APCPDCL పరిధిలోని విద్యుత్తు బిల్లు వసూలు సిబ్బంది సకల జనుల సమ్మెలో పాల్గొనటం వలన కొన్ని కోట్ల రూపాయల బిల్లులు వసూలు కావలసి ఉంది. గత నెలలో బిల్ చెల్లించ లేకపోయిన వారు ఈ-సేవా, ఏపీ ఆన్ లైన్ లో చెల్లించవచ్చు. అలానే క్రెడిట్ లేదా డెబిట్ తో APCPDCL సైట్ కి వెళ్ళి కూడా ఆన్ లైన్ లో పేమెంట్ చెయ్యవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్ద్దాం:
౧. ముందుగా APDCL సైట్ కి వెళ్ళి కుడిచేతి ప్రక్క ఉన్న ’Pay your Bill' పై క్లిక్ చెయ్యాలి.
౨. తర్వాత ఇక్కడ మన జిల్లా, ERO, సర్వీస్ నంబర్ తదితర వివరాలు ఎంటర్ చేసి ’Submit' పై క్లిక్ చెయ్యాలి.
౩. ఇప్పుడు బిల్ డెస్క్ సైట్ కి రీడైరెక్ట్ చెయబడుతుంది, అక్కడ మన సర్వీస్ నంబర్, మన్ పేరు , అడ్రస్ తదితర వివరాలు వస్తాయి, వాటిని సరిచూసుకోవాలి. తర్వాత పేమెంట్ మోడ్ ఎంచుకొని ’Submit' పై క్లిక్ చెయ్యాలి.
౪. ఇక్కడ నుండి పేమెంట్ గేట్ వే కి వెళుతుంది, అక్కడ మన క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు ఎంటర్ చేసి పేమెంట్ చెయ్యవచ్చు.
ఇకపోతే ఈ నెల రీడింగ్ తీసుకొని బిల్లులు ఇచ్చే వారు లేకపోయే సరికి ఈ నెల కూడా గత నెలలో కట్టిన బిల్ మొత్తాన్నే కట్టాలని సెంట్రల్ ఎండీ చెపుతున్నారు. ఎక్కువ/తక్కువ అడ్జస్ట్ మెమ్ట్స్ తదుపరి బిల్లులలో సరి చేస్తారు.
వెబ్ సైట్: APDCL
ధన్యవాదాలు