Monday, June 9, 2008
రిజిస్ట్రీ క్లీనర్లు (Registry Cleaners )
క్రొత్త ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసి, తర్వాత వాటిని సరైన పధ్దతి లో అన్ ఇనస్టలేషన్ చేయనప్పుడు వాటికి సంబంధించిన ఎంట్రీలు రిజిస్ట్రీ లో మిగిలి పోతాయి. ఇలా మిగిలిపోయిన ఎంట్రీలను తొలగించకపోతే అవి సిస్టం యొక్క పనితనం మీద ప్రభావాన్ని చూపుతాయి. రిజిస్ట్రీ లో మిగిలి పోయిన పనికిరాని ఎంట్రీలను తొలగించటానికి రిజిస్ట్రీ క్లీనర్లు వుపయోగపడతాయి. రిజిస్ట్రీ క్లీనర్లు రిజిస్ట్రీ ని పూర్తిగా స్కాన్ చేసి ఎర్రర్లను ఫిక్స్ లేదా కరక్ట్ చేయటానికి ప్రయత్నిస్తాయి. ఒక్కొకసారి ఈ రిజిస్ట్రీ క్లీనర్లు మేలు కు బదులు కీడు కూడా చేస్తాయి, ఇవి స్కాన్ చేసి చూపించిన లిస్ట్ లోని ఎంట్రీ లను తొలగించే ముందు ఒకటి రెండు సార్లు సరి చూసుకోవాలి, డౌట్ వస్తే మాత్రం ఎంట్రీ లను తొలగించవద్దు. ముందుగా రిజిస్ట్రీ ని బాక్ అప్ తీసుకోవటం మరువవద్దు. క్లీన్ చేయబడిన రిజిస్ట్రీ వలన సిస్టం పనితనం మెరుగుపడుదుంది అనటం లో ఏమాత్రం సందేహం లేదు.
ఉచిత రిజిస్ట్రీ క్లీనర్లు దొరికే వెబ్ సైట్లు http://www.ccleaner.com/, http://personal.inet.fi/business/toniarts/ecleane.htm
Registry Cleaners are used to clean unwanted entries in the registry. For fee regitry cleaners visit http://www.ccleaner.com/, http://personal.inet.fi/business/toniarts/ecleane.htm
ధన్యవాదాలు