Thursday, June 12, 2008

సిస్టం రిస్టోర్ (System Restore)


రిజిస్ట్రీ లో మార్పుల వలన కానీ, కొత్త్తగా ఇనస్టలేషన్ చేసిన ప్రోగ్రాముల వలన కానీ, మనం తెలియకుండా చేసిన తప్పులు (సెట్టింగులు మార్చటం) వలన కానీ, ఏ యితర ప్రమాదకరమైన మార్పులు జరిగి... సిస్టం పనిచేయనపుడు దానిని సరిగా పని చేసిన రోజుకి తిరిగి తీసుకొని వెళ్ళటానికి (Rollback) సిస్టం రిస్టోర్ (System Restore)ఫీచర్ వుపయోగపడుతుంది. ఎక్స్పీ కి ముందు వచ్చిన విండోస్ లో ఈ ఫీచర్ లేదు.

ఆపరేటింగ్ సిస్టం (OS) మన సిస్టమ్ పనితీరుని గమనిస్తూ వుంటుంది, ఎప్పుడైనా భారీ మార్పులు జరుగుతున్నప్పుడు అప్పుడున్న సిస్టమ్ పరిస్ధిని స్టోర్ చేసుకొంటుంది, దీనినే రిస్టోర్ పాయింట్ లేదా చెక్ పాయింట్ అంటారు. సాధారణంగా విండోస్ ఆటోమాటిక్ గా రిస్టోర్ పాయింట్ ని క్రియేట్ చేస్తుంది, కాని క్రొత్త ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసే ముందు లేదా రిజిస్ట్రీ లో మార్పులు చేసే ముందు మనం కూడా రిస్టోర్ పాయింట్ ని క్రియేట్ చేసుకోవచ్చు.

రిస్టోర్ పాయింట్ ని క్రియేట్ చెయ్యటానికి:
సిస్టంలో Start ---> Programs ---> Accessories ---> System Tools ---> System Restore ని సెలెక్ట్ చెయ్యాలి. అప్పుడు సిస్టం రిస్టోర్ విండో ఓపెన్ అవుతుంది. దానిలో రెండు ఆప్షన్లు వుంటాయి ఒకటి పాత డేట్ లోకి సిస్టం రిస్టోర్ చెయ్యటానికి, రెండవది రిస్టోర్ పాయింట్ క్రియేట్ చెయ్యటానికి. రెండవ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ వచ్చే సూచన ఫాలో అవ్వాలి.

సిస్టం రిస్టోర్ సెట్టింగ్:

My Computer/ Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి ప్రోపర్టీస్ కి వెళ్ళాలి లేదా కంట్రోల్ ప్యానెల్ లో ’సిస్టం’ పై మౌస్ దబల్ క్లిక్ చెయ్యాలి. అప్పుడు ఓపెన్ అయిన విండో లో ’సిస్టం రిస్టోర్’ టాబ్ ని క్లిక్ చెయ్యాలి. అక్కడ డ్రైవ్ ల స్టేటస్ ’monitoring' అని వుంటే రిస్టోర్ ఎనేబుల్ అయినట్లు. ’turn off system restore on all drives' దగ్గర టిక్ వుంటే రిస్టోర్ డిసేబుల్ అయినట్లు, టిక్ తీసివేయాలి. లేదంటే కావలసిన డ్రైవ్ లను మాత్రమే కూడా ఎనేబుల్ లేదా డిసేబుల్ చేసుకోవచ్చ, దీని కోసం డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకొని ప్రక్కనే వున్న ’సెట్టింగ్స్’ బటన్ క్లిక్ చెయ్యాలి, అక్కడ ఆప్షన్ వుంటుంది.


సిస్టం రిస్టోర్ ఎలా పని చేస్తుంది?
విండోస్ స్టార్ట్ కానప్పుడు:
1.సిస్టం ఆన్ చేసి [F8] బటన్ ప్రెస్ చేస్తే వచ్చే ఆప్షన్ల లో ’సేఫ్ మోడ్ విత్ కమాండ్ ప్రాంప్ట్’ ని సెలెక్ట్ చేసుకోవాలి
2.అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ చెయ్యాలి
3.కమాండ్ ప్రాంప్ట్ దగ్గర %systemroot%\system32\restore\rstrui.exe అని టైప్ చేసి ఎంటర్ చెయ్యాలి
4.సిస్టం రిస్టోర్ విండో వస్తుంది, తర్వాత వచ్చే ఇనస్ట్రక్షన్లు ఫాలో అయ్యి రిస్టోర్ చేసుకోవాలి.

విండోస్ స్టార్ట్ అయినప్పుడు:
1.అడ్మినిస్ట్రేటర్ తో లాగిన్ చెయ్యాలి
2.Start ---> Programs ---> Accessories ---> System Tools ---> System Restore ని సెలెక్ట్ చెయ్యాలి
3.సిస్టం రిస్టోర్ విండో ఓపెన్ అవుతుంది, ’Restore my computer to an earlier time' అప్షన్ సెలెక్ట్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి
4.Select a restore point window లో రిస్టోర్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ పైక్లిక్ చెయ్యాలి
5.Confirm restore point selection పేజీలో ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి. మనం సెలెక్ట్ చేసుకొన్న రిస్టోర్ పాయింట్ డేట్ లోకి సిస్టం రిస్టోర్ చేయబడుతుంది తర్వాత సిస్టం రీస్టార్ట్ అవుతుంది.
6.సిస్టం రీస్టార్ట్ అయిన తర్వాత ’System Restore Restoration complete' విండో లో ’OK' పై క్లిక్ చెయ్యాలి

సిస్టం రిస్టోర్ సిస్టం ఫైళ్ళను మాత్రమే రిస్టోర్ చేస్తుంది...అప్లికేషన్ (డాటా) ఫైళ్ళను చెయ్యదు...దీని కోసం ధర్డ్ పార్టీ సాప్ట్ వేర్లు లభిస్తాయి. వాటిలో ఒకటి "Roll back Rx 8.1 professional" ఇది లైఫ్ టైమ్ వాలిడిటీ తో రూ.2850/- కి లభిస్తుంది. సిస్టం రిస్టోర్ లో రిస్టోర్ పాయింట్ లాగానే దీనిలో ’Snopshots' క్రియేట్ చేయబడతాయి...

ధన్యవాదాలు