Friday, November 27, 2009

On-Screen Keyboard Portable - కీలాగర్ల నుండి రక్షణ పొందటానికి వర్చువల్ కీబోర్డ్

కీలాగర్ అనే ప్రోగ్రామ్ లు మన కంప్యూటర్ లో చేరి కీబోర్డ్ పై టైప్ చేసే స్ట్రోక్స్ ని ఫైళ్ళ రూపంలో హ్యాకర్లకు చేరవేస్తాయి. ఆన్ లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు కీలాగర్ల నుండి చాలా జాగ్రత్తగా వుండాలి, దీనికి తరుణోపాయం వర్చువల్ కీబోర్డ్ లను ఉపయోగించటమే. కొన్ని యాంటీవైరస్ సాప్ట్ వేర్లలో వర్చువల్ కీబోర్డ్ అంతర్గతంగానే వుంటుంది, అలానే కొన్ని ఆన్ లైన్ పేమెంట్ల సైట్లలో కూడా వర్చువల్ కీబోర్డ్ వుంటుంది. ఒకవేళ యాంటీవైరస్ సాప్ట్ వేర్లలో మరియు సైట్లలో వర్చువల్ కీబోర్డ్ లేని పక్షంలో On-Screen Keyboard Portable ఉపయోగపడుతుంది.


మరింత సమాచారం కోసం On-Screen Keyboard Portable సైట్ ని చూడండి.

డౌన్లోడ్: On-Screen Keyboard

ధన్యవాదాలు