Wednesday, November 5, 2008

Adeona - లాప్ టాప్ ట్రాకింగ్ సిస్టం - ఉచిత సాప్ట్ వేర్


University of Washington కంఫ్యూటర్ సైంటిస్ట్ లచే మొదటి వుచిత లాప్ టాప్ ట్రాకింగ్ సిస్టం రూపోదించబడినది... అదే Adeona ...ఒక గ్రీకు దేవత పేరునే ఈ సాప్ట్ వేర్ కు పెట్టారు. దొంగిలించబడిన లేదా పోయిన లాప్ టాప్ లను కనుక్కోవటానికి ఈ సిస్టమ్ వుపయోగపడుతుంది.లాప్ టాప్ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన తర్వాత Adeona ఒక కీ జెనెరేట్ చేస్తుంది, దొంగిలించబడిన లాప్ టాప్ ట్రాక్ చెయ్యటానికి ఆ కీ అవసరమవుతుంది. లాప్ టాప్ ట్రాక్ చెయ్యటానికి Adeona వివిధ పధ్ధతులను అనుసరిస్తుంది. లాప్ టాప్ వుపయోగించే లొకేషన్ లోని ఐపి అడ్రస్ బ్రాడ్ కాస్ట్ చేస్తుంది మరియు సిస్టం లోని ఇన్ బిల్ట్ కెమేరా ను వుపయోగించి యూజర్ యొక్క ఫోటోలను ప్రతి 30 సెకన్లకొకసారి తీస్తుంది.

మరింత సమాచారం మరియు వుచిత Adeona సాప్ట్ వేర్ కోసం http://adeona.cs.washington.edu/ కి వెళ్ళండి.

ధన్యవాదాలు