Tuesday, September 25, 2012

Piriform నుండి పీసీ ఆప్టిమైజేషన్ టూల్స్!!!

Pririform పీసీ పనితనాన్నిమెరుగు పరచటానికి నాలుగు అధ్బుతమైన టూల్స్ ని అందిస్తుంది. అవి 1.CCleaner 2.Defraaggler 3. Recuva 4.Speccy. వీటి గురించి ఇంతకుముందు చాలా పోస్ట్ లలో చూశాం ... అవి చూడని వారి కోసం మరొక్కసారి ఇక్కడ చెప్పటం జరిగింది.

౧. CCleaner
పీసీ లో పేరుకు పోయిన అనవసరమైన/ టెంపరరీ ఫైళ్ళను తొలగించి పీసీ వేగాన్ని పెంచటం తో పాటు హార్డ్ డిస్క్ స్పేస్ ఫ్రీ చెయ్యటం లో ఇది సహాయపడగలదు. టెంపరరీ ఫైళ్ళతోపాటు అనవసరమైన మరియు పాత రిజిస్ట్రీ ఎంట్రీలను తొలగించవచ్చు . మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కోసం ఇక్కడ చూడండి. 


౨. Defraggler

సాధారణంగా హార్డ్ డ్రైవ్ ని డీఫ్రాగ్మెంట్ చెయ్యటానికి విండోస్ తో పాటు వచ్చే డీఫ్రాగ్మెంటేషన్ టూల్ ని వుపయోగిస్తాం, కాని ఇది చాలా స్లోగా మరియు ఎక్కువ సమయం పడుతుంది. ఇంటర్నెట్ లో లభించే వుచిత డీఫ్రాగ్మెంటేషన్ టూల్స్ ని వుపయోగించి హార్డ్ డ్రైవ్ లేదా సెలెక్టెడ్ పార్టీషన్ ని మాత్రమే డీఫ్రాగ్మెంట్ చేసుకోవచ్చు. అలా కాకుండా Defraggler కావలసిన ఫైల్, ఫోల్డర్ లేదా డ్రైవ్ ని డీఫ్రాగ్మెంట్ చేసుకోవచ్చు. కావలసిన ఫైల్, ఫోల్డర్ డీఫ్రాగ్మెంట్ చెయ్యటంవలన డీఫ్రాగ్మెంటేషన్ కి తక్కువ సమయం పడుతుంది. ఇది Windows 2000, 2003, XP and Vista లలో పని చేస్తుంది. USB డ్రైవ్ ల నుండి కూడా ఈ అప్లికేషన్ ని రన్ చేసుకోవచ్చు.

3.Recuva

పీసీ నుండి పొరపాటున తొలగించిన ఫైళ్ళను తిరిగి (రికవర్) పొందటానికి Recuva ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పాడైన లేదా ఫార్మేట్ చెయ్యబడిన డ్రైవ్ లనుండి కూడా డాటా రికవర్ చెయ్యవచ్చు. హార్డ్ డిస్క్ లతోపాటు , USB డ్రైవ్ , కెమేరా లేదా ఐపాడ్ లనుండి తొలగించిన డాటా రికవర్ చెయ్యవచ్చు.

౪. Speccy:

Speccy ని ఉపయోగించి మన కంప్యూటర్ కి సంబంధించిన సమగ్ర సమాచారం అంటే ప్రాసెసర్ బ్రాండ్ మరియు మోడల్, హార్డ్ డిస్క్ సైజ్ మరియు స్పీడ్, RAM, మదర్ బోర్డ్, ఆప్టికల్ డ్రైవ్, ఆపరేటింగ్ సిస్టం మొదలగు వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties ని సెలెక్ట్ చేసుకొంటే మనకు మన సిస్టం కి సంబంధించిన కొంత సమాచారం మరియు Device Manager కి వెళితే హార్డ్ వేర్ కి సంబంధించిన సమాచారం టూకీ గా తెలుసుకోవచ్చు. అదే Speccy తో అయితే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

ధన్యవాదాలు