ప్రముఖ LeluSoft వారు రూపొందించిన మరొక ఉచిత అప్లికేషన్ Personal Passwords Generator, దీనిని ఉపయోగించి 14 విధాలుగా వివిధ కాంబినేషన్లలో పాస్ వార్డ్ లను జెనెరేట్ చేసుకోవచ్చు. ముందుగా Personal Passwords Generator ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇనస్టలేషన్ సమయం లో కొన్ని టూల్ బార్స్ ఇనస్టలేషన్ అవకుండా వాటిని అన్-చెక్ చెయ్యాలి. అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత Paasword type దగ్గర కావలసిన కాంబినేషన్ ని ఎంచుకోవాలి తర్వాత Password Length దగ్గర క్యారెక్టర్ లెంగ్త్ ఇవ్వాలి. పాస్ వార్డ్ జెనెరేట్ చెయ్యటం కోసం ’Key' గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చెయ్యాలి. జెనెరేట్ అయిన పాస్ వార్డ్ నచ్చకపోతే మరొక దానికై ’Key' గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చేస్తూ ఉండాలి. ’Lock' బటన్ పై క్లిక్ చేసి పాస్ వార్డ్ ని ఎన్ క్రిప్ట్ చేసుకోవచ్చు మరియు ’Save' బటన్ పై క్లిక్ చేసి పాస్ వార్డ్ ని .txt పైల్ గా సేవ్ చేసుకోవచ్చు. Encrypt చేసిన పాస్ వార్డ్ ని Decript కూడా చెయ్యవచ్చు.
ఫీచర్లు:
- Only 1.06 mb
- Portable (after the first installation)
- A single executable
- Simple to use and fast
- 14 Different passwords types
- Custom password type let you set the base characters set
- Passwords can be saved encrypted
- Freeware
ధన్యవాదాలు