Wednesday, March 20, 2013

Social Media Image Maker - సోషల్ నెట్ వర్క్స్ కోసం సరిపోయే ఇమేజ్ లను క్రియేట్ చేసుకోండి!

Social Media Image Maker అనే ఉచిత ఆన్ లైన్ టూల్ ని ఉపయోగించి ప్రముఖ సోషల్ వెట్ వర్క్ సైట్లైన ఫేస్ బుక్ , గూగుల్ ప్లస్, టంబ్లర్, పింటెరెస్ట్, లింక్డ్ ఇన్ ఇలా మెదలగు సైట్ల కోసం సరిపడే తగిన బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్, ప్రొఫైల్ ఇమేజ్ , కవర్ ఇమేజ్ లను క్రియేట్ చేసుకోవచ్చు. ఈ టూల్ లో ఆయా సైట్లకు తగిన ఇమేజ్ లెంగ్త్ ముందుగా సెట్ చేసి ఉండటం వలన దీనిలో తయారు చేసిన ఇమేజ్ లు ఆయా సైట్లకు సైట్లకు సరిగ్గా సరిపోతాయి.


Social Media Image Maker సైట్ కి వెళ్ళి కావలసిన సోషల్ నెట్ వర్క్ ఆప్షన్ ను ఎంచుకోవటం వలన అక్కడ ఆయా సైట్లకు తగిన ఇమేజ్ లను తయారు చేసుకోవటానికి ఆప్షన్ వస్తుంది . ఉదా ఫేస్ బుక్ కవర్ ఇమేజ్ తయారు చేసుకోవాలన్నప్పుడు ’Facebook' పై క్లిక్ చేసి ’Cover Image' దగ్గర ఉన్న 'Create' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత పేజీలో ’Add your File ' పై క్లిక్ చేసి ఇమేజ్ పైల్ అప్ లోడ్ చెయ్యవచ్చు, లేదంటే సింపుల్ గా ఇమెజ్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చెయ్యటం ద్వారా అక్కడ ఉన్న ఆప్షన్లను ఉపయోగించి కవలసిన మార్పులు చేసుకుని ’Apply' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత కలర్ బ్రైట్ నెస్ లో కావాలంటే మార్పులు చేసుకుని అక్కడే పైన ఉన్న డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేసి ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్: Social Media Image Maker

ధన్యవాదాలు