అతి పెద్ద సమాచార భాంఢాగారమైన వికీపీడియా వ్యాసాలతో ఈ-బుక్ లను తయారుచేసుకొని అవసరమైనప్పుడు ఆఫ్ లైన్ లో చదువుకోవచ్చు. దీనికోసం వికీపీడీయా ఆంగ్ల సైట్ కి వెళ్ళి ఎడమ చేతి పైపున ఉన్న 'Pint/Export'దగ్గర ఉన్న 'Create a Book' పై క్లిక్ చెయ్యాలి.
ఇక్కడ Start Book Creator పై క్లిక్ చేసి ఇక కావలసిన పేజీలతో ఈ-బుక్ లను తయారుచేసుకోవచ్చు.
కావలసిన ఆర్టికల్ ని మన ఈ-బుక్ కి యాడ్ చెయ్యటానికి Book Creator దగ్గర ఉన్న Add this page to your Book పై క్లిక్ చెయ్యాలి అలానే యాడ్ చేసిన పేజీన తొలగించటానికి Remove this page from your Book పై క్లిక్ చెయ్యాలి. అలానే బుక్ ని ఎడిట్ చెయ్యటానికి లేదా డౌన్లోడ్ చెయ్యటానికి Show Book పై క్లిక్ చెయ్యాలి.
చివరగా ఈ-బుక్ లను పీడీఎఫ్, EPUB మొదలగు ఫార్మేట్లలో కావలసిన దానిని ఎంచుకుని డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చెయ్యాలి.
మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.
ధన్యవాదాలు