మన చేతి వ్రాత నే ఫాంట్ గా మార్చుకొని వివిధ అప్లికేషన్లలో వాడుకోవచ్చు. దానికోసం ముందుగా
http://www.yourfonts.com/ సైట్ కి వెళ్ళండి అక్కడ వివరించిన 7 స్టెప్పుల్లో ఒక దాని తర్వాత మరొకటి ఫాలో అవుతూ చేతి వ్రాత ని ఫాంట్ గా మార్చుకోవచ్చు... అదీ ఫ్రీగా.
Step 1. Print Template
Print Template పై క్లిక్ చేసి టెంప్లేట్స్ ని ఫీడీఎఫ్ లో కాని లేదా ఇమేజ్ గా కాని ఓపెన్ చేసి ప్రింట్ తీసుకోవాలి.

Step 2. Complete Template
ప్రింట్ తీసుకున్న టెంప్లేట్స్ ని నల్ల ఇంక్ పెన్ లేదా మార్కర్ ని ఉపయోగించి దానిలోని ABCD లు మరియు యితర అక్షరాలను మీడియం మందంగా నాల్గు రూళ్ళ బుక్ లో వ్రాసే విధంగా పూరించండి. ఉదాహరణకి ఈ క్రింది చిత్రాన్ని చూడండి.

Step 3. Scan & Save Template
పూరించిన టెంప్లేట్లను స్కాన్ చేసి .gif, .jpg, .jpeg, .png, .tif, లేదా .tiff ఫైళ్ళ గా సేవ్ చేసుకోవాలి.
Step 4. Upload Template
ఫాంట్ కి ఒక్ పేరు యిచ్చి ... సేవ్ చేసుకున్న టెంప్లేట్లను ’Chose File' పై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ’Upload' పై క్లిక్ చెయ్యాలి.

Step 5. Preview your font
టెంప్లేట్లు అప్ లోడ్ అయి 1 నుండి 15 నిమిషాలలో ఫాంట్ జెనెరేట్ అయి ప్రివ్యూ వస్తుంది.
Step 6. Download
Download పై క్లిక్ చేసి మీ ఫాంట్ ని సేవ్ చేసుకోవాలి.

Step 7. Install & Use
సేవ్ చేసుకున్న ఫాంట్ ని ఇనస్టలేషన్ చేసుకోవటం కోసం Start ---> Settings ---> Control Panel ----> Fonts ఫోల్డర్ ఓపెన్ చెయ్యాలి. File---> Install New Font సెలెక్ట్ చేసుకోవాలి. బ్రౌజ్ చేసి ఫాంట్ ని సెలెక్ట్ చేసుకొని ’Ok' పై క్లిక్ చెయ్యాలి. లేదంటే సేవ్ చేసుకొన్న ఫాంట్ ని Copy చేసి Fonts ఫోల్డర్ లో Paste కూడా చెయ్యవచ్చు. ఫాంట్ ఇనస్టలేషన్ అయిన తర్వాత దానిని వుపయోగించుకోవచ్చు.
ధన్యవాదాలు