Saturday, October 1, 2011

Print Plus - వెబ్ పేజ్ లో కావలసిన భాగాన్ని ప్రింట్ చెయ్యటానికి గూగుల్ క్రోమ్ ఎక్స్‍టెన్షన్!!

Print Plus అనే గూగుల్ క్రోమ్ ఎక్స్ టెన్షన్ ని ఉపయోగించి ఒక వెబ్ పెజిలోని ఎంచుకున్న భాగాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. దీనికై ముందుగా గ్రోమ్ వెబ్ స్టోర్ లోఉన్న Print Plus కి వెళ్ళి ’Install' పై క్లిక్ చెయ్యాలి, అప్పుడు ఈ ఎక్స్ టెన్షన్ పైన లిస్ట్ లో కనబడుతుంది. ఇప్పుడు మనం ప్రింట్ చెయ్యవలసిన వెబ్ పేజ్ ని ఓపెన్ చెయ్యాలి, తర్వాత Print Plus ఎక్స్ టెన్షన్ పై క్లిక్ చెయ్యాలి. అలా చెయ్యటం వలన పైన ’Print' 'Cancel' అనే బ్లూ రంగులో బార్ వస్తుంది. ఇప్పుడు మౌస్ సహాయం తో ఆ వెబ్ పేజ్ లో ప్రింట్ చెయ్యవలసిన భాగాలను సెలెక్ట్ చేసుకోవాలి, ఆరెంజ్ అవుట్ లైన్ వస్తుంది. సెలెక్ట్ చేసిన భాగం ఆరెంజ్ రంగులోకి మారుతుంది. ఎంచుకున్న భాగం వద్దనుకుంటే ’x' పై క్లిక్ చెయ్యాలి. ప్రింట్ చెయ్యవలసిన భాగాలు ఎంచుకోవటం పూర్తి అయిన త్రర్వాత పైన ఉన్న బ్లూ బార్ లోని ’Print' బటన్ పై క్లిక్ చెయ్యాలి. 



Install: Print Plus

ధన్యవాదాలు