అనవసరమైన స్టార్ట్ అప్ ఎంట్రీలను ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం:
౧.ముందుగా Start ---> Run కి వెళ్ళి msconfig అని టైప్ చేసి ’Ok' బటన్ పై క్లిక్ చెయ్యాలి.
౨.System Configuration Utility ఓపెన్ అవుతుంది. దానిలో Startup టాబ్ క్లిక్ చేస్తే స్టార్ట్ అప్ ఎంట్రీలు కనబడతాయి. వాటిలో అనవసరమైన ఎంట్రీల దగ్గర వున్న టిక్( అన్ చెక్ ) తీసి వేయాలి. Windows ఫోల్డర్ వున్న వాటిని (విండోస్ స్టార్ట్ అప్ ఎంట్రీలు), యాంటీ వైరస్, యాంటీ స్పై వేర్ మరియు ఫైర్ వాల్ ని అన్ చెక్ చెయ్యకపోవటం వుత్తమం.
౩.ఇప్పుడు General టాబ్ కి వెళ్ళి Selective Startup ని సెలెక్ట్ చేసుకొని ముందు Apply తర్వాత Ok బటన్ పై క్లిక్ చేసి, సిస్టం రీస్టార్ట్ చెయ్యాలి.
ధన్యవాదాలు