gcal2excel అనే జావా ఆధారిత డెస్క్ టాప్ అప్లికేషన్ ని ఉపయోగించి రెండు తేదీల మధ్య వున్న గూగుల్ క్యాలెండర్ ఈవెంట్లను మైక్రోసాప్ట్ ఎక్సెల్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. gcal2excel ని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, సైట్ నుండి జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని అన్ జిప్ చేసి Gcal2Excel అనే అప్లికేషన్ ని రన్ చేస్తే క్రింద చూపబడిన విండో వస్తుంది. అక్కడ జీ మెయిల్ యూజర్ నేమ్, పాస్ వార్డ్, గూగుల్ క్యాలెండర్ ఐడి మరియు ఏతేదీల మధ్య అయితే ఈవెంట్లను డౌన్లోడ్ చేసుకోవాలో ఆ తేదీలను ఎంటర్ చేసి క్రిందవున్న ’Create' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇచ్చిన రెండు తేదీల మధ్యవున్న గూగుల్ క్యాలెండర్ ఈవెంట్లు ఎక్సెల్ లోకి మార్చబడతాయి. మెయిన్ అప్లికేషన్ వున్న ఫోల్డర్ లోనే ఎక్సెల్ ఫైల్ కూడా సేవ్ చెయ్యబడుతుంది.
డౌన్లోడ్: gcal2excel (3MB)
ధన్యవాదాలు