భారత రైల్వే RailRadar అనే సర్వీస్ ని ప్రారంభించింది, దీనిని ఉపయోగించి మనకు కావలసిన రైలు యొక్క ప్రస్తుత జియోగ్రాఫికల్ లోకేషన్ ని గూగుల్ మాప్స్ లో చూడవచ్చు. రైలు యొక్క రాక/ పోకలు తెలుసుకోవటానికి కావలసిన స్టేషన్ కోసం మ్యాప్ పై జూమ్ ఇన్ చెయ్యాలి అది మౌస్ సహాయంతో గాని లేదా ఎడమచేతి ప్రక్కన ఉన్న + గుర్తు పై క్లిక్ చెయ్యవచ్చు. ఇలా కావలసిన స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న కావలసిన ట్రైన్ గుర్తు పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. రైలు యొక్క ప్రస్తుత లొకేషన్ తో పాటు రూట్ మరియు ఆగే స్టేషన్లను కూడా తెలుసుకోవచ్చు. బ్లూ కలర్ లో ఉన్నవి సరైన సమయం లో మరియు రెడ్ కలర్ లో ఉన్నవి ఆలస్యంగా నడుస్తున్నవని అర్ధం. ప్రతి ఐదు నిమిషాలకు ఇక్కడ సమాచారం రిఫ్రెష్ అవుతుంది.
వెబ్ సైట్: RailRadar
ధన్యవాదాలు