Monday, August 27, 2012

మీ డ్రాప్ బాక్స్ అకౌంట్ ని 2 స్టెప్ వెరిఫికేషన్ తో భద్రపర్చుకోండి!!!

ఆన్‍లైన్ లో మన అకౌంట్ల ను సురక్షితంగా ఉంచుకోవటం ప్రశ్నార్ధంగా మారుతున్న తరుణం లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆవశ్యకత ఎంతో ఉంది. ఇప్పటికే ఈ సదుపాయం గూగుల్ లో ఉంది. ఇప్పటికీ మీ గూగుల్ అకౌంట్ కి 2 స్టెప్ వెరిఫికేషన్    పెట్టుకోని వారికి ఎలా పెట్టుకోవాలో ఇక్కడ చూడండి.  గూగుల్ అకౌంట్ లానే ఎన్నో వ్యక్తిగత ఫైళ్ళను క్లౌడ్ లో స్టోర్ చేసుకోవటానికి మనం ప్రముఖంగా ఉపయోగించే Dropbox ని కూడా  2 స్టెప్ వెరిఫికేషన్ సురక్షితంగా ఉంచుకోవచ్చు.


 2 స్టెప్ వెరిఫికేషన్ కాన్ఫిగర్ చేసుకున్న తర్వాత గూగుల్ లానే 6 డిజిట్ సెక్యూరిటీ కోడ్ మన మొబైల్ కి టెక్స్ట్ మెసేజ్  రూపం లో పంపబడుతుంది.  

ఇక 2 స్టెప్ వెరిఫికేషన్ ని ఎనేబుల్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. డాప్ బాక్స్ అకౌంట్ సైన్ ఇన్ అయిన తర్వాత క్రింద Account sign in దగ్గర 2 Step Verification  దగ్గర Change పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Get Started పై క్లిక్ చేసి డ్రాప్ బాక్స్ పాస్ వర్డ్ ఎంటర్ చెయ్యగా వచ్చే రెండు ఆప్షన్లలో టెక్స్ట్ మెసేజ్ పొందటానికి మొదటిటానికి మొబైల్ అప్లికేషన్ కోసం రెండవదానిని ఎంచుకోవాలి, Next పై క్లిక్ చెయ్యాలి.  ఇక్కడ మన దేశం (India) కోడ్ ని సెలెక్ట్ చేసుకొని మన మొబైల్ నంబర్ ఎంటర్ చెయ్యాలి. ’Next' పై క్లిక్ చేసిన తర్వాత 6 డిజిట్ కోడ్ మన మొబైల్ కి పంపబడుతుంది దానిని అక్కడ ఎంటర్ చెయ్యాలి. తర్వాత ఎమర్జెన్సీ  బ్యాకప్ కోడ్ జెనెరేట్ అవుతుంది, దానిని ఎక్కడైనా జాగ్రత్తగా నోట్ చేసుకుని ఉంచుకోవాలి. ఎప్పుడైనా మన మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. తర్వాత Enable two-step verification పై క్లిక్ చెయ్యాలి అంతే.

ధన్యవాదాలు