Friday, January 30, 2009

సమర్ధవంతమైన పాస్ వార్డ్ మేనేజర్...


సమాచారం/డాటా ని సురక్షితంగా వుంచటం లో పాస్ వార్డ్ కీలకపాత్ర పోషిస్తుంది. అన్ని అప్లికేషన్లకు ఒకే పాస్ వార్డ్ పెట్టడం మంచిది కాదు. అలా అని అన్ని పాస్ వార్డ్స్ గుర్తు పెట్టుకోవటం కూడా కష్టమే. అన్ని పాస్ వార్డ్స్ ని ఒకచోట దాచి పెట్టి దానికి ఒక పాస్ వార్డ్ పెట్టి దానిని గుర్తుపెట్టుకోవటం సులువేకదా! దానికోసం మనం పాస్ వార్డ్ మేనేజర్ల పై ఆధారపడవలసివుంటుంది. నెట్ లో చాలానే వుచిత పాస్ వార్డ్ మేనేజర్లు దొరుకుతాయి వాటిలో ఒకటే ’Efficient Password Manager', అప్లికేషన్ డౌన్ లోడ్ సైజ్ 2.6MB మాత్రమే. ఈ అప్లికేషన్ లో వివిధ వెబ్ సైట్ల, ఈ-మెయిల్ అకౌంట్ల, FTP అకౌంట్ల యూజర్ నేమ్ మరియు పాస్ వార్డ్ లను సేవ్ చేసుకోవచ్చు. ఇవేకాకుండా సాప్ట్ వేర్ రిజిస్ట్రేషన్ కోడ్ లను భద్రపరచుకొనే సదుపాయం వుంది. అంతే కాకుండా Password Generator కూడా ఇదే అప్లికేషకి జతచేయబడివుంది. Password Generator ని వుపయోగించి కావలసిన లెంగ్త్ లో అక్షరాలు, నంబర్లు మరియు ప్రత్యేకాక్షరాల కలయికలో కావలసిన పాస్ వార్డ్ రూపొందించుకోవచ్చు. పాస్ వార్డ్స్ అన్నిటినీ Efficient Password Manager లో సేవ్ చేసుకొని దానికి ఒక పాస్ వార్డ్ పెట్టుకుని అది గుర్తు పెట్టుకోవాలి. అలా అని మిగతావి మర్చిపోమని కాదు, అవి మర్చిపోకుండా ఇదొక ప్రత్యామ్నాయమే.

ధన్యవాదాలు