది విండోస్ 7 లేదా విస్టా 32 బిట్ ఆపరేటింగ్ సిస్టం గల పీసీ లలో పనిచేస్తుంది. అయితే దీనికోసం మన సిస్టం లో వెబ్ కెమేరా తప్పక వుండాలి. Blink వెబ్ కెమేరా సహాయంతో మన ముఖాన్ని రీడ్ చేసి , ముందుగా భద్రపరచిన యూజర్ ముఖాలతో సరిపోల్చుకొని సరైన యూజర్ ఎకౌంట్ లో లాగిన్ అయ్యేలా చేస్తుంది. ఒకవేళ జుట్టు కత్తిరించుకున్నా, కాంటాక్ట్ లెన్స్ లేదా కళ్ళజోడు ధరించినా కూడా Blink రికగ్నైజేషన్ అల్ గారిథమ్ మిమ్మల్ని గుర్తిస్తుంది. Blink ఇనస్టలేషన్ చేసి తర్వాత సెట్టింగ్స్ అన్నీ సరిగా చేసుకున్నాక , నెక్స్ట్ టైమ్ సిస్టం స్టార్ట్ చేసినప్పుడు వెబ్ కామ్ ఆటోమాటిక్ గా ఎనేబుల్ చెయ్యబడి లాగిన్ కి సిద్ధంగావుంటుంది. మనం వెబ్ కామ్ కి ఎదురుగా కూర్చోవటమే, ఎటువంటి పాస్ వార్డ్ అవసరం లేకుండా పీసీ లాగిన్ అవుతుంది.



మరింత సమాచారం మరియు డౌనోడ్ కొరకు Luxand - Blink సైట్ చూడండి.


డౌన్లోడ్: Luxand - Blink (సైజ్:8.3 MB)

ధన్యవాదాలు