టేప్ రికార్డర్ల వాడకం తగ్గిపోయి సీడీ ప్లేయర్లు, ఎమ్ పీ త్రీ/ఫోర్ , ఐపాడ్ మొ. వాటి వాడకం క్రమంగా పెరుగుతుండటంతో పాత క్యాసెట్లను అటక ఎక్కించేశాం. ఆపాతమధురాలను మన కంప్యూటర్ లేదా సీడీ లలోకి ఎలా మార్చాలో ఇక్కడ చూద్దాం.
ఆడియో క్యాసెట్ టేపులను కంప్యూటర్ లేదా సీడీ లలోకి మార్చటానికి కావలసినవి:
1.ఆడియో క్యాసెట్ ప్లేయర్
2.ఆడియో క్యాసెట్
3.మేల్-మేల్ 3.5 mm ఆడియో జాక్ (ఇది అన్ని ఎలక్ట్రానిక్స్ రిపైర్ దుకాణాలలో లభిస్తుంది)
4.మన కంప్యూటర్ లో సౌండ్ కార్డ్
5.ఏదైనా ఆడియో ఎడిటింగ్ సాప్ట్ వేర్ ఉదా: Audacity Sound Editor
విధానం:
1.ముందుగా Audacity Sound Editor సాప్ట్ వేర్ ని సిస్టం లో ఇనస్టలేషన్ చెయ్యాలి. మేల్-మేల్ 3.5 mm ఆడియో జాక్ ఒక ప్రక్క క్యాసెట్ ప్లేయర్ కి మరో ప్రక్క సిస్టం లోని సౌండ్ కార్డ్ లైన్-ఇన్ లేదా మైక్ పోర్ట్ కి కనెక్ట్ చెయ్యాలి. Audacity ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఇన్ పుట్ టైప్ మార్చాలి అదెలాగంటే Edit ---> Preferences పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Audio I/O టాబ్ లో Playback మరియు Recording Device దగ్గర సిస్టం సౌండ్ డివైజ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Microsoft SoundMapper' సెలెక్ట్ చేసుకోకూడదు. Audio I/O టాబ్ లోనే Channels దగ్గర సౌండ్ క్వాలిటీ Stero సెలెక్ట్ చేసుకోవాలి. ’Ok' బటన్ క్లిక్ చెయ్యాలి.
2.ఇప్పుడు Audacity ప్రోగ్రామ్ లో రికార్డ్ బటన్ (ఎరుపు వ్రుత్తం వున్న బటన్) ప్రెస్ చెయ్యాలి, తర్వాత క్యాసెట్ ప్లేయర్ లో Play బటన్ ప్రెస్ చెయ్యాలి.
3.కావలసిన ట్రాక్ మొత్తం ప్లే అయిన తర్వాత Audacity ప్రోగ్రామ్ లో స్టాప్ (పసుపు చతురస్రం) బటన్ ప్రెస్ చెయ్యాలి. (గమనిక దీనికి ముందే క్యాసెట్ ప్లేయర్ స్విచ్ ఆఫ్ చెయ్యకూడదు)
4. Audacity ప్రోగ్రామ్ లో File ---> Export As Wav లేదా Export As MP3 ఇలా కావలసిన ఫార్మేట్ లోకి export చేసి సిస్టం లో సేవ్ చేసుకోవాలి. ఇప్పుడు CD లేదా DVD లలో బర్న్ చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం Audacity ట్యుటోరియల్ చూడండి.
ధన్యవాదాలు